సుజనరంజని /  శీర్షికలు   /  తెలుగు తేజోమూర్తులు- డాక్టర్ భావరాజు సర్వేశ్వర రావు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆర్ధిక, సామాజిక శాస్త్రవేత్త - డాక్టర్ భావరాజు సర్వేశ్వర రావు

ఓ ఆచార్యుడిగా, కేంబ్రిడ్జ్ మేధావి, పరిపాలనాదక్షుడి, క్రియాశీలవేత్త, ఆర్ధిక, సామాజిక శాస్త్రవేత్త, నాగార్జున విశ్వవిద్యాలయ ఉప-కులపతి డాక్టర్ భావరాజు సర్వేశ్వర రావు గారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయ కార్య కలాపాలలో ప్రముఖ భూమిక నిర్వర్తించారు. దేశ, రాష్ట్ర, ఆర్ధిక క్షేత్రాభివృద్ధికి విశిష్ఠ కృషి చేసిన మేధావి, పాలానాదక్షుడు డాక్టర్ భావరాజు సర్వేశ్వర రావు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేశారు. ఈ దరిమిళా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు.

బి ఏ (ఆనర్స్), ఎం ఏ ఎకనామిక్స్ (ఆర్ధిక శాస్త్రం) లో పట్టా సాధించారు. తరువాత వి ఎస్ కృష్ణ హయాం లో పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ఆంధ్ర విశ్వవిద్యాలయమ లో చేరారు. తరువాత నాలుగు దశాబ్దాల పాటు ఇక్కడే విభిన్న పదవులలో కొలువు తీరారు.

1950-53 లో ఇంగ్లాండ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆస్టిన్ రాబిన్సన్ పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టా సాధించారు. స్వదేశానికి తిరిగి వచ్చారు. మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయ కార్య కలాపాలలో నిమగ్నమైపోయారు.

1964 ప్రాంతం లో యునైటెడ్ నేషన్స్ ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ డెవలప్ మెంట్ అండ్ ప్లానింగ్ (ఎకానమిస్ట్) శాస్త్రవేత్త గా పనిచేశారు. ఈ తరుణంలో థాయిలాండ్ లో పనిచేశారు. రెండేళ్ళ పాటు ఈస్ట్ నైజీరియా ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా పనిచేశారు.

సర్వేశ్వర రావు గారు నవంబర్ 22, 1915 లో ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో, పరబ్రహ్మ మూర్తి, లక్ష్మి దంపతులకు జన్మించారు. చిన్నతనంలో పెద్దాపురం, రాజమండ్రిలో చదువుకుని పై చదువులకి విశాఖపట్నం చేరారు. సర్వేశ్వర రావు గారికి ఆదుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.

1982 లో " ఇండియన్ ఎకనామిక్ సంస్థ " అధ్యక్షుడిగా ఎంపికైయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఇండో జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కి ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. విశ్వవిద్యాలయ సిండికేట్ సభ్యుడిగా, అకడమిక్ కౌన్సిల్ సభ్యుడిగా, ఆర్ట్స్ విభాగ అధ్యక్షుడిగా పనిచేశారు. " అగ్రో - ఎకనామిక్ " పరిశోధనా కేంద్రం వ్యవస్థాపక సంచాలకుడిగా పనిచేశారు. ఈ కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వం సహాయంతో నెలకొల్పారు. కే నాగభూషణం గారితో కలసి, సంఖ్యా శాస్త్ర విభాగ అభివృద్ధికి కృషి చేశారు ఆచార్య సర్వేశ్వర రావు గారు.

1975 లో రెటైర్ అయినా ఉత్సాహం ఏమి తగ్గలేదు. తన సేవలను కొనసాగిస్తూ వచ్చారు బి ఎస్ ఆర్.

మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ స్టడీస్, సీనియర్ ఫెల్లో గా వ్యవహరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం (1979-81) ఉప కులపతిగా ఉన్నారు. 1983 - 1996 మధ్య కాలంలో " ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ స్టడీస్ " (ఐ డి పి ఎస్) వ్యవస్థాపక సంచాలకులుగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. తరువాత గయత్రి విద్యా పరిషద్ (1989) సంస్థ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా తన జీవిత ప్రయాణంలో అనేక సంస్థలతో ప్రగాడ అనుబంధాన్ని సారించికుంటూ వచ్చారు ఆచార్య సర్వేశ్వర రావు గారు.

డాక్టర్ భావరాజు సర్వేశ్వర రావు గాంధేయ వాది, భారతీయ సంస్కృతి పట్ల చక్కని అవగాహం కలిగి ఉన్న వారు. నిరాడంబర జీవి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రణాలికా సంఘ సభ్యుడిగా ఉన్నారు.

ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలు శ్రీ సర్వేశ్వర రావు గారికి గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. హిందూ పత్రిక లో పనిచేస్తున్న డాక్టర్ కే సి రెడ్డి గారు వీరి శిష్యులు.

సర్వేశ్వర రావు గారు తన తొంబై ఐదవ ఏట సెప్టెంబర్ 23, 2010 లో గతించారు. "బి ఎస్ ఆర్" ఓ చక్కటి ఆచార్యుడిగా, ఆర్ధిక శాస్త్రవేత్త గా, "సింపుల్ లివింగ్, హై థింకింగ్ " కి నిర్వచనముగా నిలుస్తారు. ఆర్ వి ఆర్ చంద్రశేఖర్ రావు, ఏ ప్రసన్న కుమార్ - ఆచార్య సర్వేశ్వర రావు గారి స్మృత్యర్ధం " పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ డెవలప్ మెంట్ - ఎకానమి, పొలిటి అండ్ సొసైటీ " పుస్తకం వెలువడించారు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech