సుజనరంజని / కబుర్లు / మనబడి కబుర్లు

మనబడి కబుర్లు

 

పోర్ట్లాండ్లో మనబడి మొదటి బాచ్ విద్యార్థులకు పట్టా ప్రదానోత్సవం

 

- మదిర మూర్తి, పోర్ట్లాండ్లో మనబడి సమన్వయకర్త

   

C:\Documents and Settings\Owner\Desktop\photo4_graduation.JPG

పోర్ట్‌లాండ్‌ మనబడి శాఖ (ఓరెగాన్) మొదటి బాచ్ విద్యార్థుల పట్టా ప్రదానోత్సవం నవంబరు 5వ తేదీ సాయంకాలం 5గంటల నుండి 7 గంటల వరకు రెండు గంటలపాటు ఆహూతుల మరియు సిలికానాంధ్ర మనబడి కార్య నిర్వాహక సభ్యులు శ్రీ రాజు చమర్తి, శ్రీ శ్రీరాం కొట్ని గార్ల సమక్షంలో, పోర్ట్లాండ్ శాఖ సమన్వయకర్త శ్రీ మూర్తి మధిర గారి అధ్వర్యంలో జరిగింది.
 

C:\Documents and Settings\Owner\Desktop\photo6_graduation.JPG

సభలో చివరి సంవత్సరం విద్యార్థులు తెలుగులో పాటలు, పద్యాలు పాడి పట్టాలు పొందిన విద్యార్థులను శుభాకాంక్షలతో ఉత్తేజపరచగా పట్టాలు పొందిన విద్యార్థులు తమ నాలుగేళ్ళ అనుభవాలను చక్కగా తెలుగులో చెప్పి సభికులను సంతోషపెట్టారు. విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు (శ్రీ శ్రీరామారావు పెమ్మరాజు గారు, శ్రీమతి భారతి పెమ్మరాజు గారు, శ్రీమతి నాగలక్ష్మి మధిర గారు, శ్రీ సూర్యనారాయణ భమిడిపాటి గారు), విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసిఏషన్ (జి.పి.టి.ఏ) కార్య నిర్వాహక సభ్యులు శ్రీ సునిల్ గారు, మనబడి కార్య నిర్వాహక సభ్యులు పిల్లలను అభినందిస్తూ ప్రసంగించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు పంపిన పట్టాలను, జి.పి.టి.ఏ వారు అందజేసిన జ్ఞాపికలను విద్యార్థులకు ప్రదానం చేసారు. ఈ సభలో మనబడి వారు పంపిన ప్రశంసా పత్రాలను, ప్రకాశం మరియు ప్రభాసం విద్యార్థులకు కూడ అందజేసారు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech