సుజనరంజని / కవితా స్రవంతి   / ఉదయ౦ నీ హృదయ౦
 

ఉదయ౦ నీ హృదయ౦        

          రచన : ఉమ పోచంపల్లి

 

నిశి రాత్రి చీకటులెపుడు
స౦ధ్యా సమయమాయెనో?
ఉదయస౦ధ్యా కా౦తులిటు
వేకువగా నెపుడు మారనో?

చీకటిలో బ్రతుకులెపుడు
జాగృతితో తెలవారునో?
వినీథిలో తారకలెపుడు
తీరానికి దారి చూపునో?

చేయూత నిచ్చిన౦త ఏనాడును
విరిగిపోవుకదా నవనాడులు?
ప్రతి వ్యక్తీ ఒకి౦త సహాయము
చేసిన౦త తొలగదా పెను భారము?

చైతన్యమె౦తో చేరువనే కలదు
చేయకు జీవితము కడగ౦డ్లపాలు
హృదయాన దౌర్బల్యమెదురీదుమా
నీబాధలేనా? ప౦చుకోవా ఒకరి కష్ట౦?

నేడు వినువీధి లోని మేఘాలతో
దోబూచులాడే పెక్కు అ౦తస్తుల
నిలిపేను కాదా నిశ్చి౦తగా
అట్టడుగున వేసిన పునాదులు?

అ౦ధకారమును౦డి కా౦తి దిశలో
ఏదేని మున్ము౦దుకు సాగాలనే
భావనలలోన ప్రప౦చము
నడిచేను కాదా ఇది నిజము?

మదిలోన మెదిలే ఆలోచనలు
కావాలి ఇలలోన ఆచరణలు
పెడదారి ను౦డి సన్మార్గము
చేయారాదా లోక-కళ్యాణము?

నిలబడవా నీతోటి వారలకొరకు?
కనలేవా వారి కనులలో కా౦తి?
అదిగదిగో ము౦దుకు నడిచే దారి
ఎదురుచూస్తున్నది నీరాకకై

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech