సుజనరంజని / కవితా స్రవంతి   /  నేటి వార్తలు


నేటి వార్తలు

                                              రచన :  కృష్ణ అక్కులు
 

 

దూరవాణి వినిన
దూరదర్శిని కనిన
దురవార్తలే కాని
మధుర వార్తలు కరువు  
 
ఓ వైపు
స్కాముల గోలలు
స్వాముల లీలలు
సకల జనుల సమ్మెలు
ఇనుప గనుల దొమ్మీలు 
నేతల రాజీనామాలు
ఆ పై రాజీ డ్రామాలు 
రోజు వారి బంధులు
తాజా ఇబ్బంధులు 
కూలే గాలి సామ్రాజ్యాలు
రాలె గాలి గోపురాలు 
 
మరో వైపు
ఉద్యమాలలో
అమాయకుల
ఉసురులే పోవు
అయితే    
ఏ నాయకుల 
ఊపిరిలు ఆగిపోవు    
 
బందు నాడు
మందు షాపులు
బారులు,సినిమా హాల్లు
తెరిచియుండు
బడులు, ఆసుపత్రులు
మందుల షాపులు
మూసి యుండు
 
అధిక సంతానం కలిగిన
భారత మాతకు
ఉత్తర కుమారులే మెండు
అవినీతిపై పోరాటానికి
ఓ వృద్ధ సైనికుడు
కావలసి యుండు
 
అందుకే
దూరవాణి వినిన
దూరదర్శిని కనిన
దురవార్తలే కాని
మధుర వార్తలు కరువు  
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech