పుస్తక పరిచయం  అద్వితీయము - ముదిగొండ శివప్రసాద్ పరిశోదనా గ్రంధము -నాగ పూర్ణిమ
                                                                                    - శైలజా మిత్ర

    

నవలా సాహిత్యంలో చారిత్రకం ఎంతో విశిష్ట మయినవి. ఎందుకంటే ఇవి వాస్తవ కధా చిత్రాలు.. ఉహలకు, అభూత కల్పనలకు ఏమాత్రం  తావుండదు. అందుమూలంగా ఈ సాహిత్యం చారిత్రాత్మకంగా నిలిచిపోవడమే కాకుండా భావి తరాలకు కూడా ఎంతో విజ్ఞానాన్ని , విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది.. మొదటి చారిత్రాత్మక రచయితగా అడవిబాపిరాజు తర్వాత నోరి నరసింహ శాస్త్రి. ఇంకా నారాయణ బట్టు, రుద్రమదేవి, కవిసార్వబౌముడు, కవిద్వాయము, దూర్జటి మొదలైన నవలలు వారికి ఎనలేని కీర్తి తెచ్చాయి.. కాలగమనంలో రుద్రమదేవి అనే స్త్రీ శక్తిని నిరూపించే ఈ నవల ఆంధ్రుల తేజ పుంజానికి నిలువుటద్దం..ఇలా ఆయా సందర్భాలలో ఆయా కవుల పద్యాలను పేర్కొనడం వల్ల నవలకు ఒక జీవకళ ఏర్పడింది. ఇక ఈ తరపు చారిత్రిక నవలా తేజం డా.ముదిగొండ శివప్రసాద్ గారనే చెప్పాలి.. ఎందుకంటే " మొత్తం చారిత్రిక నవలను కవితామయంగా తీర్చిదిద్దడం ఇద్దరికే తెలుసు. ఒకరు విశ్వనాధ సత్యనారాయణ రెండు ముదిగొండ శివప్రసాద్" అంటూ సుప్రసిద్ధ కవులు స్వర్గీయ ఆచార్య తిరుమల గారు తాను మనమధ్య లేకున్నా ఒక గొప్ప నిజాన్ని చెప్పి చారిత్రకాంశంలో ఒక శైలీ శిల్పంలా నిలిచిపోయారు..  అలాగేఆ తరానికి విశ్వనాధ.. ఈ తరానికి ముదిగొండ-బంగారు కొండ" అంటూ నట సారధి శ్రీ అయ్యదేవర పురుషోత్తమ రావు గారు అభిప్రాయపడ్డారు. ఇక్కడ వట్టి బంగారు కొండ అనకుండా చారిత్రక బంగారు కొండ అని ప్రయోగించి ఉంటే బావుండేది అనిపిస్తుంది.. ఎందుకంటే ఇక్కడ బంగారం తొ పోల్చినది అంశం కనుక.. అలాగే "శివప్రసాద్ ప్రతిభా పాండిత్యాలకు అనుశీలన పరికల్పనకు రేఖ శ్రీలేఖ నవలఅని జ్ఞానపేట్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి గారు"కుహనా ప్రణయాలపై ఆధారపడి రచించే నిర్జీవ రచనలతో విసిగిపోయిన పాటకులకు శ్రీలేఖ ఒక చైతన్యపు రాకఅని ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి దాశరధి తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం 

చేసారు.. ఈ విధ౦గా ఎందరో ప్రముఖుల అభిప్రాయాల్ని పరిశీలిస్తే ముదిగొండ శివప్రసాద్ గారు మనకో చారిత్రక దిక్సూచి అనవచ్చు.

ప్రముఖ చారిత్రిక నవలా చక్రవర్తి డా.ముదిగొండ శివప్రసాద్ గారు కలంనుండి జాలువారిన ఎన్నో నవలలు జ్ఞాపకాల పల్లకీ, అనుభవ మండపం, ఆనాటిముచ్చట్లు,శ్రావణి, నాగానీక, రసమయి, హేమం కురిసిన రాత్రి, స్వప్నభంగం, ఆనంద శిఖరం, స్వప్న కిరీటం, అమృత వృష్టి, పంచామృతం, ,లాంటి డెబ్బై అయిదు నవలలు వీరి డెబ్బై ఏళ్ళ జీవితంలో పాటకుల్ని ఎంతగానో అలరించాయి..

నేటి మరో ఆణిముత్యం.. మనముందున్న "నాగ పూర్ణిమ " ఆచార్య నాగార్జుని జీవితంపై ఒక తులనత్మకమయిన పరిశీలన" ఇది మొట్ట మొదటి ప్రామాణిక చారిత్రాత్మక నవల... ఇదివరలో ఆచార్య నాగార్జుని జీవితము రచనలు అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా కొంత పరిశోధన జరిగింది. కానీ రెండువేల సంవత్సరాలకు పూర్వం ఈ కధను గూర్చి ఎవ్వరు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.కాకుంటే నాగార్జుని జన్మ స్థలము, జీవించిన కాలము, పోషకుడు అనే అంశాలన్నే వివాదాలే అనేది మొట్టమొదటి సమాచారం. నాగార్జునుడు హస్కుజుష్కకనిష్కులు కాష్మీరమును పరిపాలించే సమయంలో నాగార్జునుడు శ్రీ పర్వంలో ఉన్నాడు. అనతి వాహనుడు. ఉదయ సభద్రుడు, శక్తిమంతుడు , శ్రీ పర్వము నేలిన కాలములో జీవించాడని ఒకవాదము. ఇతడు క్షత్ర పనహపాణునికి మొదటి కనిస్త్కునికి సమకాలీకుదని లేవీ పండితుని ఉహ.. ఇతని పేరు శ్రీ ప్రజ్ఞాధరుడు.. తర్వాతిపేరు నాగార్జునుడు.. క్రిష్నా తీరంలో నివసించాడు. మహానాలుక అనే ఉషానదీ తీరంలో ఉన్నాడు. ఈ నదికి ఉత్తరాన గల సుందరభుతి అనే గ్రామంలో జన్మించాడు..

నాగార్జునుడు కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో పుట్టాడని ఒక స్థానిక జనశ్రుతి ప్రచారంలో ఉన్నట్లు శ్రీ స్వర్నరాజ హనుమంతరావు శివప్రసాద్ గారితో అన్నారట అయితే ఈ మంజుశ్రీ ఎవరు? నాగార్జుని ప్రశిష్యుడు జయప్రభాచార్యుడు ఆయన శిష్యుడు చంద్రప్రభాచార్యుడు,వీరి కాలం తెలియదని, అయితే ఒక శాసనం దొరికిందని తెలిపారు. ఇక ఎనిమిదివేల మంది బిక్షువులను శ్రమణ కులను భహిష్కరించి అమరావతి స్తుపమును నిర్మించినవారేవరు? అనేది సందేహమే..

ఆచార్య నాగార్జునుడు క్రీ.శ 150 లో జన్మించి 203 వరకు జీవించాడని కధనం మరో వైపు వీరి జీవనము ఇంకా ఎక్కువ కాలము ఉన్నాడని కధనంతో . గుణాడ్యుని బృహత్కధలో నాగార్జుని జీవితానికి సంభందించిన కధ జానపద శైలిలో ఉంది. అయితే ఆచార్య నాగార్జునుడు చేసిన త్యాగము మూలంగానే ప్రపంచ వైజ్ఞానిక రంగంలో విప్లవం వచ్చింది. భారతదేశంలో సమన్వయము లభించింది.. ముక్యంగా భారతీయ నిరమానంలో అపూర్వ చైతన్యం సిద్ధించింది నాగార్జునిని ప్రభావం శంకరునిపై పడింది. గౌతముని ప్రభావం జీసస్ మీద పడింది. మొత్తం ఇస్లాం ప్రభావం ఆర్యసమాజం మీద పడింది. అంబేద్కర్ ప్రభావము ఎం.ఎస్. గొల్వాకర్ మీద పడింది.. ఇవన్నీ అక్షర సత్యాలు. నాగార్జునుని గ్రంధాలు చైనా-టిబెట్, నేపాల్ ప్రాంతాలలో దొరికాయి. కాబట్టి ఆయన కీర్తి అంతవరకు వ్యాపించిందని అర్థం. అతడొక ఆచార్యుడు. తాత్వికుడు. సంఘసంస్కర్త,అన్నిటికి మించి సమన్వయవాది. నాగార్జునుని నాటికి బౌద్ధం చీలికలు పేలికలు అయ్యింది.. ఒకవైపు అంతర్గతమయిన కుమ్ములాటలు మరొకవైపు ఇతర సంస్కృతులు దాడి వైదిక మతంలో ఘర్షణ  వీటిని నిరాకరించడం కోసం నాగార్జునుడు ప్రయత్నించాడు. చివరకు ఆయన ప్రయత్నం ఫలించింది. బుస్తోన్, వంటి ప్రాశ్చాత్యుల పరిశోదనలు ప్రాధమిక సమాచారాన్ని అందిస్తాయి.. నాగార్జునులు ఎందరు? ఏ సమయము వారు? ఎక్కడ జన్మించారు?ఇలాంటి విషయాలన్నీ నేటికీ చర్చనీయంశాలే.  నాగార్జునుడు శాతవాహన చక్రవర్తికి సృహుల్లేఖ, రత్నావళి అనే రెండు ధర్మ ప్రవచన లేఖలు రాసాడు. అందులో మహాయానమును ద్వేషించేవారు  తమ ద్వేషాగ్నిచే తామే దహింప బడుతారని వివరించాడు. అయితే నాగార్జునుడు  సుహృల్లేఖ వ్రాసిన సమయంలో ఏ శాతవాహనుడు దాన్యకటకాన్ని పరిపాలిస్తున్నాడు? అనే విషయంపైన కూడా  ఏకాభిప్రాయం లేదు.. 

దాదాపుగా  పదహారు అధ్యాయాలు నెలవంక(సినివాలి) నాగాద్వీపము, సఫాలిక, పుంజిక స్థల, శ్రియాదేవి, కదలీ వనము, శంఖపాల యోగము, మహాయానము, కుమారి మంజుశ్రీ, నాగా భరణము  , ఉదాకక్ష్వేదిత, గూడ చర్యము, చైత్ర పూర్ణిమ , సంవాదము, వృషాకపి, నాగ పూర్ణిమ  అనే అద్యాయాలతో నేడు నాగార్జుని జీవితం మనకు చూపేరు.   

1940 డిసెంబెర్ 23 వ తీదీన జన్మించిన వీరు ఎం.ఎ. తెలుగు విశాఖపట్నంలో చదివి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత నొంది ఓ.యు. లో పి.హెచ్.డి చదివి  ఉస్మానియా యూనివెర్సిటి లో తెలుగు ప్రోఫెసెర్ గా పనిచేసారు. వీరికి చారిత్రిక నవలా చక్రవర్తి, శివ కవీంద్ర, అభినవ పాల్కురికి, అభినవ ధూర్జటి, చారిత్రిక నవలా సామ్రాట్, అనే బిరుదులు కలవు.. 

ఎన్ని ఉన్నా, ఎంతగా సాధించినా వినమ్రులై వీరంటారు" బుద్దుడు ఎవరో కాదు- మన దశావతారములలో ఒకడు" అని ప్రకటించారు. నాగార్జున వాస్తు పద్దతిలో ఆలయ నిర్మాణములు చేసారు. ఇదే నాగార్జున విజయము అంటూనే చివరగా " ఒక సమన్వయం/ ఒక సామరస్యం/ ఒక మహోదయం/ ఒక విశ్వవీచిక!! అని పూర్తిచేయడం.. అలజడి గల జీవితం ఒక్కసారిగా నిశ్సబ్దం అవరించినట్లుంది.. అందుకే ఇది ఒక నిశ్శబ్దంలో అనిర్వచనమయిన అనుభూతి పర్వం..!! ముదిగొండ శివప్రసాద్ గారి డెబ్బై ఒకటవ సంపూర్ణ విజయం..!! అందరూ చదవడమే కాదు చదివి దాచుకోవాల్సిన చైతన్య చరితం..!! 

 

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech