me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

అధికారుల సహకారము ఈ సమయములో లభించుట కష్టము. కావున ఆధికారికములైన పనులను వాయిదావేసుకొనవలెను.  రాశివారి కార్యకలాపములను అధికముగా వ్యతిరేకించువారు తక్కువే. కావున విరోధుల భయముతో పనులను ఆపుకోవలసిన అవసరము లేదు. వివాదములయందు సయోధ్యకు ప్రయత్నించుకోగలరు. వివాదములు సామరస్యముగా పరిష్కరించుకొన్న లాభపడగలరు.

          విద్యార్థులకు ఈ మాసము అనుకూలముగా నుండును. మితృలనుండి సహాయము లభించగలదు. తెలియని భయము మనసును పట్టి పీడించు సమయమిది. దానికి లొంగకుడ పనులను చేసుకొనవలెను. స్త్రీ పరముగ ఇది అనుకూలమైన సమయము కాదు. కావున స్త్రీ కి సంబంధించిన విషయములు ఈ సమయములో వాయిదా వేసుకొనగలరు.

          మొత్తముమీద అనుకూలముగా ఉన్న మాసము ఇది. కావున అనుకూలరంగములందు సాధ్యమైనంత శ్రమను వినియోగించుకోగలరు.

 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

ఈ మాసము రోగములతో కూడి యున్నది. కావున సాధ్యమయినంత ఎక్కువ శ్రద్ధ శరీరముపై చూపుట అవసరము. కోర్టువాజ్యములు మరియు వివాదములను పరిష్కరించుకొనుటకు ఇది అనువైన సమయము కాదు. ధనపరముగ మరియు ఆరోగ్యపరముగ ఇబ్బందులు పడే అవకాశములు కనిపిస్తున్న కారణముగ మనసును ఆ విధముగ సిద్ధము చేసుకొనగలరు. తద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకొనగలరు.

          విద్యార్థులకు ఇది అనువైన మాసము. కానీ చాలా వరకు సమయము శారీరకమైన చికాకులతో  గడచుట వలన అధిక శ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించును. వ్యాపార లావాదేవీలకు అనువైన సమయము. పెట్టుబడులకు ప్రయత్నించవచ్చును. మొత్తము మీద  ఈ మాసము ఈ రాశివారికి ధనపరముగ ఇబ్బందికరము కాకపోయిననూ శారీరకముగ అధిక శ్రద్ధను కోరుకొనుచున్నది.

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

స్త్రీ పరముగ సమయము అనుకూలముగా లేదు. ఇంటిలో కలహములు మానసికశాంతికి భంగము కలిగించగలవు. చాలా సందర్భములలో అధికముగ ఉద్రిక్తులగుటకు మరియు ఉద్వేకమునకు లోనగుటకు అవకాశములున్నవి. సహనముతో వ్యవహరించడము మరియు యోగాభ్యాసము చాలా అవసరము.

          శారీరకముగ మరియు మానసికముగ ఇబ్బందులు మరియు చికాకులు అధికముగ ఉన్ననూ ఈ మాసములో ఈ రాశివారికి మితృల సహకారము, సంతానప్రాప్తి, బంధుజనులు కలిసివచ్చుట, వ్యతిరేకులు శాంతించుట, పెద్దల అనుగ్రహము పూర్తిగా లభించగలవు. కావున వీరు ఈ అవకాశమును పూర్తిగా వినియోగించుకొనుటకు ప్రయత్నించుకొనగలరు.

 

http://www.jagjituppal.com/images/2canc.gif

ర్కాటక రాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

ఈ మాసము ఈ రాశివారికి పూర్తిగా అనుకూలముకాదు ప్రతికూలమూ కాదు.   ఈ రాశివారికి శారీరకముగ ఇబ్బందులు కలిగే కొన్ని సమయములు వచ్చిననూ చాలావరకు సమస్యలు వాటంతటవే సమసిపోగలవు. కోర్టు వాజ్యములు, భూ తగాదాలు , వివాదములు సంప్రదిపులద్వారా మరియు న్యాయస్థానములద్వారా తీర్చుకొనుటకు ఇది మంచి సమయము.

          సమాజములో వీరికి అనుకూలత పెరుగును. రాజకీయముగ అపేక్ష కలవారు ఈ సమయములో సమాజమునుండి మంచి స్పందన కొరకు ప్రయత్నించగలరు. మానసికముగ కొన్ని మధురానుభూతలను సొంతము చేసుకొనే అవకాశములు కొన్ని లభించగలవు.

          విద్యార్థులకు సమయము అనువుగా లేదు. లోతుగ ఆలోచించలేకపోవడమువలన వారిలో నిరాశ కలిగే అవకాశమున్నది. కానీ మిగిలిన పరిస్థితులు వారికి అనువుగా ఉన్న కారణముగా ప్రయత్నములను వీడరాదు.

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

ఈ రాశివారికీ ఇది శారీరకముగా అనుకూలమైన సమయము కాదు. మానసికముగా తీవ్రమైన ఒడిదుడుకులు, అసంతృప్తి వీరికి ఇబ్బందులను కలిగించు అవకాశములు ఉన్నవి. చాలా వరకు ఉద్రిక్తతలు అధిక ప్రతిస్పందన వలన మాత్రమే కలుగుచున్నవని గ్రహించి ఆలోచనలను మరియు ఆవేశమును నియంత్రించుకొనడానికి ప్రయత్నించడము ద్వారా చాలా వరకు అనుకూలమైన ఫలితములను పొందగలరు.

          విలాసాదులకు అధిక అవకాశములున్నవి. చేయు పనులయందు కళాభిమానమును ప్రదర్శించగలరు. కార్యములను సాధారణముగ తమదైన శైళిలో చేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు సమయము చాలావరకు అనుకూలముగా ఉండగలదు. యోగాభ్యాసము చేయుట ద్వారా ఉద్రిక్తవాతావరణమును తగ్గించుకొనిన విద్యపై అధిక శ్రద్ధను కనబరుచు అవకాశమున్నది కావున ఆ దిశలో ప్రయత్నించగలరు.

 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

పనులు అడ్డు లేకుండ ముందుకు సాగుతాయి. ఇది ఒక్కటే ఈ రాశివారికి అనుకూలముగా కన్పిస్తున్న విషయము. ఎక్కువగా తిరుగుట, ఆ కారణముగా ఎక్కువగా అలసటను పొందుట ఈ సమయములో ఎక్కువగా జరుగుతుంది. మానసికమైన ఒత్తిడి, ఆలోచించలేకపోవడము, నిర్ణయములు తీసుకొనకలేకపోవడము, శారీరకముగ ఇబ్బందులు చికాకులు పెట్టడము, బంధు మితృలు మరియు భార్యా పిల్లలనుండి ఒత్తిడి వీరిని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశమున్నది.

          ఇన్ని సమస్యల మధ్య కొన్ని గ్రహములు అనుకూలస్థితి కారణముగ పైన చెప్పబడిన వ్యతిరేక ఫలములన్నీయూ కొద్ది కొద్ది అంతరములో మధ్య మధ్యలో తిరగబడి అనుకూలఫలితములుగా మారుతుంటాయి. కావున ఈ రాశివారు ప్రయత్నములను ఎట్టి పరిస్థితులలోనూ వీడరాదు. వీరికి అనుకూలఫలితములు ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో కూడ ప్రాప్తించు అవకాశమున్నది.

 

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

ఈ రాశివారికి ఇది పూర్తిగా అనుకూలమైన మాసము. కొద్ది పాటి తిప్పట మరియు శారీరక అలసటను మినహాయిస్తే అన్ని వర్గములయందు, క్షేత్రములయందు మరియు విషయములయందు వీరికి అనుకూలముగా ఉన్న సమయమిది. ఈ అలసట మరియు తిప్పట ప్రస్తుతము నడచుచున్న ఏలినాటి శని ప్రభావకారణముగా మాత్రమే వీరికి లభించుచున్నది.

          పరాక్రమము మెండుగా ఉన్న కారణముగ ఈ రాశివారు ఈ సమయమునందు వివాదాదులను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయములో సాధారణముగ ఈ రాశివారికి వ్యతిరేకముగా పనిచేయడానికి ఎవ్వరూ సాహసించలేరు. సమాజములో ప్రతిష్ఠ పెరుగుతుంది. అన్ని వర్గముల వారు వీరికి సహాయముగా నిలబడగలరు. కావున అరుదుగా వచ్చే ఇటువంటి అనుకూలసమయమును పూర్తిగా సద్వినియోగపరచుకోవలెను.

 

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

సమయము ప్రస్తుతము ఉపద్రవములతో కూడినది. వీరి వైభవము క్షీణించగలదు. గుండెనెప్పి సమస్యను ఎదుర్కొనే అవకాశమున్నది. ప్రభుత్వ పరముగ వీరిపై ఒత్తిడి పెరుగగలదు.  ఈ సమయములో వివిధ ప్రభుత్వ శాఖల దాడులు వీరిపై జరుగు అవకాశములున్నవి. కావున ఈ సమయలో ఎవరినీ నమ్మరాదు. లావాదేవీలను శ్రద్ధగా జరుపుకోవాలి. పిత్త ప్రకోపము మరియు చోర రోగ భయములు వీరిని వెంటాడగలవు.

          అవమానములు సంభవించు అవకాశమున్నది. రెండు మూడు కోణములలో అవమానము మరియు వైభవక్షయము కనిపిస్తున్న కారణముగ ఈ రాశివారు  ఈ మాసమునందు సహనముతో శాంతముగ సమయమును గడుపుటకు ప్రయత్నించాలి. ఇందులోనే వారి హితము ఉన్నది. బంధుజనులకారణముగా ఏర్పడే చాలా విధములయిన కష్టములు మరియు అవరోధములు మానసికముగ ఇబ్బందిని కలుగజేయగలవు. కావున కొత్త పనులను ప్రారంభించుట, తాహతుకు మించి పెట్టుబడులు పెట్టుట తగదు.

 

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే అవకాశమున్నది. అకస్మాత్తుగా ఉద్రేకమునకు లోనగుట, ఎదుటివారిపై దాడికి దిగుట, అర్థము చేసుకొనలేకపోవుట, తొందరపడి నిర్ణయములు తీసుకొనుట ఈ సమయములో చాలా సాధారణముగా కనిపిస్తుంది. ఈ కార్యములన్నియూ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావమును చూపు అవకాశమున్నది. చెడుమాటలు వినుట, బంధనమునకు లోనగుట, కలహములకారణముగా ద్రవ్యమును కోల్పోవుట జరుగగలవు.

          ఈ మాసమునందు ఇబ్బందులకు మూలకారణము ఉద్రిక్తతలు మరియు ఆవేశము అని స్పష్టముగా తెలియుచున్నది. అకస్మాత్తుగా వచ్చే ఆవేశము ఎంతటి అనర్థమునకైననూ దారితీసే అవకాశమున్న కారణముగ సహనముగా ఉండటానికి చాలా వరకు ప్రయత్నించగలరు. ఇది ఆచరించడము చెప్పినంత సులభము కాదు. కావున సాధ్యమయినంత సమయమును ధ్యానములో మరియు యోగ లో గడపడానికి ప్రయత్నించాలి.

 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

ఈ మాసము ఈ రాశివారికి బహు మిశ్రితము. గ్రహముల శుభస్థితి ఈ రాశివారికి ఈ మాసము అధికముగా ఉన్నది. కానీ ఏ గ్రహముయొక్క శుభస్థితి నడచుచున్న సందర్భములోనైనా తనదైన శైళిలో కష్టములను ఇవ్వగలిగిన గ్రహము కుజుడు. ఆ కుజుడు ఈ రాశివారికి ఈ మాసములో వ్యతిరేకుడుగా ఉన్నాడు . ఆ వ్యతిరేకత కారణముగ కుజుడు ఈ రాశివారిని వ్యయము, సంతాపము, నేత్రరోగము మరియు స్త్రీ వ్యతిరేకతను కలుగచేయగలడు.

          ఈ విపత్కర పరిస్థితిలో ఈ రాశివారు ముఖ్యముగ శుభస్థితిలో నున్న గ్రహములపై ఆధారపడవలసి యుండును. ఈ రాశివారు సాధ్యమయినంతవరకు కుజుని రోజున అనగ మంగళవారమునాడు ఎటువంటి ప్రయాణములు చేయకుండుట మరియు ఏ కొత్త పనులను చేపట్టకుండ జాగ్రత్త వహించవలెను. అతి జాగ్రత్తగా ఉన్ననూ ప్రమాదములు సంభవించే అవకాశమున్న కారణముగ యోగాభ్యాసమును భగవద్ధ్యానముతో కలిపి ఆచరించవలెను.

 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

ధనము అధికముగా వ్యయమగుట మరియు పందెముల యందు నష్టపడుట జరుగును. పందెములకు దూరముగా ఉండాలి. బుద్ధికూడ పూర్తిగా పనిచేయదు. అవసరమైన సందర్భములలో నిర్ణయములు తీసుకోలేకపోవడము కారణముగ కూడ ధననష్టము జరుగు అవకాశములెక్కువ. కావున షేరు మార్కెట్టునకు కూడ దూరముగ ఉండగలరు. ఇది ఈ రాశివారికి ఈ మాసమంతయూ వర్తించే సామాన్యమయిన ఫలము.

          ఇక మిగిలిన విషయములకు వస్తే ఈ మాసము ఈ రాశివారికి అన్ని రంగములయందు శుభప్రదము మరియు లాభప్రదముగా ఉండును. రెండు విపరీత ఫలములు ఒకే చోట వ్రాసినట్లు అనిపించవచ్చును. కానీ ఇది సంభవము. అన్ని రంగములయందు ఈ రాశివారు రాణించుట స్పష్టము. కానీ ఆ రాబడి అనవసర సందర్భములలో వ్యవము కావడము లేక నష్టపడడము జరుగుతుంది. ఈ విషయము చాలా స్పష్టముగా ఉన్న కారణముగా నష్టమును తగ్గించుకౌవడానికి ఈ రాశివారు ఈ మాసమునందు పెట్టుబడులకు మరియూ జూదమునకు దూరముగా ఉండగలరు.
 

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

బదలీలు, కలహములు , ఆపదలు, దీనత్వము ఈ రాశివారిని అప్పుడప్పుడు ఈ మాసములో ఇబ్బంది పెట్టగలవు. ఈ పరిస్థితి చాలారోజులుగా నడచుచున్న కారణముగా ఇపుడు ప్రత్యేకమార్పుగా ఇవి కనబడే అవకాశములేదు. ఇటువంటి పరిస్థితులలోనూ ఈ రాశివారికి లక్ష్మీవంతురాలయిన స్త్రీ దొరకగలదు. అనగ ఐశ్వర్యయుక్తురాలయిన యువతితో వివాహము జరుగగలదు. ఐశ్వర్యము నానా ప్రకారములుగ ఉండునన్న సత్యమును విస్మరించరాదు. వివాహ ప్రయత్నములు చేయుచున్న వారికి మాత్రమే ఈ ఫలము వర్తించును.

          ధనాగమము సక్రమముగ జరుగును. మరియు జనుల సహకారము, సమాజములో గౌరవము వీరికి ఎప్పడివలె లభించగలవు. అధికారులతో వివాదములకు దిగరాదు. ఇతరుల పనితీరును తప్పుబట్టుటకు ఇది సరియైన సమయము కాదు. ధనాగమసిద్ధి కలుగు అవకాశములున్న కారణముగ ప్రస్తుతము దృష్టిని ఈ విషయముపై కేంద్రీకరించగలరు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech