రచన : శ్రీమతి రాజ తల్లాప్రగడ
గానం: ప్రణవి (సినీగాయని)
సంగీతం : శ్రీ రామాచారి

 

ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)              

    
సా కి ||
పచ్చా పచ్చని పైరులా సశ్యమూ - తెలుగు భాష సౌరభమూ
తెల్లా తెల్లని మల్లెలా స్వచ్చమూ తెలుగువారి హృదయమూ
పల్లవి
ఎత్తవోయి ఎత్తవోయి ఆంధ్రమాత తేరు
ఎలుగెత్తి చాటుమోయి తెలుగుదనం తీరు ||ఎత్తవోయి||

 

చరణాలు
1. ముళ్ళున్నా గులాగులాబి గుభాళించక మానునా
తేనె టీగల మాటున మకరందం దాగునా ||ముళ్ళున్నా||
తెలుసుకో తెలుసుకో - తెలుగు సోదరా..||తెలుసుకో||
మనభాషలొ ఇమిడిన ఆ పరిమళ మకరందాలు ||ఎత్తవోయి||

2. అలనాటి రాయలు అష్ట దిగ్గజాల రీతి
ఏకమైతే తెలుగు జాతి ఆగ దింక ప్రగతి || అలనాటి ||
చేయవోయి చేయవోయి తెలుగు ప్రస్తుతీ ||చేయవోయి ||
జమంతా నింప వోయి సాహితీ జ్యోతి ||ఎత్తవోయి|| 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

 

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech