సిద్ధి వినాయకా

                                                - శ్రీపతి. బాలసరస్వతి

    
 

1.  సిద్ధి వినాయకా ఎపుడు సిద్ధినిజేయుమ మంచికార్యముల్

బుద్ధిని కూడి మానవుల బుద్ధిని సక్రమమార్గమందునన్

వృద్ధిని జేయుమా, మనువు, వృత్తియు, మామది, తీరుతెన్నులన్

పృథ్విని, నేటి మాజనమ, పృథువు జేయుమయెల్లవేళలన్

 

2. అవతారమ్మును ఎత్తితీవు, యిలలో అభ్యాసమున్ నేర్పుమా

అవసానమ్మున మానవుల్ ఎపుడు నీ ఆలోచనమ్మేమదిన్

అవధూతా! ఉనుచంగ, ఆమిత్తియికన్ ఆహ్వానమియ్యంగనే

అవలంబమ్మును యిమ్ముమా, కరుణలో మాసాయిబాబాయిలన్

 

3. ఇమ్మడి నెయ్యమున్ పనిచి ఇంపుగ కోరుచుండగన్

ఉమ్మడి పెంచుచున్ మదిని ఉండగ, గోరగ భార్య, భర్తయున్

కమ్మని జీవితమ్ములను కాంచగయత్నముచేయుచుండగన్

మమ్మరె మాయ జూడు, మటుమాయముజేయునుమానవాళినిన్

 

4. నేర్పుగనీదు రూపమును నేరుగ జూడగ యత్నమాయెవే

ఓర్పుగ నేను నిన్ను గెలుపొందగ జూచితి నోడిపోయితిన్

చేర్పున చేరిచెయినిడి చేకొన జేయుదు నీదుమర్మమున్

తీర్పుగ మాయతల్లి! మరి తీర్థము తెల్పుము తృప్తిజెందగన్.

 

5. నీమీదే నిలుచుండి భారమునునే నీమీదమోపేయుచున్

ఆమీదున్నెరుగం గలేకమనుచున్ ఆక్రాంతి జేసేయుచున్

మేమీ తీరుగనుంటిమే మరీచుచున్ మేడ్పడ్చు నెల్లప్పుడున్

మామీదన్ దయజూపుమా ఎపుడు భూమాతా! అపారమ్ముగన్

 

6. అభ్య్రగ్రమ్మున నున్న భావములనే అందంమస్తిష్కమం

దభ్యస్తమ్ముగజేసి కొమ్ముయెపుడున్ అంతర్ముఖండవ్వగన్

అభ్యర్చించుము దేవదేవునిలలో అంహన్సువేపోఓవగన్

అభ్యర్ధించుము మానవాళికిలలో అదృష్టమే కల్గగన్

 

7.  నిమ్మళమున్న మానవుడు నీగునుదోషములన్ని ధాత్రిలోన్

నమ్మకమున్న మానసము నొందిని పొందును అన్ని జన్మలున్

దమ్మము ఉన్న జీవితము దందను కూడ జయించుచుండు,

పిమ్మట వేల్పులందరును పీఠము వేయును (హృదులన్నితున్)

                                                             (అట్టి హృదులన్)

 

8. ఉప జీవించగమంచి మనుజులనే, ఉగాడకన్ కాంచుచున్

ఉపయోగించగ జీవితమ్మును సదా ఉద్యోగమున్ చేయగన్

ఉపదేశించుచు పెద్దలందరుయిలన్ ఉత్కర్షమున్ చేయగన్

ఉపచారములు, చేయువారలకు నేనుప్పొంగుదున్ ఎప్పుడున్

 

   
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech