రామకథ

                                                - వి లలిత

    
 

శోకమే ఓ శ్లోకమైనది - శ్రావ్యమై ఓ కావ్యమైనది
నామమై శ్రీరామమైనది - రామమై ఆరామమైనది
మోక్షారామమైనది -

రామ కథ పవిత్రము - హనుమ సీతా సౌమిత్రము
జయజయరాం జానకిరాం - హనుమ త్సేవిత లక్ష్మణరాం

దశరధుని శోక నివారణం - పుత్రకామేష్టి పరిపూర్ణం
సుతునిగ నారాయణ జననం - సాగునింక రాక్షస హరణం

ఋషితో కదలెను చరణం - సలిపెను దానవ హరణం
ముగిసిన యాగ సంరక్షణం - మిథిలానగర ప్రయాణం

శివ ధనుసు విరిగిన శుభ తరుణం - వైదేహితో జరిగెను పరిణయం
పరశురామ గర్వోప హరణం - ఆగిన క్షాత్రవకుల హరణం

కైక కోరికతి దారుణం - సుఖ విఛ్ఛేదన కారణం
అనుజుని క్రోథ నివారణం - వనములకు కదిలె శుభ చరణం

నార చీరలే ఆభరణం - భార్యా సోదరులే అరణం
గుహునితొ మిత్ర సమ్మేళనం - గంగ దాటించె చెలిమి ఋణం

మారీచ కనక మృగథారిణం - మాయ భిక్షువె శోకోపకరణం
ఆపలేని సీతాప హరణం - సతి వియోగ మతి దారుణం

పవనసుతునితో సమాయణం - ఫలించె సీతాన్వేషణం
అంగుళి నొసగిన కారుణ్యం - లంకా దహనం సంపూర్ణం

కరుణ కురిపించె పాషాణం - సాగెను వారధి నిర్మాణం
మానవ దానవ ఘోర రణం - జరిగెను రావణ సంహరణం

   
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech