సాలోచన

                                               -  ‘సాహిత్య శ్రీ’ సోమంచి ఉషా రాణి, ప్రావిడెన్స్, రోడ్ ఐలాండ్

    
 

ఓ రోజులో నీకు
ఓరెండు నిమిషాలు చాలు
ఒరిగిన వయోజీవితాలలో నీ
కరస్పర్సే దివ్యౌషధం

తీరికలేని యాంత్రికయుగంలో
తీరని సమస్యలవలయంలో
తరగని ఆస్థిపాస్థులున్నా
తీరదు ధనదాహం;

తీరా వయసుడిగాక
తరం మారిన తదనంతరం
తీరిక దొ రికాక చిం తించినా
తరలిపోయినవారు తిరిగొస్తారా?

తరవాత తరంవారైనా
కరుణతో పలకరిస్తారాంటే
పరాయిదేశాలకు ఎగిరిపోయి
తిరిగిరావడాన్ని వాంఛించరే?

మారుతున్న కాలంతోపాటు
మారుతున్న మానవతావిలువలు
తరుగుతున్న సంబంధబాంధవ్యాలు
తరుణమిదే సాలోచనకు;

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

 

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech