శోధన

                                                          - సురేంద్ర బాబు

    
 

నేను..సమాధానం రాని ప్రశ్నలతో నిరంతరం సహవాసం చేస్తుంటాను ...

కాలం గడిచే కొద్దీ ..ధనికుడు కుబేరుడు అవుతున్నాడు..
పేదవాడు మాత్రం కుదేలైపోతున్నాడు..
దశాబ్దాలు మారుతున్న అసమానతలు ఎందుకు మాయమవటం లేదు?
తరాలు మారుతున్నా..అంతరాలు ఎందుకు తరగటం లేదు?

సెన్సెక్స్..పరుగులు పెడుతున్నా..
వృద్ధి రేటు గణనీయంగా పెరిగిపోతున్నా....
యుగాలు మారుతున్నా..
నా దేశం మాత్రం ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశం గానే మిగిలి పోతుంది?

ఉగ్రవాది దాడిని నిరోధించటానికి మొహరించలేనంత బలగాలను మాత్రం..
ఒక ఉగ్రవాది రక్షణకు ఎందుకు మోహరిస్తుంది?

లేకపోయినా బ్రతకగలిగే కారు కు మాత్రం వుంది భీమా..
మరి పంటే ప్రాణం గా బతికే ఆ రైతుకు మాత్రం ఎందుకు లేదు భీమా అనే ధీమా?

వనరులు పుష్కలం గా వున్నా..జనాలు సంవృద్దిగా వున్నా..
వాటిని అనుసంధానించి..సంధించే ప్రణాళికలు మాత్రం ఎందుకు రావట్లేదు?

చదువుకునే ఆశక్తి వున్నా..
చదువుకొనే శక్తి లేక వడలి పొతూ ..వాలిపోతున్న విద్యా కుసుమాలు ఒక వైపు..
ఆధునిక ఆ ధనిక వైద్యం తానందను అంటూ..
వెక్కిరిస్తున్న వైనం మరో వైపు..

ఇలా
ఓ ప్రశ్నమరణించక ముందే..
ఒక ప్రశ్నకు కు సమాధానం జన్మించక ముందే ..
మరో ప్రశ్న ఉదయిస్తుంది..

నాకు మాత్రం ఒకటే అనిపిస్తుంది..
విద్యకు..వైద్యానికి..
రైతుకు..రోగానికి..దాన్యానికి ప్రాధాన్యం ఇవ్వనంత కాలం .
నా దేశ స్థితి..పరిస్థితి ..దుస్థితి ఇంతేనేమో..
 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech