శతమానం భవతి

                                                                                     - ఆర్.దమయంతి

    
 

అక్షరం అమ్మలాంటిది-
నమ్మూ, నమ్మకపో.
నీకు మేలే చేస్తుంది.
అక్షరం అంతరంగం వంటిది-
అబద్ధమెరగనిది.
అక్షరం అద్దం లాంటిది..
నిజామై నీ వెంటుంటుంది.
అక్షరం దీపంవంటిది
నీ మీద చీకట్లను పరచుకోనీదు....
అక్షరం అంటె  ఒక పెట్టుబడి..
'అర్థమైతే, అంతా రాబడే!
అక్షరాన్ని అర్చించుకుంటె-భక్తి,
అక్షరానికి అర్పిచంచుకుంటె-ముక్తి.
అక్షరం నెకొసగుతుంది-భుక్తి, యుక్తి.
అక్షరం-ఒక అమృతభాండం
ఎంతమాంది, ఎన్నిసార్లు పానించినా..
తరగని అక్షయపాత్ర-
యుగాలకొద్దీ..పంచిపెడుతున్న జ్ఞానప్రదాత!
అందుకె-
అక్షరం ఆయువైంది. వైభవమైంది.
గమనమైంది, పురోగమించమంటోంది.
నువ్వు కాలుమొక్కితె-
'శతమానంభవతి.'.అంటూ దీవిస్తుంది..
తీసుకో..నూరేళ్ళ దీవెన..
అక్షరమే నీకు ఆశీస్సు, శ్రేయస్సునూ!
 

   
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech