భారతంలో (ఎం)పిడకలవేట

 

    
ఎనకటికి ,
మహాభారతంలో దుర్యోధనుడికి 99 మంది తమ్ముళ్ళట, అందులో దుశ్శాసనుడు, వికర్ణుడు తప్ప వేరే పేర్లు జనాలకి తెలీవు... పనిలేదు..పేరులేదు,,సంపాదన లేదు.. అందుకు అలిగి సమ్మె చేస్తే...సరే వచ్చే జన్మలో ఆంధ్రాలో పార్లమెంటు మెంబర్లైపోండి...కావాల్సినంత పేరు..డబ్బు అని వరమిచ్చారట..

ఇదేదో కాకమ్మ కధ.. భారతంలో పిడకలవేట..

ఈ మధ్య పార్లమెంటులో మన వాళ్ల ప్రతాపం.. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏ ప్రాతిపదికలో ఏ ప్రాంతం నించి గెలుస్తారో తెలీదు..ఒక వేళ స్త్రీకోటా ఉంటే సడెన్ గా వంటింట్లో ఉన్న ఇల్లాలిని నామినేటు చేసేసి..గెలిపించేసి, ఇక చక్రం వీళ్ళు తిప్పుతారు..ఇక కుల,మత, మరికొన్ని కారణాల వల్ల కూడా గెలిచే అవకాశాలున్నాయి..ఎంత సేపూ తమ భత్యాలు పెంచమనో..జీతాలు చాలట్లేదనో తప్ప జనాల బాధల గురించి మనవాళ్లు పట్టించుకునే టైం లేదు..సార్లకి..

రాష్ట్రం తరఫున ఎంత మంది ఎం.పీ లున్నారో..రాష్ట్రానికి నిధులు ఎంత తెస్తున్నారో సమస్యల గురించి చర్చిస్తున్నారో తెలీదు..రక రకాల పైరవీల కోసం వచ్చే జనాలతో ఏ పీ భవన్ నిండి పోతోంది కానీ...ఏ పీ కి మాత్రం ఎం పీ ల వల్ల ఒరుగుతున్నది..శూన్యం.

అసలు పార్లమెంటులో మన వాళ్ళ హాజరీ ఎంత? ఫలానా నాయకుడి ఫొటో పెట్టాలనో..మరో నాయకుణ్ని కించ పరిచారనో..గలాభా తప్ప తన నియోజకవర్గ జనాభా గురించి పోరాడే టైము లేదు మనవాళ్ళకి.
మన తెలుగు ఎం.పి వర్యులు ప్రాంతాలగ విడిపోయి, ఒకరి ఫై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, మన తెలుగు ప్రాంతానికి(ఆంధ్ర ప్రదేశ్) అన్యాయం చేస్తున్నారా? అంటే నిజమని అనాలి.
బెదిరించో..బతిమాలో తమిళ రాష్ట్రానికి మాత్రం (కరుణా) నిధులు జేరిపోతున్నాయి..
బెంగాలుపైనా కేంద్రానికి 'మమత ' ఎక్కువే...
ఇక బీహారుకి లాలూ రైళ్ళు చాలానే చేరాయి..
రాహుల్ దయ వల్ల ఒక రాష్ట్రం బాగు పడ్డది..
శివ సైనికుల రాష్ట్రంలో చవాను పై ఎన్ని కేసులు వున్నా మహా ప్రగతి సాధిస్తోంది...మహ రాష్ట్రం..
మరి మనపై ఏలా దయా రాదూ.....??????

మెంబర్ ఆఫ్ పార్లమెంటు...అంటే పార్లమెంటుకి వెళ్ళి వచ్చే వాళ్ళు కాదు....మెసెంజర్ ఆఫ్ ప్రజలు..అని
తెలుసుకునేదెప్పుడు ?

 
 

ఫణి మాధవ్ కస్తూరి :
స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech