భారతీయ విశ్వశాస్త్రం

ఆది నుండి విజ్ఞానానికి నిలయం - భారతం. తర తరాలుగా వారసత్వ రూపేణ, పరంపరల ఫలస్వరూపంగానో సాంప్రదాయ బధ్ధంగానో, శృతి, లేదా విభిన్న గ్రంధాల ద్వారానో విజ్ఞాన సంపద భావి తరాలకు అందజేయబడుతున్నాయి. విద్యా శక్తి, మేధా శక్తి, ఇచ్చా, క్రియా శక్తులు కాలనుగుణంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ శక్తుల సమన్వయీకరణ, మానవాళికి ఉపయుక్త సాధనంగా మారి, జీవన గమనం సులభసాధ్యం చేస్తూ, జీవిత సాఫల్యానికి దోహదపడుతున్నాయి.

ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తువులు నిక్షిప్తమై ఉన్నాయి. భారత దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తున్న, అనేక జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన విశేషాల సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త, పరమార్ధాలను విశ్లేషించి తదనుగుణ విషయాలను సేకరించి, సమన్వయం చేసి ఈ విజ్ఞాన భారతీయం " శీర్షికలో ప్రస్తుతీకరిస్తున్నాం.

మానవుడు ప్రకృతిని అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఈ బ్రహ్మాండం ఎప్పుడు మొదలైంది? ఎనాళ్ళు సాగుతుంది? దీని అంతం ఎప్పుడు? ఇందులో నేను ఎంత దాకా ఉంటాను? నా కాల వ్యవధి యెంతా? ఇలాటి ప్రాధమిక ప్రశ్నలకు సమాధానం కోసం దృష్టి సారించి, ఈ సృష్టిలో చతుర్భువనాలు ఉన్నట్టు దివ్య దృష్టితో కనుగొన్నారు. అనంత విశ్వం కాలమానాన్ని కొలిచే ప్రాధమిక సమస్యని పరిష్కరించారు. గెలిచారు!. ఇది మానవ మేధస్సు అద్భుత విజయం. మనవ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఖగోళ, భూగోళ, బ్రహ్మాండం, సృష్టుల రహస్యాలు కనుగొన్నారు. అపవృశీయత్వం చేశారు. ఈ జగత్తు అనంత వాయువులో ఎలా పయనిస్తొందో వివరణలు ఇచ్చారు. భూమి ఆయుర్ధాయం, 311 ట్రిల్లియన్ యేళ్ళని గణాంకం చేసి చెప్పారు. జటిలమైన ప్రాధమిక ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటమేకాక, అపారమైన విశ్వ జ్ఞాన భండాగారం, భారీ సంఖ్యలు, దశాంశ సంఖ్యా పద్ధతులు మానవాళికి అందించారు. ఈ విషయాల అవగాహనకు కూడా కొంత పరిణితి చెందిన బుద్ధి అవసరం.

విశ్వోత్పత్తి గురించి విషయాలు ఉద్బోదిస్తూ, విశ్వ రూప పరిణామము, జగత్ ఉన్మీళనం, విశ్వాంతరాళ ఆవృత్తి, గుణ-వ్యతికరణములు; జగత్ పరిణామాలు; కాలచక్రము; గ్రహాలు, సూర్య చంద్ర గుణాలు, వాటి ప్రభావాలు; బృహస్పతి చక్రము; గ్రహణ చక్రము; చంద్ర చక్రము; సూర్య చక్రము; ఇనవర్తమాన పత్రిక ఇత్యాది విషయాలపై సమగ్ర వివరణలు ఇచ్చే విశ్వశాస్త్రం (కాస్మాలజీ); ఖగోళ శాస్త్రం; గణిత శాస్త్రాలు అందించిన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఎంతొ మహోనత్త శ్రేణికి చెందిన వారు. సాపేక్శక సిద్ధాంతాం (రెలేటివిటీ) కూడా ఈ విశ్వశాస్త్రంలోని అంతర్భాగమే.

ఈ విశ్వంలోని - నవ గ్రహాలు, సప్తర్షి మండలంతో సహా - నక్షత్ర మండలం, అందులో భూగోళ మానవులని విశ్వకిరణాల రూపంలో ప్రభావితం చేస్తున్న నక్షత్రాలు - అశ్విని, భరణి, ఆరుద్ర, పునర్వసు ఇత్యాదుల ఆదారంగా నిర్మితమైంది విశ్వ శాస్త్రం. స్వర్లోక; భువర్లోకాలతో పాటు, చతుర్దశ భువనాలు - మహర్లోక; జనలోక; తపోలోక; సత్యలోక; అతల; వితల; సుతల; తలాతల; మహాతల; రసాతల; పాతాళ లోకాలు; తదనుబంధ కాల మానాలు, భువనాంతరాళాల, వివరాలు ఇచ్చారు. భూమితో పాటు 8,400,000 తెగల చరా చర జీవ రాశులు ఆవిద్భవించాయి. వీటి మీద వివరణలు ఇచ్చింది విశ్వ శాస్త్రం.

విశ్వం గురించి, అందునా ఇహ లోక అంతర్, భహిర్గత, అంతారార్ధ, విషయాలు వ్యాఖ్యానించారు. ఈ విశేషాలతో పరిపుష్టమైన ముఖ్యమైన గ్రంధాలు - ఋగ్వేదం; వేదాంగ జ్యోతిషం; మహాభారతం; " భాగవత పురాణం " (మహాభాగవతము); " విష్ణు పురాణం "; " సూర్య సిద్ధాంతం "; భగవద్గీత; కృష్ణ యజుర్వేదం; " పురుష సూక్తం "; ఈశావాశ్య ఉపనిషద్; " తైత్త్రీయ అరణ్యక "; మహా పురాణము; అమరకోశం; పణిణి శివ సూక్తాలు; అగ్ని పురాణం; స్కంద పురాణం; భాగవతం. భాగవతం మీద వెలువడినన్ని భాష్యాలు, నిర్వచనాలు మరే పురాణాల మీద వెలువడలేదు.

భారతీయ విశ్వశాస్త్రం - అనంత విశ్వ నిర్మాణ అద్బుత రహస్యాల ఆవిష్కరణ

భారతీయ విశ్వశాస్త్రం అత్యంత ప్రాచీన మైన శాస్త్రం. దీని అన్వయం ఋగ్ వేదం, శుల్బ సూత్రాలు, అరణ్యకాలు, పురాణాలు, బ్రహ్మ సంహిత; భగవత్ గీత, శ్రీమద్ భాగవతం తధితర గ్రంధాలలో పేర్కొనబడినది. భారతీయ శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభకు, వారి దివ్య దృష్టికి ఈ జగత్తులో నిక్షిప్తమైన పరమార్ధాలు, అంతర్బహిర్గత విషయసంబంధ వివరణలు, వ్యాఖ్యానాలు నిదర్శనం. భూ మండలంలోని యే దేశంలో కాని, యే భాషలో కాని ఇంతటి అసాధారణ రీతిలో సృష్టి స్థితి లయ రహస్యాలు చెప్పబడలేదు. ఈ ఘనత ఒక్క భారత దేశానిదే.

జగత్తు గూర్చి ఈశావాస్య ఉపనిషత్తులో:

పూర్ణమదః పూర్ణ మిదం పూర్నాత్ పూర్ణ ముదచ్చతే |
పూర్ణస్య పూర్ణ మదయ పూర్ణ మేవ వశిష్యతే ||
అదీ పూర్ణమే (విశ్వం); ఇదీ పూర్ణమే (విశ్వం); ఈ జగత్తు పూర్ణంలోనుంచి ఉద్భవిస్తుంది. జగత్తుని జగత్తులోనుంచి తీసేసినా జగత్తు అలానే ఉంటుంది (ఇంఫినిటి). ఇలా జగతావిష్కరణ సూత్రాన్ని తెలిపారు.

జగత్తు ఉన్మీళణం గురించి తైత్రీయ అరణ్యక "శాంతి మంత్రం"లోవివరించారు. ఈ మంత్రం జగతావిష్కరణ గురించి వివరించింది. ఈ విశ్వం ఎలా ఆవిద్భవించిందో, ఎలా నడుస్తుందో, ఎలా అంతర్దానమవుత్తుందో తెలిపారు.

ఇక పంచ శాంతి మంత్రాలలోని మరొక శాంతి మంత్రంలో ఇలా చెప్పారు - "గౌహ శాంతిహి; అంతరిక్ష శాంతిహి; పృథ్వి శాంతిహి; ఆపహ్ శాంతిహి; ఔషధయ శాంతిహి; వనస్పతయ శాంతిహి; విశ్వేదేవా శాంతిహి; బ్రహ్మ శాంతిహి; సర్వం శాంతిహి; శాంతిరేవ శాంతిహి; .... " శాంతి మంత్రం విశ్వ శాంతి కోరుతుంది - ఆకాశం శాంతితో ఉండుగాక; వాయుమండలం శాంతితో ఉండుగాక; పృత్వి శాంతితో ఉండుగాక; జలం శాంతితో ఉండుగాక; ఔషదాలు శాంతి గలిగించుగాక; వృక్షాలు శాంతితో ఉండుగాక; విశ్వ కిరణాలు శాంతితో ఉండుగాక; అక్షుణ్ణ సత్యం శాంతితో ఉండుగాక; సమస్తం శాంతితో ఉండుగాక; శాంతి కూడా శాంతితో ఉండుగాక; లౌకికంలో, పధార్ధలలో శాంతితో ఉండుగాక; (ట్రన్సెండెంటల్) శాంతి ఉండుగాక;

ఇలా ఒక శాస్త్రాన్ని కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మాత్రమే తెలుసుకుని వదిలేయకక, తెలుసుకున్న విషయాలతో పరమార్ధిక తత్వ విచారణకి, మానవ జీవితం ఎందుకన్న మూల ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకునేందుకు సోపానాలుగా ఉపయోగించారు. అందుకే మనుషులు, ప్రకృతి, భూమి, లోకం, విశ్వం శాంతియుతంగా, సామరస్యతతో ఉండాలో నియమ పూర్వత సూత్రాలు రాశారు. సమస్త చార చర వస్తువులలో అనుస్వరత ఉండాలి అని ప్రార్ధించారు; ఇది సుఖమైన మనుగడకు అవసరం కనుక!.

విశ్వోత్త్పత్తి - పురుష సూక్తం వివరణాలు

శ్రీమద్ భాగవతములోనూ, పురుష సూక్తములోనూ విశ్వోత్పత్తి గూర్చి ప్రస్తావించ్చబడ్డాయి. దశ గుణ సంఖ్యా పద్ధతి పురుష సూక్తంలో వాడేరు.

సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వ అత్యతిష్తద్ దశాంగుళం ||
పురుష సూక్తం మొదటి అనువాకం ప్రధమ శ్లోకం. సహస్ర శీర్షాలతో ఉన్న పురుషా, (విశ్వ పురుషా); వేయి కన్నులున్నవాడా; సహస్ర పాదాలుండి యావత్ భూమి (ప్రపంచం) పరివ్యాప్తించిన వాడా; పది వేళ్ళ మీద ఎంచడానికి లెక్కకు మించి ఉన్నవాడా;
తస్మాద్విరాడజాయత విరాజో అధి పురుషః |
స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మథో పురః ||
[పురుష సూక్తం – అనువాకం 1, శ్లోకం 5] - విశ్వ పురుషుడు నుండి జగత్తు ఆవిద్భవించి, విస్తీర్నిస్తుంది. ఆ విరాట్ రూపం నుండి విరాజిల్లుతాడు బ్రహ్మ, సృష్టి నిర్మాణానికి. భూమి, దేవత, రాక్షస గణాలని సృష్టిస్తాడు. ఇలా ప్రాధమిక ప్రశ్న ఐన - " విశ్వోత్పత్తి యెలా సంభవించింది? " బ్రహ్మాండావిషరణ విషయాలు, సృష్టి రహస్యాలు వెల్లడించారు.
సప్తాస్యాసన్ పరిధయః త్రిఃఅసప్త సమిధః కృతా |
దేవ యద్యజ్ఞంతన్వనాః అబధ్నన్ పురుషం పశుం ||
[పురుష సూక్తం – అనువాకం 1, శ్లోకం 7] - యజ్ఞాస్యానికి సప్త పరిదీయలు అవసరం. " త్రై సప్త ", అంటే 21 సమిధలతో దేవతలు తన్వన (యజ్ఞం) చేసి అభద్నన పురుషుని కొలుస్తారు. యేడు వేద గణాలు సప్త అవధులకి ప్రతీక. ఇరవై ఒక్క అనుపానం - 12 మాసాలు; 5 ఋతువులు; 3 ప్రపంచాలు; ఒక సూర్యుడు. దశాంశ సంఖ్యా పద్ధతి భారత దేశంలో అనాదిగా వాడకంలో ఉందని తెలపటానికి ఇది మరొక ప్రమాణం.

ప్రపంచం గురించి ఇన్ని విషయాలు, కాల మానాలు ఒక్క శ్లోకంలో చెప్పిన ఉదాహరణలు ప్రపంచంలో మరే సాంకేతిక శాస్త్ర గ్రంధంలోనూ లేవు. ఇలాటి అద్బుత రచిన చేసిన ఆ వైజ్ఞానికుడి పాండిత్య ప్రకర్షలు ఎట్టివో వెరే చెప్పనక్కర లేదు. మహాద్బుత విషయాలు నిశితంగా, క్షుణ్ణంగా వివరించారు. ఈ అంశంలో వారి అపార జ్ఞానమే కాక భాష మీద ఉన్న అఖండ ప్రజ్ఞ కూడా విదితమవుతోంది. వారి విషయ అవగాహన, భాష వైదూష్యం యే పాటివో తెలుస్తున్నాయి.

చంద్రమ మనసొ జతహ్ ఛక్షొహ్ సుర్యొ అజయత |
ముఖాదింద్రస్చగ్నిశ్చ ప్రాణాద్వయురజయత ||
(పురుష సూక్తం - అనువాకం 1, శ్లోకం 13)పంచ భూతాలు ఎలా అవిద్భవించాయో వర్ణిస్తంది. విశ్వ పురుషుడి నుండి సమస్త దీప్తులు, లోకాలు జనించాయి. చంద్రుడు అతని మనస్సునుండి; సూర్యుడు (చక్షువులు) కళ్ళ నుంచి; ఇంద్రుడు, అగ్ని అతని నోటి నుంచి; వాయువు అతని శ్వాస నుండి ఉద్భవించాయి అని వర్ణించారు.
నాభ్య ఆసిదంతరిక్షం శీర్ష్నోఉద్యౌ సమవర్తత
పద్భ్యాం భూమిర్దిశ స్రోత్రాః తథా లోకగుం అకల్పయన్ ||
(పురుష సూక్తం - అనువాకం 1, శ్లోకం 15) - విశ్వ పురుషుని నాభి నుండి సమస్తాంతరిక్షం ఆవిద్భవించింది. ఆకాశం ఆయన శిరస్సునుండి ఉత్పన్నమైంది. అతని కాళ్ళ నుండి భూమి, చెవులనుండి దిశలు, దిక్కులు ఉత్పన్నమవుతాయి. ఇలా అతని కల్పన వల్ల, సంకల్పం ద్వారా సంత లోకాలు ఆవిర్భవిస్తాయి.

విస్వ పరిణామ క్రమాన్ని ఒక కథగా వర్ణిస్తూ తెలియజెప్పే ప్రయత్నమే పురుష సూక్తం. విశ్వ పురుష అనేది "మూల కారణమైనది" అనే భావంతోనే అర్ధం చేసుకోవాలి.

పణిణి " అష్టాధ్యాయి " లో శివ సూత్రాల గురించి ప్రస్తావించారు. కాబట్టి, శివ సూత్రాలు పణిణికి పూర్వమే మనుగడలో ఉన్నాయి. స్కంద పురాణం, ప్రభాశ ఖండం (7.1.2.39-42) భాగవతములో పేర్కున్న అంశాలను వివరింపబడ్డాయి. అగ్ని పురాణం (272.6,7) లో కూడా శ్రీమద్భాగవతం లోని విశ్వం విషయాలు ప్రస్తావించ బడినవి.

సర్గ - మహత్తత్వం - కాల ప్రవాహం

శ్రీమద్భాగవతం విశ్వోత్పత్తి విధానం, గతి గమనాల వివరణలు ఇచ్చింది. పధార్ధ ప్రపంచం రెండు శక్తులతో కూడి ఉంటుంది. అవి - "బహిరంగ శక్తి"; "తటస్త శక్తి"; మూడో శక్తి "అంతరంగ శక్తి"; ఇది ఆత్మజ్ఞానంతో ప్రపంచంలో విలువడుతుంది.

"విష్ణోస్తు త్రైరూపణి పురుషఖ్యాని అథో విదుహు"

శ్రీ మహా విష్ణువు పధార్ధ శక్తులలో మూడు రూపాలలో దర్శనమిస్తాడు - గర్భోదాక్షయి విష్ణు, కారణోదాక్షయి విష్ణు, క్షీరోదాక్షయి విష్ణువు.

"యక్కరణవ-జలే భజతిస్మ యోగ-నిద్రం"

సర్వ జగత్తులకు కారకుడైన విష్ణువు, విశ్వవార్ణవములో శయనించి యోగ నిద్రలో ఉంటాడు. విష్ణువు అంటే ఇందాక చెప్పిన విశ్వ పురుషుడినే భావించాలి. ఈ పదం ఒక మతానికి సంబంధించినది కాదు.

భుమిరాపో నలో వాయుః
ఖం మనో బుద్ధి రేవ చ
అహంకరయితీయం మే
భిన్నా ప్రకృతి రష్టధా
విశ్వ సృష్టికి నిర్మాణాత్మక పదార్ధాలు - భూమి; అప; అనల; వాయు; ఖ; మనస్; బుద్ధి; అహంకార; సృష్టికి సమస్త పధార్ధాలలో విభిన్న శక్తులుగా అనేక రూపాలలో ప్రతిభింబిస్తాయి. విశ్వమంతటా బ్రహ్మజ్యోతి మినుమిట్లు గొలుపుతూ తేజోమయంగా ఉంటుంది, మిగతా భాగం మహత్తత్వంతో (సమస్త పధార్ధ శక్తులలో) నిండి ఉంటుంది.

అష్టాధాంశ పధార్ధ శక్తులు - అవి: భుమిహ్; అపహ్ (నీరు); అనల (అగ్ని); వాయువు (గాలి); ఖం; మనస్సు; బుద్ధి; ఎవ (కచ్చితంగా); చ (ఇంకా); అహంకరం; ఇతి (ఇలా); ఇయం (ఇవన్నీ); మీ (నా); భిన్న; ప్రకృతిహి (శక్తులు); అష్టాధ (ఎనిమిది మార్లు). (శ్రీమద్భాగవతము 2.10.31) పధార్ధ శక్తులలో ఇవి అత్యంత ప్రాధమికమైనవి. పంచ భూతలైన - భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం లో పంచేంద్రియాలు ఇమిడి ఉన్నాయి. పంచేంద్రియాలు - ద్వని, స్పర్శ, రూప, రుచి, గంధ (వాసన);

ప్రాణం ఆకాశం, నీరు, గాలితో నడుస్తుంది. సరీరానికి ప్రాధమిక (సప్త) పధార్ధాలు - చర్మం; మాంసం; రుధిర (రక్తం); మెద; మజ్జ; అస్తి; ధాతువులు.

ఈ ప్రపంచానికి మూడు ప్రాధమిక పదార్ధాలు - భూమి; నీరు; అగ్ని. జీవ రాశులకి ఆధారం ఆకాశం, గాలి, జలం. నీరు సమస్త జీవాలకు మూలాధారం. పధార్ధ నిర్మాణానికి పంచ భూతాలలో అతి ప్రధానమైనది నీరు. సరీరాన్నికి పంచ భూతాలు ప్రధానమైనవి. స్పర్శ సరీర చర్మానికి తెలుస్తుంది. స్వాసకి గాలి ఆకాశం, వాయు, జలం అందిస్తాయి. స్వచ్చమైన గాలి, నీరు, చోటు (దిక్) ఆరోగ్యానికి అవశరం. భూమి నుండి లభ్యమయ్యే ధాన్యాలు, పళ్ళూ, కూరలు, జలము, అగ్ని సరీర పోషణకు అవశరం.

విశ్వ పురుషుడు "కారణ జలం " లో నిదురిస్తూంటాడు. ఆయన శ్వాస నుండి అనేకానేక విశ్వాలు వెలుస్తూ ఉంటాయి. ఈ విశ్వాలు తేలుతూ, "కారణ జలం " మంతటా విస్తరిస్తాయి. ఈ విశ్వాలు విశ్వ పురుషుని ఒక్క నిశ్వాస పాటు వెల్లివిరుస్తాయి. ప్రతీ ప్రపంచ నిర్మాణమపుడు గర్భోదాక్షయి విష్ణుగా రూపమొందుతారు. విశ్వ పురుషుని నాభినుంచి ఆవిర్భవించిన కమలం నుండి సృష్టికర్త బ్రహ్మ ఉదయించి సమస్త జీవరాశులను, పధార్ధాలను, విభిన్న రూపాలలో నిర్మిస్తారు. సూర్య, చంద్రులను ఇతర గ్రహాలను రూపొందిస్తారు. మూడవ దశలో క్షీరోదాక్షయి విష్ణువు పధార్ధ రూపాలలో పరివ్యాప్తిస్తాడు.

పద్నాల్గు లోకాలు:ఊర్ధ్వ లోకాలు - భువర్లోక; జనలోక; తపోలోక; సత్యలోక; (శ్రీమద్భాగవతం - 2.5.41); భూమికి కింద ఉండే యేడు లోకాలు - అతల; వితల; సుతల; తలాతల; మహాతల; రశాతల; పాతాళ లోకాలు (శ్రీమద్భాగవతము 2.5.38-42).

భారతీయ విశ్వ సిద్ధాంతం (ఇండియన్ తిరీ ఆఫ్ కాస్మిక్ సైకిల్స్)

భారతీయ విశ్వ సిద్ధాంతం అత్యంత ప్రాచీనమైనది. ఇందులో అసాధారణ రీతిలో ఈ ఇహం ఆవిర్భవం, మనుగడ, అంతం సుస్పష్టంగా వర్ణించారు. అందులోని కీలక అంశాలు "శ్రీమద్భాగవతము", "బ్రహ్మ సంహిత"లలో పేర్కొనబడ్డాయి. వీటి ప్రకారం - విశ్వం జననం, విధ్వంసం రెండు విశ్వ క్రమాలు. గడచిన దానికి ఆది లేదు. భవిషత్తుకు అంతం లేదు. బ్రహ్మకు 120 మహా కల్పాల ఆయుర్ధాయం. పద్నాల్గు మన్వంతారలు బ్రహ్మ కాలం లో ఒక రోజుకి సమానం. ఒక్క మహాయుగం బ్రహ్మకి 43.2 సకెండ్ల తో సమానం.

ముప్పై బ్రహ్మ కల్పాలు - (1) స్వేత-కల్పము, (2) నీలలోహిత, (3) వామదేవ, (4) గథాంతర, (5) రౌరవ, (6) ప్రాణ, (7) బృహత్కల్ప, (8) కందర్ప, (9) సద్యోత, (10) ఇశాన, (11) ధ్యాన, (12) సరస్వత, (13) ఉదాన, (14) గరుడ, (15) కౌర్మ, (16) నరసిమ్హ, (17) సమాధి, (18) ఆగ్నేయ, (19) విస్ణుజ, (20) సౌర, (21) సోమ-కల్ప, (22) భావన, (23) సుపుమ, (24) వైకుంట, (25) ఆర్సిస, (26) వలి-కల్ప, (27) వైరాజ, (28) గౌరీ-కల్ప, (29) మహేశ్వర, (30) పైత్ర-కల్ప. మరిన్ని వివరాలకు, శ్రీమద్భాగవతం - 2.10.46 చూడండి.

పద్నాల్గు మనువులను శ్రీమద్భాగవతం 8.10.1-10 లో విపులీకరించారు. అవి: స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామశ, రైవత, చక్షుష, వైవస్వత, సావర్ణి, దక్ష-సావర్ణి, బ్రహ్మ-సావర్ణి, ధర్మ-సావర్ణి, రుద్ర-సావర్ణి, దేవ-సావర్ణి, ఇంద్ర-సావర్ణి; ప్రస్తుతం ఏడవ మన్వంతతరం " వైవస్వత " మన్వంతరములోని కలి యుగ ప్రధమ పాదం నడుస్తోంది. భారతీయ సిద్ధాంతాల ప్రకారం కలియుగం ఫిబ్రవరి 15, 3102 బీ సీ లో మోదలైనట్టు, యుగాది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, ద్వాదశ మాసముల సంవత్సరం ఆరంభమవునని నిర్వచించారు.

సృష్టి (Creation), స్థితి (Sustenance), లయకారకుడు (Absorption)

ఈ జగత్తులో ముల్లోకాలే కాక - చతుర్దశ లోకాలలూ, అందులోని జీవులు వెలుస్తాయి. అవి: - గంధర్వ; విద్యాధర; అసుర; యక్ష; కిన్నర, అప్సరస; నాగ; సర్ప; కింపురుష; మతృ, రాక్షస; పిసాచ; ప్రేత; భూత; వినయక; కుశుమంద; ఉన్మాద; వెతాళ; ఇత్యాది నివాసులున్నట్టు శ్రీమద్భాగతవం(2.10.37-40)లో విశిధీకరించారు.

అనంత కాల ప్రమాణాలలో - వెయ్యి చతుర్యుగాలు ఒక కల్పం. ఇది బ్రహ్మకు ఒక్క రోజుతో సమానము. ఓ కల్పం లో పద్నాలుగు మన్వంతరాలు గడుస్తాయి (శ్రీమద్భాగవతం - 12.4.2). బ్రహ్మ కి ఒక రోజు ముగిసిన తరువాత, అంటే కల్పాదికి, "నైమిత్తిక ప్రళయం" సంభవించి ముల్లోకాలు నాసనమవుతాయి (శ్రీమద్భాగవతం - 12.4.3-4)

ప్రళయాల వర్గీకరణ - జగత్ ప్రళయాలని నాలుగు రకాలుగా వర్గీకరించారు భారతీయ విశ్వశాస్త్రజ్ఞులు. అవి: ("నైమిత్తిక ప్రళయము", "ప్రకృతిక ప్రళయము", "నిత్య ప్రళయము", " మహా ప్రళయము", "అస్త్యంతిక ప్రళయము"

ఆంశిక (పాక్షిక; అసంపూర్ణ) విధ్వంసం:

మనూఅధి కాలంలో ఆంశిక విద్వంశం అవుతుంది. భారతీయ విశ్వశాస్త్ర ప్రకారం - జనించినది, ఓ కాల వ్యవధి తరువాత నశింపక మానదు. ఇది ప్రకృతి ధర్మం. కాలానుగుణంగా సంభవించే స్వరూపనాశనాలని వివిధ వర్గాలుగా వర్గీకరించారు. అవి:

- లయ - చతుర్యుగాల తరువాత, అంటే ఓ మహాయుగాంతమపుడు సంభవించే వినాశనం. భూమి జలమయమై, అగ్ని కి అర్పణమవుతుంది. ఈ విద్వంసం తరువాత తిరిగి - "సృష్టి" (క్రియేషన్), " స్థితి" (సస్టైండ్); "లయ" (డిసల్యూషన్) చక్రం పునరావృతం అవుతుంది.

- నైమిత్తిక ప్రళయం - కల్పాదియపుడు (బ్రహ్మకు ఒక రోజు పూర్తైన పిదప) జరిగే వెల్లువ. బ్రహ్మ యోగనిద్రలోకు జారుకుంటారు. భూ, భువహ, సువహ లోకాలు వినాశనం అవుతాయి. సూర్య చంద్రులు కాంతి విహీనం అవుతాయి.

- మహా ప్రళయ / బ్రహ్మ లయ / క్షితి - వెయ్యి మహా యుగాల తరువాత జరిగే విధ్వంసం. బ్రహ్మాదికి ఈ జగత్ వినాసనం సంభవిస్తుంది. సమస్త లోకాలు నశిస్తాయి; పూర్ణంలో అంతర్లీనమయిపోతాయి. దిక్, కాల, అంతఃకరణం సమసిపోతాయి. మహా ప్రళయాన్ని "జహానక", లేదా "క్షితి" అని అంటారు;

- అస్త్యంతిక ప్రళయం (టోటల్ డిసల్యూషన్) - సమస్త లోకాలు, అందులోని జీవ రాశులు, తత్వాలు (భూమి, జలము, అగ్ని, వాయువు, తేజము, ....) అన్నీ నశిస్తాయి. విశ్వం పరిసమాప్తి అవుతుంది.

వ్యాసుడి కుమారుడు శుక మహర్షి ప్రకారం బ్రహ్మ సృష్టి నిర్మాణాన్ని "సర్గ" అని అంటారు. ఇందులో పదహారు ప్రాధమిక అంశాలు (పదార్ధాలు) ఉన్నాయి. మిగతా వర్గాల నిర్మాణాన్ని "విసర్గ" అని అంటారు. సంకర్షణుడి ద్వరా ఉత్పన్నమైన అగ్ని జ్వాలల వల్ల విలయం సంభవిస్తుంది. ప్రళయంలో సముద్రాలు ఉగ్రరూపాలు దాల్చి వెల్లువౌతాయి. 36,000 వేల సంవత్సరాల వరకు ధారాపాతంగా వర్షం కురుస్తుంది; సాగరాలు ఘోషిస్తాయి; జలప్రళయమవుతుంది. భూమి కుంగిపోతుంది. విద్వంశమైన తరువాత, " గర్భోదాక్షయి విష్ణు " ద్వారా విశ్వం పాక్షిక నిర్మాణం మొదలై పునర్ నిర్మితమవుతుంది [శ్రీమద్భాగవతం - 3.8.10]

నేడు, సీ సీ డీ కమేరాలు, ఆర్ జీ బీ ఫిల్టర్లు, హెచ్ - ఆల్ఫా ఫిల్టర్లు, దూరదర్శిణి (టెలిస్కోప్) ఉపయోగించి నారో బాండ్ చిత్రాల ద్వరా జగత్ వ్యాప్తమైన అంతరిక్షాంతరాళాలలో ఉన్న పదార్ధాన్ని, గ్రహ నీహారిక తారలు; పరివర్తక నీహారిక నక్షత్రాలు; పాలపుంతను చూడవచ్చు. ఉదాహరణకు మృగశిర నక్షత్ర మండలి కుండలి నీహారిక నక్షత్రం (నెబులా) ఆవిద్భవిస్తున్న పరిణామాన్ని చూడవచ్చు. అది పచ్చ, నీలి తామ్ర, ఏరుపు రంగులలో మేఘాలు, వాయువు ప్రసరిస్తూ ఉన్నాయి. ఇలాంటి అద్భుతాలను కానడానికి దివ్య దృష్టి కలిగి ఉండడం మానవ ఇతిహాశంలో మేరెక్కడా కానరాదు. ప్రాచీన భారతీయ విశ్వ శాస్త్రవేత్తలు యెంత అపరా జ్ఞానం, బుద్ధి కుశలత కలిగి ఉన్న విజ్ఞానవేత్తలో తెలియవస్తుంది.

భారతీయ విశ్వశాస్త్రం మీద పాశ్చాత్తుల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు

భారతీయ విశ్వశాస్త్రం లోని విషయాలు, సృష్టి జ్ఞానం మాహాద్బుత విషయాలుగా పాశ్చాత్త దేశియులు పరిగణిస్తారు. ఆచార్య ఆర్తర్ హోలంస్, ఆలన్ వాట్స్, రాజర్ బెర్ట్ స్చౌసన్, డిక్ టెరిసీ, గయ్ సోర్మన్, కౌంట్ మౌరైస్ మేటర్లింక్, కార్ల్ సేగన్ వంటి మేధావులు, శాస్త్రవేత్తలు భారతీయ విశ్వశాస్త్రంపై అభిరుచి పెంచుకుని, అధ్యయనం చేసి, విషయాలను అవలోకనం చేసుకుని, తమ దృక్పదాలని చాటేరు, అభిప్రాయాలని వెళ్ళడించారు.

ఆర్తర్ హోలంస్ (1895 - 1965), డర్హాం విశ్వవిద్యాలయం ఆచార్యుడు, భూగోళజ్ఞుడు, తాను రచించిన "ది ఏజ్ అండ్ ఆర్ట్" (1913 లో) పుస్తకంలో ప్రాచీన హిందూ స్తంభనం (అనంత జల వాయువుల) గురించి వివరించారు. "మనుస్మృతి"లో కూడా ఆధారాలు లభ్యమవుతాయి. "పశ్చిమంలో వైజ్ఞానిక పరంగా చూడక పూర్వమే, హిందూ మేధావులు, ఆశ్చర్య పరిచే విషయాలు విశదీకరించి చెప్పరు. అందులో భూమి వయస్సు, అనంత కాల పరిమాణాలు, బ్రహ్మాండం సృష్టి స్థితి, లయ గురించి కూలంకషంగా తెలిపారు" అని విడమర్చారు.

ఆలన్ వాట్స్, సాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏషియన్ స్టడీస్, అధ్యక్షుడు, ఆచార్యుడునూ. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ ఫెల్లో గా వేదాంతాన్ని పశ్చిమానికి తన దృక్పదంతో చూసి, చాటుతున్న మేటి. తన అభిమతాన్ని తెలుపుతూ - "సాపేక్షత" ("రెలేటివిటీ") భారతీయ తత్వ-వేత్తలకి కొత్తేమీ కాదు. ఇది వారికి అనాదిగా తెలుసు. ఓ కల్పములో 4,320,000 యేళ్ళు (ఇంత భారీ సంఖ్యలు) అని చెప్ప గలిగిన వారికి ఇది సామాన్యమైన విషయం." వాటిని కేవలం సాంకేతిక శాస్త్ర అంశంగానే చూడక, అనేక కోణాలలో చూసారు. "సాపేక్ష సిద్ధాంతం" (రెలేటివిటీ) వారికి తెలిసున్నా వారు దాని అంతః కరణాభివృద్ధికి ఉపయోగించారు కాని ఆటం బాంబులు తయారు చేయడానికి కాదు " అని ముక్తాయించారు.

రాజర్ బెర్ట్ స్చౌసెన్ భారతీయ విశ్వశాస్త్రం మీద తన దృక్పదాన్ని ప్రకటిస్తూ "హిందువులు ఈ జగత్తు యొక్క అపారమైన కాలమానాలు విశిదీకరించారు. సేంట్ ఆగస్టైన్ ప్రకారం ప్రపంచం 5000బీ.సీ లో మొదలయ్యింది. భారతీయ విశ్వశాస్త్రం వారికి పరిచయమయ్యేదాక పశ్చిమంలో చాలామంది దీన్నే అనుసరించారు. ఈ వివరించిన కాలం భారతీయ కాలమానాలతో పోలిస్తే చలా తక్కువ. ఒక్క బ్రహ్మ రోజు 4,320,000,000 యేళ్ళు; బ్రహ్మ ఆయుర్ధాయం 311,040,000,000,000 యేళ్ళు అంటే 311 ట్రిలియన్ యేళ్ళు " అని తెలపడం అసాధారణం.

ప్రముఖ రచయిత డిక్ టెరిసీ వైజ్ఞానిక, పరిజ్ఞానిక రంగాలలో అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసారు. అందులో "ది గాడ్ ప్రాక్టికల్", "ఇండియన్ కాస్మాలజిస్ట్స్" కూడా ఉన్నాయి. భారతీయ విశ్వశాస్త్రవేత్తల ఆవిష్కరణలను ఉదాహరిస్తూ, భూమి వయస్సు 4 బిలియన్ యేళ్ళ గా వివరించారు. ఇది నేటి అణు శాస్త్రానికి అనుగుణంగా ఉంది. భారతీయ అణు, పరమాణువుల పద్ధతులు , పర్షియన్ నాగరికత నుండి పాశ్చాత్య దేశాలకి చేరింది ", అని విశ్లేషించారు.

అమెరికాలోని స్టాంఫోర్డ్, హూవర్ ఇన్స్టిట్యూషన్ విచ్చేసే ఫ్రాన్స్ దేశ లిబరలిజం నాయకుడు, మేధావి, గై సోర్మన్ " భారతీయ అంతర్కరణంలో అనాదిగా ప్రవహిస్తూ ఉంది. వారి విశ్వశాస్త్ర ప్రతిభ అసాధారణం ".

1911 లో సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన బెలిజియుం కవి కౌంట్ మౌరైస్ మేటర్లింక్ (1862 - 1949) తన పుస్తకం "మౌంటెన్ పాత్స్" లో భారతీయ విశ్వశాత్రంలోని జగత్సృష్టి విషయాలు అత్యంత ప్రాచీన మైనవనీ, అత్యద్బుత సృష్టని వర్ణిస్తూ, "ఇది ఏ యూరోపియన్ ఊహకు కూడా అందని అపవౄశీయత్వమని తన అభిమతాన్ని చాటేరు.

ఇలా, కనీ వినీ ఎరుగని రీతిలో భారతీయ శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు, పరిజ్ఞానికులు, తత్వచింతకులూ, భూ మండలాన్ని, విశ్వశాస్త్రాన్ని, దాని ఆది, కాలమానం, అంతాన్ని, సృష్టి ఆవిర్భవన, కాలమాన ఆంతర్యాన్ని విశ్లేషించి, శోధించి, సాదించి ఇచ్చిన మహా జ్ఞాన్నం. అనంత విశ్వాన్ని సైతం కొలచిన మహాద్బుత మేధావులు. ప్రముఖ విశ్వశాస్త్రవేత్తా, అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్ర ఆచార్యుడు కార్ల్ ఎడ్వర్డ్ సేగన్, భారతీయ విశ్వశాస్త్రాన్ని కొనియాడుతూ " వారి గణితం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఆ కాలంలోనే వారు భూమి వయస్సు, ఈ జగత్తు కాలమానం, దాని అనంత కాల పరిమాణాన్ని విశిదీకరించి చెప్పారు. నేడు ఉపగ్రహాలు పంపి, పరిశోధను చేసి ఈ కాలమానాలనే ద్రువీకరించారు. ఇట్టి అసాధారణ ప్రజ్ఞ, జ్ఞానం అలనాటి భారతీయ శాస్త్రవేత్తలలో, పరిజ్ఞానికులలో సర్వసధారణం". ఉత్కృష్ట మైన సృష్టి రహస్యాలను సైతం ఛేదించి పరిష్కరణలు సాదించిన మహానుభావులు, భావి తరాలకు ఆదర్శ మూర్తులు భారతీయ విశ్వశాస్త్రజ్ఞులు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)