గుండె గుండెకూ మధ్య
విధి వింతగా ప్రవర్తించినప్పుడల్లా
వెదికి వెదికి వజ్రాన్ని సంపాదించినట్లు
ఆ పిలుపు ప్రకంపనల ద్వారా
నీ హృదయంలో దాక్కోవాలనే ఉంది
నిస్వార్ధంగా.. నిజంగా ఉండాలే గానీ
తాకి చూడలేని తారల్ని సైతం
తాయిలంలా నీ మనసుకు పంపాలనే ఉంది
ప్రతి క్షణం పంచే ఆ అనురాగంలో
రాగాన్ని నేనై ఉండాలే గానీ
నీ స్పర్శను అంతరాత్మలో భద్రపరచుకోవాలనే ఉంది
నీ నిత్య స్మరణలో
నా నామం ఒక్క క్షణమైనా వినిపించాలే గానీ
శాశ్వతంగా నీ చిరునవ్వుల చిరునామానానైపోవాలని ఉంది
కదులుతున్న ఈ నిరంతర పోరాటంలో
నీకు నేను నాకు నువ్వు అనిపించాలే గానీ
నీ అడుగుల సవ్వడినై అందరికీ వినిపించాలే ఉంది
కారణం ఏదైనా కానీ
కనుచూపుమేరలో నువ్వు కనబడాలే కానీ
కలువపువ్వునై నిత్యం నిన్ను కొలవాలనే ఉంది
ఈ అనంత విశ్వంలో
ఉన్న ఎన్నో బ్రహ్మాండంలో
అణువైనా నాకోసం నువ్వు వెదుక్కోవాలే కానీ
హృదయాకారంలో నిన్ను మౌనంగా వెంబడించాలనే ఉంది
లక్షల వేల క్షణాల కాలంలో
ఏ కొద్దికాలమైనా నీకునువ్వే నాకై నిరీక్షించాలే గానీ
నా జీవితాన్ని పూర్తిగా నీకు రాసివ్వాలనే ఉంది

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)