భావ రాగ తాళ సహితమయిన మల్లిక రాంప్రసాద్

కూచిపూడి నాట్య ప్రతిభను ఎంత కొనియడినా తనివి తీరటం లేదు అలాగే ఆ కోవకు చెందిన నర్తకీ మణులను ఎంత మందిని పరిచయం చేసినా తృప్తి కలగటం లేదు. ఈ నెల మన నటరంజని శీర్షిక ద్వారా వర్జీనియాలో నివసిస్తున్న మల్లిక ఎడవల్లిగారిని పరిచయం చేస్తున్నాము. మల్లిక గారి తల్లి తండ్రులు హైదరాబాదు వాస్తవ్యులు. తండ్రి గారి పేరు రామ ప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ గవర్న్మెంట్ లో రెటైరెడ్ డైరెక్టొర్, కామర్స్ & ఎక్ష్పోర్ట్ ఆఫ్ ప్రమోషన్, తల్లి పేరు సరోజ సంగీతం, వీణ, వయొలిన్ లో విద్వాంసులు. తమ్ముడు భార్గవ రాంజి ఎ.ఐ.ఆర్.లో గ్రేడెడ్ ఆర్టిస్ట్.

చిన్నప్పుడు మల్లిక తమ తల్లి గారితో సం యుక్త పాణిగ్రాహి గారి ఒడిస్సి డ్యాన్సు చూడడానికి వెళ్ళినపుడు, ఎప్పుడయినా గుడికి వెళ్ళినపుడు ఆ గుడి ప్రాకారాల్లో తనకు తోచిన విధంగా డ్యాన్సు చేస్తూ నాట్యం పట్ల తనకున్న మక్కువను చూపే వారని చెప్పారు. అలాగే సంగీతం నేర్చుకోవడానికి రేడియో అన్నయ్య గారి దగ్గరకు తీసుకు వెళ్తే, ఆయన తనకున్న పెద్ద పెద్ద కళ్ళు చూసి వాళ్ల అమ్మగారితో అమ్మయికి నాట్యం నేర్పిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. వెంటనే సునీల గారి దగ్గర భరత నాట్యం నేర్చుకోవడానికి కుదిర్చారరని చెప్పారు. మల్లిక గారు తన నాలుగవ సంవత్సరములోనే ఆంధ్ర బాలానంద సంఘం వారి తరపు నుండి భరతనాట్యాన్ని నేర్చుకోవటం మొదలు పెట్టారు. తన మొదటి ప్రదర్శన అయిన "మాట తప్పితే" అనే అన్నయ్య గారి కధనంలో బాలల అకడెమి అవార్డును గెలుచుకున్నట్లు చెప్పారు. తురగా జానకి గారు, రేడియో అన్నయ్య గారు, అక్కయ్య గారితో కలిసి ఇలాగే ఎన్నో రేడియో ప్రొగ్రాం చేసారని, దూరదర్శన్ లో ప్రొద్దున పూట ప్రసారం చేసిన టెలిస్కూల్ అనే కార్యక్రమములో పాల్గొన్నానని చెప్పారు.

వెంపటి చినసత్యం మాస్టారు గారు సమక్షములో శోభానాయుడి గారి దగ్గర హైదరాబాదులో క్లాసులు మొదలు పెడితే తనకు ఆరవ సంవత్సరములో చేర్చుకోమని అడిగినప్పుడు ఆయన చాలా చిన్న పిల్ల అని, పది సంవత్సరాల వయసులో చేర్చుకుంటానని చెప్పగా, వాళ్ళ అమ్మగారు అయనను బ్రతిమలాడి ఒక్కసారి మల్లిక నాట్యం చేస్తుండగా చూడమని చెప్పాగా, అది చూసి ఆయన చివరికి ఒప్పుకున్నారని చెప్పారు. బాలమురళీకృష్ణ గారు కూడా ఎంతో మెచ్చుకున్నారని చెప్పారు. ఆదే సమయంలో శోభానాయుడి గారి ఆధ్వర్యంలో ఎన్నో నృత్య రూపకాలలో ప్రదర్శనలిచ్చారని చెప్పుకున్నారు. తన టీచర్ తో సమానంగా ఒక ప్రక్కన ప్రదర్శ్నలిస్తూ, మరో ప్రక్క ఎన్నో సొలోస్ కాకుండా, లీడ్ కారక్టర్స్ లో కూడా ప్రదర్శనలిచ్చారని చెప్పుకున్నారు. తనకు టాలంట్ సర్చ్ స్కాలర్ షిప్ తొమ్మిదవ సంవత్సరం నిండ కుండానే ఇచ్చారని చెప్పారు. సుమారు పదకొండు సంవత్సరాలు చాలా ఫెస్టివల్స్ లో, తిరుపతి బ్రహ్మోత్సవాలలో, చిదంబర నాట్యంజలిలో కూడా ప్రదర్శనలిచ్చారని చెప్పుకున్నారు.

మల్లిక గారు కూచిపూడి నాట్యములో తన అపూర్వ అభినయాన్న్ని ప్రదర్శించి "నాట్యవిశారద" అనే బిరుదును సంపాదించుకున్నరు.చివరికి 1992లో మాస్టారుగారి అకాడెమికి వెళ్ళగా ఆయన తనను ఎంతో ప్రొత్సహించారని చెప్పుకున్నారు. అక్కడ దాదాపు యెనిమిది సంవత్సరాలు కళను అభ్యసించారని, పెద్ద కళ్ళు తనకున్న పెద్ద జడను మాస్టారు గారే గిరజాలు తిప్పే వారని, ఎక్కువగా తనతో కృష్ణుడి పాత్రను వేయించే వారని, మాస్టారు గారు దగ్గర్ తనకు చాలా స్కాలర్ షిప్స్ కూడా వచ్చాయని చెప్పుకున్నారు. తనకు నాట్య విసారద బిరుదును కూడా ఇచ్చారని చెప్పుకున్నారు.

మాస్టర్స్ చదవటానికి హైదరాబాదుకి వచ్చి, అక్కడ మాస్టారుగారి ఆశీర్వాదముతో 1998లో ఒక స్కూలుని స్థాపించి దానికి "భరత మల్లిక" అని పేరుపెట్టుకున్నాని చెప్పారు. 2001 లో పెళ్ళి చేసుకుని అమెరికాకు వచ్చి స్థిరపడ్దారని, భర్త పేరు వెంకట్ అని నేషనల్ ఇన్సిట్యుట్ ఆఫ్ హెల్త్ లో స్టాఫ్ సైంటిస్ట్ అని పేర్కున్నారు. తాను అమెరికాకు వచ్చినప్పటి నుండి కూచిపూడి నాట్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి వైట్ హౌస్, మారిలాండ్ గవర్నర్ ఆఫీస్ ఇలా పలుచోట్ల ఎన్నో లెక్చుర్ డెమన్స్ట్రేషన్స్ ఇచ్చారని అన్నారు. అదే సంవత్సరమునుండి కూచిపూడి నాట్యానికి జీవాన్నిచ్చిన సిద్దేంద్ర యోగి ఆరధనా ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపు కుంటున్నామని చెప్పారు.

మల్లిక గారు తాను తెలుగు యూనివర్సిటి నుండి కూచిపూడిలో డిప్లొమాను, సంస్కృత భాషలో పట్టభద్రతను సంపాదించుకున్నరని చెప్పారు. మల్లిక గారు అమెరికాలో కూడా "భరత మల్లిక" అనే కూచిపూడి నాట్య కళాశాలను స్థాఇంచి తన స్కూలు తరపునుండి ఎంతో మంది పిల్లలకు నాట్యములో శిక్షణ ఇవ్వటమే కాకుండా నాట్యశాస్త్రము, సంస్కృతము, తెలుగు భాషలను కూడా తన విద్యార్ధులకు నేర్పుతున్నట్లు చెప్పుకున్నారు. తాను సంపాదించిన కీర్తిని తనకు శిక్షణ ఇచ్చి, తన అభివృద్దికి దోహద కారకులయిన గురువులకు, తలితండ్రులకు, తనకు ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తున్న భర్తకు మనస్పూర్తిగా అంకితమిస్తున్నాని అన్నారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)