|

|
తెలుసునా
-- చాకలకొండ రమాకాంతరావు |
|
|
తెలుసునా తెలుగు వాడ! తెలుగు భాష తేటని
తెలుసునా తెలుగు మాట తేనియల మూటని. ||తెలుసునా||
1. తెలుసునా తెలుగు పుటక ధరణిలోన మిన్నని,
తెలుసునా తెలుగు తల్లి భాషలకే రాణని. ||తెలుసునా||
2. తెలుసునా తెలుగు భాష పాయసల వూటని
తెలుసునా తెలుగు మాట తియ్యనైన పాటని. ||తెలుసునా||
3. తెలుసునా తెలుగు జాతి తాల్మిలోన మిన్నని,
తెలుసుకనా తెలుగు నీతి భువిలోనే బల్మని. ||తెలుసునా||
4. తెలుసునా తెలంగాణ, ఆంధ్ర, సీమ ఒకటని
తెలుసునా తెలుగు తల్లి అమ్మ కల్ప వల్లని. ||తెలుసునా||
5. తెలుసునా తెలుగు పలుకు పంచదార చిలకని
తెలుసునా తెలుగు కులుకు తెమ్మెరల తూలని. ||తెలుసునా||
6. తెలుసునా తెలుగు ఖ్యాతి దిగంతాల వ్యాప్తని
తెలుసునా తెలుగు బాణి తేటగీతి తెల్లని. ||తెలుసునా||
7. తెలుసునా తెలుగు సొగసు సీసమంత సొంపని
తెలుసునా తెలుగు గడ్డ శ్రీనివాస వాసమని. ||తెలుసునా||
|
|