తెలుగు తల్లి

-- మల్లిక్ బులుసు

పచ్చని పైరు పైటయై

పసిడిపంట జరీకుచ్చిళ్ళై

కొబ్బరిమువ్వలు తాటంకములై

తొలిసూర్యుడు సింధూరమైకళకళలాడు తెలుగుతల్లికి వందనం

నిత్య సౌభాగ్యవతికి అభివందనందట్టమైన కారడవులు కురులై

కొల్లేటి కొంగలు సిగలో మల్లియలై

పుణ్యక్షేత్రములు న్యాస భూషణములై

శ్రీశైల తిరుమల గిరులు పాదద్వయమైకళకళలాడు తెలుగుతల్లికి వందనం

నిత్య సౌభాగ్యవతికి అభివందనంగలగలపారు గోదావరి ముత్యాలహారమై

కృష్ణాప్రవాహములు వడ్డాణమై

పెన్నేరుపాయలు కాలి అందియలై

భాగ్యనగరి స్వర్ణమంజూషయైకళకళలాడు తెలుగుతల్లికి వందనం

నిత్య సౌభాగ్యవతికి అభివందనంఆత్మచింతనకు నైమిశారణ్యమై

త్యాగశీలురకు కళాతపస్వులకు నిలయమై

కుసుమకోమల కావ్యకన్యకలకు జననియై

భరతమాతకు ముద్దుబిడ్డయైకళకళలాడు తెలుగుతల్లికి వందనం

నిత్య సౌభాగ్యవతికి అభివందనం