స్వరసంగమం

-- రావు తల్లాప్రగడ, శాయి మానాప్రగడ

సుజనరంజని మూలస్థంభాలైన సాహిత్య, సంగీత, నృత్య నటనలలో ప్రతి నెలా వివిధ అంశాలను ప్రస్తుతపఱచడమే మా ధ్యేయం. అందులో భాగంగా ఈ నెల స్వరసంగమం శీర్షికలో శ్రీ రావు తల్లాప్రగడ గారిచే రచింపబడి, శ్రీ శాయి మానాప్రగడ గారిచే స్వరపరచబడిన ఓ మధురమైన గానం మీకోసం...

సోహం

ఇది ఏం దాహం, ఇది ఏం మోహం, తేలే దేహం, అంతా సోహం!

సుధాపానం, సామ గానం, మనసే స్నానం, అంతా సోహం!దేవేంద్రుడికే, నచ్చేమందూ

నారాయణుడే, పంచి నా విందూ!

అదినాకూ అందే, వరమై చెందే

ఇక లోకం అంతా, నా దాసోహం!ఇది ఏం దాహం, ఇది ఏం మోహం, తేలే దేహం, అంతా సోహం,

ఇది ఏం దాహం!మరుపే గెలిచి, చంపే నీ అహం

గుక్కే తుంచే, నీ వ్యామోహం!

అలుపే అరుదై, తిరమై దాహం

ఇక లోకా న్నొదులూ, అది యే సొహం!ఇది ఏం దాహం, ఇది ఏం మోహం, తేలే దేహం, అంతా సోహం,

ఇది ఏం దాహం!ఇదియేం మందో, నీవే చెప్పు

గుటకే చాలు, మంచి అంతబ్బు!

రామచంద్రుడవై, నిజమే చెప్పు

ఇక నీవే దైవం, అంతా సోహం!ఇది ఏం దాహం, ఇది ఏం మోహం, తేలే దేహం, అంతా సోహం!

సుధాపానం, సామ గానం, మనసే స్నానం, అంతా సోహం!


శాయి మానాప్రగడ గారు ఆలపించిన
ఈ పాటను వినడానికి
ఈ క్రింద మీట నొక్కండి

సాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.