సుజననీయం
పోదాం వెనక్కి, పదండి ముందుకు
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

1985లో వచ్చిన ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా Back to the Future సినిమాలో హీరో 30 ఏళ్లు వెనక్కి వెళ్లి తిరిగి అక్కడి నుండి భవిష్యత్తుళొకి (అంటే వర్తమానంలోకి) పయనిస్తాడు. ఈ సంపాదకీయం పేరు ఆ సినిమా పేరుకు తెలుగు అనుసరణ అనుకోవచ్చు.

ఈ నెలతో సిలికానాంధ ఆవిర్భవించి పదిహేనేళ్లు పూర్తి చేసుకొన్నది. సహస్రావధాని గరికిపాటి నరసింహారావు చేతుల మీదూగా జ్యోతీప్రజ్వలన గావించి అష్టావధానం కార్యక్రమంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 'ఇంతింతై వటుడింతై' అన్న చందానా, మొక్క మహావృక్షంగా పెరిగిన రీతిన, సిలికానాంధ్ర శాఖోపశాఖలుగా జగమత విస్తరించింది. తెలుగు బావుటాను నిర్విఘ్నంగా ఎగురవేస్తూ, సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని అందరిలోను నింపుతూనే ఉంది. పిల్లలు, నవతరం, యువతరం, పెద్దలు అందరిలో ఉత్తేజం కలిగిస్తున్నది. ప్రతీ ఒక్కరికి సరిపోయేలా ఏదో ఒక నిర్మాణాత్మక కార్యక్రమం చేపడుతూనే ఉంది. సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్య కార్యక్రమాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఆంతర్జాతీయ సమ్మేళనాలను నిర్వహించింది. మనబడి దేశవిదేశాలకు విస్తరించగా, భారతీయ సంస్కృతి బోధనకు నిలయంగా 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' ప్రారంభించింది. ఇలా పేర్కొంటూ, వివరంగా రాస్తే ఒక గ్రంథమే తయారవుతుంది.

నాకు ఈ సంస్థతో పదునాలుగేళ్ల అనుబంధం ఉంది. గడచిన ప్రతి క్షణం మధురంగా నెమరువేసుకొంటాను. రాబోయే ప్రతిరోజు కొంగ్రొత్త స్ఫూర్తితో పనిచేయటానికి సిద్ధంగా ఉంటాను.

సిలికానాంధ్రకు పుట్టినరోజు జేజేలు!!! ఈ సందర్భంగా మళ్లీ ఆగష్టు ఆరున గరికపాటి వారి 'ద్విగుణ అస్టావధానం' సన్నీవేల్ దేవాలయంలో సాయంత్రం గంటలకు ఉంది. అందరూ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనండి.

 

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)