శీర్షికలు - సంగీతరంజని
నిశ్చలముగ నీ మనసును
- డా. యనమండ్ర శ్రీనివాసశర్మ

రాగం: ఖానడ
తాళం: ఆది
రచన/ స్వరకల్పన: డా. యనమండ్ర శ్రీనివాసశర్మ

పల్లవి:
నిశ్చలముగ నీ మనసును చేయుము
సజ్జనసాంగత్యసాధనతో సదా!
ప్రచ్చన్నమైనది బ్రహ్మపదార్థము
నీవుగ తెలుసుకొనుటె నీ లక్ష్యము !!నిశ్చల!!

చరణం:1.
బంధము బాధకు కారణమే మమ!
కారాహంకారములే బంధము!
గురువుని గుర్తించు తత్వవిదునిగా
మమతాహంకృతిబంధము విడువుము !!ని!!

చరణం:2.
శోధన మరువకు బోధనతో సదా
సాధనమిదియే సాధుజనులకు!
సృష్టిస్థితిలయకారకుడైన
శ్రీనివాసహృద్వాసుని తెలిసి !!నిశ్చలముగ!!

NISCHALAMUGA KANADA

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)