మనబడి
మనబడికి ఫారిన్‌ లాంగ్వెజ్‌ క్రెడిట్‌ గుర్తింపు
సిలికానాంధ్ర మనబడికి ఫారిన్‌ లాంగ్వెజ్‌ క్రెడిట్‌ గుర్తింపు లభించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్‌ యూనిఫైడ్‌ స్కూలు డిస్ట్రిక్‌లో గతవారం జరిగిన స్కూలు బోర్డ్‌ సర్వసభ్య సమావేశంలో సిలికానాంధ్ర మనబడి నిర్వహించే తెలుగు3, తెలుగు4 తరగతులకు ఫారిన్‌ లాంగ్వేజ్‌ క్రెడిట్‌ గుర్తింపును మంజూరు చేసింది. 2014లో సిలికానాంధ్ర మనబడి నిర్వహించే తెలుగు1, తెలుగు2 కోర్సులకు ఫారిన్‌ లాంగ్వేజ్‌ క్రెడిట్‌ గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఈ గుర్తింపు ద్వారా 4 సంవత్సరాల ఫారిన్‌ లాంగ్వేజ్‌ క్రెడిట్‌ నిర్దేశించే ప్రభుత్వ, ప్రైవేట్‌ విశ్వ విద్యాలయాల్లో చేరడానికి మనబడి విద్యార్థులు అర్హత సాధించనున్నారు. ఈ అవకాశాన్ని ఫ్రీమాంట్‌ స్కూల్‌ డిస్ట్రిక్‌ పరిధిలోని తెలుగు విద్యార్థులందరూ ఉపయోగించుకుని తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవడమే కాకుండా ఉన్నత విద్యకు కావాల్సిన ఫారిన్‌ లాంగ్వేజ్‌ క్రెడిట్స్‌ కూడా సంపాదించుకోవచ్చు. 2016-17 సంవత్సరానికి గాను తరగతులు సెప్టంబరు 10 నుంచి మిషన్‌ సానొసే హై స్కూల్‌లో ప్రారంభం అవుతాయి. ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్థులు వెంటనే ఇంటర్నెట్‌లో manabadi.siliconandhra.org ద్వారా మిగతా సమాచారం పొందవచ్చు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)