కవితా స్రవంతి
అతను-ఇతను
- పారనంది శాంత కుమారి

మనవళ్ళతో గడపలేకపోతున్నానని అతను,
మనవళ్ళతో వేగలేకపోతున్నానని ఇతను,
బాధపడుతున్నారు.
సంపాదన ఎక్కువేఅయినా శాంతిలేదని అతను,
సంపాదన తక్కువఅయి సుఖంలేదని ఇతను,
బాధపడుతున్నారు.
భార్యలేక అతను,భార్యతో వేగలేక ఇతను
బాధ పడుతున్నారు.
పిల్లలు దూరంగాఉన్నారని అతను,
పిల్లలకు భారమౌతున్నానని ఇతను,
బాధ పడుతున్నారు.
ఏకాంతం కావాలని అతను,
ఒంటరితనం భరించలేనని ఇతను,
బాధపడుతున్నారు.
డబ్బున్నా పిల్లలు చూడటంలేదని అతను,
డబ్బులేకే పిల్లలు చూడటంలేదని ఇతను,
బాధ పడుతున్నారు.
సంతానం వృధా అని అతను,
సంతానమే సుధ అని ఇతను,
బాధ పడుతున్నారు.
జీవితం అనే నాణానికి
బొమ్మాబొరుసుల్లా ఉన్నవి బాధలే
అన్న సత్యం బోధపడక
ఉన్నదానిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే
తత్త్వం వంటపట్టక
దీనికంటే అది మంచిది అనే భ్రమలో ఇరుక్కొని
అతను,ఇతను అలా బాధపడుతున్నారు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)