కథా భారతి
సినిమా మావయ్య
- ఎమ్.వి.ఎన్. రామ్ కుమార్

నేను మావయ్య ఇంటికి చేరుకునేటప్పుడికి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. మవయ్య పిల్లలైన సుధాకర్ మహిదర్ ల ముఖంలో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది. చుట్టుతా బంధువులు మద్యలో దోషిగా మావయ్య. ఒకప్పుడు ఎంతో గౌరవంగా చుసిన చూపులే ఇప్పుడు అంటరాని వాడిని దోషిని చూస్తున్నట్లు ఉన్నాయి. మెరుస్తున్న కళ్ళతో గంభీరంగా కనిపించే మావయ్య జీవం లేని చూపులతో బేలగా చూస్తూ కనిపించాడు. అరవై ఏళ్ళ వయసులో కుడా నలబై ఏళ్ళ వాడిగా ఉండే మావయ్య ఇప్పుడు మాత్రం ఎనబై ఏళ్ళ వ్యక్తిల మారిపోయాడు. పరిస్తితులు మనిషి లో ఊహించని మార్పులు ఎలా తీసూకువస్తాయో మావయ్యను చూస్తే అర్ధం అవుతుంది.

“అసలేం జరిగిందిరా”? అని అడిగాను సుధాకర్ ని.

“మాకు ఏం అర్ధం కావట్లేదు బావా. అమ్మ పోయిన తరువాత నాన్నని ఇక్కడ ఒంటరిగా ఉంచడం ఏoదుకని మాతోపాటు తీసుకువెళదామని అనుకున్నాం. బ్యాంకు అకౌంట్స్ క్లోజ్ చేద్దామని బ్యాంకు కు వెళితే తెలిసింది ఇంచుమించు ఐదు లక్షలు నాన్నే విత్ డ్రా చేసారంట. ఎందుకోసమో ఎవరికోసమో చెప్పమంటే చెప్పట్లేదు. మాకు తెలిసి అప్పులు కుడా ఏమీ లేవు. అదీ కాక ఈమధ్య అమ్మకి కిడ్ని ఇచ్చిన డోనార్ భార్యను కలుస్తూ మనవాళ్ళకి కనిపించారంట . తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే ఏం చెప్పాలొ అర్ధం కావట్లేదు. నాన్న ను అడుగుతుంటే ఏం చేప్పట్లేదు. అమ్మ పోయినప్పటికంటే చాలా ముభావంగా ఉంటున్నారు. సరిగ్గా తినట్లేదు. కనీసం మాతో మనస్పూర్తిగా కుడా మాట్లాడంలేదు. ఏం చెయ్యాలో అర్ధంకాక మన వాళ్ళని రమ్మన్నాను”. ఆందోళనగ అన్నాడు పెద్దాడైనా సుధాకర్.

”ఏముందిర ఆవిడేదో మందు పెట్టేసినట్లుంది. అందుకే మీ నాన్న దాని చుట్టూ తిరుగుతున్నాడు . నాకు తెలిసిన ఒకతను ఉన్నాడు ఇలాంటి మందుల్ని వెంటనే కక్కిచేస్తాడు రేపే తిసుకేల్తే సరి”. పిన్ని వరస ఆవిడ అపాయింట్మెంట్ బుక్ చేసింది .అందరూ విస్మయంగా చూసాం ఆవిడ వంక . “అవునురా వీడికి పెళ్లమ్ పోయింది ఆవిడకి మొగుడు పోయాడు. పిల్లల పెళ్లిళు కుడా అయిపొయాయి. ఇంకేం భాద్యతలు లేవు కదా”.

“”చిన్నపడి నుండి సినిమాల పిచ్చోడు కదరా”. కాలేజి రోజుల ప్రేమను కుంటా ఇప్పుడు బయటపెట్టినట్టునాడు”. బాబాయ్ వరస ఐనా మనిషి స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేసాడు.

“”నేను ముందే చెప్పానా వదినా ఇలాంటిది ఏదో జరుగుతుందాని. మీ అన్నయ్యతో అంటే ఆయన అలాంటివాడు కాదంటారు. ఐనా పెళ్ళమ్ పోయి ఆర్నెలు కుడా కాలేదు ఇదేం బుద్దొ. ఇలాంటి వాడు మన బంధువు అని చెప్పుకొవడానికి సిగ్గు చేటు కుడా మనకు తెలిసి ఇదే , తేలియకుండ ఇంక్కేని భాగోతాలు ఉన్నాయొ.” మేనత్త వరసైన ఆడాళ్ళ గుసగుసలు.

ఎవరికి తోచినట్టు వారు ఏదో ఉహిమ్చేస్తున్నారు గాని మావయ్యను అడగడం గాని మావయ్య వైపు నుంచి ఆలోచించడం గాని ఎవరు చెయ్యట్లేదు.

ఎవరి ఉహాలతో తనకు సంబందం లేనట్టుగా జీవం లేని చూపులతో శూన్యం లోకి చూస్తూ మావయ్య కూడా ఏం మాట్లాడకపోవడంతో ఇంక కొత్త కొత్త ఉహగానాలు పుట్టుకువస్తున్నాయి’.

నెరిసిన గెడ్డం తో కళ కోల్పోయిన మోము తో ఉన్న మావయ్య ముందుకు వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని వణుకుతున్న మావయ్య చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. “ఏమైనా మాట్లాడు మావయ్య, అందరు ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారు నీ మౌనం సందేహాల్ని పెంచుతుందే కాని తిర్చట్లేదు. నువ్వు తీర్చాల్సినా అప్పులు ఏమైనా ఉన్నాయా?” ఎలాగైనా మావయ్యను మాట్లాడిమ్చాలని అడిగాను. లేదు అన్నటు గా తల అడ్డంగా ఉపాడు కాని ఏం మాట్లాడలేదు.

“పోనీ ఈ వయసులో తోడు కావాలనుకుంటున్నావ?” మావయ్య దగ్గర నాకున్న చనువు తో అడిగాను. మావయ్య గురించి తెలిసి కుడా నేనంత తప్పుడు ప్రశ్న వేసానో మావయ్యా తడి దేరిన కళ్ళను చుస్తే అర్ధమైంది నాకు . “నా ఉద్దేశం అది కాదు మావయ్యా” అనే లోపు మావయ్య లేచి గది లోపలకి వెళ్ళిపోయాడు.

మావయ్య లోపలకి వెళ్ళగానే దూరపు చుట్టాలు కుడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడం మొదలుపెట్టారు . ఒక వైపు వినకూడని మాటలు వినాల్సివస్తుంటే ఇంకో వైపు ఎవరి మాట నమ్మాలో ఎవరి సాయం తీసుకోవాలో అర్దం కాక మావయ్య పిల్లలు అయోమయం గా చూస్తున్నారు.

“”ఒరేయ్ ఎందుకు చెబుతున్నానో అర్దం చేసుకోండి. మీ అమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని మీ పేరు మీద వ్రాయించుకొండి. ఆలస్యం చేస్తే తాజ్ మహల్ కట్టిచ్చిన కట్టిస్తాడు కొత్త లవర్కి మీ నాన్న” పళ్ళు ఇకిలిస్తూ సలహా ఇచ్చాడు ఓ పెద్దాయన మావయ్య పిల్లలకి.

బంధువుల మాటలు వింటుంటే చాల అసహ్యం అనిపించింది నాకు. అసలు వీళ్ళెం బంధువులు? సూటి పోటి మాటలతో పొడవటమేన వీళ్ళకు వచ్చింది.అందుకేనా లోకుల్ని కాకులతో పోలుస్తారు. కష్ట కాలంలో అండగా నిలబడాల్సింది పొయి కొత్త కొత్త అనుమానలతో భాధ పెట్టడమ్ ఎంతవరకు సబబు. ఒకవేళ మవయ్య నిజంగా తప్పు చేస్తె ఇక తప్పుడు మనిషి కిందే జమ కటేయడేమేనా? ఒక తప్పు తొ ఆ వక్తి జీవితం మొత్తం తప్పుల తటకైపోతుందా.?

నాలో సహనం నశించిపోయి “ఆపండి మీ అర్ధం పర్దం లేని మాటలు. మావయ్య ఎలాంటి వాడో కుటుంబం కోసం మన కోసం ఎంత చేసాడో మీ అందరికి బాగా తెలుసు. అలాంటిది నిజానిజలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏం బాలేదు. అయినా మీకేవరికి మావయ్య కళ్ళలో కనిపిస్తున్న బాధా కనిపిమ్చాట్లేదా? మావయ్య ఏదో చెప్పుకోలేని భాద లో ఉన్నాడు. నీకు తోడుగా మేమున్నాము అని చేపాల్సింది పోయి లేని పోనీ మాటలతో భాధపెట్టడం భావ్యం కాదు. ఒక వేళా మీరు అనుకుంటునట్లు మావయ్య తన స్వార్ధం చూసుకుంటే అందులో తప్పేముంది? మావయ్య ఎవరికీ అన్యాయం చెయ్యలేదే?” మావయ్యకు వత్తస్సు గా మాట్లాడుతున్న నావంక మిగతా బంధువులు ఆశ్చర్యంగా చూడసాగారు . నాకు తెలుసు వీళ్లు నన్ను కుడా ఇక తప్పుడు మనిషి కిందే భావించడం మొదలు పెడతారు. లోకం తీరే అంతకద. కాని నాకు భయం వెయ్యలేదు ఎందుకంటే నేను నా మనసాక్షిని నమ్ముకున్నాను. ఎందుకంటే నా మనసాక్షి చెబుతుంది మవయ్య తప్పు చెయ్యలేదు అని.

నాకింక అక్కడ ఉండబుద్ది కాక మావయ్య పిల్లలతో “”ఒరేయ్ మీ నాన్న కారణం లేకుండా ఏ పని చేయడు. ఇప్పుడు కుడా అదే అని నా నమ్మకం. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అనవసరమైన మాటలతో మీ నాన్న ను బాధపెట్టవద్దు. కొన్ని రోజులు ఎదురు చూద్దాం. మీరు దైర్యంగా ఉండండి”. మావయ్య ఆరోగ్యం జాగ్రత్త” అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంటే కిటికీ లోంచి నన్నే చూస్తున్న మావయ్య కనిపించాడు. మావయ్య కళ్ళలో నా పట్ల అభిమానం మిణుకు మంటు కనిపించి మాయమైపోయింది.

ఆరడుగుల పైన ఉండే మావయ్య అసలు పేరు ఏమిటో గుర్తు లేదు కాని ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాల గురించి మావయ్య నోటి నుంచి వినడం వల్ల సినిమా మావయ్య అన్న పేరుతోనే పిలవడం మొదలుపెట్టి ఆ పేరునే ఖాయం చేసేసారంట. అలాగని మావయ్య సినీ యాక్టరో డైరెక్టర్ కాదు. కనీసం లైట్ బాయ్ కుడా కాదు. సినీ ప్రేమికుడు కాదు కాదు భక్తుడు మహా భక్తుడు. చిన్నప్పుడు బడి ప్రక్కనే టూరింగ్ టాకీస్ ఉండటం తో స్కూల్ లో కంటే టూరింగ్ టాకీస్ లోనే ఎక్కువ ఉండేవాడంట .
అందులోను మావయ్య వాళ్ళ బాబాయ్ పనిచెయ్యడం తో మావయ్య కి అడ్డు లేకుండా పోయింది. రిలీజైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులో హీరోల డైలాగ్స్ అందరి ముందు చెప్పాల్సిందే. సినిమా ల మీద పిచ్చిభక్తీ ఎంతగా పెరిగిందంటే ప్రతి శుక్రువారం కొత్తగా రిలీజ్ ఐయే దియేటర్ మావయ్య ద్రుష్టి లో దేవాలయం గా మారిపోయింది.

మావయ్యను మార్చాలని పెద్దవాళ్ళు ఊరు మార్చారు కాని మావయ్య మారలేదు. చదువు అటకెక్కి సినిమాయాజాలం మత్తులో విలువైన కాలాన్ని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని పెద్దవాళ్ళు బాధపడుతున్న సమయంలో మావయ్య లో ఉహించని మార్పు మొదలైందంట. అల్లారి చేసే పిల్లవాడిని సాదువు దగ్గరకు తీసుకువెళ్ళితే బుద్దిగా మారినట్టు ఏదో తెలుగు సినిమా మావయ్య లో మార్పు తీసుకువచింది. అంతే “ఆ రోజు నుంచి సినిమాని కాలక్షేపం కోసం” కాకుండా “జీవితంలో మార్పుకి సాధనంగా” భావించడం అలవాటు చేసుకున్నాడు . ఫలితంగా చదువులో ఫస్ట్ రావడం మొదలుపెట్టాడు.

మావయ్య ఏ హీరో వీరాభిమాని కాదు ఏ డైరెక్ట్ ర్ కి అభిమాని కాదు. ఫలానా తరహ సినిమాలే చూడాలని నియమం లేదు.మొదట్లో తెలుగు సినిమాని మాత్రమే అభిమానించేవాడు. భాషా వికాసం పెరిగే కొద్ది హిందీ ఇంగ్లీష్ సినిమాలకి తన మనసులో చోటిచ్చాడు.

నాకు ఉహ తెలిసినప్పటి నుంచి మొదట సినిమా చూసింది మావయ్య తోనే. మావయ్య స్టైల్ చూసి మొదట్లో సినిమాల్లో కనిపించే హీరో తనే అనుకునేవాణ్ణి. నా రోల్ మోడల్ కూడా మావయ్యే. ఎందుకంటే మావయ్యే లేకపోతే నా ఇంటర్ మాథ్స్ ఇప్పటికి పాస్ అయేవాడిని కాదు. అదేంటో ఎక్జాం పేపర్ చుస్తే చాలు ఏమి గుర్తుండేది కాదు . మైండ్ అంత తెల్ల కాగితంల గా అయిపోయేది. అప్పటికే నేను లెక్కల పరిక్ష రెండు సార్లు తప్పాను. ఈ సారి తప్పితే ఇంక చదివించనన్న నాన్న మాటకి భయపడి ఎలాగైనా ఈసారి పాస్ అవ్వాలని నిర్ణయించుకొని మావయ్య దగ్గరకు వెళ్ళాను ఏమైనా కిటుకులు చేబుతాడేమోని.

కాని అప్పటికే మావయ్య జేమ్స్ బాండ్ సినిమా కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మావయ్య సినిమా కి రెడి అయితే ఆగడం ఉండదు. చేతిలో పుస్తకాలతో దీనంగా చూస్తున్న నన్ను చూసి ఆగుతాడుకున్నాను. కాని మావయ్య నన్ను కుడా తనతో సినిమా కి రమ్మన్నాడు. చేతిలో పుస్తకాలతో సహా. అప్పటికే మావయ్య సాంగత్యం వల్ల సినిమా బలహినాత అంటుకోవాడం ఒకవేళ్ళ పరిక్ష తప్పినా మావయ్య పేరు చెప్పి తప్పించుకోవచ్చులే అన్న ధైర్యం తో నేను కుడా సినిమా కి రెడీ అయిపోయాను.
పుస్తకాలు కుడా ఎందుకు తీసుకురమ్మన్నాడో మొదట అర్దం కాలేదు నాకు. పుస్తకాలతో సినిమా కు వచ్చిన నన్ను చూసి అందరు నవ్వుతుంటే చాల సిగ్గనిపించింది నాకు. నాతొ పాటు మావయ్య ప్రొజెక్టర్ రూమ్ లో కూర్చొని సినిమా చూస్తూ ఇంటరెస్టింగ్ సీన్ వచ్చినప్పుడు తను చెప్పిన చాప్టర్స్ ని తీసి చదవమన్నాడు.

సినిమా మొదలైంది ఐదు నిమిషాల తరువాత మొదటి చాప్టర్ తీసి చదవమన్నాడు. అఇష్టంగానే తీసి చదవడం మొదలుపెట్టాను. ఇంటర్వల్ కి సగం సినిమా పూర్తి అయ్యే సరికి మొత్తం చాప్టర్స్ అయిపోయాయి . ఎందుకంటే జేమ్స్ బాండ్ సినిమా అంటే ప్రతి సీన్ ఇంటరెస్టింగ్ గే కదా.

మైండ్ లో సినిమాయే గుర్తుంది. ఈసారి కుడా ఎక్జాం పోయింది అనుకున్నాను పేపర్ చూసి. కాని విచిత్రం ఆన్సర్స్ వ్రాయడం మొదలుపెట్టగానే నేను జేమ్స్ బాండ్ లా మారిపోయాను. చదివినవన్ని గుర్తుకు వచ్చి ఇంతకు ముందు కంటే బాగా వ్రాసాను. దాంతో మావయ్య అంటే ఇష్టమే కాకుండా గౌరవం కూడా ఎక్కువైంది.

మావయ్య సినిమాల మీద ప్రేమతో తన సమయాన్నికాని డబ్బు ని కాని వృదా చెయ్యలేదు. టికెట్స్ కోసం ఇంట్లో డబ్బులు ఇవ్వనంటే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ టికెట్ డబ్బులు సంపాదించుకొనేవాడు. అంత స్వాభిమానం కలవాడు మావయ్య. తెలుగు సినిమా హీరో ప్రేరణగా కష్టపడి చదివి రెవిన్యూ డిపార్టుమెంటు లో ఉద్యోగం సంపాదింఛి మాలో మొదటి గవర్నమెంట్ ఉద్యోగి అయ్యాడు. శుభలేఖలు సినిమా ప్రేరణతో కట్నం తీసుకోకుండా అత్త ని పెళ్లి చేసుకొని మొత్తం ఉళ్ళో యువకులకి ఆదర్శం గా నిలిచాడు.

సినిమాని ఎంత ఇష్టం గా చూసేవాడో అంతే భాద్యతగా ఉద్యోగాన్ని ప్రేమతో కుటుంభాని చూసుకునేవాడు మావయ్య . ఫై డబ్బులు దండిగా వచ్చే డిపార్టుమెంటు లో ఉన్నా నిజాయితి గల ఉద్యోగి గా పేరు పొందాడు . ప్రభుత్వం ఇళ్ళ స్తలాలు పంపిణి చేసినాప్పుడు అర్హులకు తప్పించి అనర్హులకు సెంటు భూమి కుడా ఇప్పించలేదు వాళ్ళు బంధువులు ఐనా సరే. ఆ పని వల్ల కొంత మంది బంధువుల్లో వ్యేతిరేకత వచ్చినా సరే చలించలేదు మావయ్య .

తన కష్టార్జితం తో ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లి చెయ్యడం మొదలుకొని పురుళ్ళ వరకు అన్ని దగ్గరుండి చేసాడు. అంతేకాదు తన పిల్లలు ఎదిగే సమయానికి అత్తా కి పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైతే ఎవరి సాయం తీసుకోకుండా తనకి ముగ్గురు పిల్లలుగా భావించి సేవలు చేసాడు గాని విసుగు ని గాని వరక్తి ని గాని తన మోము మీదకి తొంగి చుడనివ్వలేదు. కాలం కలసి వచ్చి అత్త పుట్టింటి నుంచి పసుపు కుంకుమ కింద లక్షల ఆస్తి కలసి వస్తే దాంట్లో రూపాయి తీసుకోకుండా అత్త పేరు మీద కొంత ఉంచి మిగిలింది వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టి బిదవాళ్లైన బంధువుల పిల్లలకి చదువులు చెప్పించాడు .పెళ్లిలు చేయించాడు. ప్రస్తుతం ఆ ట్రస్ట్ కి నేను సెక్రటరి ని కుడా.

అలా ఆదర్శ భర్త గా మంచి అల్లుడు గా నిలబడ్డాడు. దాంతో మా బంధువర్గం లో మచ్చ లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మావయ్యే అని అనిపించుకున్నాడు.

నిజ జీవితం లో ఎదురైయే సమస్యలకి తన లోక జ్ఞానం సినిమా పరిజ్ఞానం కలిపి పరిష్కారాలు చెప్పేవాడు. అలాగే తనకి నచ్చిన సినిమాల్ని సందర్భానుసారంగా మాతో పంచుకోనేవాడు మావయ్య పెద్దవయసు వాళ్ళను కలిసినప్పుడు మిస్సమ్మ , గుండమ్మకధ, జానపద సినిమాల్ని అలాగే కొత్త జంటలకి పెళ్లి పుస్తకం లాంటి సినిమాల్ని గిఫ్ట్ లా ఇచ్చేవాడు. దాంతో మావయ్య అసలు పేరు పూర్తి గా మర్చిపోయి సినిమా మావయ్య గానే స్టిరపడిపోయాడు.

కాలం గడిచిన కొద్ది మావయ్య కి వయస్సు తో పాటు ఉద్యోగంలో హోదా బంధువర్గం లో పేరు ప్రఖ్యతలు పెరిగాయి. మాట సాయం కావాలన్న డబ్బు సాయం కావాలన్న మావయ్యే ముందుడే వాడు. కాని ఎన్ని పనుల్లో ఉన్నా కొత్త సినిమాలు చూడటం మాతో పంచుకోవడం మానేవాడు కాదు మావయ్య.

మంచి వాళ్లకి అంతా మంచే జరుగుతుంది అన్నట్లు మావయ్య ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి పిల్లలు మంచి ఉద్యోగాలతో వేరే ఉళ్ళాలో స్థిరపడ్డారు. మంచి సంబందాలు కుదిర్చి పెళ్ళిళ్ళు కుడా చేసాడు. అత్త కి కుడా నయమై లేచి తిరగడం మొదలుపెటింది . ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొనే సమయానికి సినిమాలో ఉహించని మలుపు వచ్చినట్టు మావయ్య జీవితంలో కోలుకోలేని ఎదురు దేబ్బ అత్త మరణంతో తగిలింది.

అత్త కు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆపరేషన్ చేసి డోనార్ కిడ్ని తో రీప్లేస్ చేసినా ఎక్కువ రోజులు బ్రతుకలేదు. అత్త మరణం మావయ్యను కృంగదిస్తే తరువాత జరిగిన సంఘటనలు బంధువర్గంలో మావయ్య ఉనికినే ప్రశ్నార్ధకం చేసాయి.

మావయ్య డోనార్ భార్యతో కనిపిస్తున్నట్లు, బ్యాంకు ఎకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ఇంట్లో చెప్పకుండా విత్ డ్రా చేస్తునట్లు .ఇంతలో ఒక రోజు అర్జెంటు గా రమ్మని సుధాకర్ దగ్గర నుండి ఫోన్. ఏంటా అని వెళ్లాను. ఇవ్వాళ జరిగిన మీటింగ్ అదే.

మీటింగ్ జరిగిన వారానికి మావయ్య సూసైడ్ చేసుకున్నాడు. అందరికి పెద్ద షాక్ ముఖ్యంగా నాకు. బందువే కాదు మార్గదర్శిని, గురువుని కోల్పోయినట్టు గా ఉంది నాకు. మావయ్య చివరి చూపుకు నేను చేరుకోనేప్పుడికి ఉహిమ్చినట్టు గానే బందువులు కంటే సన్నిహితులు స్నేహితులే వచ్చారు. మావయ్య నిజం చెప్పక పోవడంతో తమ నాన్న పట్ల ఏ భావాన్ని చూపాలో తేలికా అయోమయంగా చూస్తున్న సుధాకర్ మహిదర్ లకు దైర్యం చెప్పి దగ్గరుండి శ్రద్దగా కార్యక్రామాలు చేసేలా చుసాను.

పెద్దకర్యం కి వారం రొజులు ఉందనగా ట్రస్ట్ లీగల్ అడ్వైజేర్ ఆఫీస్ నుంచి నాకొక లెటర్ వచ్చింది. బహుశా ట్రస్ట్ కు సంబంధించిన పేపర్స్ అనుకున్నాను. వాటితో తో పాటు మావయ్య నాకు స్వహస్తాలతో వ్రాసిన లెటర్. చేస్తున్న పనిని పక్కన పెట్టి నాలో చెలరేగుతున్న ఆశ్చర్య ఆనందాల్ని అనుచుకుంటు లెటర్ చదవడం మెదలుపెట్టాను.

ప్రియమైన రామనాధ నికి,

“ఈ లెటర్ నీకు చేరేసమయానికి నీకు నా పట్ల ఎలాంటి భావన ఉన్నా చదివి నన్ను అర్ధం చేసుకుంటవన్న నమ్మకంతో ఉన్నాను .ఈ లెటర్ నీకు వ్రాయడానికి ముఖ్య కారణం నన్ను అర్ధం చేసుకున్న వాళ్ళలో నువ్వు ముఖ్యమైన వాడివి ఇన్నాళ్ళూ ఎవరికి చెప్పుకోలేని బాధతో సతమతమవుతున్న నాకు నేను చేసిన తప్పు నీతో అయినా చెప్పుకొని నీ సహాయం కోరాలని ఈ లెటర్ వ్రాస్తున్నాను. ఒక కుటుంబం రోడ్డున పడ్డానికి నేను కారణం అయ్యాను.

ఒక ఎంపి భూ కబ్జా కి నేను నా వంతు సాయం చేయాల్సివచ్చింది. అందుకు అప్పటి నా భరించలేని ఆర్ధిక పరిస్తితులు ఒక కారణమైతే ఎదిరించలేని రాజకీయ ఒత్తిళ్ళు మరో కారణం.ఫలితం భూమే ఆధారంగా బతుకుతున్న ఒక కుటుంబానికి నా వల్ల నిలువ నీడ లేకుండా పోయింది .ఈ విషయం మీ అత్తకు నాకు తప్ప మూడో కంటికి తెలియదు. చేసిన పాపం ఉరికే పోదంటారు. మీ అత్తకు కిడ్ని దానం చేసిన డోనార్ ఎవరో కాదురా నా వల్ల నిలువ నీడ కోల్పోయిన కుటుంబ యజమాని. జీవితం తో పోరాడటానికి సరైన ఆధారం దొరకక తన కూతురికి సరైన వైద్యం చేయించడానికి డబ్బులు సరిపోక తన కిడ్ని నాకు అమ్మాడురా.

భగవంతుడు ఎంత నిర్దయుడు చూసావా నా తప్పుని మరింత భయంకరంగా కనిపించాలని మీ అత్తా తో పాటు అతన్ని కుడా తనతో తీసుకుపోయి నన్ను మరింత వేదనకి గురిచేశాడు. మనం చేసిన తప్పుకి మనమే కష్టాలు పడుతుంటే అంత భాద అనిపించదు. కాని మనం చేసిన తప్పు వల్ల వేరే వాళ్ళు అదీ మన ముందే కష్టాలు పడుతుంటే అది చూస్తూ తట్టుకోవడం మనిషన్న వాడికి చాల కష్టం. ప్రస్తుతం నేను అనుభవిస్తుంది ఆ భాదే.”

“ఇంటి యజమాని లేకపొతే అది సరైన వైద్య సహాయం అందాల్సిన సమయంలో లేకపోతే ఆ కుటుంబం పడే వేదన ఉహిమ్చగలమా?. ఇంటి పెద్ద ను కోల్పోయిన ఆ కుటుంబానికి ఇక దిక్కెవరు?” జరిగింది మన వాళకి చెప్పాలనిపిమ్చినా ఏమని చెప్పను” ఎవరు వేలెత్తి చూపలేని జీవితం గడపాలని చెప్పిన నేనే తప్పు చేసానని తెలిస్తే అర్ధం చేసుకొని సానుభూతి చూపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు.

రాబోయే తరానికి నా జీవితం ఒక గుణపాటం గా చూపించడం నాకు ఇష్టం లేదు. కాని మనసుని మెలిపెడుతున్న భాదని ఎవరితొ చెప్పుకొవాలొ తెలికా భాధ ని పంచుకొనే తొడు లేక నాలొ నేను నరకం అనుభవిస్తునాను. ఆ కుటుంబానికి నా వల్ల ఆర్ధికంగా జరిగిన నష్టాన్ని బర్తి చేస్తేనే చేసిన తప్పుకి ప్రయచిత్తం అవుతుందని భావించి డబ్బు సాయం చెయ్యడానికి ఆవిడి ని కలుస్తున్నాను కాని వేరే ఉదేశ్యం ఏమి లేదు. ఆ కుటుంబానికి ఇంకో రెండు లక్షలు అవసరం ఉంది. ఆ మొతం ఇవ్వగలనొ లేదొ అని భయం గా ఉందిరా. ఇవ్వలేక పొతె నన్ను నేను మన్నించుకొలేను.”

“రామనాధమ్ నేను కోరుకొనేది ఒక్కటే. నా భాద నీవ్వు అర్ధం చేసుకోగాలికితే నేను చేసింది సరైన పని అని నువ్వు అనుకుంటే. ఎలాగైనా ఆ కుటుంబానికి సహాయం చెయ్. ఇది నా ఆకరి కోరిక గా భావించి తీరుస్తావని ఆశిస్తున్నాను.”

ఇట్లు
సినిమా మావయ్య

ఉభికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాను లెటర్ పూర్తిగా అయ్యేటప్పడికి. ఎంత భాదని గుండెల్లో దాచుకున్నాడో మావయ్య. చేస్తున్న తప్పుల్ని సరిద్ది`ద్దుకోకుండా మనసాక్షి ని మభ్యపెడుతు బతుకుతున్న ఈ రోజుల్లో చనిపోయినా సరే చేసిన తప్పుని సరిద్దిద్దు కోవాలనే నీ లాంటి వాళ్ళు ఉండటం చాల గ్రేట్ అని మనసులోనే మావయ్యకు నివాళులు అర్పించి చివరి కోరిక ఎలా తీర్చాలని ఆలోచిస్తూ మావయ్య వ్రాసిన లెటర్ ని భద్రంగా దాచుకున్నాను.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)