వైకరణ ఆంకాలజీ అతిరధుడు, బ్రాకీ తెరపీ అగ్రగణ్యుడు - డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ప్రపంచంలోనే అతిగా బాధించే వ్యాధులలో ఒకటైన పుట్టవ్యాధి (క్యాన్సర్) చికిత్సకి బ్రాకీ తెరపీ పద్ధతులను ప్రయోగాత్మకంగా అరోగ్యశాలలో రూపొందించి బాహుళ్యానికి అందించిన శ్రేష్ట వైద్యుడూ, బ్రాకీ థెరపీ రూపకర్త, ప్రపపంచంలో అత్యుత్తమ వైకరణం (రేడియేషన్) ఆంకాలజిస్ట్, క్యాన్సర్ చికిత్సా నిపుణుడు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.
విభిన్న పుట్టకురుపు వ్యాదులకు శస్త్ర చికిత్స లేకండా, బ్రాకీ తెరపీ ప్రవేశ పెట్టిన అతిరధుడు డాక్టర్ నోరి. వైకరణం ఆంకాలజీ అచార్యుడిగా ప్రపంచ మంతా తిరుగుతూ, వైకరణం చికిత్సా సేవలు అందిస్తూ, ప్రసంగాలు చేస్తూ, తన వంతు సహాయం అందిస్తూ, క్యాన్సర్ వ్యాధి నివారణకు కృషిచేస్తున్న భిషగ్వర్యుడు ఆయన.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, న్యు యార్క్ ప్రస్బిటేరియన్ ఆసుపత్రి - వీల్ కోర్నెల్ ఆరోగ్య కేంద్ర అధ్యక్షుడిగా, అచార్యుడి గా పనిచేస్తున్నారు. బ్రాకీ తెరపీ ప్రత్యేకతలో అగ్రజుడిగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు అవలంబిస్తున్న "హై డోస్ రేట్ బ్రాకి తెరపీ " ఆరోగ్యశాలల వాడకంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే కాక డాక్టర్ నోరి న్యు యార్క్ క్వీన్స్ ఆరోగ్య కేంద్రం - క్యాన్సర్ విభాగానికి, రేడియేషన్ ఆంకాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. పలు ఆంకాలజీ పత్రికల సంపాదకుడిగా ఉన్నారు.
డాక్టర్ నోరి, అమెరికన్ క్యాన్సర్ సంస్థ నుండి "ట్రిబ్యూట్ టు లైఫ్ " గౌరవం అందుకుంటూ ఇలా అన్నారు - " 2010 సంవత్సరానికి కల్లా క్యాన్సర్ బారిన పడకండా 25 శాతం కేసులు తగ్గించి, రోగుల ప్రాణ సంకటం 50 శాతం వరకు తగ్గించాలన్న అమెరికా క్యాన్సర్ సంస్థ లక్షాన్ని సాధిస్తామని తెలిపారు.
బ్రాకీ తెరపీ పరిచారణం - స్త్రీల సంబంధమైన వ్యాధుల అనగా (గైనికోలాజికల్), జననేంద్రియ, మూత్ర సంబంధిత (జెనిటో యూరినరి), వాక్షికము, తల, మెడ కణితుల చికిత్సా విధానాలకు సూత్రధారుడు. ప్రోస్ట్రేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, వృక్వకము (పాంక్రియాస్), రొమ్ము (తదితర క్యాన్సర్ ల) తో బాధ పడుతున్న రోగుల సమస్యల నిర్ధారణ, నివారణ, తదుపచార సేవా విధానాలలో పరిశోధనలు చేసి వాటి ఫలితాలను చికిత్సా విధానాలలో ఇమిడించిన ప్రావీణ్యుడు. ఇటీవల, ప్రముఖ అమెరికా పత్రిక - " లెడీస్ హోం జర్నల్ " నిర్వహించిన సర్వే లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని అమెరికాలో క్యాన్సర్ వ్యాధి తో బాదపడుతున్న స్త్రీలకు, చికిత్సా ఉపచారలను అందిస్తున్న అత్యుత్తమ డాక్టర్ గా పేర్కున్నారు.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సాంకేతిక, వైజ్ఞానిక సహాయం అందిస్తూ - భారత, దక్షిణ అమెరికా, ఇజ్రైల్ దేశాలలో క్యాన్సర్ పరిశోధనా కేంద్రాల నెలకొల్పనలో కీలకపాత్ర వహించారు. ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ (హైదరాబాద్) వ్యవస్తాపకుడిగా ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి - అంతర్జాతీయ అణు శక్తి సంస్థ - సలహాదారుగా వుండి క్యాన్సర్ వ్యాధి చికిత్సా ప్రణాళిక రూపొందించారు.
మార్చ్ 2007 లో - డాక్టర్ నాయుడమ్మ పురస్కారం అందుకుని, ఆ స్మారక ఉపన్యాసం చేస్తూ - " క్యాన్సర్ నివారణ, రోగ నిర్ధారణ, చికిత్స " అన్న అంశం మీద మాట్లాడుతూ - ఈ ప్రాణాంతక వ్యాధి అరికట్టవచ్చని తన అభిప్రాయం వెలిబుచ్చారు. యేటా సుమారు 11 మిల్లియన్ ప్రజలు క్యాన్సర్ వ్యాదిగ్రస్తులవుతున్నారని అన్నారు. దదాపు నాలుగు మిల్లియన్ల పుట్ట వ్యాధిగ్రస్తులు యేటా మరణిస్తున్నారని డాక్టర్ నోరి ప్రస్తావించారు. ఈ దోరణిలో మార్పు లేక పోతే 2030 సంవత్సరం నాటికి అబ్ధివృద్ధి చెందుతున్న దేశాలలో 70 శాతం పుట్టవ్యాది కేసులు ఉంటాయని విశ్లేషించ్చారు. ప్రపంచంలో యేటా కాలేయం పుట్టవ్యాది మూలాన 500,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు డాక్టర్ నోరి. ధూమపానం సేవించడం క్యాన్సర్ వ్యాదికి ప్రపధమ కారణమైతే, హెపటైటిస్ బి వైరస్ (హెచ్ బి వి) రెండవ కారణమని తెలిపారు.
హెపటైటిస్ బి వైరస్ (హెచ్ బి వి) నివారించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పిల్లలకు టీకాలు వెయాలన్నారు. సుమారు 300,000 స్త్రీలు గ్రీవం (సర్వికల్) క్యాన్సర్ తో మరణిస్తూంటే ఇందులో యెనబై ఐదు శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల వారు అని వివరించారు. కుటుంబాలు, సమాజ సేవా సంస్థలు, వృత్తిపరమైన సొసైటీలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు క్యాన్సర్ వ్యాధి నివారణకు చేపట్టిన కార్యక్రమాలలో, భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. ధూమపానం నివారించడం ద్వరా, గుల్మనాశకం, కీటకనాశనం, రశాయనాలు భద్రంగా వాడడం వల్ల లుకేమియా, యముక క్యాన్సర్ వ్యాదులు అరికట్ట వచ్చని వక్కాణించారు.
క్యాన్సర్ పరిశోధనలో విశిష్ట కృషి కి గాను అమెరికన్ సెనేట్ సభ్యులు - జాన్ కోర్జిన్ కొర్జైన్, గిఫ్ఫోర్డ్ మిల్లర్ డాక్టర్ నోరిని గౌరవించారు.
1979 లో, అమెరికాలో ప్రపధమంగా కంప్యూటర్ అధారంతో బ్రాకీ తెరపీ ఉపచారణా పద్ధతిని అందించారు. ఈ ప్రయోగాత్మక వైద్యశాల కొత్త పద్ధతులు అభివృద్ది పరచడానికి సహాయ పడింది. " ట్రాన్స్ పెరినియల్ " బ్రాకీ తెరపీ విధానాన్ని రూపొందించి, దాన్ని ఆచరణలోకి తేవడం, ఆ పద్ధతిని విస్తరించడం, శస్త్ర చికిత్స నిరాదారిత "రేడియో యాక్టివ్ సీడ్ ఇంప్లాంటేషన్" ఆధారంగా రోగుల జీవిత నాణ్యత మెరుగు పరచడానికి కీలకమైయ్యింది.
విద్యాభ్యాసం
1962 లో తన ఇంటర్మీడియట్ (పి యు సి) ముగించారు. తరువాత 1965 లో బి ఎస్ సి, ఈ జె కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి, కర్నూల్ వైద్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (1971) లో ఎం బి బి ఎస్ చేసారు. డాక్టర్ నోరి - గాంధి ఆసుపత్రిలో (1973 లో) " ఇంటర్న్ " గా పనిచేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుసంధానమైన రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ ఆసుపత్రిలో (1976) " రెసిడెంట్ " గా పనిచేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (1976) నుండి ఎం డి పట్టా అందుకున్నారు.
పోస్ట్ డాక్టరల్ శిక్షణ:
1977 లో న్యు యార్క్ శ్లోన్-కెట్టెరింగ్ క్యాన్సర్ కేంద్రం రేడియషన్ ఆంకాలజీ విభాగ బ్రాకీ థెరపి సెర్వీస్ సినియర్ ఫెల్లో గా, 1978 లో స్పెషల్ ఫెల్లో గా పోస్ట్ డాక్టరల్ శిక్షణ పొందేరు. 1984 లో అమెరికా క్యాన్సర్ సంస్థ - క్లినికల్ ఫెల్లో-షిప్ నిర్వర్తించారు.
చేపట్టిన కార్యాలు, నిర్వహించిన పదవులు
న్యు యార్క్ క్వీన్స్ ఆసుపత్రి సంచాలకుడిగా రోగుల సంరక్షణా నిర్వహణలో నిమగ్నమైయ్యారు. వృత్తి శిక్షణ, ఆరోగ్య కేంద్ర పరిశోధన కొనసాగిస్తూ, " ఆంకాలజీ " క్షేత్రంలో నైపుణ్యం పెంపొందించుకుని - గైనకాలజీ, మెడ, తల, రొమ్ము, నాడీ సంబంధ (న్యురో), వక్షికం పుట్టవ్యాదులు, కణుతుల నిర్మూలనలో శ్రేష్టమైన వైద్యసేవలు అందిస్తున్నారు.
విభిన్న విశ్వవిద్యాలయాల నుండి వచ్చి, రేడియేషన్ ఆంకాలజీ ప్రోగ్రాం లో దాదాపు 150 రెసిడెంట్ డాక్టర్లకి, ఫెల్లోస్ కి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. వీరిలో బహళ శాతం అమేరికా విశ్వవిద్యాలయలో, అనుబంధ ఆసుపత్రులలో పనిచేస్తున్నారు.
1996 నుండి న్యు యార్క్ ప్రశ్పిటేరియన్ ఆసుపత్రి-వీల్ కార్నెల్ వైద్య కళాశాల - " రేడియేషన్ ఆంకలజీ " విభాగంలో అచార్యుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 1989 నుండి న్యు యార్క్ క్వీన్స్ ఆరోగ్య కేంద్రంలో " రేడియేషున్ ఆంకాలజీ " విభాగ అధ్యక్షుడిగా ఉన్నారు. 1991 నుండి ఇదే ఆసుపత్రి క్యాన్సర్ కేంద్ర సంచాలకుడిగా వ్యవహరించారు.
1988-89 లో శ్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ కేంద్ర రేడియేషున్ ఆంకాలజీ విభాగంలో బ్రాకీ తెరపీ సేవ అగ్రజుడిగా ఉన్నారు. 1990-1996 మధ్య న్యూయార్క్ విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రంలో క్లినికల్ రేడియాలజీ అచార్యుడిగా ఉన్నారు. అంతకు మునుపు న్యూయార్క్ ఆసుపత్రిలో, కోర్నెల్ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల ఆంకాలజీ విభాగంలో కూడా కొంతకాలం పనిచేసారు.
విభిన్న వైజ్ఞానిక, వైద్య సంస్తలలో సభ్యుడిగా పనిచేస్తున్నారు - వాటిలో అమెరికన్ బోర్డ్ ఆఫ్ రేడియాలజీ; అమెరికన్ క్యాన్సర్ సంస్థ; అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ; అమెరికన్ కలేజ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ; అమెరికన్ బ్రాకీ తెరపీ సంస్త; అమెరికన్ వైద్య మండలి; అమెరికన్ రేడియం సొసైటి; అమెరికన్ సొసైటి ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ; ఇండియన్ సొసైటి ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ చోటు చేసుకున్నాయి.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు - ఆరోగ్యశాల (క్లినికల్), క్యాన్సర్ నివారణా పరిశోధనా కారుడే కాక, మంచి పాలనాదక్షుడు. ఆంకాలజీ కి సంభందించి పలు క్షేత్ర విభాగాలను యెంతో దక్షతతో నిర్వర్తిస్తున్నారు.
విలువడిన ప్రచురణలు
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, మూడు పుస్తకాలు రచించారు. ఇవే కాక విభిన్న పత్రికలలో - కణితులు, సెర్వికల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లింఫోమటాడ్ క్యాన్సర్ కి రేడియేషన్ తెరపీ, గైనకాలజీ క్యాన్సర్, బ్రాకీ తెరపీ ఆంకాలజీ, ప్రోస్ట్రేట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల కణుతులు అంశాల మీద సుమారు 250 పత్రాలు (పేపర్స్) ప్రకటించారు.
పొందిన పురస్కరాలు - నిర్వహిస్తున్న సభ్యత్వాలు
అమెరికా రాష్ట్ర క్యాన్సర్ సంస్థ స్పాన్సర్ చేసిన
ఆరోగ్యశాలాపరమైన విచారణలు (క్లినికల్ ట్రయల్స్ కి) ప్రాధమిక పరిశోధకుడిగా
ఉండి, క్యాన్సర్ వైద్యాభివృద్ధికి మహత్తర కృషి కొనసాగిస్తున్నారు.
ఆయన పుట్ట వ్యాది చితిక్సల పరిశోధనలకు, రోగి ఉపచరణలకు
గాను పలు అవార్డులు పొందేరు. వీటిలో డిస్టింగ్విష్డ్ అలుమ్నుస్ ఆఫ్
శ్లోన్-కేటరింగ్ క్యాన్సర్ కేంద్ర అవార్డు అందుకున్నారు. అమెరికా క్యాన్సర్
సంస్థ డాక్టర్ నోరి సాధించిన విశిష్ట ఫలితాలకు ప్రతిష్ఠాత్మక "
ట్రిబ్యూట్ టు లైఫ్ " అవార్డు ప్రధానం చేసింది.
1995 నుండి, అంతర్జతీయ అణు శక్తి సంస్థలో సభ్యుడిగా
వ్యవహరిస్తున్నారు.
న్యు ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, డాక్టర్ నోరి ని అగ్రగామిగా
పేర్కొంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ ఫెల్లో (1990) గా ఉన్నారు.
భారత దేశంలోని నర్గిస్ దత్ క్యన్సర్ ఫౌండేషన్ పురస్కారం
అందుకున్నారు. ఇదే కాక అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వారి
దగ్గరనుంచి " ఎలిక్సియర్ " అవార్డు పొందేరు. అమెరికా బ్రాకీ తెరపీ
సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇవే కాక పలు అమెరికా జాతీయ
అంతర్జాతీయ సంస్థలలో సభ్యుడిగా వివిధ స్థాయిలలో సేవలు అందించారు. 1991 నుండి, న్యు యార్క్ పత్రిక, డాక్టర్ నోరి ని " ఉత్తమ
డాక్టర్ " గా పేర్కొంది. క్యాసెల్ అండ్ కొనలీ పబ్లికేషన్ (2000 నుండి)
ప్రకటనలో అమెరికా శ్రేష్ట వైద్యుడిగా గుర్తిస్తోంది.
అమెరికాలో అత్యుత్తమ డాక్టర్ గా ఎదిగిన నోరి దత్తాత్రేయుడు గారికి,
కర్ణాటక మాజీ గవర్నర్ వి రమాదేవి డాక్టర్ నాయుడమ్మ పతకం
(2006) ఇచ్చి గౌరవించారు.
ఇవే కాక - భారతీయ వైద్య మండలి (1995) బంగారు పతకం
అందుకున్నారు; అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ (2003) - ఫెల్లో
గా ఉన్నారు.
అమెరికన్ బ్రాకీ తెరపీ సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికా ఎండో క్యురీ సంస్థ అధ్యక్షుడిగా, న్యు యార్క్ రాష్ట్ర పర్యావరణ వైకరణం సంరక్షణ బోర్డ్, సలహాదారుగా కూడా ఉన్నారు.
ఎండో క్యురీ తెరపీ, హైపర్ తెర్మియా ఆంకాలజీ, జర్నల్ ఆఫ్ క్లినికల్
రేడియో తెరపీ, రేడియేషన్ మెడిసిన్ పత్రికలకు సంపాధకుడిగా
సేవలను అందిస్తున్నారు.
డాక్టర్ నోరి
దత్తాత్రేయుడు ప్రపంచంలో శ్రేష్ట రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా,
బ్రాకీ తెరపీ అతిరథమహారధుడిగా, రోగులకు మెరుగైన వైద్య
సేవలు అందిస్తున్నారు.





























