నిలువు:

1. పిల్ల "బంగారం"లా ఉంది .. (3)
2. పిల్లలు "మొండి"కెత్తితే మొట్టికాయలు పడతాయట .. (2)
3. అందరికీ అందుబాతులో ఉండేకల్పతరువులాంటిది. "శ్రేష్ఠమైన వృక్షం" .. (4)
4. సత్యభామ వ్రతం పట్టి భర్తగారిని తూకం వేసింది "దీని"తోనే .. (4)
5. క్షీరసాగర మధనంలో కవ్వంగా ఉపయోగించినది .. (6)
6. ఒక పంచమీ విభక్తి ప్రత్యయం .. (2)
10. 2 నిలువు లోదే .. (3)
11. కలికాలంలో "నీతికీ ధర్మానికీ కట్టుబడి ప్రవర్తించడం" తేలిక కాదు .. (7)
12. పండుగలప్పుడు "ఇది" తప్పనిసరి .. (3)
13. కౌస్తుభమణి .. (6)
14. నాణానికి పాతకాలంలో ఉపయోగించిన మాట .. (2)
17. ఇదివరకు ఇళ్ళకి ఇంటిముందు "అరుగు" లేక "మెట్టు" ఉండేవి .. (2)
18. లకుముకి పిట్ట .. (4)
20. మహారణ్యాలలో అన్ని జంతువులతో పాటు "వ్యాఘ్రాలు" ఉన్నాయి .. (5)
23. ఏదైనా రవాణా సౌకర్యం ఉంటే ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతుంది .. (4)
24. "ముక్క" లేక "ఖండం" .. (3)
27. పందెంలో అందరికన్నా "ముందున్న వ్యక్తి" గెలుస్తాడు .. (3)
30. "వీటిని" ఎక్కడానికి ఉడుము సాయపడేది, క్రిందనుంచి పైకి (2)
32. "వాయసము". ఎక్కువ అల్లరి చేస్తున్న పిల్లలని "దీని" గోల అంటారు .. (2)

అడ్డం:

1. "మార్గశిర","పుష్య" మాసాల్లో వచ్చే ఋతువు .. (6)
5. లోకజ్ఞానం లేనివాళ్ళని బావిలో ఉన్న "దీని" బ్రతుకుతో పోలుస్తారు .. (3)
7. మొండివాడు రాజుకంటే బలవంతుడు .. (3)
8. చవితినాడు చంద్రుణ్ణి చూస్తే కృష్ణుడికీ "ఇది" తప్పలేదు .. (2)
9. రాజాజ్ఞ, లేక రాజశాసనం .. (4)
10. ఎలుగెత్తి "లక్ష్మీ" అంటే కానీ వెనుకకి రాదు .. (2)
11. స్వభావం .. (2)
12. రాత్రి నాలుగోజాము .. (4)
13. చందమామ కథల్లో, సుమతీ శతకంలో "ఇది" ఖచ్చితంగా ఉంటుంది .. (2)
15. అపురూపమైన, అరుదైన .. (4)
16. అంతా కన్నుపొడుచుకున్నా కనపడని "గాఢాంధకారం". అందులో ఒక అక్షరం కనపడకుండా పోయింది .. (5)
19. 2 నిలువు లోనిదే .. (2)
21. ఈ చెట్టెక్కి కోయిల కదా రాగాలు తీసేది. మరి ఈవిడకెందుకట దీర్ఘము .. (3)
22. అవకతవకయైన "సంతతి" ..(2)
24. కబళం .. (2)
25. "ఇది" చేస్తే నిలువు జీతం వస్తుంది .. (2)
26. రక్షణ .. (4)
28. అట్నుంచి నెమలి పించం .. (2)
29. వేద పఠనంలో కొంత పదసామ్యం వల్ల ఒకదానిబదులు మరొకటి వచ్చి కలవడం .. (3)
31. కూరగాయలలో ఒక "రకంవి" .. (6)
33. కొరడా .. (4)
34. బాణం మొన .. (3)



ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.


ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
ఏప్రిల్ 25, 2008


ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014


గత పదవిన్యాసం సమాధానాలు:



మార్చి నెల పదవిన్యాసం విజేత: నిరంజన్ ఇందూర్. వీరికి "వైతాళికులు" పుస్తకం బహుమతిగా పంపిస్తాము. ఏప్రిల్ నెల విజేతలకు ""భారత యువజనులారా!" పుస్తకం బహుమతిగా ఇవ్వబడుతుంది.
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)