సరిగ్గా అప్పుదే
ఋతుపవనాల ప్రవాహం ఆవిష్కరింపబడుతుంది
మబ్బుల గుంపుల పోటీ ఆరంభమవుతుంది
మనసు బీడును దున్నటం మొదలెడతాను
కందిన చెక్కిళ్ళ గులాబీలు
ఆకసం వంక విసిరి
మూసిన కనురెప్పల వెనుక
అలవోకగా కలల్ని నిద్రపుచ్చి
తొలిచినుకు అనుభూతికై
వెన్నెట్లో చాతకాన్నవుతాను
సముద్రం రెక్కలమీదవాలి
స్వాతిముత్యం అవ్వాలని నిరీక్షిస్తాను
అనుభూతి జల్లు వాగులా వరదలా ముంచెత్తాలని
పరవశించి ఒళ్ళు మరచి ప్రవహిస్తాను
యుగాలు రాత్రీ పగలూ దోబూచులాటలో
రుసరుసలు వెదజల్లే ఊపిరి నెగాళ్ళలో
ఉక్కిరిబిక్కిరై అయోమయాన్ని పెనవేసుకున్న వేళ
నిశ్శబ్ద పారవశ్యాన్ని నెమరువేస్తూ
తొలి చినుకు జారి జారి
అక్షరమై ఉషోదయపు రంగుల్నద్దుకు
మొలకెత్తుతుంది
కవిత్వాన్ని పెనవేసుకున్న జీవితం
కావ్యాలాపన చేస్తునే ఉంటుంది

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)