పుస్తక ఆవిష్కరణం

  • 'సమీక్షా చక్షువు ' ఆవిష్కరణ
    సమర్ఠ గ్రంద్ఠసమీక్షకుడుగా ప్రసిధ్దిచెందిన ద్వా.నా.శాస్త్రి ( డా.ద్వాదశి నాగేశ్వరశర్మ )సాహితీ సద్విమర్శకుడు, మరియు బోధకుడు. ద్వా.నా.శాస్త్రి సమీక్షావ్యాసాల సంపుటి ' 'సమీక్షా చక్షువు ' ఆవిష్కరణ త్యాగరాయగానసభలొ మంత్రి బుద్ధప్రసాద్ చేతులమీదుగా జరిగింది. ఈ సంధర్భంగా గ్రంధకర్తకు 'సమీక్షక సవ్యసాచి ' బిరుదు ప్రదానం డా.సి. నా. రె చేసారు. ఉస్మానియ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర అధ్యక్షతలొ ఇతర ప్రముఖులు ఆచార్య చేకూరి రామారావు, శిరం రామారావు, జి.వెంకటరెడ్డి, లొకం కృష్ణయ్య, లంక లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

  • 'అక్షర శిల్పాలు ' ఆవిష్కరణ
    మోచర్ల రామలక్ష్మి రచనల సంపుటి 'అక్షర శిల్పాలు ' ఆవిష్కరణ అంకిత సభ ' శ్రి పరాశరి సేవాసమితి మరియు త్యాగరాయ గానసభల సమ్యుక్త్వాధ్వర్యంలొ జరిగింది.
    వక్తలు: ఆచార్య వి.చలపతి రావు, రాగాల, యుద్ధనపూడి సులోచనారాణి, తమిరశ జానకి మోచర్ల రామలక్ష్మి

  • నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు పుస్తకాల ఆవిష్కరణం


    నేషనల్ బుక్ ట్రస్ట్ తాజాగా వెలువరించిన తెలుగు పుస్తకాలు
    భారతదేశంలొ ప్రభుత్వ పాలన - డా.వకుళాభరణం
    భారతదేశవిభజన --- తెలకపల్లి రవి
    మతతత్వ సమస్య ----- ఆర్వి . రామారావ్
    ప్రెస్స్ అకాడమి పూర్వ అధక్షుడు డా.పొత్తూరి వెంకతేశ్వర రావు ఈ పుస్తకాలను ఆవిష్కరించారు.

  • 'జేత్రయాత్ర ' కావ్యావిష్కరణ
    కావ్యకర్త: గెడ్డాపు సత్యం

    ఏమెస్కో సాహిత్య వేదిక ఆధ్వర్యంలొ జరిగిన ఈ కావ్యావిష్కరణ సభలొ డా. సి. నా.రె ముఖ్య అథిది గా పాల్గొని కావ్యావిష్కరణ చేయగా, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత బెతవోలు రామబ్రహ్మం సభకు అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ ప్రతిభ, పాండిత్యం, అభ్యాసంతొ కూడిన రచనాశైలి 'జేత్రయాత్ర ' లో కనిపిస్తుందన్నారు.

  • 'ఆదాబ్ హైదరాబాడ్ పుస్తకావిష్కరణ
    రచన: మల్లాది కృష్ణానంద్
    ఆవిష్కర్త : డా.వై . ఎస్ . రాజశేఖర రెడ్డి.

    రచైత కృష్ణానంద్ మాట్లాడుతూ హైదరాబాద్ లొ చూడతగిన ప్రదేశాలు, చారిత్రక, కళాత్మక, వారసత్వ కట్టడాల గురించి పర్యాటకులకు అనువుగా ఈ పుస్తకాన్ని రచించానని తెలిపారు. పొత్తూరి వెంకటెశ్వర రావు కూడా సభలొ పాల్గొన్నారు.

  • వై . ఎస్ .పాలనపై పుస్తకావిష్కరణ
    పేరు: వై. ఎస్. పాలన యుగం స్త్రీజాతికి స్వర్ణయుగం
    రచన: ఎం.ఎస్. కామేశ్వరీ దేవి.( కరుణ సేవాసదన్ ప్రధాన కార్యదర్శి)
    ఆవిష్కర్త : డా.వై . ఎస్ . రాజశేఖర రెడ్డి.

    రచైత కామేశ్వరీ దేవి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు చేస్తోన్న చేయూతను పుస్తకంలో వివరించానని తెలిపారు. పొత్తూరి వెంకటెశ్వర రావు కూడా సభలొ పాల్గొన్నారు.

  • 'దలిత దరువులు ' గ్రంధావిష్కరణ
    రచైత: డా. గుండెడప్పు కనకయ్య

    'దళిత దరువులు ' 'వర్గీకరణే హైటెక్ ఔషధం' అనే రెండు గ్రంధాలను కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆవిష్కరించగా రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ప్రొఫెస్సర్ ముత్తయ్య, ప్రసంగిస్తూ ఈ కావ్యాలు తెలుగు సాహిత్య చరిత్రలో మాదిగల బాధను సందేశాత్మకంగా ఢిల్లీ పాలకులకు నివేదించె మొదటి గ్రంధంగా కొనియాడారు

భాష - సాహితీ సదస్సులు

'తెలుగు శాష్త్ర సాంకేతిక భాష - 21 వ శతాబ్దంలో సవాళ్ళు ' అంశంపై తెలుగు యూనివర్సిటిలో రెండు రోజుల సదస్సు భాషాభివృద్ధి పీఠం నిఘంటు నిర్మాణ శాఖ అధ్వర్యంలో జరిగింది. సదస్సును ప్రారంభిస్తూ ద్రావిడ విశ్వవిద్యాలం ఉపకులపతి ఆచార్య లక్ష్మీనారాయణ "భాష నిరంతర విఙాణ వాహిక , అది ఆగిపోతే జాతి తిరోగమనంవైపు పయనిస్తుంది " అని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలం ఉపకులపతి ఆవుల మంజులత మాట్లాడుతూ కొత్త సాంకేతిక పదాలను తెలుగు లోకి తేవాల్సిన అవసం ఉందన్నారు. డా.నరసింహారెడ్డి,డా.వడ్ల సుబ్రమణ్యం , రెడ్డి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

తెలుగు - రెండో పాఠ్యాంశంపై జాతీయ సదస్సు.

తెలుగు విశ్వవిద్యాలయంలో ' తెలుగు రేండో భాషగా బోధనా పద్దతులు - పాఠ్యపుస్తక రూపకల్పన ' అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు జరిగింది. అధికార భాషాసంఘం అధ్యక్షులు ఏబికె ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచీకరణతో తెలుగు భాషకు ముప్పు ఏర్పడిందని, ప్రతి వంద మందిలో తెలుగు భాషకు 30 మంది దూరమవుతున్నారని దీనిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు. ఒక భాష కనుమరగైతే ఆ ప్రాంత ప్రజల సంస్కృతి, పరిఙానం కూడా కనుమరగయ్యె ప్రమాదం ఉందన్నారు. విదేశాల్లో తెలుగు వ్యాప్తికి తెలుగు విశ్వవిద్యాలయం చేస్తోన్న కృషి ని ఆవుల మంజులత వివరించారు. జొన్నలగడ్డ వెంకటేశ్వర శాస్త్రి, ఆచార్య గౌరీశంకర్ , డా. ప్రభాకర్ లు ప్రసంగించారు.

తెలుగు సినిమా భాషపై జాతీయ సదస్సు.

రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో 13 మంది వివిధ అంశాలపై పత్రాలు సమర్పించారు. దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం, భారతీయ భాషా సంస్థ- మైసూర్, మానవ వనరుల అభివౄద్ధి శాఖ, రంగస్థల కళల శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ సినీరచైతల సంఘం సమ్యుక్తంగా నిర్వహించిన సదస్సుకు ప్రముఖ సినీ రచైతలు హాజరైనారు. ఓల్గా , వెన్నెలకంటి, పరుచూరు గోపలకృష్న్ణ, కె.ఎల్ .ప్రసాద్ మొదలైన వారు పాల్గొన్నారు.

'జానపద సాహిత్యం - అధ్యయన రంగాలు ' అనె అంశంపై జాతీయ సదస్సు.

హైదరాబద్ సెంట్రల్ యూనివర్సిటి లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న అశోక్ తేజ జానపద సాంప్రదాయం - నవ్యప్రయోగం అనే అంశంపై ప్రసంగిస్తూ, అన్ని రకాల సాహిత్యాలకు జానపదమే తల్లి అని అన్నారు. సదస్సులో పాల్గొన్న మరి కొందరు ప్రముఖులు.

'కృష్ణా పత్రిక ' వెబ్ సైట్ ప్రారంభం.

107 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన కృష్ణా పత్రిక తొలితెలుగు జాతీయ దిన పత్రిక అని ఈ పత్రిక వెబ్ సైట్ ప్రారంభ సభలో మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వరులు, కళా దీక్షితులు, దైవఙ శర్మ మొదలైన వారు పాల్గొన్నారు.

హేమలతా లవణం మృతి

ప్రముఖ కవి గుఱ్ఱం జాషువా కుమార్తె హేమలతా లవణం విజయవాడలో మృతి చెందారు. ఆమె రచనలు:

1) మానాన్నగారు జాషువా
2) అహింసామూర్తుల అమరగాథ
3) జీవనసాగరం
4) అనుభవ తరంగాలు
5) నేరస్తుల సస్కరణ
6) జీవన ప్రభాతం
7) తాయెత్తుల గమ్మత్తులు
ఆమె పొందిన సన్మానాలు, బిరుదులు
1) తెలుగు విశ్వవిద్యాలం గౌరవ డాక్టరేటు.
2) తాన ఎచ్చీవ్మెంట్
3) తెలుగు ఆత్మ గౌరవ అవార్డులు
4) ఉగాది పురస్కారం
5) అంబేడ్కర్ భీమరత్న అవార్డు పొందిన ఏకైక మహిళ

అంతే కాకుండ గుఱ్ఱం జాషువా ఫౌండేషణ్ స్థాపించి 9 మంది కవులకు పురస్కారాలు అందచేసారు. జాషువా పద్యాలను ఆయన శైలిలోనే గానం చేయడం ఆమె ప్రతేకత. ప్రముఖులు, వివిధ సాహితీ సంఘాలు విశ్వవిద్యాలయాలు ఆవిడ మృతికి సంతాపం ప్రకటించాయి.

'అల్లం రాజయ్య నవలా సాహిత్యం' పై సదస్సు.

హైదరాబద్ ప్రెస్ క్లబ్ లో విప్లవ రచైతల సంఘం అధ్వర్యాన జరిగిన ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ సాధారణ వ్యక్తులను అసాధారణ మనుషులుగా తీర్చిదిద్ది, పీడిత ప్రజల కోసం ప్రాణత్యాగాలకూ వెరవకుండా ఉద్యమకారులకు ప్రేరణనిచ్చిన 'అల్లం రాజయ్య ' సాహిత్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. సద్దస్సులో పాల్గొన్న వక్తలు

1) ప్రొఫెసర్ హరగోపాల్
2) సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ
3) విరసం సభ్యులు రత్నమాల
4) కవి ఎ.కె. ప్రభాకర్ తదితరులు

'వంగూరి ఫౌండేషణ్ ' నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సభ

వంగూరి ఫౌండేషన్ వారి హైదరాబాద్ నగర విభాగం అధ్వర్యం లో ఈ సాహిత్య సభా పరంపరను డా.సి.నా.రె ప్రారంభిస్తూ దివంగత 'రాయప్రోలు సుబ్బారావు ' సాహిత్య సేవ, కృషిని వివరిస్తూ రాయప్రోలు నవ్యంధ్ర కవితా యుగకర్తలలో వొకరు అని అన్నారు. డా.ద్వా.నా. శాస్త్రి ప్రసంగిస్తూ రాయప్రోలు వారి సంఘసంస్కరణ కవిత్వం కూడా వారి దేశభక్తి కవిత్వం అంత గొప్పగా వుందన్నారు.

సద్దస్సులో పాల్గొన్న వక్తలు
1) డా.ఎన్.అనంత లక్ష్మి
2) వంశీ రామరాజు
3) డా. తెన్నేటి సుధాదేవి
4) కళాదీక్షితులు తదితరులు

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)