యుగళం

-- మృణాళిని

అవని చాలా కోపంగా ఊడుస్తోంది. ఒక్కొక్క పేపర్ మడిచి, తీసి చూసి, పళ్ళు కొరుక్కుని చింపి చేటలొకి పడేస్తోంది. అవధూత ఆ చీపురు దెబ్బలు తనకు తగలకుండ లాంగ్ జంప్ లు చేస్తూ గెంతుతున్నాడు.
"ఈ కోపమంతా ఎవరి మీద?' అడిగాడు.

అవని సమాధానం చెప్పలేదు. ఒక కాయితాన్ని ద్రవిడ్, మరో గుడ్డపీలికను సచిన్ , ఇంకో విరిగిన పేన్సిల్ ముక్కను సెహ్వాగ్ అని పిలుస్తూ చెత్తబుట్టలొకి వేస్తొంది. మంత్రాలు వల్లిస్తున్నట్టు ఏదో గొణుగుతోంది.

అవధూత నిట్టూర్చాడు.
"వీళ్ళ మీదా కొపం? వాళ్ళ తప్పేముంది? బాల్ వేశారు. బంగ్లాదెశ్ వాడు ఆడెశాడు. బంగ్లాదెశ్ వాడు బాల్ వేశాడు. వీళ్ళు ఆడలెకపొయారు.ఆడాలంటే మనసుండాలమ్మాయి. ఎవడు పడితె వాడు ఎప్పుడు పడితె అప్పుడు బాల్ వెసెయ్యడమే? పైగా ఆడలేకపోయారని నిందలా? " అన్నాడు.
"మరయితె అక్కడి దాకా వేళ్ళడమెందుకు? బాల్ కొట్టాలని లేకపొతే ఇంట్లో ఉండొచ్చుగా."
"భలేదానివే. విమానం ఏక్కాలని ఉందిగా? వెస్టిండీస్ అమ్మాయిలను చూడాలని ఉందిగా? ఆ కోరికలన్నే ఏందుకు తీర్చుకోకూడదు? బాల్, బాట్ అంటావా? అది వాళ్ళిష్టం. మంచి మూడ్ ఉండాలి దానికి.అది మనం అనుకున్నప్పుడల్లా రాదు"
"పొనీ. బంగ్లాదేష్ తో మూడ్ లెదనుకుందాం. శ్రీలంకతో ఏమయిందట? "
"అప్పుడు మూడ్ ఉంది గానీ, అది బంగ్లాదెశ్ తో ఆడే మూడ్. అది అప్పటికి వచ్చింది. శ్రీలంక తో ఆడె మూడ్ సూపెర్ 8 కి వచ్చాక వచ్చేది. కానీ కుళ్ళుపొతులు. రానిస్తెగా. "
"ఏవరు కుళ్ళుపొతులు? శ్రీలంక వాళ్ళేనా?"
"ఇంకేవరు? ఏవడో అన్నట్టు హనుమంతుడు లంకను పూర్తిగా కాల్చెయక పొవడం వల్ల వచ్చిన కష్టాలివన్నీ. అలా శతృశేషం ఉంచకూడదు ఎప్పుడూ"
"అంటె నీ ఉద్దెశం లంక ఆటగాళ్ళు రాక్షసులనా?'
"అవును."
"మరయితే మనం ఎవరం? కోతులు కామూ?"
"ఎందుక్కాము? అయినా కోతులయినా బాగుణ్ణు. ఒకళ్ళ పేలు మరొకళ్ళయినా తీసుకుంటాయి. మన వాళ్ళకు పేలు తీయడం కూడా రాదని పందెం".
"నీతొ పందెం కట్టే ధైర్యం లెదు తల్లీ. అందులొనూ పేలదగ్గర ఆడవాళ్ళతొ మాట్లాడ్డం కష్టం"

అవని చీపురు మూలకు పేట్టెసి "చాపెల్ లా ఇంక అక్కడె కూర్చో' అంది. తర్వాత అవధూత కేసి చూసి,
"ఇంతకూ ఇక భారత దేశంలొ క్రికెట్ పరిష్తితి ఏమిటి? అదేమైనా ఆలోచిస్తున్నావా లెదా?'అని అడిగింది.
"ఎందుకు ఆలొచించను? శరద్ పవార్ నన్ను రోజూ అడుగుతోనె ఉన్నాడు. నువ్వు రావచ్చు కదా టీం లోకి అనీ
"వెరీ గుడ్. ఓప్పెసుకో అంది అవని ఉత్సాహంగా.
"కానీ నేను లేకపొతే నీకు ఇబ్బంది అవుతుందని ఆలొచిస్తున్నా. తిట్టడానికి, కొట్టడానికి ఏవరూ ఉండరు. ఎలా తోస్తుంది నీకు?'
"నేను లేకుండా నువ్వు క్రికెట్ టీం లోకి ఎలా వెళ్తావసలు? " అవని ఆశ్చర్యంగా అడిగింది.

అవధూత తెల్లబోయాడు. "మగ క్రికేట్ టీం లోకి నువ్వెలా వస్తావు?'
"అదే చెప్పటం. ఇంకనుంచి భారత దేశం లొ మగ, ఆడ క్రికెట్ లు రెండు ఉండవు. మనకు 20 మంది గొప్ప క్రికెటర్లు ఉంటె కనీసం 19 మంది నిత్యం ఔట్ ఆఫ్ ఫాం లొ ఉంటారు కదా.ఈ జన్మకు మనం ఫుల్ టీం ను తయారు చేసుకోలేం. అందుకని, ఆడ టీం లొ ఉన్న ఓ అయిదారు మంది మంచి వాళ్ళని కలిపేస్తే, టెన్నిస్ లొ మిక్స్డ్ డబుల్స్ లాగా మనకు పర్మనెంటుగా మిక్స్డ్ క్రికెట్ టీం తయారవుతుంది. అసలే మన ఆడ క్రికెటర్లు తమకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వట్లేదని తిట్టిపోస్తున్నారు కదా. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మగ క్రికెట్ టీం లొ సగం మంది ఆడక్కర్లెదు. 15 మందిలొ ఉంటూ, క్రికెట్ గ్రౌండ్ లొ ఆడాళ్ళను చూస్తూ బీరు తాగి, టూర్ అయిపోగానె ఇండియా కు వచ్చేయొచ్చు. ఆడ టీం వాళ్ళు ఫారెన్ పంపట్లేదని ఏడవనక్కర్లేదు"
"వహ్వా. ఏం గొప్ప ఐడియా. నువ్వు ఇలాగె ఆలొచించావనుకో. శరద్ పవార్, వెంగ్‌సర్కార్ ఆ మాటకొస్తే గ్రెగ్ చాపెల్ ఉద్యోగాలు ఊడినట్టే." అవధూత్ ఆనందంగా అన్నాడు.

అవని మళ్ళీ చీపురు తీసుకుంది.
"ఏం? ఇంకెమయినా ఆలోచనలు రావాల్సిందా? మరిచిపొయావా? త్వరగా చీపురు తీసుకో. ఆలోచనలు అవే వచ్చేస్తాయి" అన్నాడు అవధూత్.
"అది కాదు. మరి వీళ్ళ క్రికెట్ మనం ఆడిపేడ్తున్నాము కదా? వాళ్ల కోక్‌లూ, పెప్సీలు కూడ మనమే తాగితే సరిపొదూ. వాళ్ళకు ఆ శ్రమ మాత్రం ఎందుకు? గంట సేపు ఎండలో నిల్చుకుంటె అలసిపోరూ మన వాళ్ళు. పాపం ఆ వెస్టిండీస్ ఎండలకు యువరాజ్, ధోనీ ఎంత కందిపొయారు? అసలె ఆ ధొనీ జుట్టుపోరిగాడు. తన చెమటంతా జుట్టులో ఇరుక్కుని, కాల్వలు పారుతూంటె పాపం సిక్సర్లు కొట్టలేదని తిడితె ఎలా కొడతాడు? అసలా జుట్టు వెనక నుంచి బంతి కనిపించాలా? కనిపించేసరికి ముఖం మీద తుడుచుకోవాలనిపిస్తుందా? పొనీ పాపం అసహ్యంగా ఉందని తుడుచుకుంటోంటె బొత్తిగా జాలి, దయ లేకుండా అవుట్ చేసేయడమొహటి. కనీస మానవత్వం ఉండదు ఈ ఫారెనర్లకు. అలాంటప్పుడు ఎండలో గెంతి పెప్సీ తాగడమెందుకు గానీ, మనమే ఆ పని కూడ చేసేద్దాం. "
"బ్రిలియంట్. అసలు నీకున్న మానవత్వం్‌లో సగమైనా ఆ శ్రిలంక వాళ్లకు, బంగ్లాదెశ్ వాళ్ళకు ఉంటె మనం సూపర్ 8 కి వెళ్ళిపోయేవాళ్ళం. "

అవని నిట్టూర్చింది. "ప్రపంచంలొ ఇంకా న్యాయం ధర్మం బతికివున్నాయనడానికి బెర్ముడాయె నిదర్షనం. అలాంటి పొట్టేళ్ళతొ ఢీకొన్నప్పుడు మన మేకపిల్లలు ఇంత గొప్పగా ఆడారంటే అదంతా వాళ్ళ ఔదార్యమే. వాళ్ళు వుత్తి వాళ్ళు కారు. దైవాంశ సంభూతులు.అందుకే నేను ఒక కఠోర నిర్ణయం తీసుకున్నాను." గంభీరంగా అంది అవని.
"ఎమిటా కఠోర నిర్ణయం?' కుతూహలంగా అడిగాడు అవధూత్
"ఇకనుంచి నువ్వ్వూ, నేనూ, మన మిత్రబృందమంతా రాత్రింబగళ్ళూ, ఇంటాబయటా, చిన్నా, పెద్దా, ఆడా, మగా అంతా బర్ముడాలే వేసుకొవాలి.ఇకనుంచీ భారత్ స్త్రీ దుస్తులు చీరెలు కాదు. పురుషుల దుస్తులు ధోవతులు కావు. బర్ముడాలు. మనం వాళ్ల పట్ల మన కృతజ్ఞత చూపంచుకోగల మార్గం అదొక్కటే."