రాతివనం - 4వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అనూష భయాలకు తగ్గట్టుగా అక్కడి వాతావరణం ఉండటం ఇంకాస్త అయిష్టతను పెంచుతుంది. ఆమె రూమ్మేటు, కల్పన, చదువు వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి హాస్టలు పైకెక్కుతుంది. అందుకు వచ్చిన ఆమె తండ్రి, ఆమెను సముదయించక తిట్టడంతో అక్కడే ఉంటానని ఒప్పుకుంటుంది కల్పన. మరోపక్క అనూష తండ్రి, రమణా రవు, తన కొడుకుకు ఎనిమిదో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఎంట్రన్సు కు కోచింగు ఇప్పించేందుక్కు సన్నాహాలు చేస్తుంటాడు. ఐ.ఐ.టి. ఎంట్రన్సు కి కోచింగ్ ఇచ్చే "రామయ్య"లో అడ్మిషనుకు ఎంట్రన్సు కు కోచింగు ఇచ్చే శాస్త్రి కోచింగు సెంటర్ లాంటి అంచెల వ్యవస్థ చూసి ఆశ్చర్యపోతాడు. "శాస్త్రి"లో ఎలాగో అప్లికేషను సంపాదిస్తాడు ఆయన. ఆ ఆనందంలో తమ కొడుకు భవిష్యత్తు ఊహించుకుంటూండగా అర్ధరాత్రి ఫోన్ మోగుతుంది.

సుర్యకుమార్ హిస్టరి లెక్చరర్. ప్రభుత్వ కళాశాలలో గత పాతికేళ్ళుగా పని చెస్తున్నాదు.

అతనికి హిస్టరి అంతే వల్లమాలిన ప్రేమా. ఒంగోల్లో వివార్ స్కుల్లో పదో తరగతి చదివి జిల్లాకే ఫస్ట్ వచ్చాడు. ఇంటర్ కోసం హిస్టరి, ఎకనామిక్స్, కామర్స్ గ్రూపుతో శర్మా కాలేజీకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇంటినుంచె కాకుండా బైటవాళ్ళ నుంచి కూడా నిరసనని ఎదుర్కున్నాడు.

'కాంపోసిట్ లెక్కలతో టెంత్ పాసై హెచ్.ఈ.సీ గ్రూపు తీస్కుంటునావేమిటి? ఆలోచించే చేస్తున్నావా? నీలాంటి తెలివిగలవాళ్ళు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రి గ్రూపు కదా తీసుకోవాలి" అన్నారు.

"మీ ఉద్దేశ్యంలో హిస్టరి లాంటి సబ్జెక్ట్ అత్తెసరు మార్కులతో పాసైనవాళ్ళే తీసుకుంటారనా? లెక్కలు, సైన్స్ గొప్ప సబ్జెక్ట్‌లే. కాదనను. కానీ హిస్టరీ కూడా గొప్ప సబ్జెక్టే. అసలు ఒక సబ్జెక్టు మంచిదని, మరోకటి కాదని, కొన్ని సబ్జెక్టులు చదివే వాళ్ళకే భవిష్యత్తు బావుంటుందనే వాదన సరైంది కాదు. హిస్టరీ చదివినా, ఎకనామిక్స్ చదివినా ఆ చదువులో రాణిస్తే తప్పకుందా భవిష్యత్తు ఉంతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఆసక్తి గురించి. నాకు హిస్టరి చదవదమంతే ఇష్టం" అని బలంగా చెప్పి, వత్తిడులకు ఒంగకుందా ఇంటర్‌లో తను కోరుకున్న గ్రూపులో చెరాడు. బియ్యే పాసైనాక, ఆంధ్ర యూనివర్సిటీలో యం.ఏ హిస్టరి చెసి గోల్డ్ మెడల్ సంపాయించాడు. వెంటనే లెక్చరరుగా ఉద్యోగం వచ్చింది.

హిస్టరి అంతే ఎంతిష్టమో, ఆ సబ్జెక్ట్ ని పిల్లలుకు బోధించదమన్న అంతే ఇష్టం అతనికి. తీయటి కల సాకారమైనట్లు... లెక్చరర్ ఉద్యోగం తనకోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్లు... తను ప్రేమించిన చరిత్ర పాఠాలని తను ప్రేమించె విద్యార్థులకు చెప్పటం ఎంత గోప్ప అనుభవం!

కాని గత ఐదారేళ్ళగా అతనిలో నిరాసక్తి... యువతరం ఎమైపోతోంది? ఎటువైపుకు వెళ్తోంది? విద్యా వ్యవస్థ ఎందుకిలా పతనం దిశగా పయనిస్తోంది లాంటి జవాబులు లెని కొన్ని వేల ప్రశ్నలు...

తను ఇంటర్మీడియెట్ చదివిన రోజుల్లో సైన్సు , లెక్కలు చదివేవాళ్ళు యాభైమంది ఉంటే హ్యుమానిటిస్ చదివేవాళ్ళు రెండొందలకు పైగా ఉండేవాళ్ళు. తను లెక్చరరుగా చెరిన కొత్తలో హిస్టరి క్లాసు అరవై డెబ్బై మంది విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు పాతికమంది ఉంటే గొప్ప. అదీ వాళ్ళని బతిమాలి బామాలి క్లాసుకు రప్పించుకోవాల్సిన దుస్థితి.

సామాజిక శాస్త్రాలకు చరిత్ర తల్లి లాంటిది. యావత్ మానవ సమాజపు ఉమ్మడి జ్ఞపాకాల సముదాయమే చరిత్ర. మానవ సమాజం ఎక్కడ, ఎలా ఆరంభమైందో.. ఒడిదుడుకులకు లొనవుతూ అభివౄద్ధి పథంలో ఎలా పయనిస్తూ వచ్చిందో తెల్సుకోకపొతే ప్రస్తుత మనుగడకు అర్థం ఉండదు. చరిత్ర అధ్యయనం మానవాళికి ప్రాణవాయువు. అటువంటి చరిత్రకు మన విద్యా విధానంలో చోటుండాల్సిన అవసరం లేదని, దాని వాల్ల ఉపయోగం లేదని రాష్ట్ర మంత్రులే మాట్లాడటం ఎంత శోచనీయం!

అందుకే, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాడానికి, వాళ్ళకు చరిత్ర మీద సరైన అవహగాహన కల్పించడానికి అతను రకరకాల ప్రణాలికలు రూపొందించి వాటిని అమలు పరిచే ప్రయత్నం చేస్తుంటాదు. అందులో భాగంగానే ఒకసారి 'చరిత్ర అంటె ఎమిటి?' అనే చర్చా కార్యాక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశాడు.

యుధ్ధాలు, రాజులు, రాణులు, వాళ్ళు పుట్టిన గిట్టిన తేదీలు... ఇదే చరిత్ర అనెలా పాఠ్య పుస్తకాలుంటె విద్యార్థులకు దాని ప్రాశస్త్యం ఎలా అర్థమవుతుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజి పేరుతో విద్యారంగాన్ని కంప్యూటర్ కోర్సులతో నింపేసిన ప్రభుత్వం.. తామర తంపరగా పుట్టుకొచ్చిన ప్రైవేటు విద్యాసంస్థల్లో హిస్టరీకి స్థానం లేకపోవడం... ప్రతి విద్యార్థి గమ్యం అమెరికా కావడం... డాలర్ల సంపాదన మీద మోజు... కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో చరిత్ర అధ్యయనం బలహీన పడటానికి అన్ని కారణలున్నాయి అని వక్తలు తేల్చెసారు.

విద్యని లాభసాటి వ్యాపారంగా మార్చిన కార్పోరెట్ కాలేజీలు ఎండాకాలం సెలవలు పూర్తికాక ముందే తెరిచారు. ప్రభుత్వ కాలేజీలు తెరవడానికి నెల టైం ఉంది. అందుకే రోటరి క్లబ్ వాల్ల సహకారంతో భారతీయ విద్యాభవన్లో డిబెట్ కాంపిటీషన్ ఏర్పాటు చెసాడు సూర్యకుమార్. పదో తరగతి పాసై ఇంటర్మీడియట్లో చేరబోతున్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. 'కాలెజిల్లో హిస్టరీ సబ్జెక్ట్ ఉండాలా అవసరం లేదా?' అనెది టాపిక్.

ఉదయం పదింటికే హాలు విద్యార్థుల్తో, వాళ్ళకు తోడొచ్చిన తల్లిదంద్రుల్తో నిండిపొతే సుర్యకుమార్ హృదయం ఆనందంతో నిండిపోయింది.

ఒక్కో విద్యార్థి స్టెజిమీది కెళ్ళి మాట్లాదుతుంటే అతను ఆశగా, ఆసక్తిగా విన్నాడు. అందరూ హిస్టరీ పనికి మాలిన సబ్జెక్ట్ అన్నవాళ్ళే.

'హిస్టరి చదివితే ఏమొస్తుంది? ఉపాధికి పనికిరాని చదువులు వౄధా. అదే ఏ కంప్యూటర్ కొర్సో, ఇంజనీరింగో, మెడిసినో చదివితే మంచి మంచి ఉద్యోగాలోస్తాయి. అమెరికాలాంటి విదేశాలకెళ్ళే అవకాశాం ఉంటుంది. బొలెడు డబ్బులు సంపాదించొచ్చు. జీవితం సుఖమయం చేసుకొవాలంటే హిస్టరి జొలికెళ్ళకూడదు ' అందో అమ్మాయి.

'అందం, ఆకర్షణ లేని హిస్టరి బుధ్ధి మాంద్యుల శరణాలయం. ఇప్పుడంతా వేగం. ఇది రాకెట్ యుగం. ఇది కంప్యూటర్ యుగం. కొన్ని వందల సంవత్సరాల నాడు ఏరాజు ఏ ఏ యుధ్ధాలు చేశాడో మనకెందుకు? అది తెల్సుకోవడం వల్ల ఎమిటి లాభం? గతం గతః మనిషి ఎప్పుడూ ప్రస్తుతంలోనే బతకాలి. మా తాతలు నెతులు తాగారు మా మూతులు వాసన చూడంది అన్న చందాన పూర్వకాలం నాటి బూజుపట్టిన సంగతులు నెమరువేసుకోవడం వల్ల మనము చెల్లని రాగి నాణాలైపొతాం.' అంతూ అనర్గళంగా ఓ కుర్రాడు మాట్లాడుతుంటె సభంతా చప్పట్లతో మార్మోగింది. కాని సూర్య కుమార్ మనసు బాధతో ముల్గింది.

" ఇప్పుడు బొడపాటి హనుమంతరావు స్కూలు విద్యర్థిని మధుమిత మాట్లాడుతుంది" అని అనౌన్స్ చేశారు. సూర్య కుమార్లో కుతూహలం.. ఇప్పటి వరకూ మాట్లాడిన వాళ్ళందరు కార్పొరెట్ స్కూల్లోనో, ఇంగ్లీషు పేరు పెట్టుకున్న ప్రైవెటు స్కుల్లోనో చదివిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో చదివి, డిబెటు కాంపిటీషన్ కొచ్చిన ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినాలన్న కుతూహలం...

"నిజానికి సాంకెతిక పరిజ్ఞానం, కంప్యూటర్లు జివితానికి సౌఖ్యం ఇవ్వవచ్చెమో కాని అర్థాన్ని కల్పించలేవు. మనిషి జీవితానికి అర్థము పరమార్థమూ మానవసంబంధాల్ని కాపాడుకొవటంలో, వాటిని మెరుగు పర్చుకొవడంలో ఉన్నాయి. వేలకు వేలు జీతాలు తెచ్చుకుంతున్న కంప్యూటర్ ఇంజనీర్ల జీవన సైలిని ఎప్పుడైనా గమనించారా? డబ్బుతో కొనగల అన్ని సుఖాల్ని, అన్ని వ్యసనాల్ని స్వంతం చేసుకుంటున్నారు. మానవత్వపు గుబాళింపులేని ఖరీదైన ప్లాస్టిక్ పువ్వులు వీళ్ళు.

చరిత్ర, సాహిత్యం చదవకుండా మానవత్వపు విలువలు తెలిసే అవకాశం లేదు. మంచితనం గురించి, మానవత్వపు విలువల గురించి తమ పిల్లలకు చెప్పేంత తీరిక నేటి తల్లిదండ్రులకు లేదు. అంతా డబ్బు సంపాదనలో బిజీ. డబ్బే సర్వస్వం. ఈ నాటి విద్యార్థులకు కవిత్రయమెవరో తేలీదు. సింధూ నాగరికత గురించి తెలీదు. వీళ్ళు కూడా కంప్యూటర్ యంత్రాలే... తేడా అల్లా కంప్యూటర్లకి డబ్బు సంపదిచాలన్న యావ ఉండదు.

నా ఉద్దెశ్యంలో సైన్స్, ఇంజనీరింగ్, మెడిసన్ చదివే విద్యార్థులకు కూడా చరిత్ర, సాహిత్యం కంపల్సరి సబ్జెక్టులు చేయాలి. మన దివంగత ప్రధాన మంత్రి పివి నర్సిమ్హారావుగారు ఇండియన్ కల్చర్ అండ్ హెరిటెజ్ అనే పాఠ్యాంశాన్ని సైన్స్ చదివే విద్యార్థుల పుస్తకాల్లో పొందు పర్చారు. మనం మరయంత్రాలుగా కాకుండా మనుషులుగా మనగలగాలంటే మన మూలాల్ని తెల్సుకొవాలి. అందుకు మన చరిత్రని అధ్యయనం చేయటం ఎంతైనా అవసరం" అంటూ ముగించిందా అమ్మాయి.

మధుమితకు మొదటి బహుమతి వచ్చింది. సభ ముగిశాక సూర్యకుమార్ ఆ అమ్మయని వెతుక్కుంతూ వెళ్ళి పలకరించాడు.

"చాల చక్కగా మాట్లాడావు తల్లి" అన్నాడు అభినందిస్తూ.

"థాంక్స్" అంది మధుమిత. ఆమె నవ్వు అద్భుతంగా ఉంది. స్వచ్ఛమైన సహజమైన నవ్వులన్ని అద్భుతంగానే ఉంటాయి.

సూర్యకుమార్ని ఓ అనుమానం బలంగా తొలుస్తుంది. ఈ అమ్మయి మాట్లాడిందంతా మనస్ఫూర్తిగానే మాట్లాదిందా లేక ప్రైజు గెలవాలనే సంకల్పంతో మాట్లాడిందా?

"నీకు నిజంగా హిస్టరి అంటే ఇష్టమా?" అని అదిగాదు.

"చాలా ఇష్టం. అదేగా నెను మాట్లాదింది? ఓ.. నేను కేవలం వాదన కోసం అలా మాట్లాదా అనుకుంటున్నరా? లేదు మా నాన్న గారు అలంటివి మాకు నెర్పలేదు"

"నువ్వు ఇంటర్లో హిస్టరి తీసుకుంటావ?"

"తప్పకుండా"

"మరి మీ ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పరా?"

"చెప్పరు. మా నాన్న గారు మా చదువుల్ని మా ఇస్టానికే వదిలేసారు. తమ ఇష్టాల్ని బలవంతంగా పిల్లల మీద రుద్దే తల్లిదండ్రులు మాకు లేకపొవటం మా అదృష్టం"

సుర్య కుమార్ కి చాలా సంతోషమనిపించింది. తను పెట్టిన కార్యక్రమం వృధా పోలెదనిపించింది.

"హిస్టరి తీసుకుని తర్వాత ఏం చేస్తావు?" ఆ అమ్మాయి గమ్యం ఎమిటో తెల్సుకుందామని అడిగాడు.

"యం. ఏ చెసాక సర్వీసెస్ కి ప్రిపేరవుతాను. ఐ.ఎ.యస్ కావాలనేది నా ఆశయం. చాలా మంది ఇంజనీరింగ్, మెడిసిన్ చదివి, సివిల్సికి మాత్రం ఆప్షనల్స్ కింద హిస్టరి, జాగ్రఫి, ఆంథ్రోపాలజి లాంటి సబ్జెక్టులు తీసుకుంటారు. దిగ్రీలు కూడా అవే సబ్జెక్టులతో చెయవచ్చు కదా. చేయరు. ఎందుకంటె వాళ్ళకు వాళ్ళ మీద నమ్మకం లెక. సివిల్స్ కి సెలక్ట్ కాకపొతే ఉద్యోగాల వెటలో తమ డిగ్రి పనికొస్తుందని ఇంజనీరింగ్ చదువుతారు. నాకలా లేదు. నేను తప్పకుండా ఐ.ఎ.యస్ అవుతాను"

ఆ ఆమ్మాయిలో తొణికిసలాడిన ఆత్మవిస్వాశానికి అతను ముచ్చట పడ్డాదు.

"డిబేట్‌లో అంత బాగా మాట్లాడావు. మీ స్కూల్లో తర్ఫీదా?"

"లెదు అంతా మా నాన్న గారి ప్రోత్సాహం. శిక్షణ... చదువంటే ర్యాంకులు కాదని, బహుముఖ ప్రజ్ఞల్లో ప్రావీణ్యం సంపయించడమేనని మానాన్న గారు చిన్నప్పటి నుండి మాకు నూరి పోసారు"

" ఆయన ఎం చేస్తుంటారు"

"మా నాన్న గారి పేరు హరిక్రిష్ణ, అంధ్రజ్యోతి డయిలి జర్నలిస్ట్"

"చాలా సంతోషం తల్లి. నీలాంటి కుతురుండటం ఎంత అదృష్టమో, నీకు మీ నాన్నలంటి వ్యక్తి ఉండటం కూడా అంతె అదృష్టం. నాకు మరో విషయంలో కూడా చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇందాకటి నుండి గమనిస్తున్నాను. అందరు దాడి, మమ్మి అని పిలుస్తున్న నేటి రొజుల్లో కూడా నువ్వు చక్కగా నాన్నగారు అనటం వినడానికి చాల బావుంది"

"మన తెలుగు భాషని మనమే కాపాడుకోకపోతే ఎలా. నాకు ఇంగ్లీష్ బాగ వచ్చు. కాని తెలుగు భాష అర్ధం కాని వ్యక్తితో మాట్లాడెటప్పుడు తప్ప నేను ఇంగ్లీషు మాట్లాడను. నాకు నా మాతృభాష మీద చాల ప్రేమ. మా అమ్మంటే ఎంతిష్టమో తెలుగన్న అంతే ఇష్టం" అందా అమ్మాయి.

"నీకు హిస్టరి పాఠాలు నేనే చెప్పాలని ఉందమ్మ. నా కొరిక తీరుతుందో లేదో" అన్నాడు సూర్య కుమర్

మధుమిత నవ్వి వీడ్కోలు తీసుకుంది. ఆమెకు మొదటి బహుమతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తనకెప్పుడూ పొటీగా ఉండే అనూష ఉండి ఉంటె ఎలా ఉండేదొ? ఆ అమ్మయికి అనూష గుర్తొచ్చి బాధనిపించింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా చదివే పిల్లల మీద ఎంత వత్తిడి ఉంటుందో.. నిజంగానే తను అదృష్టవంతురాలు. తను ఎం చదవాలనుకున్నా చదివించే నాన్న. తన ఇష్టాలకు అడ్డు చెప్పని అమ్మ.. భగవంతుదా! అందరు పిల్లలుకు నాకున్న తల్లి దండ్రుల్లాంటి మంచి తల్లిదండ్రుల్ని ప్రసాదించు అని కోరుకుంది.

ఇంటికెళ్ళేప్పటికే వాళ్ళ నాన్న ఇంట్లొనే ఉన్నాడు.

"నాన్న గారు... నాకు డిబెట్‌లో ఫస్ట్ ప్రైజ్" అంది సంతోషంగా తన కొచ్చిన బహుమతిని చూపిస్తు.

"విజయాలకి పొంగిపోవటం -- అపజయాలకు కుంగి పోవటం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలిరా. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవాలి. అది సాధన వల్లనే సాధ్య పడుతుంది. నీకు ప్రైజ్ వచ్చినందుకు నాకు సంతోషం లేదనుకునేవు. చాల వుంది. కానీ నువ్వు వైఫల్యాల్ని కూడా ఇంత సంతోషంగా చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా" అన్నాడు.

"తప్పకుండా ప్రయత్నిస్తాను నాన్న గారు" అంది మధుమిత. ఆమెకు వాళ్ళ నాన్న ఆంతర్యం తెలుసు. ఒక లక్ష్యం దిశగా పరిగెట్టుతున్నప్పుడు పడిపోవటం సహజం. పడిన ప్రతిసారి అధికోత్సాహంతో లేచి పరుగెత్తే వాడే విజేత అని వాళ్ళ నాన్న చాల సార్లు చెప్పటం గుర్తొచ్చింది.

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.