పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

>

ఆధారాలు :

నిలువు:

1. నవ్వుతో ఉన్న చరిత్ర (4)
2. తలకట్టులేని పువ్వు (2)
3. క్షేమంగ వెళ్ళి లాభంతో రానాయనా (2)
4. పెండ్లి కుమార్తె "......", పెండ్లికొడుకు తాళి కట్టెను (6)
5. ఆంధ్ర కవితాపితామహుడి ప్రసిధ్ధ ప్రబంధం (6)
6. పింగళివారి రెండర్ధాల కావ్యం. (8)
7. ఊడ (2)
8. తెలుగులో మొట్టమొదట జ్ఞాన పీఠం బహుమతి పొందిన రచన (10)
12. ఒక క్రమంగా లేక పధ్ధతిగా (4)
13. కోమలమైన గొంతు (6)
17. కొమ్ముతగ్గిన "సంగతి" (4)
21. వధ (2)

అడ్డం:

1. అల్పము,లేక గోరంత (4)
5. ఇది ఒక గౌరవ సంబోధన; ఉత్తరాలు వ్రాసేటప్పుడు (5)
9. ఈ "జలచరమును" బంధించుట అంత సులభము కాదు (6)
10. కొమ్ములేని కుండ (3)
11. కంగాళీగా ఉన్న వెధవ (3)
12. అష్ట దిగ్గజ కవులలో ఒకరైన భట్టుమూర్తి కావ్యం (5)
14 ఇబ్బందిగా (4)
15. చూపు, లేక దృష్టి (3)
16. అక్షరలోపం వల్ల సమానం అనిపించటంలేదు (2)
18. పూతా, పిందె, పండు...... మధ్య స్థితి (2)
19. ప్రౌఢకవి సింగారించిన మహాకావ్యం (6)
20. అవకతవక మంచం (3)
22. వికటకవిగారి కలం నుండి జాలువారిన భక్తి కథా విశేషం (8)

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
ఏప్రియల్ 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత మాసపు పదవిన్యాసం సమాధానాలు:

సరిగా పూరించిన వారు:
1. నిరంజన్ ఇందూర్, జెర్మన్ టౌన్, మేరిలాండ్
2. శ్రీ లక్ష్మి పోలంరెడ్డి, పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియా

ఈమాటు సరిగా వ్రాసిన వారు ఇద్దరే ఉండటం వల్ల మూడవ బహుమతి ఎవరికీ పంపటం లేదు.. విజేతలకు పుస్తకాలు పంపిస్తాము.