కొత్త కెరటం : శాంతియుత ప్రపంచం

--తాటిపాముల శ్రీదత్త కౌస్తుభ్

సుజనరంజని ఆశయాల్లో యువతలో పఠన, రచన ఆసక్తులను పెంపొందించడం; తెలుగు భాషను వారి భావధారలోకి తీసుకువెళ్ళటము ముఖ్యమైనవి. సిలికానాంధ్ర చేపట్టే అనేక భాష - సంస్కృతి సంబంధించిన కార్యక్రమాలతో పిల్లలు, యువకులు విశేషంగా ఆకర్షింపబడటం ఎంతో ఉత్సాహం కలిగిస్తోంది. ఆ ప్రేరణతో యువకులలో తెలుగులో వ్రాసే నేర్పు పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ శీర్హిక ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నాము. మనకు తెలిసిన వివిధ అంశాలను సరికొత్త కోణంలో చూపించగల నేర్పు యువత సొంతం. అందుకు పట్టం కట్టే ప్రయత్నమిది. పిల్లలను యువయను, వారి భావాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

ఈ ప్రపంచం ప్రతీ ఒక్కరిది. మన కులమత సాంప్రదాయాలు వేరైనా అందరం కలిసి ఉంటేనే సుఖపడతాము. మానవజాతి అభివృద్ధికి మనమంతా కలిసి కృషి చేయవలసింది.

ఐకమత్యం లేకుండా ప్రశాంతంగా ఉండలేము. ఒకరు తెల్లవారని, ఇంకొకరు నల్లవారని, కొదరు అల్లాను ప్రార్థిస్తారని, కొందరు క్రీస్తుకు శిష్యులని ఇలా మనలో మనము ద్వేషాలు, భేదాలు సృష్టించుకోకూడదు. మంచి మనసుతో మనమందరం ఒకటనుకోవాలి. ఇలా కావాలంటే మన భయాలను వదిలిపెట్టుకొని అందరిని సమానంగా చూడాలి. ఒకరి మీద ఒకరు ప్రేమతో, గౌరవంతో కలసి 'మన ప్రపంచ శాంతీ అనే ఆశయానికి కృషి చేయాలి.

ప్రతీ మనిషిలో అత్యాశ, హింస ఉంటుంది. వీటి వలన ప్రపంచ యుద్ధాలు, టెర్రరిజం జరుగుతున్నాయి. కాని తోటివారిని ఎలా హింస పరచాలి అని కాకుండా ఎలా బాగుపరచాలి అని ఆలోచిస్తే మన ఆశయానికి దగ్గరైనట్టే.

ఇవన్నీ ప్రయత్నం లేకుండా చేయ్యలేము. ప్రతీ వ్యక్తి తనవంతు ప్రయత్నం తాను చేస్తే మన ప్రపంచం ఎంతో బాగుపడుతుంది. గాంధిగారు అన్నట్టు - 'You must be the change that you want to see" కాబట్టి వేరొకరు మారాలని అనుకోకుండా మనమే మారాలి. మన ప్రేమతో మన ప్రపంచాన్ని మార్చవచ్చు.

ఇది చెయ్యటం అంత కష్టమైన పని కాదు. ప్రతీరోజు కలిసే వారితో దయగా ఉండటం మొదలు పెట్టావచ్చు. కనీసం చిరునవ్వుతో పలకరించిన వాళ్ళకు చిన్న సహాయం చేసిన వాళ్ళమౌతాము. గురువు దలైలామా - "Love and compassion are necessities, not luxuries'. ప్రేమ అందరికి సమానమే.

ఒక్కొక్కసారి సంబంధాలు మంచిగా ఉండకపోవచ్చు. మనకు బాధ కలిగించిన వారిని క్షమించాలి. ఎదురు తిరగకూడదు. ఇలా క్షమిస్తుంటే మనము అందరికి ఆదర్శం అవుతాము. మనస్పూర్తిగా మన సంఘంలో ప్రేమ, శాంతి ఉంటాయి.

మనము ఎంతో మంది కన్నా సుఖంగా బతుకుతున్నాము. కాని పేద ప్రజలు ఎందరో ఉన్నారు. వారిని పట్టించుకోకపోవడం మనకు అలవాటై పోయిండి. దీని వలన వాళ్ళ కష్టాలు తీరవు. అవసరంలో ఉన్న వారికి సహాయం చెయ్యడం, చేయూతనివ్వాడం మన ధరమం.

ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే మన వంతు పని మనం చేయాలి. ప్రపంచ శాంతి మాత్రమే మన జాతి అభివృద్ధికి మార్గము. ఈ శాంతి సూత్రాలను రోజూ పాటిస్తే అందరికి మంచి జరుగుతుంది.

తాటిపాముల మృత్యుంజయుడు, జయమాల కుమారుడైన శ్రీదత్త మిలిపీటస్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. తెలుగు మాట్లాడటం, చదవటం, రాయడం వచ్చిన శ్రీదత్త సిలికానాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ముందు ముందు "Telugu Wikipedia" లో రాయాలని కోరిక. ఇటీవల వేదవాణి పత్రిక నిర్వహించిన వ్యాస రచన పోటీలో శ్రీ దత్త వ్యాసం "Peace and Prosperity" కు బహుమతి లభించింది.