 |
|
|
కథా భారతి |
|
|
ది
డైరీ
ఆఫ్
డాక్టర్
వనమాలి.
(నవల)..
4 |
|
రచన:
కొండగుంట వెంకటేశ్. |
|
వనమాలి తన చాంబర్స్ లో కూర్చుని ఆ రోజు
పేపరు చదువుతున్నాడు. అందులో మొదటి పేజిలో
కాలాబజార్ గురించి ప్రముఖంగా రాశారు.
సిటిలో కాలాబజార్ ఒక పెద్ద బజినెస్ సెంటర్.
అక్కడ అన్ని రకాల దొంగవ్యాపారాలు జరగుతాయి.
గుండు సూది నుంచి పాటన్ టాంకు వరకు అక్కడ
తేలికిగా దొరుకుతాయి. డబ్బు ఉండాలే కాని
కాలాబజార్ లో దొరగని వస్తువంటు లేదు.
అలాంటి కాలాబజార్ లో నిన్న రాత్రి
అకస్మాతుగా రెయిడ్ జరిగింది. యస్.పి
అధ్వర్యంలో ఈ రెయిడ్ జరిగింది. దాదాపు
అయిదుకొట్ల రూపాయల దొంగసరుకు దొరికింది.
వాటిలో ముఖ్యంగా తుపాకులు సబ్ మెషిన్ గన్స్
ఇంకా కొన్ని మారణాయుధాలు ఉన్నాయి.
నిజానికి కాలాబజార్ లో ఇలాంటి వ్యాపారం
జరుగుతుందని పోలీస్ డిపార్ట్ మెంట్ కు
తెలుసు. అయినా వాళ్ళు కొంచం కూడా చర్య
తీసుకోలేదు. దానికి కారణం కాలాబజార్ నుంచి
ప్రతి నెల అయిదు లక్షల రుపాయలు పోలీస్
డిపార్ట్ మెంట్ కు అందుతుంది. అందుకే
అక్కడ ఎలాంటి వ్యాపారం జరుగుతున్న
పట్టించుకోకుండ ఊరుకుంటున్నారు. ఈ విషయం
మాములు జనానికి తెలియకూడదని అప్పుడప్పుడు
ఇలా ఒకటి రెండు రెయిడ్ లు చేస్తూ తమ
డిపార్ట్ మెంట్ సమర్ధవంతంగా పని చేస్తుందని
పరోక్షంగా తెలియచేస్తున్నారు.
ఆ విషయం పూర్తిగా చదివిన వనమాలి ఒక్క క్షణం
ఆలోచనలో పడ్డాడు. తరువాత ఏదో
నిర్ణయించుకున్నట్టు తలపంకించి పేపరు మడిచి
పక్కన పెట్టాడు. అప్పుడే నర్స్ మేరి వచ్చి
డాక్ఠర్ మీతో మాట్లాడాలని ఒక అమ్మాయి
వచ్చింది. బహుశా జర్నలిస్ట్ లా ఉంది
పంపించమంటారా అని అడిగింది.
మాములుగా అయితే జర్నలిస్ట్ లను పత్రిక
రిపోర్ట్ లను ఆమడదూరంలో పెడతాడు వనమాలి.
కాని ఆ రోజు వనమాలి మూడ్ చాల బాగుంది.
దానికి కారణం నాయక్ డేవిడ్ ఆచూకి చెప్పటం.
ఎంతో కాలం నుంచి పోలీసులు వెతుకుతున్న జాన్
డేవిడ్ ఇప్పుడు ఎక్కడున్నాడో చూచాయిగా
తెలిసింది. అది అతని సంతోషానికి కారణం.
అందుకే వెంటనే పంపించమని మేరితో చెప్పాడు.
క్షణం తరువాత ఆ అమ్మాయి వచ్చి అతనికి
ఎదురుగా కూర్చుంది.
ఆమెకు ఇరవై సంవత్సరాలు ఉంటాయి. కాని ఇంకా
లేతగా కనిపిస్తుంది. సన్నగా నాజుకుగా బాపు
బొమ్మలా ఉంది. ఎవరైన చప్పున చూస్తే ఇలాంటి
చెల్లెలు తనకుంటే ఎంతో బాగుంటుందని
అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె కళ్ళలో అదో
రకమైన మెరుపు కనిపిస్తుంది. జీవితంలో ఏదో
సాధించాలనే తపన గొప్ప లక్ష్యం ఉన్న వాళ్ళకు
మాత్రమే కళ్ళలో అలాంటి మెరుపు కనిపిస్తుంది.
దాదాపు పది సంవత్సరాలకుముందు వనమాలి కళ్ళలో
కూడా అలాంటి మెరుపు కనిపించింది.
మాములు ఫార్మాలిటిస్ పూర్తయిన తరువాత
ఇప్పుడు చెప్పండి. ఎవరు మీరు. నావల్ల మీకేం
సహయం కావాలి అని అడిగాడు.
నాపేరు జాహ్నవి. అన్వేషణ పత్రిక రిపోర్టర్
ను. మీ ఇంటర్ వ్యూ కోసం వచ్చాను. ఆ విషయం
మాట్లాడేముందు నాదొక చిన్న రిక్వేస్ట్.
నేను మీకంటే చాల చిన్నదాన్ని. మీరు
అనకండి, నువ్వు అనండి అప్పడే నాకు
కంఫర్టబుల్ గా ఉంటుంది అంది జాహ్వవి
నవ్వి.
సరే అలాగే కాని ఇంతకి నువ్వెందుకువచ్చావో
చెప్పలేదు. అన్నాడు వనమాలి.
మీ ఇంటర్ వ్యూకోసం.
నా గురించి నీకు తెలిసినట్టులేదు. నేను
ఇంతవరకు ఎవరికి ఏ పత్రికకు ఇంటర్ వ్యూ
ఇవ్వలేదు. అసలు ఇంటర్ వ్యూ ఇవ్వటం అంటే నే
గిట్టదు. అందుకే నా గురించి ఇంతవరకు ఏ
పత్రికలలో రాలేదు. అన్నాడు వనమాలి.
ఏమో డాక్టర్ ఆ విషయం నాకు తెలియదు. నిన్న
మీటింగ్ జరిగినప్పుడు మా పత్రిక యాజమాన్యం
ఎవరైన గొప్ప వ్యక్తిని ఇంటర్ వ్యూ చేస్తే
పత్రిక ప్రతిష్ట పెరుగుతుందని చెప్పారు.
అందరిలోకి మీ పేరు ప్రముఖంగా కనిపించింది.
అందుకే మీ దగ్గరికి వచ్చాను. వచ్చే ముందు
మీ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాను.
మీరు కష్టపడి ఈ స్ధితికి వచ్చారని పది
సంవత్సరాలకు ముందు మీ భార్య కూతురిని ఎవరో
దారుణంగా హత్య.. అప్పుటి నుంచి మీరు మరో
పెళ్ళి చేసుకోకుండ ఒంటరిగా ఉంటున్నారని
తెలుసుకున్నాను. ప్లాస్టిక్ సర్జరిలో మీరు
సాధించిన విజయాలు అపూర్వమైనవి
అద్భుతమైనవి. మిమ్మల్లి ఇంటర్ వ్యూ
చెయ్యటానికి ఇంతకంటే కారణాలు ఇంకేం
కావాలి. అందుకే వచ్చాను. మా యాజమాన్యం
కూడా నా ప్రపోజల్ కి ఒప్పుకున్నారు. అంది
జాహ్నవి ఉత్సాహంగా.
వనమాలి నవ్వి అన్నాడు.
నా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నావు.
కాని అసలు విషయం తెలుసుకోలేదు. నా ఇంటర్
వ్యూ కోసం ఇంతకు ముందు ఎన్నో పత్రికలు
ప్రయత్నించాయి. కాని నేను ఇవ్వలేదు. నాకు
ఇంటర్ వ్యూ లు అంటే ఇష్టంలేదని కరాకండిగా
చెప్పాను. అయిన వాళ్ళు వినిపించుకోలేదు.
పట్టువదలని విక్రమార్కుడిలా నా ఇంటర్ వ్యూ
కోసం ప్రయత్నిస్తునే ఉన్నారు. దాదాపు
నాలుగు నెలలు నా చుట్టు తిరిగారు. చివరికి
నేను లొంగనని తెలిసి వెళ్ళిపోయారు. ఆ రోజు
నుంచి ఏ పత్రిక మళ్ళి నా ఇంటర్ వ్యూ కోసం
ప్రయత్నించలేదు.
ఈ విషయం దాదాపు అన్ని పత్రికలకు ముఖ్యంగా
రిపోర్టర్ లకు బాగా తెలుసు. అందుకే తెలిసి
తెలసి ఎవరు నా దగ్గరికి రారు. చాల
సంవత్సరాల తరువాత నువ్వు వచ్చావు. బహుశా ఈ
వృత్తికి కొత్త కనుక అసలు విషయం నీకు
తెలియదు.
అందుకే చెప్పుతున్నాను. తిరిగి వెళ్ళిపో.
అనవసరంగా నా వెనుక తిరిగి నీ సమయం వృధా
చేసుకోకు. వృద్ధిలోకి రావలసిన దానవి. నాకు
బదులుగా వేరే ఎవరి ఇంటర్ వ్యూ తీసకుంటే
నీకు లాభం మీ పత్రికకు లాభం. కావాలంటే ఏ
సినిమా స్టార్ నో లేకపోతే క్రికెట్
ఆటగాడినో ఇంటర్ వ్యూ చెయ్యి. నీకు మంచి
పేరు వస్తుంది. మీ పత్రిక అమ్మకాలు కూడా
పెరుగుతాయి.
మీ సలహాకు చాల ద్యాంక్స్. నా నిర్ణయం
మాత్రం మారదు. మీ ఇంటర్ వ్యూ
సంపాదిస్తానని మా ఛీప్ ఎడిటర్ ముందు
చాలేంజ్ చేశాను. ఇంతవరకు ఏ విషయంలోను నేను
ఓడిపోలేదు. చదువులో ముందునుంచి మెరిట్ లో
పాసవుతూ వచ్చాను. మాస్ కమ్యునికేషన్ అండ్
జర్నలిజంలో ఫస్ట్ ర్యాంకు సంపాదించాను.
చదువు పూర్తయిన వెంటనే అన్వేషణ పత్రికలో
కాల్ లెటర్ వచ్చింది. ఆ ఇంటర్ వ్యూకు
దాదాపు వంద మంది అభ్యర్దులు వచ్చారు.
పత్రిక యాజమాన్యం నన్నే సెలక్ట్ చేసింది.
ఇది నా ఫస్ట్ ఎసైన్ మెంట్. నా భవిష్యత్తు
దీని మీద ఆధారపడిఉంది. అందుకే ఎలాగైన మీ
ఇంటర్ వ్యూ సంపాదించి నా ఉద్యోగం
నిలబెట్టుకోవాలి. ఇంత జరిగిన తరువాత మాటలు
అనవసరం. ఇప్పుడు సమయం పదకొండుగంటలు. నలబై
ఎనిమది గంటలలోగా అంటే ఎల్లుండి ఇదే టైం
లోపల మీ ఇంటర్ వ్యూ సంపాదిస్తాను. మీ
నోటితో మీరు స్వయంగా ఇంటర్ వ్యూ ఇస్తానని
చెప్పేలా చేస్తాను. ఇది నా చాలెంజ్.
ధైర్యం ఉంటే ఒప్పుకోండి అంది జాహ్వవి.
ఆత్మవిశ్వాసంతో ఆమె కళ్ళు ఎర్రాగా
జ్వలిస్తున్నాయి.
వనమాలి ఒక్క క్షణంపాటు ఆమె వైపు తేరిపార
చూశాడు. తరువాత అన్నాడు.
ఇంతవరకు వచ్చినతరువాత నేను మాత్రం ఎందుకు
వెనక్కి తగ్గుతాను. నీ చాలెంజ్ ను
అంగీకరిస్తున్నాను. పందేం ప్రకారం నువ్వు
గెలిస్తే నేనే నిన్ను పిలిచి ఇంటర్ వ్యూ
ఇస్తాను. ఒక వేళ నువ్వు ఓడిపోతే ఎం
చేస్తావు. ఇంటర్ వ్యూ కావాలని నా వెంటపడటం
మానేస్తావా.
లేదు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను.
ఇంకేప్పుడు కలం పట్టను. జర్నలిజం గురించి
పూర్తిగా మరిచిపోతాను అంది జాహ్నవి
దృఢంగా.
వనమాలి మెచ్చుకోలుగా ఆమె వంక చూశాడు.
అతనికి ఎందుకో తెలియదు కాని ఆమెను
చూస్తుంటే చాల ముచ్చట వేస్తుంది. తనకి
ఆమెకు ఏదో దగ్గర సంబంధం ఉన్నటు అనుభూతి
కలుగుతుంది. ఆమె స్ధానంలో ఇంకేవరైన ఉంటే
తగిన రిటార్ట్ ఇచ్చేవాడు. కాని ఆమెను
చూస్తుంటే అతనికి కోపం రావటంలేదు.
అడ్మిరేషన్ కలుగుతుంది. అందుకే ఆమె
ప్రపోజల్ కు సంతోషంగా ఒప్పుకున్నాడు.
జాహ్నవి వెళ్ళిపోయిన తరువాత విశ్రాంతిగా
వెనక్కి వాలాడు. అతనికి ఈపందెం ఎందుకో
తెలియదు కాని చాల సరదాగా ఉంది. చాల
సంవత్సరాల నుంచి వృత్తికి పూర్తిగా
అంకితమై ఒక మొనోటనస్ జీవితాన్ని
గడుపుతున్నాడు. అందులోంచి బయట పడటానికి
ఎంతో ప్రయత్నించాడు కాని వీలు కాలేదు.
ఇప్పుడు అనుకోకుండ ఈ అవకాశం దొరికింది.
దీన్ని ఒక ఆటవిడుపుగానే భావించాడు వనమాలి.
అందుకే సీరియస్ గా తీసుకోలేదు.
సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు హాస్పటల్
నుంచి బయలు దేరాడు. ఇంటికి వెళ్ళకుండా
తిన్నగా కాలాబజార్ కు వెళ్ళాడు. కారు
పార్కింగ్ స్పేస్ లో పార్క్ చేసి లోపలకి
వెళ్ళాడు. లోపల విపరీతంగా జనం ఉన్నారు.
కాలాబజార్ లో మాములు నిత్యావసర వస్తుపులు
కూడా అమ్ముతారు. వనమాలి వరుసగా షాపులు
చూసుకుంటు ఒక షాపు ముందు ఆగాడు. కౌంటర్
దగ్గరు కూర్చున్న వ్యకి ఏంకావాలని వనమాలి
వైపు చూశాడు.
నాకో తుపాకి కావాలి అన్నాడు వనమాలి
మెల్లగా.
కొట్టువాడు అనుమానంగా చూశాడు. తరువాత
చిన్నగా నవ్వి అన్నాడు
ఇక్కడ తుపాకులు అమ్ముతారని మీకెవరు
చెప్పారు.
ఎవరు చెప్పలేదు. నేనే తెలుసుకున్నాను. ఈ
రోజు పేపర్ లో ఈ బజార్ గురించి రాశారు.
అప్పుడే ఇక్కడ తుపాకులు కూడా దొరుకుతాయని
తెలిసింది అన్నాడు వనమాలి.
వ్యాపారం గురించి మాట్లాడేముందు నా
ప్రశ్నలకు జవాబు చెప్పండి. అంతా నిజమే
చెప్పాలి. అబద్ధం చెపితే మీకే ప్రమాధం
హచ్చరిస్తున్నట్టుగా అన్నాడు కొట్టువాడు.
ఏం కావాలో అడుగు. నిజమే చెప్తాను.
ఎవరుమీరు. ఏం చేస్తుంటారు.
నేను డాక్టర్ ని . మల్హోత్ర హాస్పటల్ లో
పనిచేస్తున్నాను. కావాలంటే నా ఐడింటి చూడు
అంటు తన ఐడింటికార్డు మిగత కాగితాలు
చూపించాడు. కొట్టువాడు వాటిని చూసి
తృప్తిగా తలపంకించి లోపలకు వెళ్ళాడు. వాడు
ఎందుకు వెళ్ళాడో వనమాలికి అర్ధమైంది. తన
ఐడింటి నిజమైనదో కాదో తెలుసుకోవటానికి
వెళ్ళాడు. కొట్టువాడి రాకకోసం చూస్తునే
తనకు తెలిసిన వాళ్ళు ఎవరైన కనిపిస్తారా
అనుకుంటు చుట్టు చూస్తున్నాడు వనమాలి.
అదృష్టవశతు అతని పరిచయస్తులు ఎవరు
కనిపించలేదు.
రెండు నిమిషాలుతరువాత కొట్టువాడు
తిరిగివచ్చాడు. అతని మొహంలో తృప్తి
కనిపించింది. ఐడింటి కార్డ్ తిరిగి ఇస్తూ
అన్నాడు.
అన్ని సరిగ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం
వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. మీకు
ఎలాంటి తుపాకి కావాలి. ఎలాంటి మోడల్
కావాలి. మా దగ్గర అన్న రకాల తుపాకులు
అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి.
మీకేలాంటిది కావాలో చెప్పండి. ఒక వేళ
మీరడిగిన రకం మా దగ్గర లేకపోతే తెప్పించి
ఇస్తాం.
నాకు తుపాకులు గురించి అంతగా తెలియదు.
కాని ఎలాంటిది కావాలో మాత్రం ఖచ్చితంగా
చెప్పగలను. నాకు కావల్సింది చేతిలో
ఇమిడిపోయేలా ఉండాలి. అంటే చాల చిన్న
తుపాకి అన్నమాట. అలాంటిది మీ దగ్గర ఉందా.
ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే వస్తాను” అంటు
కొట్టువాడు లోపలికి వెళ్ళి ఒక బుట్ట నిండా
తుపాకులు తీసుకొచ్చి వనమాలి
ముందుపెట్టాడు. అందులో రకరకాల తుపాకులు
వివిధ సైజులో ఉన్నాయి. వాటిలోంచి ఒక చిన్న
తుపాకిని సెలక్ట్ చేసుకుని దాన్ని
కొట్టువాడికి చూపించాడు.
అలాంటిది మా దగ్గర స్టాక్ లేదు. కావాలంటే
తెప్పించి ఇస్తాను. ముప్పై వేలు అవుతుంది.
డబ్బు మొత్తం ఇప్పుడే అడ్వాన్స్ గా
ఇవ్వాలి. దాంతో పాటు మీ అడ్రస్సు ఫోన్
నెంబర్ ఒక చిన్న కాగితం మీద రాసి ఇవ్వండి.
సరిగ్గా వారం రోజుల తరువాత మీకు డెలివరి
చేస్తాం అన్నాడు కొట్టువాడు.
వనమాలి ఏం మాట్లాడకుండ డబ్బు ఇచ్చాడు.
తరువాత ఒక చిన్న కాగితం మీద తన అడ్రస్సు
రాసి ఇచ్చాడు. ఈ తతంగం అంతా
పూర్తిచేసుకుని వనమాలి బయటకు వచ్చాడు.
కారు స్టార్ట్ చేస్తూ ఒక్క క్షణం పాటు తను
చేస్తుంది తప్పా రైటా అని బేరీజు
వేసుకున్నాడు. నిజానికి ఒక డాక్టర్ గా
అతను ప్రాణాలు పోయాలి కాని తీయ్యకూడదు. ఆ
అధికారం అతనికి లేదు. ఆ నియమం వేరే వాళ్ళ
విషయంలో వర్తిస్తుంది కాని డేవిడ్ విషయంలో
కాదు. వాడు రాక్షసుడు. తన జీవితాన్ని
నాశనం చెయ్యటం కాకుండ రోసి జీవితాన్ని
కుక్కలు చింపిన విస్తరి చేశాడు. ఇవి
అతనికి తెలిసిన నేరాలు. అతనికి తెలియకుండ
ఇంకా ఎన్ని భయంకరమైన నేరాలు చేశాడో
తెలియదు. అలాంటి ముష్కరుడు నేరం ప్రవృత్తి
ఉన్న వాడు సభ్య సమాజంలో ఉండటానికి అర్హత
లేదు. పోలీసులు ఎలాగు అతన్ని పట్టుకోలేరు.
ఇంకా అతడిని ఇలాగే స్వేచ్ఛగా తిరగనిస్తే
ఇంకా ఎలాంటి ఘోరాలు చేస్తాడో ఊహించటానికే
భయంకరంగా ఉంది. అందుకే అతడిని చంపటానికే
నిశ్చయించుకున్నాడు వనమాలి.
ఈ నిర్ణయానికి రాగానే వనమాలి మనస్సుకి
శాంతి కలిగింది. అతను ఇంటికి
చేరుకునేసరికి బాగా చీకటి పడింది. చలికాలం
కావటం వల్ల చాల తొందరగా చీకటి పడిపోయింది.
కారు పోర్టికోలో పార్కు చేస్తూ యధాలాపంగా
ముందుకు చూశాడు వనమాలి. అతని ఇంటి ఎదురుగా
ట్రాన్స్ ఫార్మర్ ఉంది. దాని దగ్గర ఒక
ఆకారం కనిపించింది. చీకటిగా ఉండటం వల్ల ఆ
ఆకారం ఆడో మగో తెలియటం లేదు. క్యాజువల్ గా
చూసి వనమాలి లోపలికి వెళ్ళాడు.
హాలులో కూర్చుంది రోసి. టీవిలో ఏదో
ప్రోగ్రాం చూస్తుంది.
అక్కావెంటనే బయలుదేరు అన్నాడు తెగ
హడావిడిపడిపోతూ.
ఉన్నఫళంగా రమ్మంటున్నావు. ఎక్కడికి
ఆశ్చర్యంగా అడిగింది రోసి.
లిబర్టి లో మంచి పాత ఇంగ్లీష్ సినిమా
వచ్చింది. చాల రోజులనుంచి ఆ సినిమా
చూడాలని అనుకుంటున్నాను. కాని టైం
లేకపోవటం వీలుకావటంలేదు. ఈ రోజు ఆఖరి
రోజు. ఈ రోజు వెళ్ళకపోతే మళ్ళి ఆ సినిమా
చూసే అవకాశం దొరకదు. నేను అయిదు నిమిషాలలో
తయారయి వస్తాను. ఈలోగా నువ్వు రెడిగా ఉండు
అని చెప్పి లోపలికి వెళ్ళాడు.
వనమాలి తిరిగి వచ్చేసరికి రోసి కూడా
సిద్దంగా ఉంది. ఇద్దరు వెళ్ళి కారులో
కూర్చున్నారు. వనమాలి కారు స్టార్ట్
చేస్తూ తిరిగి ట్రాన్స్ ఫార్మర్ వైపు
చూశాడు. ఆ ఆకారం అలాగే నిలబడి ఉంది.
వనమాలికి ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా
కలిగింది. అయిన తనకెందుకులే అనుకుని కారు
స్టార్ట్ చేశాడు.
వాళ్ళు హాలు దగ్గరికి చేరుకునేసరికి
సినిమా మొదలుపెట్టేశారు. పాత సినిమా కావటం
వల్ల జనం చాల పలచగా ఉన్నారు. సినిమా
పూర్తయేసరికి పదిన్నర అయింది. అప్పుడే
వాతావరణంలో అనుహ్యమైన మార్పులు వచ్చాయి.
అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం నల్లచీర
కప్పుకున్నట్టు కారుమబ్బులతో
నిండిపోయింది. సన్నగా మొదలైన వర్షం
క్షణంలో జడివానగా మారింది. ఏనుగు తొండంతా
సైజులో చినకులు పడుతున్నాయి.
వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి
పదకొండుగంటలైంది. కారు పోర్టికోలో పార్క్
చేస్తూ తిరిగి యధాలాపంగా ముందుకు చూశాడు.
ట్రాన్స్ ఫార్మర్ దగ్గర ఇంకా ఆ ఆకారం అలగే
బొమ్మలా నిలబడి ఉంది.
వర్షానికి ఆతనో ఆమె తెలియదుకాని వేసుకున్న
బట్టలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
వనమాలికి ఎక్కడలేని చిరాకు కలిగింది.
అక్కడికి వెళ్ళి అసలు విషయం
తెలుసుకుందామని ముందు అనుకున్నాడు. కాని
అప్పటికే బాగా అలసిపోవటంతో తనకెందకులే
అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు.
భోజనం చేసిన తరువాత తన బెడ్ రూం
చేరుకున్నాడు. వర్షం ఇంకా కురుస్తునే
ఉంది. పెద్దపెద్ద చినుకులు కిటికి అద్దాల
మీద పడి వింత శబ్ధం చేస్తున్నాయి.
కిటికితలుపులు మూస్తూ మళ్ళి ముందుకు
చూశాడు. ఆ ఆకారం ట్రన్స్ ఫార్మర్ దగ్గర
అలాగే నిలబడి ఉంది. అయిన అతను కొంచం కూడ
పట్టించుకోలేదు. ఎవరో పిచ్చివాడనుకుని
పుస్తకం తీసుకుని వెళ్ళి మంచం మీద
పడుకున్నాడు. పది పేజీలు చదవగానే అతనికి
గాఢంగా నిద్రపట్టేసింది. పుస్తకం
గుండెలమీద పెట్టుకుని అలాగే నిద్రపోయాడు.
ఎంత సేపు నిద్రపోయాడో తెలియదు. తిరిగి
అతను కళ్ళతెరిచేసరికి తెల్లవారుజామున మూడు
గంటలు కావస్తుంది. కిటికి దగ్గరికి వెళ్ళి
చూశాడు. ఇంకా ఆ ఆకారం అలగే నిలబడి ఉంది.
వనమాలి ఓపిక నశించింది. ఆఆకారం విషయం తాడో
పేడో తేల్చుకోవాలని కిందికి వెళ్ళాడు.
నాయర్ ని నిద్రలేపి విషయం చెప్పి బయటకు
పంపించాడు.
ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగా తిరిగి
వచ్చాడు నాయర్.
బాబుగారు. ఆ అమ్మాయి అక్కడ నుంచి కదలనని
మొండికేస్తుంది. మీరు ఇంటర్ వ్యూ
ఇస్తేకాని తను లోపలికి రానని చెప్పింది
అన్నాడు నాయర్.
వనమాలి బిత్తరపోయాడు. ఇప్పుడతనికి అసలు
విషయం అర్ధమైంది. ఇదంతా జాహ్నవి ఆడిన
నాటకం. తెలివిగా అతనని మోసం చేసి తన పందెం
నెగ్గించుకుంది. తను ఓడిపోయినందుకు
వనమాలికి కొంచం కూడా కోపం రాలేదు. ఆమె
తెలివికి స్ట్రాటజికి ఆశ్చర్య కలిగింది.
జాహ్నవి లో మొండితనం మాత్రమే కాదు దాన్ని
నెరవేర్చుకునే తెలవితేటలు చొరవ ధైర్యం
అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. తను ఒక డాక్టర్
అని తెలుసు కనుక తనని ఆకర్షించటానకి ఈ
పద్ధతిని ఎంచుకుంది. మాములు మనిషిగా
ఇలాంటివి పట్టించుకోకపోవచ్చు కాని ఒక
డాక్టర్ గా పట్టించుకోకుండ ఉండలేడు. ఈ
చిన్న విషయాన్ని జాహ్నవి గ్రహించి తన పంతం
నెగ్గించుకుంది.
నాయర్ నేను ఇంటర్ వ్యూ ఇవ్వటానికి
ఒప్పుకున్నానని చెప్పి ఆమెను తీసుకురా.
అలాగే వేడి టీ తీసుకురా అని చెప్పి సోఫాలో
కూర్చున్నాడు. క్షణం తరువాత నాయర్
జాహ్నవిని తీసుకువచ్చాడు. దాదాపు కొన్ని
గంటలు వర్షంలో కావాలని తడవటంవల్ల ఆమె
పూర్తిగా తడిసిపోయింది. బట్టలు ఒంటికి
అతుక్కుపోయాయి. జుట్టులోంచి కారుతున్న
నీళ్ళు నేల మీద పడుతున్నాయి. ఇంకా కొంచం
సేపు ఆమె ఇలాగే ఉంటే నిమోనియా రావటం ఖాయం.
అందుకే రోసిని పిలచి పొడి బట్టలు
తీసుకురమ్మనాలని అనుకున్నాడు.
కాని అతని ప్రమేయం లేకుండానే రోసి
వచ్చింది. హాలులో జరుగుతున్న హడావిడికి
ఆమెకు నిద్రాభంగం అయింది. తడిబట్టలతో
బొమ్మలా నిల్చున్న జాహ్నవిని ఆమెకు
ఎదురుగా ఉన్న వనమాలిని చూసి
ఆశ్చర్యపోయింది. ఏమిటి విషయం అన్నట్టు
ప్రశార్ధకంగా వనమాలి వంక చూసింది.
అక్కా అన్ని విషయాలు నీకు తరువాత
చెప్తాను. ముందు ఈ అమ్మాయిని లోపలకి
తీసుకువెళ్ళి పొడి బట్టలు ఇవ్వు. లేకపోతే
చలిజ్వరం వస్తుంది అన్నాడు.
రోసి అలాగే అని తలుపి జాహ్వవిని తీసుకుని
లోపలకి వెళ్ళిపోయింది. ఈ లోగా నాయర్ వేడి
టీ సిద్ధం చేశాడు. అయిదు నిమిషాల తరువాత
జాహ్నవి వచ్చింది. దాదాపు కొన్ని గంటలు
వర్షంలో తడవటం వల్ల చలికి శరీరం సన్నగా
వణుకుతుంది. మొహంలో అలసట కనిపిస్తుంది.
కాని ఆశ్చర్యంగా కళ్ళు మాత్రం వింత
కాంతితో మెరుస్తున్నాయి. ఏదైన అనుహ్యమైన
విజయం సాధించినప్పుడు మాత్రమే కళ్ళలో
అలాంటి వెలుగు కనిపిస్తుంది.
అందరు వేడి టీ తాగిన తరువాత రోసికి అసలు
విషయం చెప్పాడు వనమాలి. రోసి కూడా జాహ్నవి
ధైర్యానికి తెలివికి ఆశ్చర్యపోయింది.
నీ మెండితన్నాన్ని తెలివిని మెచ్చుకోకుండ
ఉండలేకపోతున్నాను జాహ్నవి. అసలు ఇలాంటి
ఆలోచన నీకెలా వచ్చింది. నేను ఖచ్చితంగా
నిన్ను చూస్తానని ఎలా నమ్మావు. ఒకవేళ
చూడకుండ ఉంటే ఎంత ప్రమాధం జరిగేదో నీకు
తెలుసా. నీకు తప్పుకుండ చలిజ్వరం వచ్చేది.
అంత రిస్క్ తీసుకోవలసిన అవసరం ఏమోచ్చింది.
కేవలం నిన్ను ఆటపట్టించటానికే నేను ఈ
పందానికి ఒప్పుకున్నాను. నిజానికి నీకు
ఇంటర వ్యు ఇవ్వటానికి నేను ఎప్పుడో రెడి
అయ్యాను. ఈ విషయం నీకు చెప్పాలని
అనుకున్నాను. కాన ఈలోగా నువ్వు ఈ నిర్ణయం
తీసుకున్నావు.
ఏది ఏమైన నువ్వు పందేంలో గెలిచావు. మన
అగ్రిమెంట్ ప్రకారం నీకు నేను ఇంటర్ వ్యూ
ఇస్తాను. చెప్పు ఎప్పుడు కావాలి ఇంటర్
వ్యూ అన్నాడు వనమాలి.,
ఈ పధకం నా మనస్సులో తట్టటానకి కారణం నాకు
మనిషి మీద ఉండే నమ్మకం. మనిషి దేనికి
లొంగకపోవచ్చుకాని సెంటిమెంట్ కు తప్పకుండ
లొంగిపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని
ఇలా చేశాను. మీ దగ్గరికి రాకముందే మీ
గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను.
మీది చాల జాలి గుండె అని ఎవరైన కష్టాలలో
ఉంటే ఓర్చుకోలేరని ముఖ్యంగా మీరు ఎంతో
మంది బీదవాళ్ళకు ఉచితంగా వైద్య సహయం
చేశారని తెలుసుకున్నాను..
అందుకే రిస్క్ తీసుకుని ఈ పని చేశాను. ఒక
వేళ నిజంగా మీరనుకున్నట్టు జరిగి ఉంటే
నేను చాల ఇబ్బందిలో పడతాను. అందుకే ఆ
పరిస్ధితి రాకుండ ముందే ఒక పెద్ద డాక్టర్
ను కలుసుకుని నాకు ఏ ప్రమాధం జరగకుండ
కొన్ని మాత్రలు వేసుకున్నాను. వాటిలో
ఎనర్జీ మాత్రలు కూడా ఉన్నాయి. అంతే కాకుండ
మీ ఏరియా చాల ఐసోలేటడ్ గా ఉంది. ఇక్కడ
ఎక్కువమంది జనం కనిపించరు. అందుకే
మిమ్మల్ని తొందరగా ఆకర్షించగలిగాను. సరే ఆ
విషయం పక్కన పెట్టండి. నేను పందెంలో
గెలిచాను కనుక ఇంటర వ్యూ విషయంలో మీరు
నేను చెప్పినట్టు వినాలి. అంది జాహ్నవి.
తప్పకుండ. చెప్పు నేనేం చెయ్యాలి అన్నాడు
వనమాలి. అతని మొహంలో తాను ఓడిపోయానన్న
కోపం కాని సిగ్గుకాని కనిపించటంలేదు. చాల
స్పోర్టివ్ గా ఉన్నాడు.
“రేపటినుంచి మన ఇంటర్ వ్యూ మొదలవుతుంది.
నేనే మీకు ఫోన్ చేసి టైం చెప్తాను. నేను
బయలు దేరుతాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది.
ఇంట్లో వాళ్ళు కంగారుపడుతుంటారు. అంటు
లేచింది జాహ్నవి.
ఇంతచీకటిలో ఒంటరిగా ఎలా వెళతావు. నా
కారులో వెళ్ళు అంటు డ్రైవర్ ని పిలిచి
చెప్పాడు.
జాహ్నవి వెళ్ళిపోయిన తరువాత రోసికి అంతా
వివరంగా చెప్పాడు. రోసి కూడా జాహ్నవి
తెగువకి తెలివికి ఆశ్చర్యపోయింది.
ంంంంంంంంంంంంంం
వనమాలి తన చాంబర్స్ లో కూర్చుని మెడికల్
జర్నల్ చూస్తున్నాడు. అప్పుడే టెలిఫోన్
రింగైయింది.
యస్ డాక్టర్ వనమాలి స్పీకింగ్ అన్నాడు
వనమాలి.
“నేను వర్మను మాట్లాడుతున్నాను అంటు
అవతలనుంచి వినిపించింది.
వర్మ నువ్వా ఎన్నిరోజులైంది నీ గొంతు
విని. ఎక్కడనుంచి
మాట్లాడుతున్నావు.సంతోషంతో ఉక్కిరిబక్కిరి
అవుతూ అడిగాడు వనమాలి.
నేను హైదరబాదు నుంచి మాట్లాడుతున్నాను.
ఎలా ఉన్నావు. నిన్నుచూడాలని నాకు చాల ఆశగా
ఉంది. ఈ రోజు సాయంత్రం నా ఇంట్లో చిన్న
గెట్ టూ గెదర్ ఏర్పాటు చేశాను. బాగా
దగ్గరవాళ్ళను మాత్రం పిలిచాను. నువ్వు
మాత్రం తప్పకుండ రావలి. ఏదో సాకు చెప్పి
తప్పించుకోవటానికి ప్రయత్నించకు. నాకు చాల
కోపం వస్తుంది.
అలాగే తప్పకుండ వస్తాను. కాని నువ్వు
ఇండియా ఎప్పుడు వచ్చావు. పైగా హైదరబాదులో
ఎప్పుడు సెటిల్ అయ్యావు.
నేను వచ్చి నెలరోజులవుతుంది.ఇక్కడికి
వచ్చిన వెంటనే నీకు ఫోన్ చెయ్యాలని
అనుకున్నాను. కాని నీ నెంబర్ రాసుకున్న
డైయిరీ ఎక్కడో మరిచిపోయాను. దాంతో నీ
నెంబర్ తెలియక చాల ఇబ్బంది పడ్డాను.
నువ్వు మల్హోత్ర హాస్పటల్ లో
పనిచేస్తున్నావని నువ్వు ఎప్పడో ఒకసారి
చెప్పావు. అది గుర్తుపెట్టుకుని హాస్పటల్
కు ఫోన్ చేశాను. అదృష్టవశతు నీ నెంబర్
తెలిసి రింగ్ చేస్తున్నాను.
సరే తప్పకుండ పార్టికి వస్తాను. నీ ఇంటి
అడ్రస్సు చెప్పు నోట్ చేసుకుంటాను అంటు
కాగితం కలం అందుకున్నాడు వనమాలి. అతను
చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుని రిసివర్
పెట్టేశాడు. అకస్మాతుగా చాల నంవత్సరాల
తరువాత వర్మ గొంతు వినటం వనమాలి చాల
ఆనందంగాను ద్రిల్లీంగ్ గాను ఉంది. వర్మ
వనమాలికి మంచి స్నేహితుడు. నిజం
చెప్పాలంటే ఆత్మీయుడు. పైగా క్లాస్ మెట్.
ఇద్దరు ఒకే మెడికిల్ కాలేజిలో డాక్టర్
కోర్స్ పూర్తి చేశారు.
వర్మ తండ్రి పెద్ద బజినెస్ మాగ్నట్.
డబ్బుకు ఎలాంటి లోటు లేదు. కాని వర్మలో
మాత్రం తను డబ్బు ఉన్నవాడిననే అహంకారం
కాని గర్వం కాని కొంచం కూడా కనిపించదు.
అందరితో కలసి మెలిసి తిరుగుతాడు.గొప్పవాడు
బీదవాడు అని తేడాలు చూడకుండ అందరిని
నవ్వుతూ పలకరిస్తాడు. అడిగిన వాళ్ళకు
లేదనకుండ సహయం చేస్తాడు. వనమాలి కూడా అతడి
సహయం చాల సార్లు తీసుకున్నాడు. ఇద్దరు
క్లాసులో మెరిట్ స్టూడెంట్స్. చదువులో
ప్రతి నిమిషం ఒకరితో ఒకరు పోటి
పడుతుంటారు. ఒక సబ్జక్టులో వనమాలికి ఫస్ట్
మార్కులు వస్తే వర్మకు ఇంకో సబ్జక్టులో
వచ్చేది. కాలేజిలో ప్రోఫెసర్లకు వీళ్ళంటే
ఎంతో అభిమానం ప్రేమ. పైనల్ పరీక్షలో
ఎవరికి యూనివర్స్ టి ఫస్ట్ రాంకు
వస్తుందని అందరికి చాల ఆసక్తిగా ఉండేది.
చదువులో ఇద్దరు ఎంత పోటి పడిన బయట మాత్రం
మంచి స్నేహితులు. నిజం చెప్పాలంటే గాఢమైన
స్నేహితులు.
అనుకున్ను తేదికి పరీక్షలు ముగిసి ఫలితాలు
వచ్చాయి. ఆశ్చర్యంగా ఇద్దరికి యూనివర్
సిటి జాయింట్ గోల్డ్ మెడల్ వచ్చింది.
అందరు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు గోల్డ్
మెడల్ ఒక్కరికే వచ్చింది. కానిఈ సారి
ఇద్దరికి రావటం కాలేజి చరిత్రలో ఇది
మెదటిసారి. స్టూడెంట్స్ స్టాఫ్ అందరు
ఇద్దరిని ఆకాశానికి ఎత్తేశారు. వనమాలికి
చదువు చెప్పిస్తున్న శివశంకరశాస్త్రి ఆయన
కుటుంబం ఆనందంతో పొంగిపోయారు. ముఖ్యంగా
శివశంకర్ కూతురు మిత్రవింద సంతోషంతో
ఊగిపోయింది. వనమాలి చదువు అయిపోయింది కనుక
తమ పెళ్ళి జరిగిపోతుందని ఆమె ఆశ.
ఇద్దరికి మెడల్ వచ్చిన శుభసందర్భాన్ని
పురస్కరించుకుని కాలేజి మేనేజిమెంట్ చిన్న
ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ కి
వైస్ చాన్స్ లర్ కూడా వస్తున్నాడు. ఆయనే
ఇద్దరికి మెడల్ బహుకరిస్తున్నాడు. ఆ
మీటింగ్ కి ముఖ్య అతిధిగా విద్యాశాఖ
మంత్రి వస్తున్నాడు.
అనుకున్న టైంకి మీటింగ్ మొదలైంది. మాములు
ఫార్మాలిటిస్ పూర్తయిన తరువాత అతిధులు
మాట్లాడారు. చివరగా మెడల్ బహుకరించే
కార్యక్రమం ప్రారంభమైంది. వీసి మైక్
ముందుకువచ్చి ఏదో చెప్పబోయాడు. అప్పడే ఒక
పక్కగా కూర్చున్న వర్మ లేచి తనకు రెండు
నిమిషాలు మాట్లడే అవకాశం ఇమ్మని వీసిని
కోరాడు. వీసి ఏం అనుకోకుండు పర్మిషన్
ఇచ్చాడు.
వర్మ మైక్ ముందుకువచ్చి అన్నాడు.
గౌరవనీయులైన అద్యాపకులకు విద్యాశాఖ మంత్రి
గారికి వైస్ చాన్సలర్ గారికి నా తోటి
విద్యార్ధులకు నా నమస్కారం. గోల్డ్ మెడల్
తీసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు
చెప్పాలి. నాకు వనమాలికి గోల్డ్ మెడల్
రావటం నాకు చాల సంతోషంగాను ఆనందంగాను
ఉంది. కాని బాగా ఆలోచిస్తే ఈ మెడల్ వనమాలి
ఒక్కడికే ఇవ్వటం సబబుగా ఉంటుందని
భావిస్తున్నాను. దానికి కొన్ని కారణాలు
ఉన్నాయి. ఇద్దరం మంచి స్నేహితులమే అయిన
నాకు అతనికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా
ఉంది. నేను కలవారి ఇంట్లో పుట్టాను.
కావల్సినంత డబ్బు మాకుంది. నేను అడగాలే
కాని మా నాన్నగారు కొండమీద కోతినైన తెచ్చి
ఇస్తారు. నా ఫైనల్ పరీక్ష కోసం మా
నాన్నగారు చాల డబ్బు ఖర్చుపెట్టారు.
అనుభవం ఉన్న ప్రోఫెసెర్లతో నాకు టూషన్
చెప్పించారు. వాళ్ళ నా కోసం నోట్స్
తయారుచేసి ఇచ్చారు. ఏమాత్రం కష్టపడకుండ ఆ
నోట్స్ చదివి నేను రాంకు తెచ్చుకున్నాను.
ఇది నా దృష్టిలో ఏమంత గొప్ప విషయం కాదు.
నా స్ధానంలో ఇంకేవరున్నానా లాగే గోల్డ్
మెడల్ సంపాదించేవారు.
కాని వనమాలి పరిస్ధితి నాకు పూర్తిగా
వ్యతిరేకం. అతను చిన్నతనం నుంచి అనాధగా
పుట్టి పెరిగాడు. కొంతమంది పెద్దవాళ్ళ
సహయం వల్ల ఈ స్దితికి వచ్చాడు. అతనికి
డబ్బులేదు. ప్రోఫెసర్ల సహయం తీసుకునే
శక్తిలేదు. రేపటిభోజనం ఎక్కడనుంచి
వస్తుందో తెలియని పరిస్ధితి. అతని
స్ధానంలో ఇంకేవరైన ఉంటే బ్రేక్
అయ్యేవాళ్లు. ఈ చదువు మనకెందుకులే అని
మద్యలో చదువు విరమించుకునేవాళ్ళు. కాని
వనమాలి అలా చెయ్యలేదు. ఎలాగైన డాక్టర్
కావాలనే పట్టుదలతో చుట్టుముట్టిన
కష్టాలన్ని అధికమించి తన ఆశయం
పూర్తిచేసుకున్నాడు. రోజు లైబ్రరికి
వెళ్ళి కష్టపడినోట్స్ తయారుచేసుకుని
పరీక్షకు చదివాడు. అతను పడిన కష్టంలో పావు
వంతు కూడా నేను పడలేదు. అందుకే నా కోరిక
మన్నించి ఈ మెడల్ ని వనమాలికి బహుకరించమని
వినయంగా వేడుకుంటున్నాను అంటు
పూర్తిచేశడు.
ఒక్కసారిగా ఆడిటోరియం నిర్ఘాంతపోయింది.
ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న వాళ్ళంతా
షాక్ తో బిగుసుకుపోయారు. స్టేజి మీద
కూర్చనవాళ్ళు పిచ్చివాళ్ళలాగా వర్మ వంక
చూశారు. అందరికంటే బాగా స్పందించింది
వనమాలి. వర్మ ఇంత గొప్పత్యాగం చేస్తాడని
అతను ఊహించలేదు. మెడల్ సంపాదించటం మాములు
విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాలి.
ముఖ్యంగా ఎంతో తెలివితేటలు కావాలి.
అంతకష్టపడి సంపాదించుకున్న మెడల్ ను ఎవరు
అంత తేలికగా వదులుకోరు. ఆలా వదులుకోవాలంటే
దానికి ఎంతో మంచి మవస్సు విశాల హృదయం
కావాలి. అవి రెండు తనకున్నాయని వర్మ
నిరూపించాడు.
అక్కడున్నవాళ్ళఅందరితోపాటు వనమాలి కూడా
కొంచంసేపు అదిరిపాటుకు లోనయ్యాడు. దాదాపు
రెండు నిమిషాలపాటు ఆడిటోరియంలో పిన్
డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. తరువాత
ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.
చదువైన తరువాత పై చదువులు చదవటానికి
వనమాలికి స్తోమతలేక భార్య మిత్రవిందను
తీసుకుని హైదరాబాదు చేరుకున్నాడు. అక్కడ
మల్హోత్ర హాస్పటల్ లో అసిస్టెంట్ ఫీజిషన్
గా చేరాడు. వర్మ మాత్రం పై చదువులకోసం
అమెరికా వెళ్ళాడు. ఇద్దరు కొన్ని వేల
మైళ్లు దూరంగా ఉన్నా వాళ్ళ స్నేహం మాత్రం
తగ్గలేదు. తరుచు ఇద్దరు ఫోన్ లో
మాట్లాడుకునేవాళ్ళు. కొంతకాలం అయిన తరువాత
ఏం జరిగిందో తెలియదు కాని వర్మ దగ్గరనుంచి
ఫోన్ కాల్ రావటం ఆగిపోయింది. వనమాలికి
కారణం తెలియలేదు. అతనితో మాట్లాడాలని
వనమాలి ఎంతో ప్రయత్నించాడు కాని
సాధ్యంకాలేదు.
ఆ తరువాత వృత్తిలో పడి క్రమంగా వర్మను
మరిచిపోయాడు. మళ్ళి ఇన్ని సంవత్సరాల
తరువాత వర్మ గొంతు ఫోన్ లో వినటం అతనికి
చాల ఎక్సైటింగ్ గా ఉంది. తన స్నేహితుడితో
మనస్సు విప్పి మాట్లాడుకోవాలని ఆతృత
పడ్డాడు.
హాస్పటల్ పని తొందరగా ముగించుకుని
అక్కడనుంచి నేరుగా వర్మ ఇంటికి
బయలుదేరాడు. వర్మ ఇల్లు సిటికి దాదాపు
పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇప్పడిప్పుడే అభివృద్ధి చెందుతున్న
ప్రాంతం అది. కారు వర్మ ఇంటిముందుపార్క్
చేసిలోపలికి వెళ్ళాడు. వనమాలిని ఆప్యాయంగా
రిసివ్ చేసుకున్నాడు వర్మ.
మాములు పలకరింపులు అయిన తరువాత వర్మ
మిగిలిన ఆహుతులను వనమాలికి పరిచయం చేశాడు.
వాళ్ళందరు సిటిలో ప్రముఖ డాక్టర్లు.
వాళ్ళలో సగం మంది వనమాలికి తెలుసు. పార్టి
వెంటనే మొదలైంది. అందరు హాయిగా తాగుతూ
మాట్లాడుకుంటు ఎంజాయ్ చేస్తున్నారు.
వనమాలికి మాత్రం ఒక విషయం అర్ధం కాలేదు.
వర్మ భార్య ఎక్కడ అతనికి కనిపించలేదు.
కనీసం పిల్లలు కూడా కనిపించలేదు. ఈ విషయం
అడుగుదామని ముందు అనుకున్నాడు కాని సమయం
కాదని ఊరుకున్నాడు. దాదాపు పది గంటల వరకు
జరిగింది పార్టి. అందరు వెళ్ళిపోయిన
తరువాత వనమాలి వర్మ లాన్ లో
కూర్చున్నారు.. చుట్టు ఉన్న ప్రాంతమంత
నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది. ఒక్క మనిషి
కూడా కనిపించటంలేదు. ఇళ్ళనీ
విసిరేసినట్టుగా దూరంగా ఒకదానితో ఒకటి
సంబంధం లేకుండ ఉన్నాయి.
ఆకాశంలో చంద్రుడు దేదిప్యమానంగా
వెలిగిపోతున్నాడు. గాలిచల్లగా వీస్తూ
సెదతీరుస్తున్నట్టుగా ఉంది. కొన్ని
క్షణాలవరకు ఇద్దరు ఏం మాట్లాడకుండ మౌనంగా
ఉండిపోయారు. ముందుగా నిశబ్ధాన్ని చిద్రం
చేస్తూ అన్నాడు వర్మ.
నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు వనమాలి. ఆ
విషయాన్ని నేను ముందే గ్రహించాను. అందరు
వెళ్ళిపోయిన తరువాత తీరుబడిగా నా కధ
చెప్పాలని అనుకున్నాను. అందుకే ఇంతసేపు
ఆగాను. నీకు ఇంట్లో అర్జంట్ పనులు లేకపోతే
నా కధ చెప్తాను. వింటావా. వినే ఓపిక ఉందా.
తప్పకుండ వింటాను చెప్పు”అంటు సర్దుకుని
కూర్చున్నాడు వనమాలి.
గుండెజబ్బులకు సంబంధించిన వ్యాధుల గురించి
చదవటానికి నేను అమెరికా వెళ్ళాను. చదువు
అయిపోయిన తరువాత ఒక పెద్ద హాస్పటల్ లో
అసిస్టెంట్ గా చేరాను. అక్కడే నాకు ఏంజిల్
తో పరిచయం అయింది. తను చాల అందంగా
స్మార్ట్ గా ఉంటుంది. ఒక ప్రైవేట్ టీవి
చానల్ లోప్రోగ్రాం ఆఫీసర్ గా
పనిచేస్తుంది. మెదటి పరిచయంలోనే మేము బాగా
కలిసిపోయాం. మనస్సు విప్పి ఒకరి గురించి
ఒకరు చెప్పుకున్నాం. నెలరోజల తరువాత మా
పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం హిందు
సంప్రదాయంలో పెళ్ళి చేసుకున్నాం. ఆ రోజు
నుంచి నా జీవితం నరకప్రాయం అయింది.
తనకు చెప్పకుండ ఒక అమెరికన్ అమ్మాయిను
పెళ్ళి చేసుకున్నందుకు నాన్నగారికి చాల
కోపం వచ్చింది. జన్మలో నాతో మాట్లాడనని
కోపంగా అన్నారు. కాని అమ్మ మాత్రం నాకు
పెళ్ళైనందుకు చాల సంతోషపడింది. రోజు
రాత్రి ఫోన్ లో నాతోమాట్లాడుతూ కోడలిని
గురించి అడిగేది. నాకేం చెప్పాలో తోచేది
కాదు.
ఏంజిల్ చాల దుబారా మనిషి. ఆమెకు ఎంత డబ్బు
ఇచ్చినా చాలేది కాదు. ఇంకా కావాలని పోరు
పెట్టేది.
ఇచ్చిన డబ్బు తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ ను
వెంటపెట్టుకుని పార్టిలకని పబ్ లకని
విచ్చలవిడిగా తిరుగుతుండేది. అయిన నేను ఆ
విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
అమెరికని కల్చర్ లో అది కూడా ఒక భాగమే అని
సరిపెట్టుకునేవాడిని.
నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంది
ఏంజిల్. దాంతో ఇంకా విచ్చలవిడిగా
ప్రవర్తించటం మొదలుపెట్టింది. నా జీవితం
ఇంతే అని సరిపెట్టుకున్నాను. నాన్నగారి
మాట విని ఉంటే నా పరిస్ధితి ఇలా ఉండేది
కాదు. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అంతా
నా ఖర్మ అని సరిపెట్టుకున్నాను.
ఒక రోజు కొంచం తొందరగా ఇంటికి వచ్చాను.
ఏంజిల్ కోసం చూస్తూ బెడ్ రూంలోకి
వెళ్ళాను. అక్కడ కనిపించిన దృశ్యం నన్ను
నిర్ఘాంతపోయేలా చేసింది. ఏంజిల్ ఆమె బాయ్
ప్రెండ్ ఇద్దరు నా మంచం మీద నగ్నంగా
శృంగార కార్యక్రమంలో తేలిపోతున్నారు.
అకస్మాతుగా గదిలోకి వచ్చిన నన్ను చూసి ఆమె
బాయ్ ఫ్రెండ్ బట్టలు తీసుకుని గదిలోంచి
పారిపోయాడు. కాని ఏంజిల్ లో మాత్రం ఎలాంటి
స్పందన లేదు. తను తప్పు చేసిందన్న భయం
కాని సిగ్గుకాని ఆమెలో ఏ కోశాన లేవు.
నగ్నంగా పడుకుని నా వంక అదోలా చూసింది.
ఆ చూపులకు అర్ధం రోజు ఆరు గంటలకు
వచ్చేవాడివి ఈ రోజు మాత్రం అయిదు గంటలకు
ఎందుకువచ్చావు. అందుకే ఇలాంటి దృశ్యం
చూడవలసివచ్చింది అని పరోక్షంగా
చెబుతున్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. ఆ
సంఘటన తరువాత నా మనస్సు పూర్తిగా
విరిగిపోయింది. వెంటనే విడాకులు
ఇచ్చేశాను. దానికి ఎంతో మూల్యం
చెల్లించుకోవలసివచ్చింది.
ఆ తరువాత నాకు అక్కడ ఉండాలనిపించలేదు.
వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా
వచ్చేశాను. నాన్నగారు నా పరిస్ధితి
తెలుసుకుని నన్ను ఇంటికి రమ్మని చెప్పారు.
కాని నాకెందుకో వెళ్ళాలని పించలేదు.
డబ్బుకు ఎలాంటి లోటు లేదు. అమెరికాలో నేను
సంపాదించిన డబ్బుతో ఏ పని చెయ్యకుండ కాలు
మీద కాలు వేసుకుని సుఖంగా ఉండవచ్చు.
ప్రస్తుతం నాకు ఉండటానికి ఇల్లు కావాలి
కనుక ఈ ఇల్లు కొనుక్కున్నాను. తరువాత వీలు
చూసుకుని హాస్పటల్ కట్టించాలి అంటు
ముగించాడు వర్మ.
వనమాలి జాలిగా చూశాడు. ఎలాగు తన జీవితం
నాశనమైంది కనీసం వర్మ అయిన భార్య పిల్లలతో
సుఖంగా ఉన్నాడని అనుకున్నాడు. కాని అతని
పరిస్ధితి తన కంటే చాల దారుణంగా ఉంది.
ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు.
ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో వనమాలికి
తోచలేదు. కొన్ని సమయాలలో మాటలకంటే మౌనమే
గొప్ప ఓదార్పు ఇస్తుంది. అందుకే వనమాలి ఏం
మాట్లాడలేదు.
నా గురించి చెప్పి బాధపెట్టినట్టున్నాను.
సరే నా సంగతి వదిలేయ్. నీ విషయం చెప్పు.
ఎంతమంది పిల్లలు. వాళ్ళు ఏం
చదువుతున్నారు. నీ భార్య గురించి చెప్పనే
లేదు అంటు ప్రశ్నల మీద ప్రశ్నలు
గుప్పించాడు వర్మ.
వనమాలి పేలవంగా నవ్వి అంతా చెప్పాడు. తన
భార్యను కూతురిని హత్యచెయ్యబడ్డారని
చెప్పకుండ యాక్సిడెంట్ లో పోయారని
చెప్పాడు.
వర్మ చాల నొచ్చుకున్నాడు. తన జీవితం లాగా
స్నేహితుడి జీవితం కూడా నిస్సారంగా
గడిచిపోతుందని తెలిసి చాల బాధపడ్డాడు.
తరువాత ఆ ప్రసక్తి విడిచిపెట్టి మాములు
విషయాలు మాట్లాడుకున్నారు. అప్పటికే టైం
పదకొండు కావస్తుండటంతో వనమాలి ఇంటికి బయలు
దేరాడు. కాని దురదృష్టవశాత్తు కారు ఎంత
స్టార్ట్ చేసిన స్టార్ట్ కాలేదు. కారు
ఇక్కడే విడిచి పెట్టి వెళతానని రేపు ఉదయం
మెకానిక్ ని పంపిస్తానని చెప్పాడు. తన
కారు తీసుకువెళ్ళమని వర్మ ఎంతో చెప్పి
చూశాడు. కాని వనమాలి ఒప్పుకోలేదు.
ఇంకో పదిహేను నిమిషాలలో చివరి లోకల్
ట్రైన్ ఉంది. అందులో వెళితే దాదాపు ఇంటి
వరకు చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఆటో
పట్టుకుని తన గమ్యస్ధానం చేరుకోవచ్చు
వనమాలి స్టేషన్ చేరుకునేసరికి అప్పుడే
చివరి లోకల్ ట్రైన్ వచ్చింది. టికెట్టు
తీసుకుని హడావిడిగా ఒక కంపార్ట మెంట్ లోకి
ఎక్కాడు. లోపల చీకటిగా ఉంది. వనమాలి ఇంకో
ప్రయాణికుడు తప్పు ఇంకేవరులేరు. వనమాలి
వెళ్ళి ఆ ప్రయాణికుడి పక్కన కూర్చున్నాడు.
ట్రైన్ వేగంగా వెళుతుంది. వనమాలి
అన్యమనస్కాంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అప్పుడే కంపార్ట్ మెంట్ లో ఉన్నట్టుండి
లైట్లు వెలిగాయి. తన పక్కన కూర్చున్న
వ్యక్తిని చూసి తల మీద పిడుగుపడినట్టు
ఒక్కసారిగా అదిరిపడ్డాడు వనమాలి. అతను
ఎవరో కాదు. జాన్ డేవిడ్.
పోలీస్ డిపార్ట్ మెంట్ ఎవరి కోసమైతే
వెతుకుతుందో ఆ కరుడుగట్టిన నేరస్ధుడు
ఇప్పుడు అతని పక్కన ఉన్నాడు. ఎవరి కోసమైతే
నాయక్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడో అతను
వనమాలి పక్కన ఉన్నాడు. ప్రపంచంలో ఇంతకంటే
అద్భుతమైన సంఘటన ఇంకోకటి ఉండదు. ఊహించని ఈ
సన్నివేశానికి వనమాలి శరీరం ఒక్కసారిగా
చల్లబడిపోయింది. అమాంతం అతని మీద పడి
చంపెద్దాం అన్నంత ఆవేశం వచ్చింది
వనమాలికి. కాని ఆశ్చర్యంగా అతని శరీరం
అందుకు సహకరించటం లేదు. కాళ్ళుచేతులు
ముందుకు కదలనని మొరాయించాయి.
ఇలా ఎందుకు జరుగుతుందో వనమాలికి అర్ధం
కాలేద. నిజానికి అతను బలహీనుడు కాడు.
డేవిడ్ లాంటి మరో ఇద్దరిని కూడా ఒంటి
చేత్తో సమాధానం చెప్పగలడు. కాని ఆ సమయంలో
మాత్రం అతని అవయవాలు చచ్చబడినట్టు
నిస్తేజంగా ఉన్నాయి.
వనమాలి ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే
ఉన్నట్టుండి డేవిడ్ లేచి అవతలకి వెళ్ళాడు.
బహుశా బాత్ రూంకి వెళ్ళి ఉండాడనుకుని
సరిపెట్టుకున్నాడు. కాని లోకల్ ట్రైన్ లో
బాత్ రూంలు ఉండవని గుర్తుకువచ్చి చప్పున
లేచి డేవిడ్ వెళ్ళిన వైపు వెళ్ళాడు
వనమాలి. కాని డేవిడ్ ఎక్కడ కనిపించలేదు.
కంపార్ట్ మెంట్ అంతా వెతికాడు. కాని అతని
జాడలేదు. గాలిలో కలిసిపోయినట్టు
మాయమయ్యాడు.
స్టేషన్ లో కూడా అతని కోసం చూశాడు వనమాలి.
కాని కనిపించలేదు. నిరుత్సాహంతో ఇంటికి
చేరుకున్నాడు. తను జాన్ డేవిడ్ ని చూసిన
విషయం వనమాలి రోసికి చెప్పలేదు. దాని వల్ల
లాభం కంటే నష్టం ఎక్కువ అని అతనికి
తోచింది.
ంంంంంంంంంంంంంంంంం
రాత్రి పది గంటలు కావస్తుంది. వనమాలి
సిల్వర్ ఫాక్స్ రెస్టారెంటులో కూర్చుని
డేవిడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. నాయక్
చెప్పిన దాని ప్రకారం ప్రతి రోజు డేవిడ్
పది గంటలనుంచి పదిన్నర మద్య ఈ బార్ కి
వచ్చి కొద్ది సేపు గడిపి వెళతాడని
తెలిసింది. తన మీద ఎవరికి అనుమానం రాకుండ
ఒక బీర్ తెప్పించుకుని తాగుతూ
కుర్చున్నాడు.
వనమాలి ఎంతో సేపు ఎదురుచూడవలసిన అవసరం
లేకుండ డేవిడ్ వచ్చాడు. వనమాలికి ఎదురుగా
ముందు టేబుల్ ముందు కూర్చున్నాడు. అతని
మొహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
ట్రైన్ లో కంగారులో అతన్ని అంతగా పరీక్షగా
చూడలేకపోయాడు వనమాలి. రోసి చెప్పింది
నిజం. డేవిడ్ చాల అందంగా మ్యాన్లిగా
ఉన్నాడు. వయస్సు వల్ల అక్కడక్కడ జుట్టు
నెరిసిన అతనిలో అందం కాని ఆకర్షణ కాని
ఏమాత్రం తగ్గలేదు. కారణం తెలియదు కాని
డేవిడ్ చాల డిస్ట్రబ్ గా ఉన్నాడు. అసహనంగా
అటు ఇట్టు చూస్తున్నాడు. రెండు పెగ్గులు
విస్కీ తాగిన తరువాత లేచాడు. కౌంటర్
లోబిల్ పేచేసి బయటకు నడిచాడు. వనమాలి కూడా
బిల్ ఇచ్చి డేవిడ్ వెనుకు వెళ్ళాడు.
పది నిమిషాలు నడిచిన తరువాత డేవిడ్ ఒక
బంగళా ముందు ఆగాడు. అతన్ని చూడగానే గేటు
ముందు కూర్చున్న వాచ్ మెన్ మర్యాదగా లేచి
గేటు తెరిచాడు. డేవిడ్ లోపలకి వచ్చిన
వెంటనే వాచ్ మెన్ తిరిగి గేటు వేసి
కూర్చున్నాడు. బహుశా ఇదే డేవిడ్ ఇల్లు అయి
ఉంటుంది. ఆ ఏరియాని ఇంటిని బాగా
గుర్తుపెట్టుకుని వెనక్కి తిరిగాడు
వనమాలి.
ంంంంంంంంంంంంంంంంంం
హాలులో కూర్చుని టీవిలో ఏదో ప్రోగ్రాం
చూస్తుంది రోసి. ఎప్పుడెప్పుడు ఆమె టీవి
ఆఫ్ చేసి లోపలకు వెళుతుందా తను ఎప్పుడు
ఇంట్లోంచి బయటపడదామా అని వనమాలి
ఎదురుచూస్తున్నాడు. ఈ రాత్రి డేవిడ్
ఇంటికి వెళ్ళలని అతను నిశ్చయించుకున్నడు
వనమాలి. అందుకు కావలిసిన ఏర్పాట్లు కూడా
చేసుకున్నాడు. డేవిడ్ బార్ కి వెళ్ళి
తిరిగి ఇంటకి వచ్చేసరికి ఎంతలేదనుకున్నా
పదకొండుగంటలు అవుతుంది. ఈ లోగా డేవిడ్
ఇంటికి వెళ్ళి అతనికి సంబంధించిన రహస్యాలు
సేకరించాలని వనమాలి ప్లాన్.
కాని ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా హాలులో
రోసి కూర్చుని ఉంది. అతను బయటకు వెళ్ళలంటే
ఆమె ముందునుంచి వెళ్ళాలి. ఎక్కడికి
వెళుతున్నావు. ఎందుకు వెళుతున్నావు అని
యక్షపశ్నలు వేస్తుంది. అందుకే ఆమె లోపలికి
ఎప్పుడు వెళుతుందా అని కాచుకుని
కూర్చున్నాడు.
అదృష్టవశతు పది నిమిషాల తరువాత రోసి
లేచింది. టీవి ఆఫ్ చేసి తన బెడ్ రూంలోకి
వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటు
వనమాలి ఇంట్లోంచిబయట పడ్డాడు. కారు
తీసకుని వేగంగా డేవిడ్ ఇంటి వైపు
సాగిపోయాడు.
డేవిడ్ ఇంటికి చేరుకునేసరికి అరగంట
పట్టింది. డేవిడ్ ఇంటికి కొంతదురంలో కారు
పార్క్ చేసి నడుస్తూ ముందుకువెళ్ళాడు.
యధాప్రకారం వాచ్ మెన్ గేటు మూసి సిగరెట్
తాగుతూ కూర్చుని ఉన్నాడు. వనమాలి ఇంట్లోకి
వెళ్ళాలంటే వాచ్ మెన్ ముందు నుంచి
వెళ్ళాలి. అతడు అక్కడున్నంత వరకు వనమాలి
లోపలకి వెళ్ళలేడు. ఏంచేద్దాం అని వనమాలి
ఆలోచిస్తుంటే అప్పుడే వాచ్ మెన్ లేచాడు.
ఏదో పని ఉన్నట్టు హాడావిడిగా లోపలికి
వెళ్ళాడు. వనమాలి వెంటనే గేటు తెరుచుకుని
లోపలికి వెళ్ళాడు.
ఒక చెట్టు చాటున నిలబడి వాచ్ మెన్ కోసం
ఎదురుచూశాడు. రెండు నిమిషాల తరువాత వాచ్
మెన్ వచ్చి యధాప్రకారం గేటు దగ్గర
కూర్చున్నాడు. వనమాలి పిల్లిలా అడుగులు
వేస్తూ లోపలికి వెళ్ళాడు. మేడ మెట్లు
ఎక్కి పైకి చేరుకున్నాడు. పొడుగ్గా ఉన్న
కారిడార్ లో వరుసగా గదులు కనిపించాయి.
ఒక్క గదిలో తప్ప మిగిలిన గదులు చీకటిగా
ఉన్నాయి. అదే డేవిడ్ బెడ్ రూం అయి
ఉంటుంది. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళి
చూశాడు. ఎవరూలేరు. అతని ఊహ నిజమైంది.
నిజంగానే అది డేవిడ్ బెడ్ రూం. మూలగా ఉన్న
టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. |
|
|
|
|
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో
అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ
క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)
|
|
సుజనరంజని
మాసపత్రిక
ఉచితంగా మీ
ఇమెయిల్
కి పంపాలంటే
వివరాలు
కింది
బాక్స్‌లో టైపు
చేసి
సబ్‌స్క్రైబ్
బటన్ నొక్కగలరు.
|
|
|
|
|
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ
అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any
unsolicited purposes. Please keep comments relevant.)
|
|
|
|
|
Copyright ® 2001-2012
SiliconAndhra. All Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|