
The essence of cinema is editing. It's
the combination of what can be
extraordinary images of people during
emotional moments, or images in a
general sense, put together in a kind of
alchemy.Francis
Ford Coppola
I prefer ordinary girls
- you know, college students,
waitresses, that sort of thing. Most of
the girls I go out with are just good
friends. Just because I go out to the
cinema with a girl, it doesn't mean we
are dating.Leonardo
DiCaprio
ఓక్కొ
సారి
అనిపిస్తుంది
రంగుల
పిట్టలని
చూస్తున్నప్పుడు
నేనెందుకు
అలా
కాలేదని ..
మరొకసారి
అనిపిస్తుంది
మహానుభావుల్ని
చూసినప్పుడు
నేను
ఆ
వేదికపై ఎందుకు
లేనని.. మనిషి
ఆశావాది.
అందరు
"పల్లకీ
ఎక్కేవారు
అయితే
మోసేవారు
ఎవరని
అన్నట్లు"
సామెత
పాతదే
అయినా
ఎప్పటికీ
మనకు
అవసరమే
అవుతుంది.
అంటే
ప్రయత్నం
చేసేవారు
పల్లకీ ఎక్కేవారు,
ప్రయత్నం
చేస్తున్నాము
అనుకునే
వారు
మోసేవారు
గానే
ఎప్పటికి
పరిగణింప
బడతారు అది
ప్రతిష్టాత్మకమైన
అవార్డు
కావచ్చు
లేదా
స్వచ్చమైన
ప్రేమ
కావచ్చు.
మనలోనే
కొందరు
అంటారు
నుదిటిపై
రాత
లేనిదే
ఏమి
దక్కదు
అని
లేదా
పెద్దవాళ్ళ
పరిచయాలు,
ఆస్తి
అంతస్తులు
లేనిదే
ఏ
పని
కాదని.
అది
కొంతవరకు
తప్పదు.
నాగరిక
ప్రపంచంలో
దేనినీ
ఎవరు
చాల
సులభంగా
సాధించలేరు.
సాధించడం
అంటే
ఏమిటి
అని
మరో
ప్రశ్న
మనలోకి
రావచ్చు.
ఇక్కడ
రెండు
అర్థాలు
వస్తాయి.
మొదటిది ఎదుటి
మనిషిని
తన
స్థానం
కోసం
విసిగించి
సంపాదించడం
రెండవది
పట్టుదలతో
తాము
అనుకున్నది
సాధించి
గెలుచుకోవడం.
ఇన్ని
విషయాలు
ఎందుకు
చెప్పానంటే
ఎనభై
ఏళ్ల
సినీ
ప్రస్థానం
ఇంత
చక్కగా,
పరిశోధనలకు
అనుకూలంగా
మలచిన
రవిచంద్ర
గారి
ప్రయత్నం
ఎందరికో
మార్గదర్శకం
అనడంలో
అతిశయోక్తి
లేదు.
సినిమా
నా
?
ఎందుకు?
దానిపై
మాట్లాడటం
ఎందుకు?
సినిమాల
ప్రస్థానం
ఎందుకు?
వచ్చేవన్నీ
చెత్తవే
.
అసలు
సినిమా
ఎందుకు
తీస్తున్నారో
వారికైనా
అర్థం
అవుతోందా
?
లేకుంటే
ఏమిటండీ
ఆ
హీరో
ఏమిటీ
వందలమందిని
తన్నడం
ఏమిటి?
తన్నిన
వారందరూ
ఊరు
అవతల
పడటం
ఏమిటి?
ఆ
హీరో
ఏమిటి?
ఆ
హీరోయిన్
ఏమిటి
?
ఆ డ్యు యట్లు
పాడుకోవడం
ఏమిటి?
ఏమయినా
సరే
ఈ
మధ్య
సినిమాల్లో
ఏముంటున్నాయని అని
చాలామంది
మనమధ్య
వాపోతూ
అప్పటికి
వారేదో
పెద్ద
మనుషులు
అయినట్లు
అనుకుంటూ
ఉంటారు.
కాని
ఆ
అభిప్రాయం
ముమ్మాటికీ
తప్పు
.
అసలు
సినిమా
అనేది
ఖర్చు,
మేదస్సు
రెంటినీ
తాకట్టు
పెట్టి
చేస్తున్న
ఒక
గొప్ప
ప్రయత్నమే
కాదు
ఎవరికీ
అర్థం
కాని,
అర్థం
చేసుకోలేని ఒక
అందమయిన ప్రయాణం.
మరి
ఈ
ప్రయాణంలో
అందం
ఉండాలి,
అనడంతో
పాటు
ఆనందం
ఉండాలి.
కాని
నేడు
జరుగుతున్నది
ఏమిటంటే
అందం
మిగులుతోంది
తప్ప
ఆయా
సంబందిత నిర్మాతకు
కాని,
డైరెక్టర్
కు
గాని
ఆనందం
కనుచూపు
మేరలో
కనబడటం
లేదు.
కారణం
ప్రేక్షకుల్లో ఊక
దంపుడు
మేదస్సు
పెరిగిపోవడమే!
అయితే
ఇలా
ఎందుకు
జరుగుతోంది
అనే
విషయంపై
ఆలోచిస్తే
ఇందుకు
కారణాలు
అనేకం.
ఒకప్పుడు
సినెమా
అనేది
ప్రేక్షకుడి
కల.
ఆ
సంభందిత
హీరోలు
కాని,
హీరొయిన్
గాని,
ఇతర
పాత్రదారులు
కాని
ప్రేక్షకుల
కనుచూపు
మేరలో
ఉండేవారు
కారు.
దాంతో
వారు
ఎప్పుడైనా
ఎక్కడైనా,
కనిపిస్తే
చాలు
సాక్షాత్తు
ఆ
భగవంతుడే
ప్రత్యక్ష
మయినట్లుగా
భావించేవారు.
ఇప్పుడు
మీడియా
పుణ్యమా
అని,
రాజకీయాల
దైన్యమా
అని,
అందరు
ప్రేక్షకుడికి
దగ్గరగా
అయిపొయారు.
అంటే
దాదాపు
ఒకప్పుడు
వందకు
ఒక్క
శాతం
సినిమా
వ్యక్తి
తెలుసు
అని
చెబితే
నేడు
వందకు
ఎనభై
శాతం
సినిమా
వ్యక్తులతో
వారికి
సన్నిహితమైన
సంబంధాలు,
పరిచయాలు
ఉంటున్నాయి.
దాంతో
ప్రేక్షకుడికి
ఏది
కొత్తదనం
లేదు.
చూసిన
,
మాట్లాడిన
వ్యక్తులు
ఏమి
చేసినా
కొత్తదనం
ఎప్పుడు ఉండదు.
ఉదాహరణకు
1960-75
దాదాపు పదిహేను
సంవత్సరాలు
పాటు
తల్లి
తండ్రిని
చంపితే
పగ
తీర్చుకునే
పాత్రల్లో
ఎమ్.టి.
రామారావు,
ఒకళ్ళను
ప్రేమించి
మరొకరిని
పెళ్లి
చేసుకుని
ప్రేక్షకుల్ని
వెక్కి
వెక్కి
ఏడిపించేలా
నటించి
మెప్పించిన
అక్కినేని నాగేశ్వరావు
,
శోభన్
బాబు
లు
నిరంతరం
ఒకే
రకమైన
పాత్రలు
పోషించినా
కూడా
జనాదరణ
పొందేవి.
కారణం
అక్కడికి
ఎవరు
సినిమా
చూడాలని
ఎవ్వరు
రాలేదు
.
ఎం.
టి
.
రామారావు
నో,
అక్కినేని
నో లేక
ఆ
య
సంభందిత
హీరోలను చూద్దామని
వచ్చేవారు.
అప్పట్లో
చెన్నై
టినగర్
కు
వెళ్లి
ఎవరైనా
బయటకు
రాకపోతారా,
చూసి
ఆ
రోజంతా
తాము
సాధించిన
ఈ
ఘనతను
అందరికి
చెప్పుకోక
పోతానా అనేలా
ఉండేది
.
కాని
ఇప్పుడు
ఎక్కడ
చూసినా
వారే.
సినిమా
చేసిన
దగ్గరనుండి
ప్రచారం
కోసం
వారే,
సబ్బులు,
పేస్టులు
అన్ని
ప్రచారాలకు,
వేదికలకు,
రాజకీయ
ప్రచారానికి
వారే.
ఇక
కొత్తదనం
ఏముంది?
ఎవరికోసం
ప్రేక్షకుడు
సినిమా
కు
వెళతాడు?
ఎంతో
కష్టపడి
సొంతంగా
దూకి,
సొంతంగా
సాహసాలు
చేసినా
సరే
విలువలేదు.
ఎందుకంటే
వారి
వ్యక్తిగత
జీవితం
రోడ్డుపైనే
ఉంటోంది
.
వారు
దగ్గినా,
తుమ్మినా,
పెళ్లి
చేసుకున్నా,
తాగినా,
వాగినా,
పడినా, భార్యా
భర్తలు
పోట్లాడుకున్నా
అన్నీ
అన్ని
వర్గాలకు
తెలిసిపోతున్నాయి.
సమస్యలు,
దారుణాలు
ఎక్కడ
లేవని?
ఎవరు
తాగటం
లేదు?
ఎవరు
నోటికొచ్చినట్లు
వాగటం
లేదు? కాకుంటే
ప్రచారం
ఎందుకు
జరుగుతోందని
?
ఆ
ప్రచారం
అవసరమా?
దానివల్ల
ఒరిగేదేమిటి?
అని
ఒక్కసారి
నిశితంగా గమనిస్తే
సినీ
పరిశ్రమకు
పాత
రోజులు
రాకపొవు.
''The
cinema began with a passionate, physical
relationship between celluloid and the
artists and craftsmen and technicians
who handled it, manipulated it, and came
to know it the way a lover comes to know
every inch of the body of the beloved.
No matter where the cinema goes, we
cannot afford to lose sight of its
beginnings.''Martin
Scorsese
అయినా
గెలిచే
రోజుల్లో
హీరోలు
,
సాధించే
ధోరణిలో
నిర్మాతలు,
ప్రతిభ
కనపరచే
దిశలో
దర్శకులు
ఉన్నారు.
అదే
కోవలో
ఎనభై సినీ
పరిశ్రమను
గురించి,
ఆ
చిత్రాల
గొప్పదనం,
నటీనటుల
గురించి,
వారి
ఆశయాల
గురించి
ఎంతో
శ్రద్దగా
శ్రీ
పొన్నం
రవిచంద్ర
గారు
అందరికీ
అర్థమయ్యే
రీతిలో
రచించి
ఒక
ప్రభంజనాన్నే
సృష్టించారు.
ఒక్క
మాటలో
చెప్పాలంటే
దేశ
వ్యాప్తంగా
తెలుగు
చిత్ర
సీమ
స్థానం
రెండవది
అని
ఈ
రచయిత
తమ
పరిశోధనలో
తెలిపారు పొన్నం
రవిచంద్ర
గారు
ఒక్క
రచయిత
గా
ఎన్నో
సంపాదకీయాలు
రాసినా,
కవిగా
కవితలు
రచించి
తమదైన
స్థానాన్ని
తాము
నిలబెట్టుకున్నా
రు.
వీరికి
బాపు
లాంటి
గోప్పవారితో
పరిచయం
కలిగి
ఉండటమే
వీరు
ఈనాడు
ఇంతటి
స్థాయిలో
సినిమాల
పై
అవగాహన
,సాధక
భాధకాలు
తెలుసుకుని
ఉన్నారేమో
అనిపించక
మానదు.
అందుకే
వీరంటారు
కవిగా,
ఒక
రచయితగా
ఎన్నో
సాధించినా
పొందని
ఆనందాన్ని
నేడు
ఈసినీ
ప్రస్థానం రాసాక
కలిగిందనడం
లో
వీరిలోని
నిరాడంబరత
స్పష్టంగా
కనిపిస్తుంది.
ఎందుకంటే
ఎన్ని
బలవంతపు
పనులు
చేసి
సాధించినా
రాని
త్రుప్తి
కేవలం
ఇష్టమైన
పనులు
చేయడంలో
ఉంటుందని
వీరి
మాటల్లోనే అర్థమవుతుందని
అత్యంత
ప్రభావోపెతమైన
సినీ
పరిశ్రమ
గురించి
తెలియజేయడం
రావిచంద్రగారికే
చెల్లింది.
ఒకానొక
సమావేశంలో
ప్రముఖ
సినీ
రచయిత
మహారధి
గారు
మాట్లాడుతూ
''
సినిమా
అంటే
మీకేమి
తెలుసు?
సమయానికి
తినీ
తినక
రోడ్డు
పక్కన
పడి
ఎంతో
కష్టపడి
ఉన్న
డబ్బంతా
పోగొట్టుకుని
సినిమా
తీస్తే
మీరు
ఒక్క
నిముషంలో
బాగోలేదని
చెప్పేస్తారు.
డ్రెస్సెస్
బాగోలేదని,
మాటలు
సరిగా
కుదరలేదని,
చివర
సరిగా
తీయలేక
పోయారని
అంటారు
.
అలా
అనేవారు
ఒక్క
సరి
సినిమా
తీయడం
గమనించండి
''
అని
ఆవేశంగా
అన్నారు.
ఆ
మాటలు
నూటికి
నూరుపాళ్ళు
నిజం
కాకున్నా
కొంతవరకు
నిజమే
అనిపించింది.
తర్వాత
నువ్వెవరో
చెప్పడానికి
నీ
స్నేహితులను
చూపించు
అనే
మాట
ఎంతో
ప్రతిభావంతమయినది,
ఈ
రచయితతో
నాకు
పరిచయం
లెదు.
పేరు
మాత్రం
తెలుగు
సాహితీ
చరిత్రలో
వినిపిస్తూనే
ఉంటుంది. వీరితో
నాకు
పరిచయం
లేకున్నా
వీరి
స్నేహితులు
శ్రీలక్ష్మి,
మామిడి
హరికృష్ణ
నాకు
ఆత్మీయులు,
సన్నిహితులు
కావడం
తో
వీరి
స్వభావాన్ని
సులభంగా
అంచనా
వెయగలిగాను.
శ్రీ
హరి
చంద్ర
అనే
ఈ
ముగ్గురు
స్నేహితులు
ఒకే
మాటై
సాహిత్యానికి
అమితమైన
సేవ
చేయడం ఒకరి
సేవలో
మరొకరు
చేయూత
ఇవ్వడం
అనేది
ఎంతో
హర్షించ దగిన విషయం.ఎంత
పెద్ద
కవి
అయినా
ప్రోత్సాహం
ఎంతో
అవసరం.
అది
కూడా
నిష్కల్మషంగా
ఉండాలి.
అవి
సంపాదించుకున్న
పొన్నం
రవిచంద్ర
గారు
మానవత్వం
ఉన్నవారని
తెలుస్తుంది.
మనిషికి
మనిషికి
ఏమాత్రం
పొంతన
కుదరని
ఈ
రోజుల్లో
వీరి
స్నేహం
చిరకాలం
నిలవాలని
కోరుకుంటున్నాను.
ఇక
తెలుగు
సినిమా
చరిత్రను
భావి
తరాలకు
అందివ్వాలనే
సంకల్పంతో
వీరి
కృషి
ఎంతో హర్షించ దగినది.
తెలుగు
చిత్ర
పరిశ్రమ
గత
ఎనభై
సంవత్సరాలుగా
ఎన్నో
చిత్రాలను
విడుదల
చేసింది.
అన్ని
భాషల
చిత్రాల
కంటే
ఎక్కువ
విజయాలనే
చవి
చూసింది.
సగటు
భారతీయునికి
ఉన్న
ఏకైక
వినోదం
సినిమా.
అలంటి
సాంకేతిక
పరిజ్ఞానాన్ని
తొలిసారిగా
కదిలే
బొమ్మల
తో 1895
అయ్
లుమిఎర్
బ్రదర్స్
పరిచయం
చేసారు
కూడా.
ఈ
సినిమా
నుండి
నుండి
ప్రారంభమై,
మూకీ
యుగం,
ఆలం-ఆరా(
తొలి
టాకీ)
ఒక
మైలు
రాయిగా
1931
లో
జరిగిందాని
అనేక
విశేషాలతో
ఈ
గ్రంధం
అలరించబడింది
హాలివుడ్
,
ఇతర
ప్రపంచ
సినీ
రంగాల
నుంచి
భారతీయ
సినిమాలకు
విశిష్టతను
అందిస్తున్న
అందిస్తున్నకారకాలలో
పాటలు
ముఖ్యమైనవి.
పాత్రల
పరంగా
చిత్ర
పరిశ్రమ
ప్రత్యేకతను
సంతరించుకుంటున్నా
పాటల
పరంగా
కూడా
ఒక్క
సినిమా
కు
40
నిముషాలు
పాటలకే
కేటాయిస్తున్నారంటే
పాటల
ప్రత్యేకత
అర్థమవుతుంది
. కాని
అన్ని
వేల
పాటల్లో
అతి
ముఖ్యమైన
80
పాటలను
ఎంపిక
చేసి
ఇందులో
పొందుపరచడం
అనేది
సామాన్యమైన
విషయం
కాదు.
ఇక
సాహితీ
పరమైన
అంశాలలో
ముఖ్యమైనది
కధలు.
వాటిగురించి
తెలుగు
సాహిత్యాన్ని
ఆశ్రయించింది
అనడంలో
ఏ
మాత్రం
సందేహం
లెదు.
సాహిత్యంలోని
ఆత్మను
మిస్
చేయకుండా
తెరపై
ఆవిష్కరించాలంటే
చాల
విధ్వత్తు,
జ్ఞానం,
సాహితీ
సినెమా
రంగాలపై
సమానమైన
పట్టు
దర్శక
రచయితలకు
ఎంతో
అవసరం.
కాని
నేటి
తెలుగు
దర్శకులలో
చాలా
మందికి
అంత
పరిజ్ఞానం
కాని,
సాహితీ
అభినివేశం
కానీ
లెవు.
దీనివల్ల
తెలుగు
సాహిత్యం
దారి
తెలుగు
సినిమా
దారి
వేరు
అయ్యాయి
అని
రచయిత
తెలిపే
తీరు
ఎంతో
ఆలోచించాల్సిన
విషయం.
ఒక్క
విషయం
మాట్లాడాలంటే
కదా
రచయితలు
ఎక్కువగా
ఉంటున్న
ఈ
రోజుల్లో
వారిని
ఉపయోగించుకోకుండా
కధలను
చూసి
అక్కడ
కొంత,
ఇక్కడ
కొంత
కాపీ
చేసి
కధను
సినిమా
గా
తీసి
నిర్మాత
దర్శకులు
సమస్యలలో
పడేకంటే
నచ్చిన
కధకు
చేతనైనంత
పారితోషకం
ఇచ్చి
ఆ
కధను
ఆ
రచయిత
చేతే
కొన్ని
కావాల్సినంత
మార్పులు
చేసుకుంటే
సినిమా
కొంతవరకు
ప్రశాంతతను
సంతరించుకుంటుంది
.
ఎందుకంటే
నిర్మాతలు
కధలు
రాయలెరు.
దర్శకులు
కధను
మర్చలెరు.
ఎవరు
ఏమి
చేయాలో
వారే
ఆ
పని
చేయాలి
అనేది
తెలుసుకోకుండా
అన్నీ
ఒకరే
అయ్యి
డబ్బును
సంపాదించుకోవాలనే
తీరును
పూర్తిగా
మార్చు
కాకుంటే
చివరికి
ఎవరికీ
ఏదీ
కాని
స్థితికి
తెలుగు
పరిశ్రమ
చేరుకుంటుంది.
ఏవో
కొన్ని
మాధుర్యాలు
తప్ప
ఏమాత్రం సాహిత్యం
లేకుండా
రణ
గొణ
ధ్వనుల
మధ్య
అరుపులు,
కేకలు
,
హాస్యం
పేరిట
ద్వంద్వార్ధపు
మాటలు
కొనసాగింపు
లేకుండా
మార్చుకుంటే
బావుంటుంది
కొసమెరుపుగా
తెలుగు
చిత్ర
పారిశ్రామను
చిన్న
చూపు
చూస్తూ,
ఏమి
చేసిందని
నిలదీస్తున్న
ప్రపంచానికి
ఎన్ని
రికార్డ్స్
బద్దలు
కొట్టిందో,
ఎన్ని
మైలు రాళ్ళను దాటిందో
అని
పాటలు,
కధ
నాటక,
భాష,
ను
గూర్చి
ఎంతో
విపులీకరంగా
వివరించి
మా
తెలుగు
వారి
ఆత్మగోరవాన్ని
నిలబెట్టిన
శ్రీ
పొన్నం
రవిచంద్ర
గారికి
తెలుగు
పరిశ్రమ
తప్పక
అభినందిస్తుంది
.
స్వలాభం
వెంట
పడకుండా
ఎంతో
దీక్షగా
తీసుకుని
ఎవ్వరు
మరవలేని
తీరులో
తీర్చిదిద్దిన
తీరుకు
నేను అభినందిస్తున్నాను.
''Telugu Cinema
is still a very young art form with
extraordinary techniques and very
impressive special effects but sometimes
it seems the soul has been taken out of
things.''
కాపీలకు
విశాలాంధ్ర
బుక్
హౌస్
(అల్
బ్రాంచెస్)
నవోదయ
బుక్
హౌస్,
హైదరాబాద్
నవయుగ
బుక్
హౌస్,
హైదరాబాద్
ఫోన్
; 9440077499
వెల
: 900
రూపాయలు |