"వాక్యం
రసాత్మకం
కావ్యం
అన్నారు
పెద్దలు".
ఒక
మంచి
వాక్యం
వాడుక
చేసికోగలిగితే
ఓ
మాహ
కావ్యాన్నే
మననం
చేసుకొన్నంత
రసానుభూతి
కల్గుతుందని
భావన!
అనేక
మంది
ఋషులు,
కవులు,
పండితులు,
మాహనీయులు
తమ
తమ
గ్రంధాలతో,
మహా
కావ్యాలతో,
మధుర
వచనాలతో,
ప్రవచనాలతో
మన
భారతావనినే
కాదు
యావత్
ప్రపంచమునూ
పునీతం
చేసిన
చరిత్ర
మన
తెలుగు
జాతికే
వుంది. "నానృషిహి
కృషితో
కావ్యం"
అన్నారు.
మన
తెలుగు
భాష
చరిత్రను
తిరగ
వేస్తే -
పురాణ
కాలం
నుంచి,
ద్వైతాద్వైత
సింధ్ధాంతముల
తాకిడినుంచి,
శైవ,
గౌడీయ,
వైష్ణవాది
బహుముఖ
భాగవత
భక్తి
సంప్రదాయాల
సాన్నిధ్యాల
నుంచి,
ఆయా
కాల
మాన
పరిస్థితులకూ,
భావోద్వేగాలకూ,
సాంప్రదాయ
వైషిస్ట్యాలకూ
నిలువుటద్దం
పడుతూ,
మహారాజ
పోషకుల
విజ్ఞాన
ప్రేరణా
శక్తిగా,
తలమానికముగా
నిలిచి,
అవసర
మైనచోట్ల
తలవొగ్గి,
కాల
క్రమేణా
అనేకానేక
రూపాంతరాలు
చెందటము
మనము
స్పష్టముగా
గమనించవచ్చు.
అందు
వల్లనే "తెలుగు
జాతి
మనది
నిండుగ
వెలుగు
జాతి
మనది"
అనటం
అతిశయోక్తి
కాదు.
అసలు
సిసలైన
తెలుగు
వారిగా
మనం
జన్మించి
వుండటమే
కాదు,
తెలుగు
భాష
మీద
అభిమానం
కలిగి
వుండి,
యీ
జన్మలో
భాగవత
భక్తి
సంప్రదాయాలకు,
తాత్విక
చింతనాది
నేపధ్యము
కలిగి
వుండటమనేది
నిజంగా
జన్మ
జన్మాంతర
వంశ
పారంపరిక
పురాకృత
సుకృతం
అని
నా
అభిప్రాయము.
"తెలుగు
వాళ్ళందరం
తెలుగు
లోనే
మాట్లాడుకుందాం!"
ఎంత
మంచి
ప్రేరణా
పూరిత
వాక్యమో
కదా!
కానీ
ఇక్కడ
యేమవుతోందంటే
- తెలుగు
వచ్చి
కూడ,
మరి..
వారి "గొప్ప"
తగ్గి
పోతుందనో
యేమో..
తరచూ
ఆంగ్లము
లోనే
సంభాషణ
సాగిస్తూ
వుంటారు
కొందరు 'టెలుగూ'
వారు .. .
చిత్రం
యేమిటంటే,
సర్వ
సాధరణంగా
యే
ఇద్దరు
తెలుగు
వాళ్ళు
వారి
సంభాషణ
అయినా
వివాదపు
దిశ
గా
వెళ్ళే
తరుణం
లో
మాత్రం,
విధిగా
ఆంగ్లము
లోకి
దిగిపోవడమ
పరిపాటి.
బహుశా
ఆంగ్లములోని
తిట్లతో
వారి
భాషా
పరిణతి
మరింత
ఇనుమడిస్తుందనో
లేక
మన
తెలుగులొ
ఓ
మోస్తరుకు మించి
తిట్లే
లేవనో :).
వారి
వుద్దేశ్యం
ఏమైనా
సంతోషించాల్సింది
యేమిటంటే
తెలుగులో
తిట్టు
కోవటాని
వారు
ఇష్ట
పడటం
లేదన్నది
మాత్రం 'నిర్వివాదాంశం'.
ఇక
స్వఛ్ఛ
మైన
తెలుగు
భాషా
నిగారింపు
గురించి
మాట్లాడు
కోవాలన్నా
తేనె
లాంటి
తేట
తేట
తెలుగులోని
మధుర
మైన
తీయదనాన్ని
గురించి
వివిరించాలన్నా
ఎంత
చెబితే
మన
భాషా
జిజ్ఞాస
సరిపోతుంది
గనక?
ఆది
కవి
నన్నయ
భట్టారకుని
నుంచి..
సర్వ
సంగ
పరిత్యాగి
యోగి
వేమన
నుంచి..
రామాయణ,
మహా
భారత,
భాగవతాదులను,
తాము
అవపోసన
పట్టి -
మనకు
కళ్ళకు
కట్టినట్టు
శులభ
శైలిలో
అంధించిన
పరమ
భాగవతాదులైన
తెలుగు
కవి
కోవిదులనుంచి..
చరిత్రల
కెక్కిన
కమనీయ
చరితార్ధులనుంచి..
నేడు
సినీ
తెరల
వెనుకనున్న
రమణీయ
రచయితల
వరకూ --
అనేక
మంది
మన
తెలుగు
వారవటం
మనకి
ఒకింత
గర్వ
కారణమే
కదా!
అలనాటి
దైవ
సంకల్పితోత్తములైన
భక్త
కవులనుంచి,
నేటి
మేటి
భావ
కవుల
వరకూ,
అందరూ
మన
తెలుగు
తల్లి
ముద్దు
బిడ్డలే
కాదా!!
అసలు
మిగతా
భాషల
కంటే
కూడ,
తెలుగులో
వున్న
సౌలభ్యము
యేమిటంటే,
దేవ
భాష
సంస్కృతము
మరియు
రాజ
భాష
హిందీ
లోని
అనేక
పద
ప్రయోగములు
మన
తెలుగు
భాషలోకి
తేలిగ్గా
ఇమిడిపోగల్గుటయే.
మనం
తరచూ
వాడుకొనే
మాటల్లో
యీ
రెండు
భాషల్లోని
పదాలు
మనకు
తెలియ
కుందానే
దొర్లిపోతూ
వుంటాయి.
అదే
తెలుగు
గొప్పదనం,
అందువల్లే
బహుశ
తెలుగు
వారు
సంస్కృతాది
దేవ
భాషల్లో
వున్న
ఉత్తమోత్తమ
గ్రంధాల్ని
మిగతా
భాషల
వారి
కన్నా
బాగా
ఆశ్వాదించ
గల్గుతునారు.
ఇన్నిమాటలేల?
ఏకంగా
ముప్పై
రెండు
వేల
సంకీర్తనలని
మురిపెంగా
సునాయాసంగా
వ్రాసిన
ఒక్క
అన్నమాచర్యుల
వారే
మన
తెలుగు
వారికో
వెలలేని
అనంత
భాండాగారము
కాద?
ఎంతో
నిగూఢమైన
అర్ధాన్ని
తన
కీర్తనల్లో
ధీటుగా
నింపి,
రంగరించి,
చక్కని
అర్ధవంతమైన
తెలుగులో
అలవోకగా
అందించిన
ఆ
పద
కవితా
పితా
మహునికి
ఏమిచ్చి
మన
రుణం
తీర్చుకో
గలం
చెప్పండి?
భాషకూ -
భావానికి -
' భక్తి '
అనే
ఒక
అవ్యాజ
మైన
బంధమును
ధ్రుఢంగా
సంధించి -
ఒక
ప్రక్క
భగవంతుణ్ణి
స్తుతిస్తూనే,
అంతర్లీనంగా
మరో
పక్క
అనేకానేక
లోకపు
పోకడలని
...తేట
తెల్లముగా
విశద
పరచి..
మన
తెలుగు
వారందరికి
శిరోమణి
గా
నిలిచారాయన!
మరి
పరమ
పూజ్యమైన
సంగీత
విజ్ఞానానికే
తానొక
నిగూఢ
నిఘంటువై..
చరితార్ధుడైన
త్యాగరాజ
స్వామి,
మువ్వలో
పుట్టిన
మహాకవి
క్షేత్రయ్య,
అచంచల
మైన
శ్రీ
రామ
భక్త
రామదాసు,
సుపద్య
గమన
యోగి
వేమన,
సుశతకాల
గతుల
రీతి-
సుమతి..
ఇలా
ఎందరెందరో
దివ్య
మూర్తులు
.. మన
తెలుగు
భాషలో
తమ
కావ్యామృతమును
నింపి,
ఒక
సుందర
శిల్పము
వలే
సజీవముగా
మలచి
విరాజిల్లింప
జేసిన
పరమ
సుగుణధాములు
మన
తెలుగు
వారు.
శ్రీమద్
భాగవతము
తెలుగువారందరికి
సుపరిచితమైన
పురాణ
గ్రంధము.
భాగవతము
పేరు
వినగానే
పోతనా
మాత్యుల
వారు
జ్ఞప్తికి
వస్తారు.
వ్యాసుడు
రచించిన
సంస్కృత
భాగవతముకన్నా
కూడా
శ్రీ
బమ్మెర
పోతన
గారి
భాగవతమే
తెలుగువారి
మనస్సులలో
ఎక్కువగా
నాటుకున్నది
అంటే
అతిశయోక్తి
కాదు.
చాలామంది
తెలుగువారి
మనో
ఫలకాల్లో
పోతన
గారి
భాగవతములోని
కొన్ని
పద్యములు
చెక్కు
చెరగని
ముద్ర
వేసినాయి.
ఉదాహరణకు
గజేంద్ర
మోక్షము
లోని "ఎవ్వనిచే
జనించు
జగమెవ్వరి
లోపల...",
"లావొక్కింతయు
లేదు,
ధైర్యము
విలోలంబయ్యె...",
"అల
వైకుంఠ
పురంబులో
నగరిలో..
నా
మూల
సౌధంబు...",
"సిరికిన్
చెప్పడు
శంఖ
చక్ర
యుగమున్
చేదోయి
సంధింపడే...",
అనే
పద్యములు -
అల్లాగే
ప్రహ్లద
చరిత్ర
లోని "కంజాక్షునకు
గాని
కాయంబు
కాయమే?
పనగ
గుంభిత
చర్మ
భస్త్రి
గాకా..", "తన్ను
నిశాచరుల్
వొడువ
దైత్య
కుమారుడు
మాటి
మాటి
కో
పన్నగ
శాయి...",
"ఇందుకలడందు
లేడని .."
అని
భక్త
పోతన
గారు
ప్రహ్లాద
ముఖ
పూర్వకముగా
ఆ
మహా
విష్ణు
తత్వాన్ని
మంకు
ఎంతో
భక్తితో
తెలిపారు.
"మందార
మకరంద
మాధుర్యమున
దేలు
మధుపంబు
వోవునె
మదనములకు
.." అంటారాయన
ఎంతో
అందమైన
వుపమానములతో..
అందుకే
కాబోలు
యీ
కాలములో
సాక్షాత్తూ
భగవదవతరముగా
వెలసిన
శ్రీ
సత్యసాయి
బాబావారు
కూడా
అనేక
పర్యాయములు
తమ
అధ్యాత్మిక
ప్రసంగములలో
- భాగవతము
యొక్క
ఉత్క్రుష్టతను
తెలుపుచూ..
" భాగవతము
" అనే
పదమును
పలుమార్లు
ఉచ్చరించుచూ
వున్నచో,
ఆ
ఉచ్చారణా
వేగమునకు "
బా
గ
వు
తా
ము "
అని
వినిపించ
గలదని
సెలవిచ్చినారు.
అంత
గొప్పది
ఆ
భాగవతామృత
పఠనము
మరి!
అలాగే
శృంగార
నైషధంలో
కవి
సార్వ
భౌములు
శ్రీనాధుల
వారంటారు:
"సత్యలోకమునుండి
సకల
లోకంబులు -
ఆటపట్టులు
మాకు
అబ్జ
వదన
మధురాక్షరము
లైన
మా
మాటలు
వినంగ -
అమృతాంశులే
యోగు
అనుపమాంగి
శారదా
దేవి
ముంజేతి
పలుకు
చిలుక -
సమద
గజయాన
సద్బ్రహ్మచారి
మాకు
వేద
శాస్త్ర
పురాణాది
విద్యలెల్ల
- తరుణి,
నీ
యాన
ఘంటా
పధమ్ము
మాకు."
దమయంతి
తో
హంసల
చేత
అందముగా
కవిసార్వ
భౌముల
వారు
వర్ణించిన
వైనమది!
మరి
ఆంధ్ర
భోజుడైన
శ్రీ
క్రిష్న
దేవ
రాయల
వారయితే
తమ
అధ్భుత
వ్యాకరణ
శైలితో
పటుత్వముగల
"ఉత్పలమాల
" లో
శ్రీ
వేంకటేశ్వర
స్వామి
వారిని
ఎంతో
చక్కగా
కీర్తించిన
తీరు
చూడండి:
"శ్రీ
కమనీయ
హారమణి
జెన్నుగ
దానును,గౌస్తుబంభునం
దాకమలా
వధూటియును
దారత
దోప
పరస్పరాత్మలం
దాకలితంబు
లైన
తమ
యాక్రుతు
లఛ్చత
బైకి
దోపన
స్తోకత
నందు
దోచెనన
శోభిలు
వేంకట
భర్త
గొల్చెదన్"
ఇది
మన
విజయ
నగర
సామ్రజ్య
నిర్మాణ
తేజో
విరాజుని
భాషాభి
మానముతో
కూడిన
భక్తికి
ఒక
అందమైన
మచ్చు
తునక
మాత్రమే
సుమా!
ఇక
ఆధునిక
రచయితల
గురించి
మాట్లాడు
కుంటే,
సహజ
కవుల
నుచి
సినిమా
రచయితల
వరకూ
కూడా
అనేకమంది
తెలుగు
వారు
తమ
సాహితీ
సౌరభాలను
నాటికీ
నేటికీ
వెదజల్లుతునే
వున్నారు.
విశ్వనాధుల
వారి
వేయి
పడగలను
చూసినా,
నారాయణ
రెడ్డి
గారి
విశ్వంభర
లోని
నవ
పోకడలను
విన్నా,
దేవులపల్లి
వారి
భావు
కవిత్వాన్ని
అహ్లాదముగా
అస్వాదించినా
మనకు
ఒక
అనిర్వచనీయ
మైన
ఆనందం
కలగక
మానదు.
అసలా
కవిత్వాని
కున్న "
శక్తి "
అటువంటిది
మరి.
ఒక
నండూరి
సుబ్బారావు
యెంకి
పాట,
ఒక
గుడిపాటి
వెంకట
చలం
సగటు
మాట,
ఒక
దేవరకొండ
బాల
గంగాధర
తిలక్
వర్ణనా
తేట,
ఒక
యండమూరి,
మల్లాది,
యద్దనపూడి,
ముప్పాళ్ళ,
ముళ్ళపూడి,
తెన్నేటి,
ఇలా
చెప్పుకుంటూ
పోతే -
వారు
తమ
నవలల
నడతలలో
గాని,
నాటికల
పేటికల
మాటున
గానీ..
తెలుగు
భాష
అనే
ఖడ్గానికి
మరింత
పదునునూ,
క్రొత్త
వొరవడినీ,
వేగాన్నీ,
తెచ్చి
పాఠక
ప్రపంచములో
ఒక
ప్రత్యేక
శైలితో
నూతన
అధ్యాన్ని
ప్రారంభింప
చేశారని
చెప్పాలి.
ఉదాహరణకు-
"నా
అక్షరాలు
వెన్నెల్లో
ఆడుకొనే
అందమైన
ఆడపిల్లల్లు"
అని
పోల్చినా..
"నిద్దిరిస్తున్న
ప్రియురాలి
ఎర్రని
అధరాల్ని
ముద్దుపెట్టుకున్నాను..
ఎంత
అందమైన
దొంగ
తనం
అదీ!"
అన్న
ఉమర్
ఖయ్యాం
భావాన్ని
తేట
తెలుగులో
చక్కగ
పరిమళింప
చేసినా..
అలాగే
పేద
వాడి
కష్టాల్నీ,
బడుగు
జీవన
బాధల్నీ,
సామాన్య
మానవుల
మనో
వేదనల్నీ
బట్ట
బయలు
చేస్తూ
కలమనే
కత్తితో-
చురకలు
వేసినా
వారికి
వారే
సాటి.
ఇంకా
ఒక
ఆరుద్ర,
ఒక
జాలాది
మనకు
తెలుగులో
అందించిన
ఆలోచనా
సరళి
మరే
ఇతర
భాషల
కవులకూ
అసాధ్యమే
అనవచ్చును.
"కూత
నేర్చి
నోల్ల
కులం
కోకిలంటరా?
ఆక
లేసి
కేక
లేస్తె
కాకు
లంటరా? "
అని
సూటిగా
ప్రశ్నించినా..
"పదండి
ముందుకు
పదండి
తోసుకు"
అని
ఉద్రేక
పరచినా,
తెలుగు
కవితా
గానాని
కున్న
రూపం
అనిర్వచనీయ
మైనది.
అందమైన
ప్రకృతినీ,
అహ్లాద
కరమైన
వాతావరణాన్నీ
తియ్యని
తెలుగులో
వర్ణించడంలో
దేవులపల్లి
వారిది
అందెవేసిన
చెయ్యి. "కొమ్మల
గాలులు
రెప
రెప.."
మన్నపుడల్లా..
వారే
మనకు
ముందుగా
గుర్తుకు
వస్తారు!
అలాగే
మనసు
కవి
ఆత్రేయ,
రెండు
ప్రక్కలా
పదునైన
వాటముకల
కవి
వేటూరి,
మరచి
పోలేని
మధుర
కల "
సిరివెన్నెల
" ఇలా
తెలుగు
సినిమా
పాటల్లో
అసలైన
కవులు '
సిసలైన '
సాహిత్యాన్ని
మనకు
అందిస్తునే
వున్నారు.
తెలుగు
వారికి
అసహజ
వేషం
కన్నా
భేషైన
రోషము
మాత్రం
ఒకింత
ఎక్కువే
ననీ,
ఆ
రోషనికి
చిహ్న
మైన
మీసం
గురించి '
శ్రీ
శ్రీ '
గారు
ఎంత
చమత్కారంగా
చెప్పారో
యీ
సీస
పద్యంలో
చూడండి:
"కారు
మబ్బులబారు
సేరునేలెడి
తీరు
కోర
మీసము
పొందు
కోరుకొందు
మృగరాజు
జూలునే
తెగనోడ
జూలు
నీ
ఘన
మీసము
పసందు
కనుల
విందు
గండు
చీమల
దండు
కదలాడినటులుండు
నీ
మీసము
తెరంగు
నీలరంగు
మెలిపెట్టి
నెలబెట్టు
మీసాల
రోసాలు
గగన
మండలముపై
కాలు
దువ్వు
ఎవరు
మోయుచున్నారు
ఈ
అవని
భర
మాదిశేషుడా,
కూర్మమా?
కాదు,కాదు
అష్టదిగ్గజ
కూటమా?
అదియు
కాదు-
మామ
మీసాలె
భువికి
శ్రీరామ
రక్ష!!"
స్థలా
భావం
వల్ల
ఈ
వ్యాసం
లో
చోటు
చేసుకోలేక
పోయిన
అనేకానేక
మంది
తెలుగు
కవి
కోవిదులకు,
మన
మనసుల్లో
తప్పక
సముచితమైన,
సమోన్నత
మైన
సుస్థిర
సిం
హాసనం
వేయ
బడి
వున్నదన్న
విషయం
మరువరాదని
సవినయము
గా
మనవి
చేస్తునాను.
నా
యీ
ముందుమాటల్ని
మంచి
మనసుతొ
చదివి,
పెద్ద
మనసుతో
ఆస్వాదించే
మీ
అందరి "సుమనస్సులకూ
నా
నమస్సులు".
విజ్ఞులు,
ప్రజ్ఞులు,
ప్రతిభావంతులూ,
సాహితీ
దురంధరులూ,
అనేక
ప్రత్యేక
ప్రక్రియలతో
పలువురిని
ప్రభావితము
చేయ
గల
ధీశాలులు
మన
తెలుగు
వారు!
వారందరూ -
మరియు..
మనిషికి
మరణం
వున్నదనవచ్చును
గానీ
అక్షరం
మాత్రం
అజరామరమైనదని
తమ
శాశ్వత
మైన
వ్రాత
పూర్వకముగా
రుజువుచేసిన
వారాందరూ
ప్రాతః
స్మరణీయులే..
అటువంటి..
" ఎందరో
మహాను
భావులు ..
అందరికీ
వందనములు
"
సర్వే
జనాహ్
సుఖినో
భవంతు.
సమస్థ
సన్మంగళాణి
భవంతు.
|