Sujanaranjani
           
  సారస్వతం  
  భాగవత గణనోపాఖ్యానము పద్యగద్యల సంఖ్యలు – ఒక అధ్యయనము


 
 

                                                                       ఊ. సాంబశివరావు, భాగవతగణనాధ్యాయి.

 

ఉపోద్ఘాతము

భాగవతం పెద్ద ఙ్ఞాన సముద్రము. పోతనగారు దానికి తన కవితా చమత్కృతుల సుగంధం అద్దారు. అనేక గొప్పగొప్ప వ్యాఖ్యానాలు ఆ మహా భాగవత విశ్వాం లోని కవితా మాధుర్యాదుల అద్యయనంతో వచ్చాయి. తరతరానికి నవతరం మేధస్సు, అవగాహనా శక్తి అధికమౌతోంది. కొన్నాళ్ళకి మన పూర్వ ఋషులను అందుకుంటారేమో. అందుకని సరి కొత్త విధానాలుతో పెద్ద విషయాలు సులువుగా అందుబాటులోకి రావాలి. దీనికి చక్కటి సాధనాలు కంప్యూటరు, వేదగణితాది విధానాలు. కంప్యూటరులో అనేక పుస్తకాలు పట్టే విషయాన్ని సులువుగా పెట్టచ్చు. ఇంకా పట్టికలు పటాల రూపాల్లో చాలా అనువుగా పెద్ద పెద్ద గణాంకాలు లెక్కించి బాగా అర్థమయ్యేలా చూపొచ్చు. అలా కంప్యూటరు వాడి లెక్కించి అధ్యయనం చేయడమే గణనోపాఖ్యానం పద్దతి. ఇది ఆసక్తికరంగానూ ఉంటుంది, కొత్తదనం కనిపిస్తుంది.

కనుక మన పోతన తెలుగు భాగవతం లోని పద్యగద్యల సంఖ్యలతో ఇలా అధ్యయనం చేసి చూద్దాం. పోతన తెలుగు భాగవతాన్ని యూనికోడ్ లో వర్డ దస్త్రంగా తయారుచేసా. ఏ పదాని కా పదం, ఏ అక్షరాని కా అక్షరం విడదీసి దత్తైలు జనింపజేసా. పదాల దత్తై లో 2.97 లక్షల వరుసలు, అక్షరాల దత్తై లో 8.53 లక్షల వరుసలు వచ్చాయి. వీటినుండి జనింపజేసిన పద్యాలు – ప్రథమాక్షరాల దత్తై నుంచి నకలీకరణ, క్రమీకరణ, వడబోత, పివట్ టేబులతో (copy paste, sort, filter, pivot table) కంప్యూటరులో జనింపచేసిన పట్టికలు, పటాలు (tables, charts) సాయంతీసుకొని చిన్న అధ్యయనం చేద్దాం. అదే గణనోపాఖ్యానం పద్దతి.

అధ్యయనం

ఈ పద్యాలు – ప్రథమాక్షరాల దత్తైని వాడి అతి సులువుగా అకారాది అనుక్రమణిక జనింపజేసాను ఈ రెంటి నమూనలు కింద ఇచ్చా చూడండి.

అకారాది అనుక్రమణిక                       

అం  అంకరహితేందు వదనలు                          10.1-1086-క.        రాసక్రీడావర్ణనము          

      అంకిలి గలుగక మా కకలంకేందుని               10.1-1444-క.        నందోద్ధవ సంవాదము      

      అంకిలి జెప్పలేదు                                   10.1-1708-ఉ.        రుక్మిణి సందేశము పంపుట

      అంగజసమలావణ్యశుభాంగులు                  6-29-క.             గ్రంథకర్త వంశవర్ణనము     

పద్యలు – ప్రథమాక్షరాల దత్తై

స్కంధ

వృత్తాంతము

స్కం

పద్య సంఖ్య

వృత్తం

పద్యము

ప్రథమాక్షరం

1

ఉపోద్ఘాతము

1

1

శా.

శ్రీకైవల్యపదంబుఁజేరుటకునై

శ్రీ

   

1

2

ఉ.

వాలిన భక్తి మ్రొక్కెద

వా

   

1

3

ఉ.

ఆతతసేవఁజేసెద

 

ఈ దత్తైనించి చేసిన అధ్యయనం చూద్దాం. వ్యాస భాగవత పురాణ సంఖ్య 10000 (12-48-వ.). పోతన తెలుగు భాగవతము గ్రంధ విస్తారం విషయాని కొస్తే 9014 పద్యగద్యలు ఉన్నాయి. ఈ 9014 పద్యాలలో మూడో వంతు (3135 పద్యాలు) అన్నిటికన్న పెద్దదైన దశమ స్కంధం లోనే ఉన్నాయి. చిన్నదైన ఏకాదశ స్కంధంలో సుమారు 20వ వంతు (54) మాత్రమే ఉన్నాయి. స్కంధాల వారీ పద్యాల సంఖ్యను కింద పటం లో చూడండి.

SK_vs_PADYAs.jpg

మరి సీస పద్యానికి కింద ఆటవెలది కాని తేటగీతి పద్యం కాని ఉంటుంది కదా. అవి కూడ లెక్కపెడితో మొత్తం పద్యాలు 10061 అవుతాయి. ఈ 9014 / 10061 పద్యాలు 30 రకాల వృత్తాలలో ఉండగా, మొత్తం 8,53,052 అక్షరాలు కలిగి ఉన్నాయి. ఏ స్కంధంలో ఏ వృత్తంలో ఎన్ని పద్యాలున్నాయి అన్న లెక్క ఈ పత్రం కింది స్కంధ వారీ వృత్తాల పట్టిక లో చూడండి. సీసపద్యం కింద వాడిన మరియు విడిగా వాడిన ఆటవెలది, తేటగీత పద్యాల గణన కింది పటములో చూడండి.

ataveldi_thetagithi.jpg

మరి సర్వ లఘు సీస పద్యాన్ని విడిగా లెక్కిస్తే 31 రకాలు వృత్తాలు అనుకోవచ్చు. అవి - 1ఆటవెలది (ఆ.), 2ఇంద్ర వ్రజము (ఇ.), 3ఉత్పలమాల (ఉ.), 4ఉత్సాహము (ఉత్సా.), 5ఉపేంద్ర వ్రజము (ఉపేం.), 6కంద పద్యము (క.), 7కవిరాజ విరాజితము (కవి.), 8గద్యము (గ.), 9చంపకమాల (చ.), 10తరలము (త.), 11తేటగీతి (తే.), 12తోటకము (తో.), 13దండకము (దం.), 14పంచ చామరము (పంచ.), 15భుజంగ ప్రయాతము (భు.), 16మంగళ మహశ్రీ (మంగ.), 17మత్తేభ విక్రీడితము (మ.), 18మత్త కోకిల (మత్త.), 19మహా స్రగ్దర (మస్ర.), 20మాలిని (మా.), 21మానిని (మాని.), 22లయగ్రాహి (లగ్రా.), 23లయవిభాతి (లవి.), 24వచనము (వ.), 25వనమయూరము (వన.), 26శార్దూల విక్రీడితము (శా.), 27శ్లోకము (శ్లో.), 28సీస పద్యము (సీ.), 29స్రగ్దర (స్రగ్ద.), 30స్రగ్విణి (స్రగ్వి.), 31సర్వలఘు సీస పద్యము (ససీ.). ఈ 31 వృత్తాలకి చంధోనియమాలు పద్యరూపంలోను గణ విభజన పద్దతిలోను వేరే దస్త్రములలో ఇచ్చాను.

వృత్తాల వారీ విశేషాలు కొన్ని చూద్దాం. సగం పద్యగద్యలు (10061 లో 5290 పద్యాలు) కంద పద్యము, వచనము లలో ఉన్నాయి. పది (10) వృత్తాలు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ఉన్నాయి. అవి 1ఉపేంద్రవ్రజము, 2తోటకము, 3పంచచామరము, 4భుజంగప్రయాతము, 5మంగళమహాశ్రీ 6మానిని 7వనమయూరము 8శ్లోకము 9సర్వలఘు సీసము 10స్రగ్విణి.

వంద కంటె ఎక్కువ మార్లు వాడిన వృత్తాలు తొమ్మిదింటి (9) లోను 8890 పద్యాలు ఉన్నాయి. వంద కంటె తక్కువగా 2 అంత కంటె ఎక్కువ మార్లు వాడిన వృత్తాలు 12లోను కలిపి 114 పద్యాలున్నాయి. ఆ వివరాలు కింది పటములలో చూడండి.

 

poems_morethan_100.jpg poems_2_100.jpg

 

ఒకే వృత్తంలో పద్యం మీద పద్యం ఉన్నవి అధికంగా ఎన్నుండచ్చు అంటే 15 అని చెప్పాలి. అవి కంద పద్యాలు ఒకదానిమీదొకటి పదిహేనింటిని (15) ప్రయోగించారు దశమ స్కంధం పూర్వ భాగమునందు 10.1-311-క. వద్ద.

ఈ 10061 పద్యగద్యలకు ప్రథమాక్షరంగా 402 అక్షరాలు వాడబడ్డాయి. అన్నిటికన్న ఎక్కువ మార్లు 1908 మార్లు అక్షరం ని వాడారు. పవిత్రమైన శ్రీ అనే అక్షరాన్ని ప్రతి స్కంధ ప్రథమ పద్యానికి ప్రథమాక్షరంగా వాడారు. ఇంతేకాక, మొత్తం 50 పద్యాలకి శ్రీ ని ప్రథమాక్షరంగా వాడారు.

పంచమ స్కంధం పూర్వోత్తరాశ్వాసములు బొప్పనామాత్యులు, షష్ఠ స్కంధం  సింగయ, ఏకాదశ ద్వాదశ స్కంధాలు నారయల కృతి అని స్థూలంగా తీసుకొని గణిస్తే వారి భాగాలలోని పద్యాలు వరుసగా 352, 531, 182. మరి పోతన భాగంలోని పద్యాలు 7949 ఉన్నాయి.

 

krithikarthalu.jpg

 

ఈ వ్యాసం లోని పట్టిక పటాలు కంప్యూటరులో జనింపజేసినవే. ఇండక్సింగ్ కార్డులు చేయడం వాటిని విడివిడిగా లెక్కపెట్టడం పట్టికలు చేయడం లాంటి శ్రమ లేదు. చూసారా గణనోపాఖ్యానం విధానంలోని సౌలభ్యం. 

 

స్కంధవారీ వృత్తాల లెక్క

పద్యం

1

2

3

4

5.1

5.2

6

7

8

9

10.1

10.2

11

12

గ్రంధము

మొత్తం

577

335

1193

1152

210

196

606

531

838

802

1946

1482

137

56

10061

వ.

147

82

246

315

56

51

108

163

236

283

530

395

47

21

2680

క.

148

68

339

282

44

50

147

116

217

184

579

369

48

19

2610

సీ.

47

47

138

175

26

28

75

48

93

66

154

139

9

2

1047

తేసీతో.

22

36

138

175

23

10

41

27

52

44

69

123

9

2

771

మ.

56

41

69

33

9

1

10

34

70

47

137

76

2

2

587

చ.

16

19

116

87

7

4

32

9

5

15

34

137

2

3

486

ఉ.

50

10

53

19

5

3

49

35

9

29

126

82

4

1

475

ఆ.

22

6

4

7

27

28

46

23

67

75

84

36

2

 

427

తే.

4

5

82

52

6

1

32

1

7

5

7

74

10

4

290

శా.

29

7

1

1

1

 

10

49

33

23

114

20

   

288

ఆసీతో.

25

11

   

3

18

34

21

41

22

85

16

   

276

మత్త.

6

 

1

1

 

1

4

3

6

3

11

4

1

 

41

త.

2

1

3

2

1

 

5

   

3

6

     

23

గ.

1

1

1

1

1

1

1

1

1

1

1

1

1

1

14

మా.

1

1

1

1

1

   

1

1

1

1

1

1

1

12

ఇ.

           

1

   

1

2

     

4

లగ్రా.

           

3

       

1

   

4

ఉత్సా.

           

1

       

2

   

3

కవి.

     

1

             

2

   

3

లవి.

                   

2

1

   

3

స్రగ్ద.

           

1

       

2

   

3

దం.

   

1

             

1

     

2

మస్ర.

           

1

       

1

   

2

ఉపేం.

                   

1

     

1

తో.

           

1

             

1

పంచ.

                   

1

     

1

భు.

1

                         

1

మంగ.

           

1

             

1

మాని.

                   

1

     

1

వన.

           

1

             

1

శ్లో.

           

1

             

1

ససీ.

                       

1

 

1

స్రగ్వి.

 

 

 

 

 

 

1

 

 

 

 

 

 

 

1


 

 

 

 

 

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 




సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech