Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  మన జాతి
 

 - రచన: - గురు సహస్రావధాని డా.కడిమిళ్ళ వరప్రసాద్   

 
 

హలం పట్టి బంగారం
కలం పట్టి సంస్కారం
గళం ఎత్తి గాంధర్వం
సాధించిన జాతి మనది

శిశువులైన పశువులైన
నాగులైన నరులైనా
తలయూచే సంగీతం
వినిపించిన జాతి మనది.

అచ్చరలె మచ్చరింప
నటరాజే పరవశింప
అడుగడుగున ఒడుపు చూపి
నర్తించిన జాతి మనది.

కత్తికంటే పదునైనది
కలమంటూ చాటి చెప్పి
సాహిత్యం సౌహిత్యం
కలబోసిన జాతి మనది

పైడి జరీ పట్టుబట్ట
అగ్గిపెట్టెలో అమర్చి
పనితనమున పస చూపిన
జాణలున్న జాతి మనది.

స్వతంత్రతా సమరంలో
స్వరాజ్యాన్ని సాధించి
అహింసయే ఆయుధమని
చాటించిన జాతి మనది.

ఆ జాతికి మనమంతా
వారసులం కావాలి
భరత మాత కన్నులలో
దివ్వెలుగా వెలగాలి.
 



 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech