Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  అమ్మ!
 

రచన:  రావు తల్లాప్రగడ

 
 

బిడ్డలెందరుగాని - ఒక్కతే అమ్మ! గడ్డాలు నెరిసినా - నాకున్నదే అమ్మ!

ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ! ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ!

 

ప్రేమ పంచేను ముక్కముక్కలు తుంచి పిల్లలందరిమద్య ఒక్కతే అమ్మ!

ప్రేమ తుంచేటి బాధేమి నాకేమి లేకుండె - నాకొక్కతే అమ్మ-- నాకున్నదే అమ్మ!

బిడ్డలెందరుగాని - ఒక్కతే అమ్మ! గడ్డాలు నెరిసినా - నాకున్నదే అమ్మ!

ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ! ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ!

 

తల్లి రక్తము చింద కళ్ళచూచినగాని, బిడ్ద పొందడు జన్మ, ఇది ఏమి ఖర్మం?

వల్లకాదంటు ఏడ్చుతూ కళ్ళుమూస్కు పుట్టాను, నాకొక్కతే అమ్మ, నా కున్నదే అమ్మ!

బిడ్డలెందరుగాని - ఒక్కతే అమ్మ! గడ్డాలు నెరిసినా - నాకున్నదే అమ్మ!

ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ! ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ!

 

తిట్లదెబ్బలతో నడత నేర్పును కాని, దెబ్బ తగులటయేమొ ఆమెకే నమ్మ!

ఇట్లు హృదిపైన గాయాలు ఎన్నుండెనే  ఏమొ నాకొక్కతే అమ్మ-- నాకున్నదే అమ్మ!

బిడ్డలెందరుగాని - ఒక్కతే అమ్మ! గడ్డాలు నెరిసినా - నాకున్నదే అమ్మ!

ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ! ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ!

 

నాటి గారాలా రామచంద్రుని గంటుపెంచి అలసిన తల్లి ఒక్కతే అమ్మ

సాటి కైకైన పంపురా వనవాసమేయంటు - కౌసల్య ఒక్కతే అమ్మ! నిన్ను కన్నదే అమ్మ!

బిడ్డలెందరుగాని - ఒక్కతే అమ్మ! గడ్డాలు నెరిసినా - నాకున్నదే అమ్మ!

ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ! ఒక్కతే అమ్మ - నాకున్నదే అమ్మ!

ఒక్కతే అమ్మ - నాకు ఉన్నదే అమ్మ!



 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech