భారతీయ
దర్శనాలు
తొమ్మిదింటిలో
వేద
ప్రామాణ్యాన్ని
అంగీకరించని
నాస్తిక
దర్శనాలైన
చార్వాక,
జైన,
బౌద్ధ
దర్శనాలలోని
దైవ
సిద్ధాంతాలు
ఏమిటో
గత
రెండు
భాగాలలో
క్లుప్తంగా
పరిశీలించాం.
ఇప్పుడిక
వేద
ప్రామాణ్యాన్ని
అంగీకరించే
(ఆస్తిక
)దర్శనాలు
ఆరింటిలో
చెప్పబడిన
దైవ
సిద్ధాంతాన్ని
స్థూల
పరామర్శ
చేద్దాం.
న్యాయ,
వైశేషిక,సాంఖ్య,
యోగ,పూర్వ
మీమాంస,
ఉత్తర
మీమాంస
(వేదాంత)
దర్శనాలు
ఆరింటినీ
షడాస్తిక
దర్శనాలు
అంటారని
మనం
లోగడనే
చెప్పుకున్నాం.
న్యాయ
దర్శనం - న్యాయ
దర్శనాన్ని
అనుసరించి
దేవుడున్నాడని
రుజువుచేసేందుకు
న్యాయ-వైశేషిక
తత్త్వవేత్త
ఉదయనుడు
'కుసుమాంజలి'
అనే
తన
గ్రంథంలో
ప్రతిపాదించిన
సంప్రదాయ
రుజువులు
ఎలా
అసమగ్రమైనవో,
అవి
ఏవిధంగా
శాస్త్ర
పరీక్షకూ,తర్కానికి
నిలువలేనట్టివో
ఈ
వ్యాస
పరంపర
లోని
అక్టోబర్,
2012
సంచికలో
ప్రచురితమైన
వ్యాసంలో
విపులంగా
వివరించాను.న్యాయ
దర్శనంలో
జ్ఞాన
సిద్ధాంతం,
దైవ
మీమాంస
ప్రధానమైనవి.గోతముడు
అనే
ఋషి
మొదటిగా
న్యాయ
దర్శనాన్ని
ప్రవచించాడు.ఆయన్నే
గౌతముడనీ,
అక్షపాదుడనీ
కూడా
అంటారు.
సవ్యమైన
ఆలోచనకు
షరతులు,సత్యాన్ని
గురించిన
సిసలైన
జ్ఞానాన్ని
సముపార్జించే
మార్గాలు
కనుగొనడమే
ఆయన
తన
ప్రధాన
లక్ష్యంగా
ఎంచాడు.న్యాయ
దర్శనాన్ని
న్యాయవిద్య,
తర్క
శాస్త్ర,
ఆన్వీక్షకీ(The
Science of Critical Study)
అనే
పేర్లతోనూ
పిలుస్తారు.అంతిమ
సత్యాన్ని
గురించిన
సమ్యక్
జ్ఞానం
మాత్రమే
ఈ
లోకంలో
జనం
బాధలు
నివారించి,
వారికి విముక్తి
కలిగించగలదని
భావించి
తార్కికత,జ్ఞాన
సముపార్జనా
మార్గాలపైనే
నైయాయికులు
తమ
దృష్టినంతా
కేంద్రీకరించారు.
గోతముడు
రాసిన
'న్యాయ
సూత్ర'
అనే
ఐదు
అధ్యాయాల
గ్రంథం,
దానిపై
వాత్స్యాయనుడు,
ఉద్ద్యోతకరుడు,వాచస్పతి,
ఉదయనుడు,
జయంతుడు
మొదలగు
అనంతరకాలపు
తాత్త్వికులు
రాసిన
వ్యాఖ్యాన
గ్రంథాలు
ఈ
సిద్ధాంతాన్ని
విపులంగా
వివరిస్తాయి.ప్రాచీన
న్యాయా(Ancient
School of Nyaya)నికి
ఇవే
ఆధార
గ్రంథాలు.నవ్య
న్యాయా(Modern
School)
నికి
గణేశుని 'తత్త్వ చింతామణి' ఆధార
గ్రంథం. ఈ
నవ్యన్యాయ శాఖ
ముందుగా మిథిలలో ప్రారంభమై,
అనంతరకాలంలో
బెంగాల్
లోని
నవద్వీపం
(నాడియా)లో
పరిడవిల్లింది.
ఈ
దర్శనంలో
ఆత్మ
క్షయము,
నాశనము
లేనట్టి
ఒక
శాశ్వత
వస్తువని
పేర్కొనబడింది.గుర్తించడం,
స్పందించడం,
అనుభూతులు
కలిగి
ఉండడం
ఆత్మ
లక్షణాలు.అలాగే
రాగ
ద్వేషాలు,
సుఖదుఃఖాలు,
ఇచ్ఛ
మొదలైనవన్నీ
కూడా
ఆత్మ
లక్షణాలే.ఇవి
భౌతిక
గుణాలు
కావు
కనుక
భౌతిక
వస్తువులకు
చెందవు.తప్పనిసరిగా
అవి
భౌతిక
వస్తువులకు
భిన్నమైనట్టి
ఆత్మకే
చెందిన
లక్షణాలుగా
మనం
భావించాల్సి
ఉంటుంది.పలు
దేహాలలో
పలు
ఆత్మలుంటాయి.ఆత్మ
అనేది
ఒకే
అఖండ
పదార్ధం
కాదు.అయితే
ఈ
ఆత్మలన్నీ
అనశ్వరాలూ,
శాశ్వతాలూ.ఆత్మ
స్థల
కాలాదులకు
అతీతమైనట్టిది.
ఆత్మ
అనంతమైనది
కనుక
దాన్ని
నాశనం
చేయలేం.ఆత్మ
విభుత్వ
(ubiquitous)
లక్షణం
కలది.ఆత్మ
అంటే
మన
శరీరం,
పంచేంద్రియాలు
కాదు.ఎందుకంటే
పదార్థంతో
తయారైన
శరీరం,పంచేంద్రియాలకు
పదార్థేతరమైన
చైతన్యం
అనేది
ఒక
లక్షణంగా
ఎలా
ఉంటుంది
?
వస్తుతః
శరీరానికి
ఎలాంటి
చైతన్యం,
తెలివితేటలు
లేవు.పంచేంద్రియాలకేమో
ఊహ,
స్మృతి,
ఆలోచన
వగైరాలు
లేవు.మనస్సు
కూడా
ఆత్మ
స్థానం
తీసుకోలేనట్టిదే.
ఆత్మకు
చైతన్యం
కలిగిఉండడం
ఒక
లక్షణమే
అయినా
ఆత్మ
ఎప్పుడూ
ఆ
లక్షణాన్ని
ప్రకర్షించదు.
అది
ఏదైనా
శరీరంలో
ప్రవేశి౦చినప్పుడే
చైతన్యపూరిత
స్వభావాన్ని
సంతరించుకుంటుంది.
ఇకపోతే
వివిధ
ఆత్మలు
తమ
అస్తిత్వం
కోసం
పరమాత్మమీద
ఆధారపడవలసిన
అవసరంలేదనీ,
అవన్నీ
వేటికవే
స్వతంత్ర
ప్రవృత్తి
కలిగినవనీ
నైయాయికుల
సిద్ధాంతం.వీరి
ఈ
Pluralistic Realism
అనే
సిద్ధాంతం
వీరి
తార్కిక
సిద్ధాంతం
అంతటి
బలమైనది
కాదు.
బహుళ
వాస్తవికతలైన
పదార్థపు పరమాణువులు, మనస్సులు,
ప్రత్యగాత్మలు
(Individual Souls),
పరమాత్మ
(God) --
ఇవన్నీ
ఏకకాలంలో
అంతిమ
సత్యాలంటారు
వీరు.
స్వతహాగా ఆత్మ
చైతన్యం
కలిగినట్టిదని
నమ్మే
మిగిలిన భారతీయ
దార్శనికులు
శరీరంలో
ప్రవేశించడం
కారణంగానే
ఆత్మకు
చైతన్యం
అబ్బుతుందని
చెప్పే
నైయాయికుల
సిద్ధాంతాన్ని
తీవ్రంగా
విమర్శించారు.
ముక్తి
పొంది,
అనంతరం శరీరాన్ని
వదిలేసి,
బయల్పడిన
ప్రత్యగాత్మకూ
చైతన్యం
లేనప్పుడు
ఇక
చైతన్య
రహిత
పదార్థానికీ,
ఆత్మకూ
తేడా
ఏముంటుందని
వారి
విమర్శ.
ఈ
విమర్శకు
నైయాయికుల
నుండి
సరైన
సమాధానం
లేదు.
అలాగే
అంతకు
ముందే
వేరొకరు
సృష్టించిన
గడియారం
యొక్క
విడిభాగాలను
అమర్చి
గడియారంగా
తయారు
చేసే
వ్యక్తి
వలెనే
నైయాయికుల
దృష్టిలో
భగవంతుడు
కూడా
తనతోపాటు
సమానంగా
అనాది
అస్తిత్వం
కలిగినట్టి
పదార్థపు
పరమాణువులను
గుదిగుచ్చి
ఈ
విశ్వాన్ని
తయారు
చేశాడు.
వారి
దృష్టిలో
భగవంతుడు
విశ్వానికి
పదార్థ
కారణం
(Material Cause)
కాదు;
ఎందుకంటే
పదార్థపు పరమాణువులు ఆయన
సృష్టించినవి
కావు.
ఈ
పరమాణువులే
కాదు;
అసంఖ్యాకమైన
ఆత్మలు
కూడా భగవంతుడితో
సరి సమానంగా
అనాదిసిద్ధాలు.
వీరి
దైవ
సిద్ధాంతం
భగవంతుడి
స్థాయిని
కేవలం
ఒక
సమర్థుడైన
భవన
నిర్మాత
లేక
గడియారం
తయారీదారు
స్థాయికి
దిగజార్చిందని
మిగిలిన
దార్శనిక
శాఖలవారు
తీవ్రంగా
విమర్శించారు.
అలా
వీరి
దైవ
సిద్ధాంతం
అసమగ్రమైనదని
తిరస్కరించబడింది.(నైయాయికుల
దైవ
సిద్ధాంతం
యొక్క
అశాస్త్రీయత,
అసమగ్రత
గురించిన
వివరణ
కోసం
అక్టోబర్
2012 'సుజనరంజని'
సంచిక
చూడగలరు.)
వైశేషిక దర్శనం:- కణాదుడు తన
'వైశేషిక సూత్ర
'
అనే
గ్రంథంలో వైశేషిక దర్శనం యొక్క
మూల
సిద్ధాంతాలను
ప్రతిపాదించాడు.లంకేశ్వరుడైన
రావణుడు
ఈ
గ్రంథానికి
ఒక
భాష్యం
రాశాడు.ప్రశస్తపాదుడు
రాసిన
'పదార్థ
ధర్మ
సంగ్రహ'
అనే
గ్రంథం,
ఉదయనుడి
'కిరణావళీ'
గ్రంథం
వైశేషిక
సిద్ధాంతాన్ని
మరింతగా
విపులీకరించాయి.న్యాయ,
వైశేషిక
సిద్ధాంతాలను
సమాన
తంత్రాలు
(Allied Systems of Philosophy) అంటారు.అయినా
ఆ
రెండు
సిద్ధాంతాల
మధ్య
కొద్దిపాటి
తేడాలున్నాయి.నైయాయికులు
పదహారు
పదార్థాలు
అంతిమ
సత్యాలని
భావిస్తే,
వైశేషికులు
కేవలం
ఏడు
పదార్థాలు
(Seven Categories of Reality)
మాత్రమే
అంతిమ
సత్యాలంటారు.
ద్రవ్యము (Substance),
గుణము
(Quality),
కర్మ
(Action),
సామాన్య
(Generality),
విశేష
(Particularity),
సమవాయ(Inherence),
అభావ
(Non-existence)
అనేవి
ఈ
ఏడు
పదార్థాలు.
నైయాయికులు
ప్రత్యక్ష,
అనుమాన,
ఉపమాన,
శబ్ద
ప్రమాణాలు
నాలుగింటినీ
గుర్తిస్తే,
వైశేషికులు
ప్రత్యక్ష,
అనుమాన
ప్రమాణాలను
మాత్రమే
అంగీకరిస్తారు.
డెమోక్రిటస్
మొదలైన
గ్రీకు
తాత్త్వికులు
ప్రతిపాదించిన
పరమాణువాదానికి
భిన్నంగా
కణాదుడి
సిద్ధాంతం
గుణాత్మక
పరమాణు
వాదం
(Qualitative Atomism)
కావడం
విశేషం.
గ్రీకు
తాత్త్వికుల
సిద్ధాంతం ప్రకారం భౌతిక
సూత్రాలపై
ఆధారపడి
పరమాణువులు
తెలివైన
ఏ
బయటి
శక్తి
ప్రమేయం
లేకుండా
తమకు
తామే
సంఘాత,
విఘాతాలకు
లోనవుతాయి.
కణాదుడి
సిద్ధాంతం
ప్రకారం
పరమాత్మ
సృష్టి,
లయ
అనే
తన
ఇచ్చల
కారణంగా
పరమాణువులను
ప్రత్యగాత్మల
కర్మల
ఆధారంగా
వారివారి
అదృష్టాలనుబట్టి,
తన
నైతిక
కర్తవ్యం
యొక్క
అంతిమ
లక్ష్యానికి
లోబడి
కలపడం,
విడదీయడం
చేస్తూ
ఉంటాడు.
రెండు
పరమాణువులను
కలిపి
ద్వ్యణుకము
(Dyad)
గానూ,
మూడు
ద్వ్యణుకాలను
కలిపి
ఒక
త్రసరేణువు
(Triad)
గానూ
భగవంతుడు
రూపొందిస్తాడు.ఈ
త్రసరేణువునే
త్ర్యణుకము
అని
కూడా
అంటారు.
వైశేషికుల
విశ్వాసం
ప్రకారం
మామూలు
కంటికి
ఒక
త్రస
రేణువు
మాత్రమే
కనుపిస్తుంది.
పరమాణువులు,
ద్వ్యణుకములు
మామూలు
కంటికి
కనుపించవు.
ఆధునిక
విజ్ఞాన
శాస్త్రం
పరమాణువులలో
ఉండే
మూల
కణాల
(Fundamental Particles)
లోని
విద్యుదావేశం
కారణంగా
పరమాణువులకు
ఏర్పడే
వాలెన్సి
(Valency)
బంధాల
వల్ల
వాటికవే
ఒక
దానితో
మరొకటి
సంఘాతమై
అణువులుగా
మారతాయనీ
,
వాటి
సంఘాత
విఘాతాలకు
ఏ
బాహ్య
శక్తీ
కారణం
కాదనీ
నిర్ధారించింది.
విజ్ఞాన
శాస్త్రం
పదార్థాల
పరమాణువులు
కలిసి
అణువులుగా
ఏర్పడడం,
తిరిగి
పరమాణువులుగా విడిపోవడం
కేవలం
యాదృచ్చికమేననీ,
ఇందుకే
బాహ్య
శక్తి
అవసరమూ
లేదనీ,
పరమాణువుల
వాలెన్సీ
బంధాల
కారణంగానే
ఈ
సంఘాతం
జరుగుతున్నదనీ
ప్రయోగశాలల్లో
జరిపిన
ప్రయోగాల
ద్వారా
ఋజువు
పరచింది ఈ
విశ్వం
యొక్క
సృష్టి,
విలయం
ఒకదాని
తరువాత
మరొకటిగా
అనంతంగా
భగవదేచ్చ
ప్రకారం
సాగిపోతూనే
ఉంటాయని
వైశేషికుల
విశ్వాసం.
ఆత్మ,
పరమాత్మలకు
సంబంధించిన
వీరి
సిద్ధాంతం
కూడా
నైయాయికుల
సిద్ధాంతం
వలెనే
చిక్కులపాలై౦ది.భగవంతుడు
వీరి
సిద్ధాంతం
ప్రకారం
అంతిమ
సత్యాలైన
పరమాణువులు,
మనస్సులూ,ఆత్మలను
వ్యవస్థీకృతం
మాత్రమే
చేయగలడు.ఆయన
వాటికి
సృష్టికర్త
కాదు.
అలా
వీరి
దైవ
సిద్ధాంతం
కూడా
భగవంతుడిని
సృష్టికర్త
స్థాయి
నుంచి
కేవలం
అంతకుమునుపే
తయారైన
విడిభాగాలను
అమర్చే ఒక
గడియారం
తయారీదారు
స్థాయికి
దిగజార్చిందని
మిగిలిన
తాత్త్విక
శాఖల
తీవ్ర
విమర్శకు
లోనై
అదో
అసమగ్రమైన
సిద్ధాంతంగా
మిగిలిపోయింది.
సాంఖ్య దర్శనము:- కపిలుడనే
మహర్షి
సాంఖ్య
సిద్ధాంత
కర్త.
శృతి,
స్మృతి,
పురాణాలన్నింటిలో
సాంఖ్య
సిద్ధాంత
ప్రస్తావనలున్న
కారణంగా
ఈ
సిద్ధాంతం
అత్యంత
ప్రాచీనమైనదని
మనం
భావించవచ్చు.
కపిలుడు
రాసిన
'సాంఖ్య
సూత్ర'
చాలా
క్లిష్ట
మైన,
సంక్షిప్తమైన
రచన
అయిన
కారణంగా,
అందరికీ
అర్థమయ్యే
విధంగా
కపిలుడే
తిరిగి
దానిని
విపులీకరిస్తూ
'సాంఖ్య
ప్రవచన
సూత్ర'
అనే
గ్రంథం
రాశాడ౦టారు.
కపిలుడు
భగవంతుడి
ఉనికిని
నమ్మలేదు.
సాంఖ్యం
వేద
ప్రామాణ్యాన్ని
అంగీకరించినా భగవంతుడి
అస్తిత్వాన్ని
మాత్రం
అంగీకరించకపోవడం
విశేషం.దీనికి
సమానతంత్రమని
పిలువబడిన
'యోగ'
దర్శన
శాఖ
మాత్రం
దైవాన్ని
విశ్వసించింది.
అందుకే
సాంఖ్య సిద్ధాంతాన్ని
'నిరీశ్వర
సాంఖ్యం'
అనీ,
యోగ
సిద్ధాంతాన్ని
'సేశ్వర
సాంఖ్యం'
అనీ
అంటారు.న్యాయ-వైశేషికులు
పరమాణువులు,
మనస్సులు,
ప్రత్యగాత్మలు,
పరమాత్మ--
ఇలా
పలు
అంతిమ
సత్యాలను
నమ్మగా,
సాంఖ్య
సిద్ధాంతాన్ని
అనుసరించి
అంతిమ
సత్యాలు రెండే.ఒకటి
ప్రకృతి
(matter)
మరొకటి
పురుషుడు
(spirit).అందుకే
వీరి
సిద్ధాంతాన్ని
Dualistic Realism
అంటారు.ఈ
విశ్వం
లోని
సకల
ద్రవ్యాలు-
చివరికి మన
శరీరం,
మనస్సు,
పంచేంద్రియాలు,
అంతఃకరణతో
సహా--
కొన్ని
మూలకాలతో
తయారయ్యాయి.
కనుక
అవి
పరిమితమైనవి;
తమ
అస్తిత్వానికై
మరో
దానిపై
తప్పక
ఆధారపడి
ఉండేవే.
ప్రకృతి,
పురుషుడు
మాత్రమే
అంతిమ
సత్యాలు.వీరి
సిద్ధాంతం
ప్రకారం
పురుషుడు
అంతిమ
సత్యమే
కాక
పురుషులు
అసంఖ్యాకులు
కూడా.ప్రకృతి
నిరంతర
పరిణామ
శీలం.
పురుషుడు
తెలివితేటలు,
చైతన్యం
కలిగి
ఉన్నాచలనం
లేని
వాడు.
ప్రకృతి
ఎలాంటి
తెలివితేటలు,
చైతన్యం
లేనిదే
అయినా
విపరీతమైన
చలన
శక్తి
కలిగినట్టిది.
ప్రకృతి
కదలికలు
పురుషుడి
తెలివితేటలు,
చైతన్యం
వల్ల
ప్రభావితం
అయి,
సవ్యమైన
మార్గంలో
నడుపబడే
కారణంగా
ప్రకృతి
పరిణామం
చెందుతుంది.
ఒక
అడవిలో
ఒక
పంగుడు
(కుంటివాడు)
, మరో
అంధుడు
(
గుడ్డివాడు)
కార్చిచ్చు
నుంచి
బయటపడడానికి
ఒకరితో
మరొకరు
సహకరించుకుంటారు.గుడ్డివాడి
బుజాలపై
ఎక్కిన
కుంటివాడు
కళ్ళు
కనుపించని
గుడ్డివాడికి
మార్గదర్శనం
చేస్తాడు.
నడవలేని
కుంటివాడిని
తన
భుజాలపై
మోస్తూ
అతడి
ఆదేశాల
ప్రకారం
నడుస్తాడు గుడ్డివాడు.
అలా
వారిద్దరూ
ఒకరికొకరు
సహకరించుకుంటూ
అడవిలోని
కార్చిచ్చు
నుంచి
క్షేమంగా
బయటపడతారు
దీనినే
అంధ-పంగు
న్యాయం
అంటారు.
సరిగ్గా
ఇదే
విధంగా
తెలివిలేని
ప్రకృతి,
అచేతనమైన
పురుషుడు
--
ఇరువురూ
ఒకరితో
మరొకరు
సహకరించుకుంటూ
ప్రకృతి
యొక్క
పరిణామానికి
ఇరువురూ
జంటగా
కారణమవుతున్నారు.
ఈ
పరస్పర
సహయోగంలో
వారిరువురి
లక్ష్యాలూ
నెరవేరుతున్నాయి.
ప్రకృతి
తనను
ఎప్పుడూ
పురుషుడు
(self)
చూడాలని
కోరుకుంటుంది.
ప్రకృతితో
సంయోగం
ద్వారా
తాను
కైవల్యసిద్ధి
పొందాలనుకుంటాడు
పురుషుడు.ఈ
ప్రకృతి-
పురుష
సంయోగంలో
తనను
పురుషుడు
చూడాలనే
(దర్శనార్థం)
ప్రకృతి
లక్ష్యం
నెరవేరడం
మాత్రమే
కాదు;
వివేక
జ్ఞానం
పొందిన
పురుషుడు
'కైవల్య
సిద్ధి'
పొందుతున్నాడు(కైవల్యార్థం)
కూడా.
అలా
ఉభయుల
లక్ష్యాలూ
నెరవేరతాయి.
పురుషులు
(ఆత్మలు)
అసంఖ్యాకమనీ,
అవి
వేరువేరనీ,
అవన్నీ
వేటికవే
ప్రత్యేక
అస్తిత్వం
కలిగినవనీ
సాంఖ్య
సిద్ధాంతం.ప్రతి
పురుషుడు
(ఆత్మ)
అజ్ఞానం
కారణంగా
దుఃఖానికి
లోనవుతాడు.
ప్రతి
పురుషుడూ
దుఃఖ
నివారణ
కోసం
ప్రయత్నిస్తాడు.అజ్ఞానం
స్థానంలో
వివేక
జ్ఞానం
పొందడమే
ముక్తి.
అప్పుడే
దుఃఖాన్నుంచి
పూర్తిగా
విముక్తి.ఆధ్యాత్మిక,
ఆధిభౌతిక,
ఆధిదైవిక
దుఃఖాలు
అనబడే
మూడు
విధాల
దుఃఖాల
నుంచి
పూర్తిగా
విముక్తి
చెందడమే
(దుఃఖ
త్రయ
విఘాత)
సాంఖ్య
సిద్ధాంతం
ప్రకారం
ముక్తి.
ఇక
సాంఖ్యుల
దైవ
సిద్ధాంతానికి
వద్దాం.
సంప్రదాయ
సాంఖ్యులు
దేవుడు
లేడనేందుకు
ఈ
క్రింది
ఆధారాలు
పేర్కొంటారు-
అ)
ఈ
ప్రపంచం
మొత్తం
పలు
కార్యముల
(effects)
సముదాయమైనందున
వీటన్నిటికీ
ఏదో
ఒక
కారణం(cause)
ఉండి
తీరాలనేది
నిజం. అయితే
దేవుడు (బ్రహ్మన్) ఈ
ప్రపంచానికి
కారణం
కావడానికి వీల్లేదు.భగవంతుడు అనశ్వరమైన, ఎలాంటి మార్పుకూ లోనుకాని శాశ్వతమైన
ఆత్మ
అని
చెపుతారు.
ఏదైతే
తాను
మారదో,
అది
మరొక
దాన్ని
సృష్టించలేదు.
తన
లోని
శక్తిని
కోల్పోకుండా,తాను
స్వయంగా
పరిణామానికి
లోను
కాకుండా
ఎవరైనా
సృష్టికర్త
కావడం
అసాధ్యం.
కనుక
ఈ
ప్రపంచానికి
అంతిమ
కారణం
(ultimate cause)
శాశ్వతమైన,
నిత్య
పరిణామశీలమైన
ప్రకృతి
లేక
పదార్ధం
తప్ప
వేరొకటి
కాదు.
ఆ)ప్రకృతి
తెలివిలేనిది
కనుక,
దాని
పరిణామానికి
సవ్య
దిశా
నిర్దేశం
చేసి,
దాని
పరిణామ
ఫలితంగా
ఈ
ప్రపంచం
ఆవిర్భవించేట్లు
చూసేందుకు
ఒక
తెలివైన
చోదకుడు
అవసరమని
అనవచ్చు.
ప్రత్యగాత్మలకు
ప్రకృతిని
అదుపుచేసి,
దిశా
నిర్దేశం
చేయగలిగేట౦త
తెలివితేటలు,
జ్ఞానం
సహజంగానే
ఉండే
అవకాశం
లేదు.కనుక
అన౦త
జ్ఞాన
సంపన్నుడు
అయినట్టి
భగవంతుడే
ఈ
ప్రకృతికి
మార్గదర్శనం
చేసి,
దానిని
సవ్యమైన
మార్గంలో
నడుపుతున్నాడని కొందరు అనవచ్చు. కాని
ఈ
వాదన
నిలిచేది
కాదు.
ఎందుకంటే
సేశ్వర
వాదుల
భావన
ప్రకారం
భగవంతుడు
స్థాణువు, అచేతనుడు;
నిర్వికారుడు;
నిర్వికల్పుడు.ప్రకృతికి
దిశానిర్దేశం
చేయడం
అంటే
తానుగా
ఒక
పనిలో
పాల్గొనడమే.
కాసేపు
భగవంతుడు
ప్రకృతికి
చోదకుడనే
అనుకుందాం.
ప్రకృతి
మీద
పెత్తనం
చెయ్యాలనీ,
ఈ
ప్రపంచాన్ని
సృష్టించాలనీ
అతడిని
ఎవరు
పురికొల్పి
ఉంటారు
?
అది
భగవంతుడి
స్వంత
లక్ష్యం
కావడానికి
వీల్లేదు.
ఎందుకంటే
సేశ్వరవాదుల
దృష్టిలో
భగవంతుడు
సకల
పరిపూర్ణుడు.
ఒక
పరిపూర్ణుడు
సాధించాల్సిన
లక్ష్యాలు,
తీరని
కోరికలు
కలిగి
ఉన్నాడనడం
అసంబద్ధం.
ప్రపంచంలోని
జీవులందరి
బాగు
కోసం
భగవంతుడు
అలా
చేస్తాడనీ
అనుకోలేం.
ఏ
తెలివైన,
విచక్షణా
జ్ఞానం
కలిగిన
వ్యక్తీ
తనకు
ఎటువంటి
ప్రయోజనం
ఆశించకుండా
కేవలం
ఇతర
జీవుల
సంక్షేమం
కోసమే
పాటుపడడు.మరో
విషయం;
భగవంతుడే
తన
జీవుల
సుఖాన్నీ,
మంచినీ
దృష్టిలో
పెట్టుకుని
ఇదంతా
చేస్తున్నాడనుకోవడానికా,
పూర్తిగా
పాప
పూరితమూ,
దుఃఖమయమూ
అయినట్టి
ఈ
ప్రపంచాన్ని
చూస్తే
ఇది
తన
జీవుల
సంక్షేమాన్ని
దృష్టిలో
ఉంచుకుని
దేవుడు
చేసిన
సృష్టి
కానేకాదని
ఎవరికైనా
ఇట్టే
అర్థమవుతుంది.
ఇ)
ఇక
ప్రత్యగాత్మల
విషయానికొస్తే
--
అవి
నశించనివీ,
మరణం
లేనివీ
అంటారు.అదే
కనుక
నిజమైతే
భగవంతుడు
ఉన్నాడనే
విషయం
అసంగతం
అవుతుంది.ప్రత్యగాత్మలు
పరమాత్మ
శరీరాంగాలే
అయినట్లయితే,
వాటికి
కూడా
దివ్యశక్తులు
ఉండి
తీరాలి.
కానీ,
ప్రత్యగాత్మలకు
ఏ
దివ్యశక్తులూ
లేవే
!
ఇది
కాదు;
భగవంతుడే
ప్రత్యగాత్మలను
సృష్టించాడనుకుందామా--
అవి
ఎప్పటికైనా
ధ్వంసమై
నశి౦చి
పోయేవే.ఏది
సృష్టించబడిందో
అది
నశించి
తీరుతుంది
కదా!
ఈ
వాదనలన్నింటి
సారాంశం
ఏమిటంటే
--
భగవంతుడు
లేడు.
ఈ
ప్రాపంచిక
వస్తు
సంచయమ౦తా
పదార్ధం
(ప్రకృతి)
నుంచి
ఆవిర్భవించిందే.తన
దూడ
శ్రేయస్సు
కోసం
ఆవు
పొదుగు
నుంచి
అప్రయత్నంగా
ధారగా
పాలు
జాలువారిన
విధంగానే,
ప్రత్యగాత్మల
(పురుషుల)
క్షేమం
కోరి
ప్రకృతి
ఈ
ప్రపంచంలోని
సమస్త
వస్తు
సంచయాన్ని
అప్రయత్నంగానే
సృష్టించింది.
యోగ
దర్శనం
:-
ఆత్మానుభూతి
పొందేందుకు
సాధకులకు
పతంజలి
మహర్షి
బహూకరించిన
గొప్ప
సిద్ధాంతమే
'యోగసూత్ర'
లేక
'పాతంజల
సూత్ర'
అని
ప్రాచీనుల
విశ్వాసం.శరీరం,
ఇంద్రియాలు,
మనస్సు-
వీటికి
అతీతంగా
ఆత్మ
ఒక
స్వతంత్ర
సూత్రమని
గ్రహించగోరేవారికి
'యోగ
సూత్ర'
ఎంతగానో
ఉపకరిస్తుందని
వారి
నమ్మకం.
యోగ
సూత్రాల
మీద
వ్యాసుడు
రాసిన
'వ్యాస
భాష్య'
పేరిట
ప్రసిద్ధమైన
'యోగ
భాష్య'
అనే
గ్రంథం
పాతంజల
సూత్రాలను
విపులీకరిస్తుంది.సాంఖ్య
సిద్ధాంతం
యొక్క
ఆచరణాత్మక
భాగమే
'యోగ'
దర్శనం.సాంఖ్యులు
ముక్తి
కొరకు
అత్యావశ్యకమని
చెప్పిన
'వివేక
జ్ఞానం'
(Discriminative Knowledge)
లభించాలంటే
యోగ
సూత్రాలలో విధించబడ్డ అష్టాంగ మార్గం తప్ప
వేరే
మార్గం లేదంటారు.సాంఖ్య దర్శనంలో చెప్పబడిన
అసంఖ్యాకమైన
పురుషులు
(ఆత్మలు)
అందరిలోకీ
భిన్నమైన
పురుషోత్తముడు
(Supreme Self)
ఉన్నాడనీ,
ఆయనే
భగవంతుడనీ
'యోగ'
దర్శనం
నమ్ముతుంది.ఉపనిషత్తులు,
స్మృతులు,
పురాణాల
కాలంలో
కూడా
యోగసూత్రాలు
కొందరు
పాటించినట్లు
ఆధారాలున్నాయి.చిత్త
వృత్తులను
నిరోధించి,
పరిశుద్ధమైన
హృదయం,
ప్రశాంతమైన
చిత్తం
కలిగి
ఉన్నప్పుడు
మాత్రమే
దర్శనములు,
మతములు
ప్రవచించిన
సిద్ధాంతాలు
అవగతం
కాగలవని
యోగ
శాస్త్రం
చెపుతుంది.
'యోగాశ్చిత్త
వృత్తి
నిరోధాః
'
అని
నిర్వచనం.
యోగ
అంటే
చిత్త
వృత్తిని
నిరోధించేది
అని
అర్థం.
'సమత్వం
యోగ
ఉచ్యతే'
అనేది
మరో
నిర్వచనం.
యోగ
సాధన
శరీరం,
మనస్సు,
ఆత్మ
--
ఈ
మూడింటి
మధ్య
ఒక
చక్కటి
సమతౌల్యాన్ని
(Equilibrium )
సాధిస్తుందని
నమ్ముతారు. ఆత్మ
పరిశుద్ధికి-
అంటే
శరీరం,
అంతఃకరణల
పరిశుద్ధికి
యోగ
సాధనను
మించింది
లేదని
ప్రాచీనుల
విశ్వాసం.జీవన
తత్త్వం
యొక్క
అత్యావశ్యక
ప్రాయోగిక
పార్శ్వంగా
యోగ
సాదనను
భారతీయ
తాత్త్విక
శాఖలన్నీ
గుర్తించాయి.ఆత్మను
ఈ
భౌతిక
ప్రపంచానికి,
చివరికి
మన
శరీరం,
మనస్సు,
అహంకారం
(ego)
లకు
కూడా
భిన్నమైనదని
గ్రహించడమే
వివేక
జ్ఞానం.అది
సిద్ధి౦చడమే
ముక్తి. క్షిప్త,
మూఢ,
విక్షిప్త,
ఏకాగ్ర,
నిరుద్ధ
అనే
ఐదు
చిత్త
భూములనూ
(Five Levels of Mental Life)
ఒకదాని
తరువాత
మరొక
దానిని
అధిగమిస్తూ,
సంప్రజ్ఞాత సమాధినీ, అంతిమంగా
అసంప్రజ్ఞాత
సమాధి
దశనూ
చేరుకొనడానికి
సాధకులు
ప్రయత్నిస్తారు.
ఈ
నైతిక
ప్రయాణంలో
వారు
ఎనిమిది
అంగాలతో
కూడిన
మార్గాన్ని
అనుసరిస్తారు.ఈ
ఎనిమిదింటినీ
యోగా౦గాలు
అంటారు.
ఈ
మార్గాన్ని
అష్టాంగ
యోగము
అంటారు.ఆ
ఎనిమిది
అంగాలూ
ఇవి:
1)
యమ
(Restraint). ఇది
ఐదు
విధాలు.
చిత్తాన్ని
అదుపులో
పెట్టుకోవాలంటే
జీవులకు
హాని
తలపెట్ట
కూడదు.
(అహింస);
అసత్యం
పలుకకూడదు.
సత్యం
మాత్రమే
పలకాలి
(సత్యం);
దొంగతనం
చేయకూడదు
(అస్తేయం);
బ్రహ్మచర్యం
పాటించాలి; ఇతరులు ఊరికే
ఇచ్చే
అనవసరమైన బహుమతులు
స్వీకరించకూడదు(అపరిగ్రహం).
ఆరోగ్యకరమైన
శరీరంలోనే
ఆరోగ్యకరమైన
మనస్సు
ఉంటుందని
గుర్తించిన
యోగ
దార్శనికులు
మానసికారోగ్యం
తోపాటు
శరీరారోగ్యానికీ
సమ
ప్రాధాన్యం
ఇచ్చారు.అందుకే
శారీరకారోగ్యాన్ని
కాపాడుకొనేందుకు
బ్రహ్మచర్యాన్ని
యోగసాధకులకు
తప్పనిసరి
చేశారు.
2)
నియమ
(Cultivation of good habits):
ఇది
తిరిగి
ఐదు
విధాలు.శౌచము-
అంటే
శరీరాన్ని
శుభ్రంగా
ఉంచుకొనడం;
శుభ్రమైన
ఆహారం
తీసుకొనడం--
ఇది
బాహ్య
శౌచం.
స్నేహం,ప్రేమ,
ఔదార్యం,
ఆనందం
మొదలైన
మంచి
అలవాట్లు
చేసుకొనడం;
చెడు
తల౦పులకు
మనస్సును
దూరంగా
ఉంచడం
--
ఇది
అభ్యంతర
శౌచం.
సంతోష
-
అంటే
అనవసరంగా
హైరానా
పడకుండా
తనకు
తానుగా
లభించినదానితో
తృప్తి
పడడం;
చలి,
వేడిమి
వగైరాలను
తట్టుకొనడాన్ని
అలవరచుకొనడం.
దీనినే
తపస్సు
అంటారు.క్రమం
తప్పకుండా
మత
గ్రంథాలను
చదవడం.దీనినే
స్వాధ్యాయం
అంటారు.ఎప్పుడూ
భగవంతుడి
మీదనే
మనస్సు
లగ్నం
చేసి,
సాధకుడు
తనను
తాను
భగవంతుడికి
ఆత్మసమర్పణం
చేసుకొనడం.దీనినే
ఈశ్వర
ప్రణిధానం
అంటారు.
3)
ఆసనం:
కుదిరికగా,
సౌకర్యవంతమైన
ఆసనంలో
ఎక్కువసేపు
కూర్చునే
అభ్యాసం
చేయడం.
పద్మాసనం,
వజ్రాసనం,
భద్రాసనం,
పశ్చిమోత్తానాసనం మొదలైన పలు
ఆసనాలలో స్థిమితంగా ఎక్కువసేపు
కూర్చొనగలిగితే
సాధకుడు
తన
మనస్సును
చక్కగా
కేంద్రీకరించ
గలుగుతాడు.
4)
ప్రాణాయామ అంటే
శ్వాస
నియంత్రణ. రేచక
(గాలిని బయటికి వదలడం),
పూరక
(లోనికి పీల్చడం), కుంభక
(లోపలి
ప్రాణ
వాయువును అలానే
నిలిపి ఉంచడం
)
హృదయాన్ని పరిపుష్టం
చెయ్యడానికి,
మనస్సును
ఒకే
విషయం
మీద
లగ్నం
చేయడానికి
ప్రాణాయామం
ఉపకరిస్తుంది.
5)
ప్రత్యాహార: ప్రయత్న
పూర్వకంగా
విషయ
లోలత్వం
తగ్గించుకొనడం,
ఇంద్రియాలను
ఇంద్రియార్థాలకు
విముఖంగా
మరల్చడం.
6)
ధారణ
: దృష్టిని ఒకే
విషయంపై నిలిపి లగ్నం
చేయడం.
ఒక
వ్యక్తి తన
శరీరంలోని ఏదైనా
భాగం
--
ఉదాహరణకు బొడ్డు,
భ్రుకుటిస్థలి(కను
బొమల
మధ్య
భాగం)--
మీదనో
లేక
శరీరానికి
బయట
ఉన్న
ఏదైనా
వస్తువు
మీదనో--
ఉదాహరణకు
ఏదైనా
విగ్రహం
మీదనో
లేక
చంద్రబింబం
మీదనో
--
దృష్టిని
లగ్నం
చేయడం.
ఇలా
ఒకే
వస్తువు మీద
కేంద్రీకరించడం
అనే
అభ్యాసం తరువాతి
మెట్టు
అయినట్టి
ధ్యానానికి
చేరుకొనేందుకు
ఒక
పరీక్ష
వంటిది.
7)ధ్యాన
:
మనస్సును
ఒకే
విషయం
మీద
లగ్నం
చేసి,
నిరంతరాయంగా
దానిమీదనే ధ్యాస
నిలపడం.
8)
సమాధి
:
మనం
ఆలోచిస్తున్న
విషయంలోనే
మన
మనస్సును
పూర్తిగా
ము౦చెయ్యడం.యోగ
సాధనలో
ఇది
చివరి
దశ.ఈ
దశలో
ఐహిక
విషయాలపట్ల
సిసలైన వివేక
జ్ఞానం
లభిస్తుందనీ,
అదే
ముక్తి
అనీ
విశ్వాసం.
అంతేకాదు.సాధకుడికి
కొన్ని
అతీంద్రియ
శక్తులు
సిద్ధిస్తాయని
కూడా
విశ్వాసం.యోగులు
క్రూర
జంతువులను
సైతం
వశపరచుకోగలరనీ,తాము
కోరుకున్న
వస్తువులను
సృష్టించుకోగలరనీ,
భూత,భవిష్యత్,
వర్తమాన
కాలాల్లో
జరిగిన,జరుగనున్న,జరుగుతున్న
అన్ని
విషయాలనూ
నేరుగా
తెలుసుకోగలుగుతారనీ,ఇతరులకు
కూడా
వారు
దివ్య
దృష్టి
ప్రసాదించగలరనీ,
సూక్ష్మాతిసూక్ష్మ వస్తువులనేకాదు
వారు
భగవంతుడినీ
చూడగలరనీ,
మూసివున్న
తలుపులలోనుంచీ,
రాతి
గోడలలోనుంచీ
ఆవలిపక్కకు
సునాయాసంగా
వెళ్ళగలరనీ,
ఒకచోట
మాయమై
వేరొకచోట
ప్రత్యక్షం
కాగలరనీ,
ఒకే
సమయంలో
పలు
ప్రదేశాల్లో
ఉండగలరనీ
జనంలో
ఎన్నెన్నో
విశ్వాసాలున్నాయి.
అయితే
ఇవేవీ
శాస్త్రీయంగా
రుజువు
పరచినవిగానీ,
రుజువుపరచగలిగినవిగానీ
కాకపోవడం
కారణంగా
శాస్త్ర
విజ్ఞానం
వాటిని
అశాస్త్రీయమని
కొట్టి
పారవేసింది.
దివ్య
దృష్టి(క్లేర్
వాయన్స్-Clairvoyance),టెలిపతీ
(Telepathy) మొదలైనవాటిని
శాస్త్రీయంగా
రుజువు
చేయాలని
ప్రయత్నించినవారు
పలువురు
పలు
ప్రపంచ
దేశాల్లో
ఈ
తరహా
అతీంద్రియ
శక్తులు శాస్త్రీయంగా
సాధ్యపడేవేనని
రుజువుపరచడం
చేతగాక
విఫలమయ్యారు.
అయినా
ఇంకా
కొందరు
అమాయకులు,
దురాశాపరులు
మొసగాళ్ళ
వంచనలకు
బలవుతూనే
ఉన్నారు.
ఒక్కటి
మాత్రం
సత్యం.
సుదీర్ఘకాలంపాటు
ఇంద్రియాలనూ,
మనస్సునూ
అదుపులో
పెట్టుకుని,
ఋజువర్తనతో,
నైతిక
నియమాలను
పాటిస్తూ,
సాత్విక
జీవనానికి
అలవాటు
పడిన
యోగ
సాధకుడు
తప్పనిసరిగా
సమాజం
పట్ల
బాధ్యతాయుతంగా
వ్యవహరిస్తాడు.వారికి
స్వార్థ
చింతన
లేశమైనా
ఉండడానికి
వీల్లేదు;
సాధారణంగా
అలాంటి
యోగుల ఆలోచనలన్నీలోక
కళ్యాణం
కోసమే
అయివుంటాయి. అలాంటి
యోగులు
భారతీయ
సమాజంలో
సమున్నత
విలువలు
పాటించి
ప్రజల
దృష్టిలో
సముచిత
గౌరవ
స్థానం
పొందారు.యోగుల
పేరిట
కొందరు
భోగులు
చేస్తున్న
మోసాలు,
అకృత్యాలు
దాదాపు
ప్రతిరోజూ
ఏదో
ఒక
ప్రాంతంలో
బయల్పడుతూనే
ఉన్నాయి.
ఇక
యోగ
దర్శనంలో దైవ
భావన
విషయానికొద్దాం.
లోగడనే
మనం
యోగ
దర్శనంలో భగవంతుడికి ఇవ్వబడిన నిర్వచనం ' క్లేశ
కర్మ
విపాకాశయైరపరామృష్టా'
గురించి
తొలి
భాగాలలో
ముచ్చటించుకున్నాం.
యోగ
దర్శనం
ప్రకారం
భగవంతుడు
క్లేశములు,
కర్మలు,
విపాకములు,
ఆశయములు--
వీటితో
అంటబడనివాడు.
మానవులంతా
అవిద్య(ignorance),
అస్మితా
(egoism),
రాగ
(desire),
ద్వేష
(aversion),
అభినివేశ
(dread of death)
అనే
పంచ
క్లేశాల
(five afflictions)
తో
బాధింపబడే
వారే.
భగవంతుడికి
ఈ
పంచ
క్లేశాల
బాధింపు
ఉండదు.మంచి
పనులు,
చెడ్డ
పనులు,
మంచిదో
చెడ్డదో
తెలియక
చేసే
పనులు-
ఇలా
మూడు
రకాల
కర్మలు
మానవులందరూ
చేస్తారు.వాటి
విపాకాలను (కర్మ
ఫలాలను )అనుభవిస్తారు.
కాని,
భగవంతుడు
ఏ
కర్మా
చేయడు.
చేయాలనే
తలంపు(చికీర్ష) కలిగి
ఉన్నా
భగవంతుడి
పరిపూర్ణత్వానికి
అదొక
లోటే.
అందుకే
భగవంతుడు
మంచి,
చెడ్డ,
మంచీ
చెడూ
కాని--
మూడు
తరహాల
పనులు
ఏవీ
చేయడు.
అందుచేత
ఆ
కర్మల
చేతగానీ,
వాటి
విపాకం
చేతగానీ ఆతడు
అంటబడనివాడు.
ఆశయము
అంటే
గత
అనుభవాలకు
సంబంధించి
మన
మదిలో
దాగివున్న
జ్ఞాపకాలు.
మానవులందరికీ
వారి
వారి
గత
అనుభవాల
జ్ఞాపకాలు
వారి
మనస్సుల్లో
గూడు
కట్టుకుని
ఉంటాయి.వివేకజ్ఞానం
పొంది
ముక్తుడైన
యోగికి
కూడా
గత
అనుభవాల
జ్ఞాపకాలు
మనస్సులో
పదిలంగా
ఉంటాయి.
అలా
మదిలో
ఆశయాలే
లేనివాడు
భగవంతుడు
ఒక్కడే.
అలా
యోగ
దర్శనం
ప్రకారం
అన్ని
లోపాలకూ
అతీతమైనవాడు
ఒక్క
భగవంతుడు
మాత్రమే.
ఉపనిషత్తులు(వేదాలలోని
చివరి
భాగాలు)దేవుడున్నాడని
ఘోషిస్తున్నాయి
కనుక
దేవుడున్నాడని
యోగ
దర్శనం
చెపుతుంది.కంటిన్యూటీ
నియమం
ప్రకారం
తరతమ
స్థాయీ
భేదం
ఉన్న
ప్రతిదానికీ
నిమ్నోన్నత
హద్దులుంటాయి.ఉదాహరణకు
పరమాణువు
అతి
చిన్న
పరిమాణం
కలిగినదైతే
ఆకాశం
అతి
పెద్ద
పరిమాణం
కలిగినది.జ్ఞానం
విషయంలోనూ,శక్తి
విషయంలోనూ
అలాగే
స్థాయీ
భేదాలున్నాయి.కనుక
ఒక
పరిపూర్ణమైన
శక్తి
కలవాడూ,
పరిపూర్ణమైన
జ్ఞానం
కలవాడూ
ఎవరో
ఉండితీరాలి.యోగ
దర్శనం
ప్రకారం
అతడే
భగవంతుడు.ప్రకృతి,పురుషుడు
అనే
రెండు
పరస్పర
విరుద్ధమైన
శక్తుల
సంయోగం
కారణంగా
సృష్టి
,వియోగం
కారణంగా
ప్రళయం
సంభవిస్తున్నాయి.తెలివైన
ఒకపరమ
పురుషుడు
ప్రకృతినీ,
పలువురు పురుషులనూ
ఒకచోటికి
చేర్చి,
కలిపి
సృష్టికి
కారకుడవుతున్నాడు.తిరిగి
ఆ
రెంటినీ
విడదీసి
ప్రళయానికీ
కారకుడవుతున్నాడు.
వేదాలు
స్వయంగా
భగవంతుడి
నుంచి
వెలువడిన
శబ్ద
సంపద
కనుక
అవి
విశ్వసనీయమైనవని
ఒకపక్కన
చెపుతూ,
మరోపక్క
వేదాలు
చెపుతున్నాయి
కనుక
దేవుడున్నాడనే
వాదన
తార్కికంగా
ఎలా
నిలువలేని
వాదనో
మనం
ఉదయనుడి
న్యాయ
సిద్ధాంతం
గురించి
చర్చించినప్పుడే
వివరంగా
పరిశీలించాం.నిమ్నోన్నత
హద్దుల
సిద్ధాంతం
కేవలం
సైద్ధాంతికమే
తప్ప
అది
ఆచరణలో
సాధ్యపడేదికాదు.పూర్తిగా
శక్తిలేని
పురుషుడు
ఉండడం
అసాధ్యం.మృత
శరీరంలోనూ
ఎంతోకొంత
శక్తి
ఉంటుంది
కనుక.అలాగే
పరిపూర్ణ
శక్తిమంతుడు
అనేదికూడా
కేవలం
ఊహాత్మకమే.విశ్వం
లోని
అన్ని
శక్తులూ
తనలోనే
ఇమిడివున్న
ఒక
పురుషుడు
ఉండే
ఉంటాడని
ఖాయంగా
ఎవరైనా
ఎలా
చెప్పగలరు?
పరిపూర్ణ
పురుషుడు
అనేది
మనం
ఆదర్శం
కోసం
ఏర్పరచుకున్న
ఒక
ఊహాత్మక
లక్ష్యం
మాత్రమే. పదార్థేతరుడూ,
విశ్వాత్మ
అయినట్టి
భగవంతుడు
పదార్థమైనట్టి
ప్రకృతి
యొక్క
పరిణామానికి
ఎలా
కారకుడు
కాగలడనే
ప్రశ్న
ఉండనే
ఉంది.కనుక
యోగ
దర్శనం
యొక్క
దైవ
సిద్ధాంతం
కూడా
ఇదే
తరహాలో
పలు
చిక్కు
ప్రశ్నలకు
సమాధానాలు
చెప్పడంలో
విఫలమైంది.
పూర్వ
మీమాంస
;-పూర్వ
మీమాంసనే
'మీమాంస
దర్శనం'
అనికూడా
అంటారు.వేదాల్లో
చెప్పిన
క్రతు
కాండ
యొక్క
ప్రాముఖ్యాన్ని
అర్థం
చేసుకుని,
ఎలాంటి
ఇబ్బంది
లేకుండా
తు.చ.
తప్పకుండా
ఆ
క్రతుకాండను
యథాతథంగా
పాటించేటందుకు
అనువైన
సూత్రాలు
తయారు
చేయడం,
ఆ
క్రతుకాండకు
తాత్త్విక
పునాదిని
ఏర్పరచడం
పూర్వ
మీమాంస
తన
లక్ష్యాలుగా
భావించింది.బౌద్ధ,
జైన,
చార్వాక
సిద్ధాంతాలు
ఒకపక్క
వేద
ప్రామాణ్యాన్నే
అంగీకరించని
నేపథ్యంలో,
కొన్ని
బౌద్ధ
శాఖలు
ఆత్మ
యొక్క
ఉనికినే
ప్రశ్నిస్తున్న
సందర్భంలో,
కొన్ని
ఉపనిషత్తులు
స్వర్గ
ప్రాప్తి
మానవ
జీవితం
యొక్క
లక్ష్యం
కావాలనే
వాదనను
తీవ్రంగా
గేలి
చేస్తున్న
సమయంలో
జైమిని
పన్నెండు
అధ్యాయాల
'పూర్వ
మీమాంస'
సూత్రాలను
రచించాడు.ఈ
సూత్రాలకు
శబరస్వామి
భాష్యం
రాశాడు.కుమారిల
భట్టు,
ప్రభాకరుడు
పూర్వ
మైమాంసికులలొ
పేర్కొనదగినవారు.
జ్ఞాన
సిద్ధాంతంలో
అర్థాపత్తి(
Postulation),
అనుపలబ్ధి(Non-Perception)
అనే
మరి
రెండు
ప్రమాణాలను
వీరు
చేర్చారు. పూర్వ
మైమాంసికులంతా
వేదాలను
ప్రామాణికంగా
భావిస్తారు.
అయితే
చాలా
మంది
మైమాంసికులు
దేవుడి
యొక్క
ఉనికిని
మాత్రం
అంగీకరించక
పోవడం
విచిత్రం.శాలికానాథుడి
"ప్రకరణ
పంచికా"
అన్న
గ్రంథంలో'
ఒకే
దేవుడిని
ఆవాహన
చేస్తే
అతడు
పలు
తావులలో
ఒకేసారి
ప్రత్యక్షం
ఎలా
అవుతాడు
?'--
అని
ప్రశ్నించడం
ఉంది.దేవీ
దేవతలను
మైమాంసికులు
కేవలం
ఆదర్శమైన
పౌరాణిక
పాత్రలుగానే
భావించారుగానీ,
మహిమలుగల
దేవతలుగా
భావించలేదు.దైవం
విషయంలో
దాదాపు
మైమాంసికులంతా
ఇదే
భావన
కలిగి
ఉన్నారు.
వేదాంత
దర్శనం
:-వేదాంతము
అంటే
వేదముల
చివరి
భాగం.
ప్రతి
వేదంలోనూ
సంహిత,
బ్రాహ్మణము,ఆరణ్యకము, ఉపనిషత్ అనే
నాలుగు
భాగాలుంటాయి.
వేదాంతం
అంటే
వీటిలో
చివరిదైన
ఉపనిషత్
అన్నమాట.ఉపనిషత్తుల
గురించి
వివరాలు
లోగడ
మనం
తెలుసుకున్నాం.వివిధ
ఉపనిషత్తులలో
ఆత్మ
తత్త్వం,
పరమాత్మ
తత్త్వం,
ఆత్మ-
పరమాత్మల
సంబంధం
వగైరా
విషయాల
గురించి
చర్చ
చేయబడింది.బాదరాయణుడు
తన
'బ్రహ్మ
సూత్రాలు'
అన్న
గ్రంథంలో
ఉపనిషత్తుల
సారాన్ని
గుదిగుచ్చాడు.బ్రహ్మసూత్రాలకు
పలువురు
తాత్త్వికులు
భాష్యాలు
రాశారు.
శంకరుడు,
రామానుజుడు,
మధ్వ,
నింబార్క,
వల్లభ
తదితరులు
బ్రహ్మసూత్రాలకు
భాష్యాలు
రాసి,
అలా ఎవరికివారు
తమ
స్వంత
వేదాంత
శాఖకు
ఆద్యులయ్యారు.
ఈ
వేదాంత
శాఖల
మధ్య
అభిప్రాయ
భేదాలు
ప్రధానంగా
ఒకే విషయం
మీద
వచ్చాయి.
అదేమిటంటే:జీవునికీ,
దేవునికీ
మధ్య
ఉన్న
సంబంధం
స్వభావం
ఏమిటి
? (జీవుడినే ఆత్మ
అనీ,
దేవుడినే పరమాత్మ అనీ
లేక
బ్రహ్మన్ అనీ
అంటారు). ఆత్మ,
పరమాత్మ వేటికవే రెండు
పూర్తిగా
భిన్నమైన
అంశాలని మధ్వాచార్యుడు
పేర్కొన్నాడు.దీనినే
ద్వైతం
(Dualism)
అంటారు.శంకరాచార్యుడు
ఆత్మ,
పరమాత్మలు
ఒక్కటేనని
వాటి
మధ్య
అభేదం
పాటించాడు.ఈ
సిద్ధాంతాన్ని
అద్వైతం
(Monism)
అంటారు.రామానుజుడేమో
బ్రహ్మన్
ఒక్కడే
సత్యం
అంటూనే
బ్రహ్మన్
లోనే
అంతర్భాగంగా
వాస్తవికమైనట్టి
పదార్థాలు,
జీవులు
(పరిమితాత్మలు-Limited
Selves ) కూడా
ఉన్నాయంటాడు.అలా
రామానుజుడిదీ
అద్వైతమే అయినా
అది
వాస్తవ పదార్థాలు,
జీవాత్మలతో కూడిన
విశిష్టమైన బ్రహ్మన్ ను
ప్రతిపాదిస్తుంది
కనుక
దానిని
విశిష్టాద్వైతం
(Qualified Monism) అన్నారు.అభేద,
భేద,
భేదాభేద
శాఖలు
ఎన్నో
ఉన్నా
మనం
అతి
ప్రధానమైన శంకర,
రామానుజుల
సిద్ధాంతాలను
మాత్రమే సాపేక్షంగానూ,
తులనాత్మకంగానూ పరిశీలిద్దాం.
ప్రపంచాన్ని
గురించి
శంకరుడి
సిద్ధాంతమేమిటో
ముందుగా
చూద్దాం.అజ్ఞానులకు
ఈ
ప్రపంచం
వాస్తవమైనదిగా
కనుపిస్తుంది.
విజ్ఞులైనవారు
మాత్రమే
ఈ
ప్రపంచం
నిత్యమూ
కాదు;
సత్యమూ
కాదని
గ్రహించగలరు.బ్రహ్మన్
ఒక
గొప్ప
మంత్రగాడివలె
మాయ
అనే
ఒక
మంత్రదండాన్ని
ధరించి
ఈ
ప్రపంచంలోని
సకలవస్తువులూ
సత్యమని
మనం
భ్రమపడేటట్లు
చేస్తున్నాడు.మాయ
అనేది
బ్రహ్మన్
లో
అంతర్లీనంగా
ఉండే
శక్తే.
మండే
అగ్ని
నుంచి
కాలే
గుణాన్ని
ఎలాగైతే
వేరు
చెయ్యలేమో
అలాగే
బ్రహ్మన్
నీ
మాయనీ
వేరు
చెయ్యలేం.విజ్ఞులైన
వారు
మాత్రమే
ఈ
భ్రమలు
గొలిపే
జగన్నాటకం
వెనుక
ఉన్నది
బ్రహ్మన్
తప్ప
వేరెవరూ
కాదని
గ్రహించగలరు.అలాగే
విజ్ఞులు
మాత్రమే
బ్రహ్మన్
ఒక్కడే
సత్యమనీ,
ఈ
జగత్తంతా
మిధ్య
అనీ
కూడా
గ్రహించ
గలరు.ఉదాహరణకు
రజ్జు
సర్ప
భ్రాంతినే
తీసుకుందాం
.మనలోని
అవిద్య
లేక
అజ్ఞానం
కారణంగా
తాడు
మనకి
పాములా
కనుపిస్తుంది.
అవిద్య
వాస్తవాన్ని
ఆవరణ
చేయడమే
కాక
(మూసిపెట్టడమే
కాక)
అది వాస్తవాన్ని
విక్షేపం
చేస్తుంది
కూడా --
అంటే
వక్రీకరిస్తుంది
కూడా.
తాడు
పాముగా
కనుపించడం
అంటే
'వివర్తం'
చెందుతుంది
కనుక
ఇలా
మారినట్లు
భ్రమ
కలిగించే
మార్పుతో
కూడిన
శంకరుడి
సృష్టి
సిద్ధాంతాన్ని
'
వివర్త
వాదం'
అంటారు.అలాకాక
పాలు
వాస్తవంగా
పెరుగుగా
మారతాయి.
ఇలా
నిజమైన
మార్పు
మీద
ఆధారపడిన
సాంఖ్యుల
సృష్టి
సిద్ధాంతాన్ని
'పరిణామవాదం'
అంటారు.రామానుజుడి
విశిష్టాద్వైతం
కూడా
పరిణామవాద
సిద్ధాంతమే.రామానుజుడు
బ్రహ్మన్
లోని
అచేతన
పదార్థం
వాస్తవంగా
ప్రపంచంగా
పరిణామం
చెందుతుందంటాడు.శంకరుడి
వివర్తవాదం
రామానుజుడి
పరిణామవాదం--
ఈ
రెండూ
ఒక్క
విషయంపైన
మాత్రం
ఏకాభిప్రాయం
కలిగి
ఉన్నాయి.
అదేమిటంటే
కార్యం(
Effect ) పదార్థ
కారణం(Material
Cause ) లో
ముందే
ఇమిడి
ఉన్నదనేది.ఇలా
కార్యం
కొత్తగా
ఎక్కడినుంచో
ఊడిపడ్డదేమీ
కాదనీ,
అది
ముందే
కారణంలో
ఇమిడి
ఉందనీ
అనడాన్ని
సత్కార్యవాదం
అంటారు.శంకరుడు
పేర్కొన్న
మాయను
ప్రకృతి
అని
కూడా
అంటారు.అయితే
సాంఖ్యుల
ప్రకృతి
స్వతంత్ర
అస్తిత్వం
కలిగినట్టిదికాగా,శంకరుడి
ప్రకృతి
(మాయ)
బ్రహ్మన్
యొక్క
శక్తి.
అది
పూర్తిగా
బ్రహ్మన్
మీద
ఆధారపడినట్టిది.
శంకరుడి
సృష్టి
సిద్ధాంతం
వీలైనమేరకు
హేతుబద్ధంగా
రూపొందించబడిందే.
భగవంతుడు
పదార్థం
నుంచి
ఈ
ప్రపంచాన్ని
సృష్టించాడనుకుంటే
అప్పుడు
భగవంతుడితో
పాటు
ఆ
పదార్థమూ
ఒక
శాశ్వతమైనదీ,
అనంతమైనదీ
అవుతుంది.అప్పుడిక
బ్రహ్మన్
ఒక్కడే
శాశ్వతుడూ,
అనంతుడూ
అన్న
పదాలకింకా
అర్థమేముంటుంది?
పదార్థం
సత్యమనీ,
అది
భగవంతుడిలో
ఒక
అంతర్భాగమనీ
అనుకుంటే
మనం
చిక్కుల్లో
పడాల్సి
వస్తుంది.పదార్థం
భగవంతుడిలో
ఒక
భాగమనన్నా
అనుకోవాలి.లేక
భగవంతుడే
ఆ
పదార్థం
అనన్నా
అనుకోవాలి.మొదటి
విధంగా
అయితే
ఇన్నాళ్ళూ
మనం
ఒక
ఆత్మిక
ద్రవ్యం
అనుకుంటున్న
భగవంతుడు
పదార్థ
ద్రవ్యాలకు
వలెనే
భాగాలు
కలిగి
ఉంటాడనుకోవాల్సి
వస్తుంది.
అప్పుడు
భాగాలు
కలిగివున్న
పదార్థ
ద్రవ్యాలన్నింటివలెనే
భగవంతుడు
కూడా
నశించి
తీరాలి.ఇక
రెండవ
ప్రత్యామ్నాయం
అంగీకరిస్తే
పదార్థమే
బ్రహ్మన్
అని
భావించాలి.
పదార్థమే
ప్రపంచంగా
పరిణామం
చెందింది
కనుక
ప్రపంచమే
బ్రహ్మన్.అప్పుడిక
భగవంతుడు
ప్రపంచం
స్థాయికి
కుదించబడి,
సృష్టి
తరువాత
ఇక
అసలు
భగవంతుడి
ఉనికే
ప్రశ్నార్థకం
అవుతుంది.మొత్తం
పదార్థమే
బ్రహ్మన్
అనుకున్నా
లేక
పదార్థం
బ్రహ్మన్
లోని
ఒక
అంతర్భాగం
అనుకున్నా
పదార్థం
ప్రపంచంగా
పరిణామం
చెందడం
వాస్తవమే
అయితే
భగవంతుడిలో
కొంత
భాగంగానీ
లేక
భగవంతుడు
పూర్తిగా
కానీ
మార్పుకు
లోనైనట్లే
కదా
!
అప్పుడిక
మనం
ఇంతకాలం
శాశ్వతుడు
అనుకుంటున్న
భగవంతుడు
ఇంకెంతమాత్రం
శాశ్వతుడు
కాడన్నమాట.అప్పుడిక
అతడు
భగవంతుడెలా
అవుతాడు
?
పదార్థం
ప్రపంచంగా
పరిణామం
చెందినప్పుడు
అది
నిజంగా
పరిణామం
చెందదనీ,
మనకు
అలా
పరిణామం
చెందినట్లు
అనిపిస్తుందనీ
ప్రతిపాదించిన
శంకరుడి
సృష్టి
సిద్ధాంతం
పై
చిక్కులన్నింటినీ
సులువుగా
అధిగమించింది.
అయితే
శంకరుడి
మాయావాద
సిద్ధాంతాన్ని
రామానుజుడి
వంటి
అనంతరకాలపు
తత్త్వవేత్తలు
తీవ్రంగా
తప్పుబట్టారు.మాయ
కారణంగా
అపరిపూర్ణులైన
మానవులందరికీ
ఈ
ప్రపంచమంతా
భేదాలు,
వ్యత్యస్తాలుగా
కనుపిస్తున్నదని
మనం
కూడా
శంకరుడిలాగే
అనుకుందాం.అపరిపూర్ణులైన
మానవులకు
అది
సహజమేనని
కూడా
అనుకుందాం.మరి
భగవంతుడు
పరిపూర్ణుడు
కదా.
ఆయన
ఈ
ప్రపంచాన్ని
సృజించి,
జీవుల
పాప
పుణ్యాల
చిట్ఠా
లెక్కలనుబట్టి
ఆ
యా
ప్రత్యగాత్మలకు
వారికి
ఉచితమైన
శరీరాలను
వారికి
కేటాయిస్తాడని
వేదాలు
ఘోషిస్తున్నాయి.మరప్పుడు
భగవంతుడికి
కూడా
ఈ
ప్రపంచం
భేదాలు,
వ్యత్యస్తాల
మయంగానే
కనుపిస్తున్నట్లే
కదా
!మరి
భగవంతుడి
చేతిలోని
మంత్రదండం
వంటి
మాయ
కారణంగా
ఆయన
కూడా
భ్రాంతికి
లోనవుతున్నాడనుకోవాలా?
మరో
విషయం-
ప్రపంచంలో
ఒక
వాస్తవికత
అయినట్టి
ఈ
వైవిధ్యాలను
మనం
ఒక
ఎండమావిలా
వాస్తవం
కాదని
ఎలా
భావిస్తాం
?ఒక
చెరువు
ఉండడం,
దానిలో
నీరు
ఉండడం,ఆ
నీరు
తాగితే
అది
మన
దాహార్తిని
తీర్చడం
పచ్చి
నిజాలు
కాగా
మనకి
ఉన్నట్లు
కనుపించే
ఎండమావి
భ్రమ
;
అందులో
నీరు
ఉండడం
పచ్చి
అవాస్తవం.మనం
తాగి,
దాహార్తిని
తీర్చుకున్న
చెరువు
నీళ్ళూ
ఎండమావిలోని
నీటిలా
భ్రమేనంటే
ఎలా
?'బ్రహ్మ
తప్పితే
ఈ
జగత్తులో
సర్వం
మిధ్య'
అని
ప్రచారం
చేసే
ఒక
అద్వైతినో
లేక
స్వయంగా
ఆది
శంకరాచార్యుడినేనో
ఒక
మదపుటేనుగు
భీకరంగా
వెంబడిస్తే
ఆయన
పరుగు
లంకించుకున్నాడనీ,
అది
చూసిన
ఎవరో
ఒక
వ్యక్తి,
'స్వామీ
!
ఈ
జగత్తంతా
మిధ్య
అని
నమ్మే
మీరే
ఈ
మదపుటేనుగుకు
భీతిల్లి
పలాయనం
చిత్తగిస్తున్నారేం
?ఆ
గజం
కూడా
జగత్తులో
భాగమైనందున
అదీ
మిథ్యే
కాదా
?'అని
ప్రశ్నిస్తే
దానికి
ఆయన
'పిచ్చివాడా
!
నీకు
నేను
పలాయనం
చిత్తగిస్తున్నట్లుగా
అనిపించిందా
?
ఆ
గజమూ
మిధ్యే.నేను
పలాయనం
చిత్తగిస్తున్నట్లుగా
నీకు
అనిపించడం
కూడా
మిధ్యే',
(గజం
మిధ్య
;
పలాయనం
మిధ్య
)
అంటూ
కొంటెగా
సమాధానమిచ్చి,
తెలివిగా
తప్పుకున్నాడట.వాస్తవంగా
ఉన్న
వస్తువులను
లేవని
చెప్పడం,మన
భ్రమ
కారణంగా
అవి
ఉన్నట్లుగా
అనిపిస్తున్నాయని
చెప్పడం
శంకరుడి
మాయావాదంలోని
ప్రధానాంశం.మన
ఇంద్రియాలకు ఒకే
విషయాన్ని
గురించిన
పరస్పర
విరుద్ధమైన
రెండు
అనుభూతులు
కలిగాయనుకోండి.అప్పుడు
ఆ
రెంటిలో
ఏదో
ఒకటి
మాత్రమే
నిజమవుతుంది
కానీ
రెండూ
నిజాలు
కావు.మనం
ఒక
కుండనూ,
పుస్తకాన్నీ
చూస్తున్నామనుకోండి.ఆ
రెండు
వస్తువులూ
స్థల
కాలాల్లో
వేర్వేరుగా
ఉన్నాయి
కనుక
అవి
మనకు
కలిగించే
అనుభూతుల
మధ్య
ఎలాంటి
వైరుద్ధ్యమూ
లేదు.కాబట్టి
ఆ
రెండూ
వాస్తవమేనని
గ్రహించాలి.
'రజ్జు
సర్ప
భ్రాంతి'లో
అలా
కాదు.అక్కడ
వాస్తవంగా ఉన్నది తాడు
మాత్రమే. పాము
లేకపోయినా మనం
ఉన్నట్లుగా
భ్రమిస్తున్నాం.కారణం
తాడు
మనలో
కలిగించిన
అనుభూతిని
మనం
భ్రమపడి
పాముగా
అర్థం
చేసుకున్నాం.ఆ
తాడు
అక్కడ
ఉన్నది
వాస్తవం.
అది
అందరికీ
తాడుగానే
కనబడడమూ
వాస్తవమే.లోపం
అంతా ఒక్క చూసే
వ్యక్తి
మనస్స్థితిలోనూ,
అతడి
పూర్వానుభవాలలోనూ
ఉందికానీ,
తాడులో
మాత్రం
ఏ
లోపమూ లేదు.అది
అక్కడ
ఉన్నదనే
విషయం
వాస్తవం.అవాస్తవం
మాత్రం
కాదు.మన
దగ్గర
ఇప్పుడు
లేని
ఒక
వస్తువును
అసలు
ఎక్కడా
లేనట్టిదని
అనలేం
కదా
!
అలాగే
వాస్తవమైన
ఒక
వస్తువును
ఒకసారి
మనం
భ్రాంతితో
వేరే
వస్తువుగా
భావించినప్పటికీ,
అసలు
ఆ
వస్తువే
లేదు;
అదంతా
మిధ్య
అనడం
వాస్తవ
చిత్రణ
కాదు.
అలాగే
శంకరుడు మాయకూ,
బ్రహ్మన్
కూ
అభేదం పాటించడం
కూడా
సరి
కాదు.
బ్రహ్మన్
కారణం(Cause); మాయేమో
ఆ
కారణాన్నుంచి
జనించిన
కార్యం
(Effect). కార్యానికీ,
కారణానికీ
అభేదం
అంటే
బ్రహ్మన్
అయినా
అసత్యం
అయివుంటాడు.
లేకపోతే ప్రపంచం వాస్తవం
అయివుంటుంది.ఇవీ
క్లుప్తంగా
అద్వైత
వేదాంతంలోని
సృష్టి
సిద్ధాంతంలోని
బలహీనతలు.
ఇక
శంకరుని
దైవ
సిద్ధాంతం
ఏమిటో
కూడా
చూద్దాం.
వ్యావహారిక
దృష్టి
(practical standpoint )తో
చూస్తే
ఈ
ప్రపంచం
సత్యం.
దానికి
కారణం(Cause
)
భగవంతుడే. ఈ
ప్రపంచానికి
సృష్టికర్త,పోషకుడు,లయకారుడు భగవంతుడే. ఆయన
సర్వ
వ్యాపి (omnipresent ),
సర్వ
శక్తి
సమన్వితుడు(omnipotent
)
మరియు
సర్వ
జ్ఞాని
(omniscient ).
ఆయన
వ్యావహారిక
దృష్టితో
చూస్తే
సగుణుడిగా
(Possessed of Qualities )అనిపిస్తాడు.
శాంకర
సిద్ధాంతంలో
సగుణ
బ్రహ్మ
ను
'ఈశ్వర'
అంటారు.
ఆయన
పూజనీయుడు.
ఇక పారమార్థిక
దృష్టి
(non -worldly point of view )తో
చూస్తే
భగవంతుడికి
సగుణ
బ్రహ్మకు ఉన్నట్లుగా మనం
చెప్పుకున్న
లక్షణాలేవీ
ఉండవు.
ఆయన్ని
పరంబ్రహ్మ
(Supreme God )
అని
వ్యవహరిస్తారు.
మనం
లోగడనే
చెప్పుకున్న
గ్రీకు
తాత్త్వికుడు
ప్లేటో
యొక్క
Idea of the Good (లేక)
God కు'
పరంబ్రహ్మ' కూ
దగ్గర
పోలికలున్నాయి.
పారమార్థిక
దృష్టితో
చూసినప్పుడు
మనం
భగవంతుడిని
సగుణుడిగా
వర్ణించలేం.
ఎందుకంటే
గుణాలన్నీ
ప్రపంచానికి చెందినట్టివి.
ఈ
నిర్గుణ
బ్రహ్మ
స్వజాతీయ,
విజాతీయ,
స్వగత
భేదాలన్నింటికీ
అతీతుడని
శంకరుడు
భావిస్తే,
రామానుజుడు
భగవంతుడికి
స్వజాతీయ,
విజాతీయ
భేదాలు
లేకున్నా
స్వగత
భేదం
మాత్రం ఉన్నదంటాడు.
ఎందుకంటే
భగవంతుడి
లోపలే
స్పష్టమైన
జీవ,
అజీవ
పదార్థాలు
ఉన్నాయి
కనుక
భగవంతుడికి
కనీసం
స్వగత
భేదం
అయినా
ఉన్నదని
మనం
గ్రహించగలమంటాడు
రామానుజుడు.
పారమార్థిక
దృష్టితో
చూస్తే
బ్రహ్మన్
ను
మనం
వర్ణించలేమంటాడు
శంకరుడు.
అందుకే
అతడిని
నిర్గుణ
బ్రహ్మన్
(Indeterminate or Characterless God )
అంటాడు.
భగవంతుడి
గుణాలను
ఎవరైనా చెప్పబోతే
ఆయనకు
పరిమితులు
విధించడమే
.
ప్రముఖ పాశ్చాత్య
తత్త్వవేత్త
స్పినోజా కనిపెట్టిన
ఒక
సూత్రం
ఇక్కడ
చెప్పుకోదగినది
.
If 'S' is
P ; It is a non-P and therefore non-P is
excluded from S, which becomes then
limited to that extent.
అందుకే
స్పినోజా
అంటాడు:'
Every Determination is Negation '
అని
.
భగవంతుడి
గుణాలు
ఇవని
నిర్ధారించి
చెప్పలేమనీ, అందుకే భగవంతుడిని ఏ
సకారాత్మక
గుణాలతో
వర్ణించలేమనీ
అంటాడు స్పినోజా .
ఉపనిషత్తులు
కూడా
ఇదే
విషయాన్ని నొక్కి
చెప్పాయి
.భగవంతుడిని
ఎటువంటి
గుణగణాలతో
వర్ణించలేమనీ
అతడి
పూజార్హత
కూడా
ప్రశ్నార్థకమనీ చెపుతూ 'కేనోపనిషత్' ఏమన్నదో చూడండి
.
యత్
వాచా
నభ్యుదితం
యేన
వాగభ్యుద్యతే
।
తదేవ
బ్రహ్మత్వం
విద్ధి
నేదం
యదిద
ముపాసతే
॥
(కేనోపనిషత్తు
1-5)
భావం
:- మాటలు
దేన్ని
ప్రకటించలేవో;
మాటలనే
ఏది
ప్రకటిస్తుందో
అది
మాత్రమే
బ్రహ్మం
అనీ,
ఈ
ప్రజలు
పూజించే
'ఇది'కాదనీ
తెలుసుకో.
శంకరుడి
'మాయ'
అనే
భావాన్నీ,
వివర్త
వాదాన్నీ
ఖండించిన
రామానుజుడి
దైవ
సిద్ధాంతం
శంకరుడి
సిద్ధాంతంతో
పోలిస్తే
కొంతమేరకు
వాస్తవికంగా
ఉంది.
దైవం
తనలోనిదే
అయినట్టి
అచేతన పదార్ధం
నుంచి
ఈ
ప్రపంచాన్ని
సృష్టించాడు.
సృష్టి
భగవంతుడు
చేసిన
వాస్తవిక
చర్యే.
భగవంతుడు
శ్వేతాశ్వతర
ఉపనిషత్తులో
మాయా
అనే
శక్తిని
ధరిస్తాడని
పేర్కొన్నమాట
వాస్తవమే
.
అయితే
ఒక
మాంత్రికుని చేతిలోని
మంత్రదండానికి
ఉన్న
తిరుగులేని
శక్తిగానే
మనం
మాయను
అర్థం
చేసుకోవాలి
.
మాయ
అనే
పదాన్ని
విచిత్రమైన
వస్తువులను
సృష్టించగల
(విచిత్రార్థ
సర్గకారీ
శక్తి)
భగవంతుడి
శక్తిగానే
మనం
భావించాలి
.
ఒక్కోసారి
అద్భుత
సృజనశీలత
కలిగిన
ప్రకృతిని
'మాయ'పేరిట
సంబోధించడం
కూడా
ఉంది.
రామానుజుడి
దృష్టిలో
విజ్ఞానమంతా
వాస్తవికమైనట్టిదే
(యథార్థం
సర్వ
విజ్ఞానం).అంతా
మిధ్య
అని
చెప్పే
శంకరుడి
అద్వైత
సిద్ధాంతమైనా
మిధ్య
కాదనీ,
నమ్మదగినదేననీ
భావించడం
ఎలాగని
విశిష్టాద్వైతులు
ప్రశ్నించారు.
.
శంకరుడి
భావన
ప్రకారం
భగవంతుడు
నిర్గుణుడు
;
రామానుజుడి
విశ్వాసం
ప్రకారం భగవంతుడు
అసంఖ్యాకమైన
ఉత్తమ
గుణాల
సమాహారం.
శంకరుడి
సిద్ధాంతాలపై
వచ్చినంత
తీవ్ర
స్థాయిలో
కాకున్నా
రామానుజుడి
సిద్ధాంతాలపై
కూడా
తీవ్ర
విమర్శలే
వచ్చాయి.
భగవంతుడు జీవ,
అజీవ
భాగాలు
కలిగివుంటాడనే
రామానుజుడి
ప్రతిపాదనపై
ప్రతికక్షులు
ఇలా
అభ్యంతరం
లేవనెత్తారు.
భాగాలు
కలిగినది
ఏదైనా
నశిస్తుంది.
ఆ
లెక్కన
భాగాలు
కలిగిన
భగవంతుడూ
నశించాలి.
మరి
నశిస్తాడా
?
పదార్ధం(అజీవం)
నశ్వరమని
ఒక
పక్క
చెపుతూనే
మరోపక్క అది
బ్రహ్మన్
లోని
ఒక
అంతర్భాగమనీ
విశిష్టాద్వైతుల
భావన.
మరప్పుడు
పూర్తిగా
కాకున్నా
భగవంతుడు
పాక్షికంగానైనా
నశిస్తాడా
?
పాక్షికంగానైనాసరే
నశించే
వాడు
భగవంతుడెలా
కాగలడు
?అసంఖ్యాకంగా
ఉన్న జీవాత్మలు
ఎవరిచే
సృష్టించ
బడ్డాయి
?
అవి
భగవంతుడితో
పాటు
అనాది
సిద్ధాలు,
శాశ్వతాలూ
(co- eternal with God )అని
భావించాలా
?అప్పుడిక భగవంతుడి ప్రత్యేకత ఏముంది ? భగవంతుడే ఈ
జీవాత్మలను
సృష్టించాడని
భావిస్తే
సృష్టించబడిన
ప్రతిదీ
నశించితీరాలి
కదా
!
ఇవీ
స్థూలంగా
విశిష్టాద్వైత
సిద్ధాంతం
ఎదుర్కొన్న
సమస్యలు.
మిగిలిన
అందరు
ప్రాక్పశ్చిమ
తాత్త్వికులు
ఎలాగైతే
తాము
ప్రతిపాదించిన
దైవ
సిద్ధాంతాలలోని
లోపాలను
ప్రతికక్షుల
విమర్శలకు
దీటుగా
సవరించి,
తమ
దైవ
సిద్ధాంతాలను లోపరహితమైన
(fool proof )
సిద్ధాంతాలుగా
తయారు
చేయడంలో
విఫలమయ్యారో,
అదే
విధంగా
రామానుజుడూ
విఫలమయ్యాడు.
అలా
పాశ్చాత్య
తత్త్వవేత్తలలోగానీ, ప్రాచ్య
తత్త్వవేత్తలలో
గానీ
దేవుడున్నాడని
రుజువు
పరచబోయిన,
లేక
ప్రతికక్షుల
విమర్శలకు
తట్టుకుని
నిలవగలిగే
పటిష్టమైన
దైవ
సిద్ధాంతం
తయారుచేయబోయిన
ప్రతి
ఒక్కరూ
వైఫల్యం
చెందడం
మనం
గమనించాం.
అయితే ఆ
తాత్త్వికులు
అద్భుతమైన
తమ
మేధా
శక్తితో
సృష్టించిన
లోతైన
శాస్త్ర
చర్చతో
కూడిన
ఆ సిద్ధాంతాలు
వట్టిపోలేదు.
ఏనాటికీ
అవి
వట్టిపోవు
కూడా
.
ఈ
దైవ
సిద్ధాంతాలు,
వాటికి
ప్రతిగా
ప్రతికక్షుల
అభ్యంతరాలు
చిరస్థాయిగా
నిలిచి
ఉంటాయి.
కేవలం
తత్త్వశాస్త్ర
విద్యార్థులకే
కాదు;
అవి చదువరులందరి
మేధస్సుకు
పదునుపెడుతూ,
వారి
జ్ఞాన
సంపదను
చిలుకుతూ,
లోతుల్లోకి
వెళ్లి
పరిశీలించేవారికి
జ్ఞాన
సుధలను
అందిస్తూనే
ఉంటాయి.సమకాలీనులు
కాకున్నా
భారతీయ
తత్త్వశాస్త్ర
చరిత్రలో
అలాంటి
ప్రాతఃస్మరణీయులైన
ప్రతిస్పర్థులే
శంకర
రామానుజులు.
వారి
సిద్ధాంతాలు
రుచించనివారు
సైతం
వారి
భావ
గాంభీర్యాన్నీ,
పట్టుదలతో
కూడిన
వారి
ప్రయత్నాన్నీ,
వారి
చిత్తశుద్ధినీ
ఎంతమాత్రం
శంకించలేరు.
అయితే
చారిత్రకంగా
చూస్తే
రామానుజుడు
శంకరుని
కంటే
ప్రగతిశీలమైన
పాత్ర
నిర్వహించాడు.
రామానుజుడు
కుల
భేదాలను
పాటించక
సర్వ
మానవ
సౌభ్రాతృత్వాన్ని
ఆచరణలో
పాటించి
చూపాడు.
శూద్రులు
మొదలైన
దిగువ
కులాల
వారు
సైతం
విశిష్టాద్వైతంలో
ఆళ్వారులుగా
ఉండడం,
వారి
శిష్యులలో
కొందరు
బ్రాహ్మణులు
కూడా
ఉండడం
రామానుజులవారి
విశాల
దృక్పథం
కారణంగానే
సాధ్యమైంది
.
ఆయనే
స్వయంగా
నేతృత్వం
వహించి
మెల్కోటే
దేవస్థానం
లోకి
దళితులను
ప్రవేశ
పెట్టారు.
ఆయన
తన
సిద్ధాంతాల
ప్రచారంలో ప్రజల
భాష
అయినట్టి
తమిళానికి
సంస్కృతంతోపాటు
సరిసమాన
ప్రాధాన్యం
ఇచ్చారు.
దానికి
తోడు
ఆయన
సిద్ధాంతాలు
మాయ,
మిధ్య
అనకుండా వాస్తవిక
దృష్టిని
ప్రతిబింబించాయి. అందుకే
ఆయన
సిద్ధాంతాలకు
సామాన్య
ప్రజలలో
అంతటి
ఆదరణ
లభించింది.
దీనితో
ప్రాక్పశ్చిమ
తత్త్వ
శాస్త్రాల్లో
పలువురు
ప్రముఖులు
వెలిబుచ్చిన
దైవ
సిద్ధాంతాలు ,
వాటిపై
చెలరేగిన
విమర్శలు,
వాటిని
ఎదుర్కొనేందుకు
ప్రయత్నించి,
ఆ
యా
తాత్త్వికులు
విఫలమయన
తీరుతెన్నులు,
శాస్త్ర
జ్ఞానమనే
కొలబద్దకూ,
తార్కికత
అనే
ద్రావక
పరీక్షకూ వారి
సిద్ధాంతాలు
ఏవిధంగా
నిలవలేక
పోయాయో కూడా
ఎక్కడికక్కడ
ఆ
యా
అధ్యాయాలలోనే
వీలైనంత
క్లుప్తంగా విపులీకరించడం
పూర్తయింది.
ఇక
నిర్ణయం
మీది.
దేవుడనే
ఒక
అదృశ్య
శక్తి
మన
వెనక
ఉండి
,
మన
కర్మఫలదాతగా
వ్యవహరిస్తూ,
మన
పాప
పుణ్యాల
చిట్టాలు
సరిచూస్తూ,
ఎవరి
పాపానికి
తగిన
శిక్షలు
వారికి
వేస్తూ,
ఎవరి
పుణ్యానికి
తగిన
పురస్కారాలు
వారికి
ఇస్తూ
ఉండే
అవకాశం
ఉన్నదా
?
ఒకపక్క
ఏ
కర్మా
చేయనివాడు దేవుడని
చెపుతూ,
పని
చేయాలనే
తలంపు
(చికీర్ష)
మనసులో
మొలకెత్తినా ఆయన
దేవుడు
కానేరడని
మనమే
దైవాన్ని
నిర్వచించుకొని
కూడా
మన
దైవం ఇన్ని
పనులతో
నిర్విరామంగా
ఉంటాడని
నమ్మడం
ఏ
మేరకు
సబబో
మీరే
ఆలోచించగోరతాను.
మొత్తం
పద్దెనిమిది
అధ్యాయాలుగా
ఈ
చర్చ
సాగించి,
పదిహేడవ
అధ్యాయం
మొత్తం
వేదాంత
దర్శనానికి
కేటాయించి,
పద్దెనిమిదవ
అధ్యాయంలో
మొత్తం
అధ్యాయాల
సారాన్ని
క్లుప్తంగా
సమీక్షించి,
నా
ప్రణాళిక
ప్రకారం
ఈ
చర్చకు
ఒక ప్రభావవంతమైన,
నాకు సంతృప్తికరమైన ముగింపు
పలకాలని
భావించాను.
అయితే
చర్చను
సంపాదకుల
కోరిక
మేరకు
పదహారవ
అధ్యాయంతోనే
ముగిస్తున్నాను.
బహు
విషయ
పరిజ్ఞానం,
ఇతోధిక శాస్త్ర
జ్ఞానం
కల
ఎందఱో
పెద్దలు
ఈ
చర్చలో
పాల్గొని
తమ
అమూల్యాభిప్రాయాలు
వెలిబుచ్చారు.
వారందరికీ
నా
నమోవాకాలు. చర్చాంశానికి
నిజాయతీగా,
నిక్కచ్చిగా కట్టుబడినందున ,
చర్చలలో
ఇతరుల
స్పందనలకు
నా
ప్రతిస్పందన
తెలిపే సందర్భాలలో నేను
వాది -ప్రతివాదులకు
సహజమైన అంకితభావాన్నే
ప్రదర్శించాను.
నాకు
తెలిసి
ఎక్కడా
ఎదురుదాడికి
దిగకుండా,
ఆసాంతం రక్షణాత్మక
వైఖరినే
అవలంబిస్తూ
నా
వాదనను
గట్టిగా
సమర్థించుకున్నాను. ఎక్కడన్నా
భావోద్వేగానికి
లోనై సహనం
కోల్పోయి
ఉంటే
పెద్ద
మనసుతో
మన్నించ
గోరతాను.ఎవరినీ
లేశమైనా
నొప్పించడం
నా
ఉద్దేశం
కాదు.
వాది, ప్రతివాది
మధ్య
జరిగే
శాస్త్ర చర్చలో
'కఠోపనిషత్తు'
లోని
శాంతి
పాఠం
లో
పేర్కొన్న
విధంగా
'మా
విద్విషా
వహై
' (
మా
మధ్య ఎటువంటి
విద్వేషాలూ
కూడదు)
అనేదే
నా
విశ్వాసం
కూడా. ఈ
చర్చావేదికలో
పాలుపంచుకున్న
విజ్ఞులైన
పెద్దలకూ,
వేదిక
నిర్వహణకు
నన్ను
ప్రోత్సహించి
నాకు
అన్నివిధాల
సహకారాన్ని
అందించిన
సంపాదకులు
మాన్యశ్రీ
తల్లాప్రగడ
రావు
గారికి,
'సుజనరంజని'
నిర్వాహకులు
మాన్యశ్రీ
కూచిభొట్ల
ఆనంద్
గారికి,
ఇన్నాళ్ళూ ఈ
శీర్షిక
పట్ల,
నా
పట్ల
ఆదరణ
చూపిన
'సుజనరంజని' చదువరులందరికీ
నా
ధన్యవాదాలు.
సెలవు.
మీ,
ముత్తేవి రవీంద్రనాథ్.
|