సారస్వతం  
       పుస్తక పరిచయం

- పరిచయకర్త: శైలజామిత్ర

 

అద్భుత విశ్వ రూప సందర్శనం సి.హెచ్. ప్రకాష్ "స్వప్న శకలం''

''The immortal universe has in it many radiant and colour ful bodies which are gaint in size and also tiny particals. A fraction of such a particle is the mandane earth on which we are living. This life on this beautiful mass is a mind boggling and mysterious wonder, even today. More wonderful and puzzling to me is the human nature which is not identical at least between two persons, Like in prehistoric era now also there are disturbances of all sorts whether from mother nature or mandane life. In spite of advancement in all spheres. Instead of finding the secrets to be more peaceful and happy for ever, the human being is all filled with hatred, selfishness and arson. The society in general is engulfed in jealous making leaving no place for peace, love, and affection where each one of us is a prey. At this juncture my mind has given birth to a new thinking in the form of poetry where I am free to express and shater all the grief and joy with fellow beings. 

విశ్వం ఆంటే ఏమిటి? మన ఉహకు కూడా అందనటువంటి విశాలమయిన ప్రదేశంలో వ్యాపించిన వేల కోట్ల నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, మేఘాలు ఇంకా బ్రహ్మా౦డమయిన ధూళి. వాయువులు ప్రాణులు వీటన్నిటినీ కలిపితేనే విశ్వం అవుతుంది. మనం మనసులో అనుకోవాలే కాని విశ్వం గురించిన అంతులేని విషయాలు అనేకం ఉన్నాయి

సి. హెచ్ ప్రకాష్ ఆధునిక కవులలో ప్రత్యేకమయిన శైలి ఉన్న కవి. అందుకే  కవిత్వం ఒక మూసలో పోతున్న కాలంలో విశ్వాన్ని గురించి తెలియజేసి కవిత్వానికే ఒక కొత్తదనాన్ని చేకూర్చారు. విశ్వ ఆవిర్భావంపై మొదటి కావ్యంగా రూపు  దిద్దారు.  విశ్వం అనేది ఎంతో విశాలమయిన వస్తువు. అర్థం కావాలంటే ఎంతో శ్రమకు ఓర్చుకోవాల్సి వస్తుంది. అలాంటి విశ్వం గురించి పాఠకులకు తెలియ జేయాలనుకోవడం ఎంతో ఆశక్తికరం.  అందుకే " సంశయ పుష్పం / మొగ్గ తొడగక ముందే/ స్వప్న శకలం / రేకులు విచ్చుకుంది/ ఏమి లేదని కాదు/తెలియనిది ఏదో ఒకటి ఉందని. " అని ప్రారంభిస్తారు.

సూర్యుడిని ఒక నక్షత్రమనీ, మనమందరం నివసిస్తున్న భూమి సౌరమండలంలోని ఇతర గ్రహాలతో సహా సుర్యునిచుట్టు తిరుగుతున్నాడని మనకు తెలిసిందే.  కాని గ్రహాలే కాకుండా వేలాది గ్రహ శకలాలు, తోకచుక్కలు, కూడా సుర్యునిచుట్టు తిరుగుతున్నాయి. ఇదంతా విన్నప్పుడల్లా మనం అబ్బో అని ఆకాశం కేసి ఒకసారి చూసి అంటాము. అయితే బ్రహ్మానందమయిన విశ్వంతో పోల్చితే సూర్యుడు ఒక చేతిలో మన గదిలోని రేణు వంత కూడా కాదు. ఎందుకంటే సూర్యుడు కొన్ని కోట్ల నక్షత్రాలతో ఒక నక్షత్ర మండలం లేదా గ్యాలక్సీ రూపొందుతుంది . ఒక్కసారి ఇక్కడ చూడండి " సంకల్పం / తన కన్నులు తెరవక ముందే/ లక్ష్యం చూపును సాచిన / సుక్షోష్మ / సాంద్ర తాణువు / విష్పోటనం  / చెందింది/  నిప్పుల కుంపటి /ముడులు విప్పుతున్నట్లు/ వెదజల్లింది". అంటారు ఆంటే విశ్వంలో ఇలాంటి నక్షత్ర మండలాలు కొన్ని వందల కోట్లు ఉన్నాయని అర్థం. కొన్ని వందల కోట్ల నక్షత్ర మండలాలలో ఒకానొక నక్షత్ర మండలమే సూర్యుడు.  దీనిని బట్టి నక్షత్రం ఎంత విశాలమయినదో మనం ఉహించుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక్కో నక్షత్ర మండలానికీ ఒక్కో పేరు పెడుతూ వచ్చేరు. అందులో భాగంగా మన సౌర కుటుంబం ఉందే నక్షత్ర మండలానికి పాల పుంత అని పేరు పెట్టేరు. అదంతా వదిలేస్తే ఎక్కడయినా మనం నిలబడి విశ్వమంతటిని ఒకేసారి చూడగలిగి నట్లయితే అదో అద్భుతమయిన అందమయిన, అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న వేల కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలతో కూడిన ఒక బ్రహ్మాండమయిన సాలె గూడులా కనిపిస్తుంది

మరో చోట కవి స్వరం వినండి "ఆనుకొని ఉంటుందా/ అంతరిక్షం?/ పెరగడానికి విశ్వం పరుగులెడుతుందని/ నడవడానికి/ కాలం /అడుగులిడుతుందని/ పరిణామానికి / గతి శీలం/ నాంది పలుకుతుందని/ విశ్వం విస్తరిస్తోందంటే అర్థం / కాలం / కాంతి వేగంతో/ స్థలాన్ని పరుచుకుంటున్నదని / స్థలం / అపురూపంగా / పరిణామాన్ని / పెంచుకుంటున్నదని/ విరామమెరుగని /వెలుగు రేఖలు/ ఎల్లలెరుగని రోదసి లోకి/ఎగురుతున్నాయని" అని అద్భుతంగా విశదీకరిస్తూ విశ్వ సొగసును మనకు తెలియజేస్తారు.  అందుకే అంటారు. ఆధారం లేకుండా ఏవీ జనించవు. ఒకవేళ మనలోని అంతర్గత జీవం అనే అంశం వృద్ది చెంది విధంగా రచనల్లో బయటకు వస్తోంది కాబోలు. ఎవరికీ తెలుసును? రాను రాను భూమి వంటి గ్రహాలు ఇంకా అంతరిక్షంలో ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి

కవి అంతరిక్షాన్ని ఒక స్త్రీ గా పోల్చి రాయడం అద్భుతం " చుక్కల / చెరువులో/గెలాక్సీ గట్టుమీద/ఏకాంతంగా కూర్చున్నది ఒక తార/మబ్బు తునక దువ్వెనతో/నలుపు కురులను/ సున్నితంగా దువ్వుకుంటూ/అనంతంగా కులుకుతున్నది/ త్రితార/ చెరుకు గడల చేతులతో/ విరుల జడలను/ మురిపెంగా అల్లుకుంటూ /ముసి ముసిగా మురుస్తున్నది / ధ్రువతార" అనడం ఎంతో అందంగా అక్షరాలు అల్లిన తీరు కవి లోని సృజనాత్మకతను తెలియజేస్తుంది. 

మనం అంతరిక్షంలో తిరిగే గ్రహాలను మన జీవిత గమనానికి ముడి పెట్టుకున్నాము. దేవతలుగా చేసుకున్నాము. ఉదాహరణకు సూర్యుణ్ణి భగవంతుడు అంటున్నాము.మరణించిన కొందరు మానవ స్త్రీలను నక్షత్రాలుగా మార్చుకున్నాము. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయినా తర్వాత గ్రహాలన్నీ కేవలం భౌతిక పదార్దాలే అని తేల్చి పారేసాడు. చంద్రునిపై కాలు మోపి అక్కడి మట్టి రాళ్ళను తెచ్చి, చందమామ మామ కాదు ఎవ్వరు పిలిచినా రాదని అన్నాము. రోవర్ల సాహయంతో అంగారకుని ఉపరితలాన్ని భూమి మీద నుండే అధ్యయనం చేసాము.  ఇంత చేసినా విశ్వంలో మరొక జీవ కుటుంబం ఉందేమో అనే అనుమానం మనిషిని వదలలేదు. అందుకు తగిన అన్వేషణ ప్రారంభం అయ్యింది కూడా.  అదిగో పులి ఆంటే అదిగో తోక అన్న చందంగా ఎన్నో పుకార్లు కొందరు చూసామని చెప్పడం ప్రారంభించారు. అసలు విశ్వంలో ఇతర సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? వాటిలో జీవరాసులకు అనుకూలమయిన గ్రహాలు ఏమైనా ఉన్నాయా ? అనే వెదుకులాటలో ప్రస్తుతం ఉన్నారు. కాకుంటే అన్వేషణలో వచ్చే ఫలితాలు మేలు చేస్తాయో, కీడు చేస్తాయో అనేది తెలుసుకోవాలి. విషయమై జరిగే వింతలు, విడ్డూరాలు ఎన్నో వెలికి వచ్చాయి. వస్తున్నాయి కూడా.

విషయాలపై చర్చకు కాలం, కలం రెండు సరిపోవు. అలాంటి విషయాన్ని వస్తువుగా తీసుకుని. ఎంతో ఆలోచించే రీతిలో విషయం పొందుపరచడం కవి ప్రకాష్ కే సాటి.

"సృష్టి పదానికి/ సుపరిచితమే సకలం/ దృష్టి పథానికి /గుభాలించింది పరిమళం/అగుంభణ జీవం పుప్పొడితో /అఖిలమే అంబర తలం/ అనంత విశ్వ క్షేత్రంలో../ కుశలమే పృధ్వీ తలం/ వనమాలి సంరక్షణలో" అంటూ ఒకవైపు శాస్త్రాన్ని, మరోవైపు స్వామీ సన్నిధిని తెలియజేసిన సి.హెచ్. ప్రకాష్ మంచి కవి అనడానికి సందేహం లేదు. అభినందనలు

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 




సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech