పాఠకుల సమర్పణ  
     పాఠకుల స్పందన    

 Response to: may10 sujananeeyam

  Name: raghu pathi achari, helebeedu (p) alur (t) kurnool (dist) AP

  Message: పూజ్యులు రావు తల్లాప్రగడ గారికి పాదాభివందనములు. డియర్ సర్, నా పేరు రఘు. మాది హుబీదు గ్రామం. మీరు వ్రాసిన ఆర్టికల్ గురించి నేను చాలా సంవత్సరాలుగా వెదుకుచున్నాను. ఎక్కడా దొర్కలేదు. మీరు వ్రాసినందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే, మా నాన్న వాళ్ళ నాన్న (తాత)గారు సుమారు 1920-1930 మధ్య కాలం లో ఒక పాంప్లెట్ ముద్రించారు. అందులో బ్లాక్ స్మిత్ పనికి సంబందించిన రేట్లు(cost)గురించి వేసారు. అది నాకు మద్యన దొరికింది. దాంట్లో ఆయన(తాత)కంపెనీ పేరు(విశ్వకర్మ మయ కంబార నాగప్పచారి కంపెని)అని వుంది. ఇది తెలుగు, కన్నడలలొ ప్రింటయ్యి వుంది. ప్రింటింగ్ ప్రెస్ పేరు శంకర ప్రెస్, శంకరగిరి. అని అడ్రస్సు  వుంది. మాకు చుట్టుపక్కన 150-200 కిమిల వరకు పేరు గల ఊరు ఏది కనపడలేదు. దీని(విశ్వకర్మ మయ) గురించి మా నాన్నను అడిగితే మనం విశ్వకర్మ కులానికి చెందిన వారము అని చెప్పారు,కాని "మయ" గురించి అడిగితే తెలియదు అన్నారు. విశ్వకర్మ గురించి తెలుసు. కాని మయ గురించిన వివరాలు నాకు తెలియలేదు. ఇప్పుడు మీరు వ్రాసిన ఆర్టికల్ చదివి నందుకు క్లియర్ గా తెలిసింది. అంధుకు మీకు చాలా థాంక్స్. మీకు ఇంకా తెలిసిన( మయ కు సంబధించిన) వివరాలు వుంటే తెలపండి. లేదంటే ఏదయిన మీరు బుక్కు వ్రాసుంటే, దాని పేరు, ఎక్కడ దొరుకుతుందో, తెలపగలరు . నమస్తే

Rao Tallapragada: రఘు గారికి నమస్కారములు,

మే 2010లో మాయన్ నాగరికత పైన  నేను వ్రాసిన ఆర్టికల్ గురించి మీరు వ్రాసిన స్పందనను చదివాను. మీకు ఇది ఉపయోగకరంగా వుందని తెలుసుకొని సంతోషిస్తున్నాను.  మీ కులానికి ఆద్యుడు విశ్వకర్మ అయితే, దానిలో ఉన్న మరొక తెగ మయనిది అని అనుకోవచ్చును.

విశ్వకర్మ, మయుడు ఇద్దరు వాస్తు శాస్త్రం పైన అనేక గ్రంధాలను వ్రాసారు. ఇద్దరూ భవననిర్మాణశాస్త్రానికి ఆధ్యులుగా పిలువబడినా, కేవలం విశ్వకర్మని మాత్రమే వాస్తు అధిదేవతగా పరిగణిస్తారు. మయుడు పూజ్యుడే అయినా రాక్షస అంశునిగా గణిస్తారు. అదే  ఆయనని అధిదేవతగా గణించకుండా వుండటనికి కారణం అయి వుండవచ్చు. కానీ అన్ని పురాణాలలో విజ్ఞానశాస్త్రం అంటే మయుడి పేరే వినిపిస్తుంది.

కర్ణాటక కొంకణీ ప్రాంతంలో "మనుమయవిశ్వకర్మబ్రాహ్మణకులం" అని  ఒకటి వుంది. వీరినే గోవా ప్రాంతంలో "చారి" అని పిలుస్తారు. మీరు చెప్పిన పాంప్లెట్ ప్రకారం అది తెలుగు కన్నడ భాషలలో వుంది కనుక, చారి, మయ వంటి ప్రయోగాలు వున్నాయి కనుక,  మీ పూర్వీకులు కొంకణీ ప్రాంతం నుంచీ వచ్చివుంటారు, అని నా అనుమానం. చెక్ చేసుకుని చూడండి. ఏమైనా కొత్త విషయాలు తెలియవచ్చును.

నేను విషయం పైన ఇంకా పరిశొధన కొనసాగిస్తున్నాను. పుస్తకం ఇంకా వ్రాయలేదు. వ్రాయగానే తెలియపర్చుతాను.

మీ స్పందనకు మరొక్కసారి ధన్యవాదాలు. రావు తల్లాప్రగడ.

 

Response to: mar12 sujananeeyam
Name: rajeshwari.n,  u.s.
Message: నమస్కారములు
తాజ్ మహల్ ను గురించి ఎన్నో తెలియని ఆశ్చర్య కర మైన విషయాలను తెలియ జేస్తున్న శ్రీ రావు గారికి ధన్యవాదములు .

రావు తల్లాప్రగడ:  మీ అభిమానానికి కృతజ్ఞులము 

Response to: mar12 sujananeeyam

Name: Murthy KVVKSN, Hyderabad

Message: Thanks to Rao Tallpragada Garu. This article is very interesting and giving knowledge to the extent how the Hindu culture has been dominated by other religions. Really appreciate your efforts in consolidating the details and presenting them here.

Regards to you. Murthy.

రావు తల్లాప్రగడ:  మీ అభిమానానికి కృతజ్ఞులము 
From: srini kode
To: rao.tallapragada
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2012 Issue
Hello Rao garu,
Hope things are going good.
Saw your article on Taj mahal. Last summer we went to India and we went on North India trip and saw Taj Mahal. On tajmahal on the top we can clearly see kalash. I asked the  muslim guide who was with us and he confirmed it saying that shah jahan mother was hindu and out of respect he put it.....blah ....blahh..
Also, in 1960 some British archeologist wrote a book on taj mahal and India govt banned it.
రావు తల్లాప్రగడ: It is unfortunate that we deliberately sabotage our own history. I seriously think Indian goverment must take an active step and allow a proper inspection of the Tajmahal complex. I do not advocate changing anything in Tajmahal, but simply conducting a non-destructive-investigation and then appropriately correcting the history books, would be good enough. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
esponse to: mar12 indexpage
Name: shasha, hyderabad
Message: exelent
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 govindam
Name: Harinarayana R Dasu, Los Altos
Message: ఇది కేవలము సుజన రంజని కాదు సర్వజన మనోరంజని, మరియు మనో వికాసిని.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 kavita-1 ugadisubhakanksahlu
Name: అర్క సోమయాజి, పాలకొల్లు
Message: మధురాతి మధురమైన తెలుగు రచనల సమాహారం ఈ "సుజన రంజని"
వేయి మాటలేల? ఇది నిజంగా సు జన రంజనే!.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 vanmayacharitralo
Name: upadhyayula radha krishna, Hyderabad
Message:
 శ్రీ తల్లాప్రగడ రావు గారికి నమస్కారములు.
మీరు తెలుగు తల్లికి చేస్తున్న అర్చన చాలా చాలా అభినందనీయము.  తెలుగువారు గర్వించే విధంగా మన ఉనికిని నిలబెట్టే విధంగా సిలికాన్ ఆంధ్ర పేరతో మీరు చేస్తున్న ప్రయత్నానికి శిరస్సు వంచి మా పాదాభివందనం చేస్తున్నాము.  మన పండగలు, ప్రాముఖ్యత, లలితాకళారాధన, తెలుగు తేజోమూర్తులు, ఎందఱో మహానుభావులు, తెలుగు కవితలు,  ఇలా  ఎన్నో విషయాలను ఒక సమాహారం చేసి అందించే మీకు అనేకానేక కృతజ్ఞతలు.  ఈ సందర్భంలో ఒక చిన్న మనవి.   వివిధ "శీర్షికలలో"  ప్రతీ నెలా మీరు అందిస్తున్న  ధారావాహిక ఒక్క చోట చూసుకొనే విధంగా ఏర్పాటు చేస్తే మన పాటకులకు విషయం ఒక్కచోట చదువుకొనే అవకాసం కలుగుతుందనే భావన.  ఉదాహరణకు, ఎర్రమిల్లి హేమారత్నం గారు అందిస్తున్న  " గోవిందం భజ మూఢ మతే", శ్రీ తనికెళ్ళ భరణి  గారి "ఎందఱో మహానుభావులు", శ్రీ శంకర్ రావు గారి "అన్నమయ్య కీర్తనలు" లాంటివి, ఇప్పటి వరకు ప్రచురించినవి ఒక చోట చూసుకోనేలా, అలాగే, రాబోయే ప్రచురితాలనుంచి ఎప్పటికప్పుడు ఆయా శీర్షికలకు అనుసంధానం చేసేలా ఏదైనా వీలు వుంటే,  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మా ఈ ప్రార్ధనను పెద్ద మనసుతో స్వీకరించి,  అశీర్వదించ ప్రార్ధన.

Rao Tallapragada: Radhakrishna garu, Thank you for your feedback. We will certainly try to do it under SiliconAndhra prachuranalu. It is a very valuable suggestion for Sujanaranjani.
 
Response to: mar12 padyamhrudyam
Name: kompella ramakrishna murty, హైదరాబాద్

Message: నమస్కారం, మీ పత్రికను ఉచితంగా పొందటానికి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కమన్నారు. ఆ బటన్ నాకు కనిపించలేదు.ధయచేసి నా ఐ.డి కి పత్రిక పంప ప్రార్థన.

రావు తల్లాప్రగడ: మీ ఈ-మెయిల్ ఐ.డి. ని మా మెయిలింగ్ లిస్టులోకి జతచేసాము. ఇకనుంచి మీకు ప్రతి నెలా కొత్త సంచిక లింకుని పంపిస్తూ వుంటాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: mar12 emdaromahanubhavulu
Name: Harinarayana R Dasu, Los Altos

Message: సుజన రంజని సంపాదక వర్గానికి, రచయిత భరణి గారికి నా అభివందనములు .  ఒక మహా పండితుని గురించి ఇంత ఆహ్లాదకరంగా క్లుప్తము గాను రచించిన విధానము చాలా శ్లాఘనీయము అతి ప్రశంసనీయము.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 sangeetha
R.Surya Lakshmi, Nepal

Message: Respected BalaSubrahmanyam garu, As a Karnatic Musician I felt
very happy after reading Sangeetha Sourabhalu.It is very useful to one and all.

I would like to request you
to know the meaning to Sarnam
Bhava Karunamayi Narayathirtha
Tarangam through Sujana Ranjani.

రచయిత సమాధానం :

ధన్యవాదాలు. మీరడిగిన పదానికి అర్ఢం ఉన్న వెబ్ లింక్ ఇదిగో :

http://www.sangeetasudha.org/narayanateertha/sklt1.html#MARK_SARANAM


- డా. వైజార్సు బాల సుబ్రహ్మణ్యం
 

Response to: mar12 indexpage

Name: kanchi seshagiri rao, vishakhapatnam

Message: ఒక ఆన్ లైన్ పత్రిక ని ఇంత అందముగా తీర్చిదిద్దిన తల్లాప్రగడ రావు గారికి నా అభినందనలు, ఇందులో వెలువరించిన రచనలు అన్ని ఉన్నతప్రమాణాలతో ఉన్నాయి. ఇది నిజం గా సు'జనరంజని'రసరమ్యభావాలతరంగిణి

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
From: nirmala nallanichakravarthula
To: rao.tallapragada

Subject: Fw: SiliconAndhra SujanaRanjani January 2012 Issue

Sir/Madam,  If magazines are available, I would like to take them every month by post. Please let me know how much amount is to be paid for subscription?

Rao Tallapragada: Nirmala garu
The magazine is free and a new issue is released every month on the first. You can read it on internet only at

www.sujanaranjani.siliconAndhra.org

You can also see all the previous issues there free of cost. Please read it every month and let us know your feedback. regards
 

Response to: mar12 tolipaluku
Name: kothapalli ravibabu, vijayawada

Message: new fonts introduced are not opening. only boxes are appearing. what to do?

Rao Tallapragada: We have forwarded your email to the technical people, who would respond to you directly. Thank you for your interest
 
From: Vasant Naidu
To: rao.tallapragada

Subject: Please add my id for Sujanaranjani monthly announcement
Rao garu, Earlier I did register my id through web for sujanaranjani, no response, please add my id for Sujanaranjani announcement, I am longtime reader, thanks a lot....

రావు తల్లాప్రగడ: మీ ఈ-మెయిల్ ఐ.డి. ని మా మెయిలింగ్ లిస్టులోకి జతచేసాము. ఇకనుంచి మీకు ప్రతి నెలా కొత్త సంచిక లింకుని పంపిస్తూ వుంటాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
From: Sreenivasulu Galaeti , Cheltenham, Melbourne, Victoria, 3192, Australia
Subject: Request for subscribing sujanaranjani Telugu online magazine

Dear Sir, I am Sreenivasulu Galaeti, living in Melbourne, AUS.

I would like to subscribe for sujanaranjani Telugu online magazine.

I am following since long time, I should say that the best complete real Telugu magazine currently available in the world.

I would like to Congratulate to all the member of Siliconandhra.

Thank you , Best Regards

Sreenivasulu

రావు తల్లాప్రగడ: మీ ఈ-మెయిల్ ఐ.డి. ని మా మెయిలింగ్ లిస్టులోకి జతచేసాము. ఇకనుంచి మీకు ప్రతి నెలా కొత్త సంచిక లింకుని పంపిస్తూ వుంటాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
From: purnachandra rao
To: rao.tallapragada
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2012 Issue

Dear Sir

Thank you very much for updating the activities you are undertaking to keep the spirit of Telugu people and sampradayam.
Regards

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 indexpage
Name: ravikiran moka, hyderabad
Message: dear sir...
really very thankful....to service "the great telugu langue"..it's really great...and my blessings to your Team and entire staff..
with regards.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 kavita-6 prapancha matrubhashadinam
Name: JHANSI LAKSHMI
Message: Fantastic

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: mar12 vanmayacharitralo
Name: P.Santha Devi, New Delhi
Message: Dear Muralidhara Rao Garu,
I deem it my greatest privilege that I am associated with you and receive the rays of wisdom radiated by you. Your deduction of Ganganarya's period is absolutely right, I suppose. People like me who have never heard of a Diamond of a poet like Ganganarya would be grateful to you for introducing him to us. Thank you.

Mee Vyasam adbhutam. Ganganaryuni vanti kavulanu parichayam chesinamduku sada krutagnulam. Mee to sahitya bandhavyam naa adrushtam.


ఏల్చూరి మురళీధరరావు    : మాన్య విదుషీతల్లజ శ్రీమతి శాంతాదేవి గారికి, అభివందనములు.

మీ సహృత్సందేశానికి సాధువాదాలు. మీరన్నట్లు ఆంధ్రసాహిత్యమనే వజ్రాల గనిలో గంగనార్యుడు చరిత్రకెక్కినప్పటికీ చరితార్థిగా వీనుమిగిలిన వజ్రనిభుడు. ఋషిఋణాపనోదనగా పాఠకులే ఆ మహాకవి రమ్యోక్తికాంతిపుంజాన్ని దేదీప్యమానం చేయవలసి ఉన్నది. శ్రీ తల్లాప్రగడ రావు గారి ప్రోత్సాహనదోహదం వల్ల ఆ కవులకు ఈ మాత్రం నివాళి సమర్పింపగలిగే అవకాశం సిద్ధించింది.  వినమ్రంగా,
 
From: v subba rao Voleti To: elchurimuralidhararao@gmail.com
Subject: Re: How Are You, Sir !

My dear Muralidhara Rao garu-
Namaste--
Your  words truly  speak 'volumes' of affection and regard  and I admire  and appreciate from the bottom of my heart   your gesture .May God bless you.
I have since  gone through your article in the " Sujanaranjani".It throws light   on different aspects  of   Devotion underlying  the sacred  ' Srimadbhagavatham'. Please make Sujanaranjani  enriched   with your valuable contributions and no doubt our good-friend Sri Tallapragada Rao  garu  will extend all cooperation and encouragement in this  direction.Please keep in touch .
Regards

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: mar12 satyamevajayate
 Name: Saratchandra, Cupertino
 Message: అంతా నిఝంలాగేవుందే !

Satyam Mandapati: శరత్, నిఝంగా నిఝం.
 
 Response to: feb12 satyamevajayate
Name: mohan Reddy, Hyderabad
Message: Debate here created a well suited humor but the debate session in the actual field is over. Right minded and even ordinary people on both sides already accepted the necessity of 2 or 3 states for telugu speaking people now. Only adamant politicians and few moneyed vested interests are blocking the way. I appreciate the writer for impartial and balanced dialogues in the article...


Satyam Mandapati: Mohan garu,
If people want it really, that is good. But is it really the case? That is the big question. Thanks for taking time to share your comments.
 
Response to: mar12 satyamevajayate
Name: Mohan Devaraju, Carmel IN
Message: cAlA cAlA bAguMdi.
muLLApUDini bAgA gurtu cEsAru.

Satyam Mandapati: Mohan garu.
Thanks for taking time to share your comments.
 
Response to: mar12 satyamevajayate
Name: Rammohan Potturi, hyderabad, andhra pradesh, india
Message: satyam mandapati gari 'battiyam' chadivaka naa abhiprayam. stayam garu seershika motham lo 'student' behavior explain cheysaru. Ayethi nizaniki eeroju paristhiti anni colleges lo 'lecturers' behavior alaney vundi. Most lecturers do not even know the basics of their subject. Out of 3 lac (+) engineers who pass out not even 3% opt teaching as a career. Adi mana dourbhagyam. rammohan potturi.


Satyam Mandapati: Dear Rammohan,
That is very interesting. That is a sad situation. Thanks for bringing it up.
 
 Response to: mar12 satyamevajayate
Name: Prasad, Austin
Message: Ayya Satyam gAru,

Anta bagaane undi. Vedala gurinchi touch cheyakunda untee inkaa bagundedi. My personal feelings no offense.

Satyam Mandapati: Dear Prasad garu,
Glad you liked the article. I wrote about Vedas in the article from my personnel experience. I have been talking to a large number of Purohits, who recite Vedas without knowing the meaning of those. There is always an exception and there are Pandits who teach Vedas explaining the essence of them. And it is not a shame to talk about our short comings. How do we get better if we cover them up? 
I didn't write this ridiculing our religion, but with deep sorrow of looking at things in the real world.
Thanks for sharing your feelings and knowing my thoughts on this.
 
Response to: mar12 kavita-6 prapancha matrubhashadinam
Name: Manimurthy(మాణిక్యాంబ(వడ్లమాని మణి మూర్తి), Hyderabad,India

Message: శ్రీ వేదుల బాల కృష్ణమూర్తి గారికి,చక్కటి
పద్యాన్నిఅందచేసార ుమాతృభాషా దినము సందర్భం గా "పద్యము తెలుగు వారలకు భాగ్యఫలంబగ లభ్యమౌటచే
గద్యము కన్న ఎక్కుడగు గౌరవమిచ్చుచు పండితోత్తముల్" అన్న  ఈ మాటలకి నిజం గా అక్షర లక్షలు.  మన తెలుగు వాళ్ళకి సొంతమైన ఈ పద్యం,విలువ మనవాళ్ళు ఎప్పుడు గురుతిస్తారో  అప్పుడే  మన తల్లి ఋణం తీరుచుకున్న వాళ్ళ మవుతాం
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 
Response to: feb12 funcounter
Name: Durgapriya, malaysia

Message: Phani Mahdav garu rasinadhi kavithainaa, vyasam ayina, hyku ayinaa, nani ayinaa andhriki nacchadame gaani nacchakapovadam annadhi undadhu...

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 maanannakujejelu
Name: Dhurjati.Lakshmi, Hyderabad

Message: sThUlamgaane ainaa paripoorna Saahitya jeevitha charitrani andinchaaru Naga padmini garu... kallu chammagillelaa...!!!
Naaku koncham Naga Padminigari Mail Id kaavali, Ivvagalaraa?

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 maanannakujejelu
Name: డి.వి.ఎన్.శర్మ, Hyderabad

Message: మహామనీషి పుట్టపర్తి నారాయణాచార్యుల దుహిత  మాటలలో వారిని గురించిన అత్యంత సన్నిహితమైన విషయాలను చదివి ఆనందించాను. వారికి కృతజ్ఞతలు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 tolipaluku
Name: Gandhi  Message: సిలికానాంధ్ర వాటిని http://fonts.silicoandhra.org వెబ్‌సైట్ ద్వారా అందరికీ
lease correct the URl as under సిలికానాంధ్ర వాటిని http://fonts.siliconandhra.org/ వెబ్‌సైట్ ద్వారా అందరికీ

సుజనరంజని: Yes sir, we stand corrected and thank you for the correction. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: mar12 pustaka parichayam-1
 Name: lakshmi raghava, india
 Message: శైలజ మిత్ర గారు ,
చాలా ఆసక్తి కరంగా పరిచయం చేసారు.అభినందనలు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 kavita-5 nandana
Name: A.J.Rao, Hyderabad

Message: Beautiful. My CPU fan too starts its racket well before the cock crows

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 kavita-5 nandana
Name: G.Raghavendra Rao, Hyderabad

Message: KLJ's poem welcoming telugu newyear Sri Nandana is apt and full of expectations.Let all of us wish so.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 emdaromahanubhavulu
Name: D HARI PRASAD, Hyderabad

Message: మా ముత్తాతగారు ఈ దాసు శ్రీరాములుగారు.ఎప్పటికైన తనికెళ్ళ భరణి గారు రాస్తారనే ప్రతి నెలా చూస్తున్నాను. దాసు వామన రావు గారి గూర్చి కూడా రాస్తారని ఆశిస్తూ,

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 telugutejomurthulu
Name: Dr. J.K. Kishore, India

Message: Dear Silicon Andhra

Congrats. It reminds me of a book I read in past --> Gaints of Science which was a compilation of all great Scientists over the last few centuries. Along similar lines, if the biographies of such eminent Telugu personalities are compiled into a single book, it will be a wonderful inspiration for future generations Regards Dr. J.K.Kishore

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 emdaromahanubhavulu
Name: Dasu Damodara Rao, California

Message: I am very glad to know certain new facts about multifaceted personality Dasu Sriramulu. Readers can know more about him from

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 pustaka parichayam-1
Name: rajeswari.n , u.s.

Message: నమస్కారములు.
శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి శతక సాహిత్యం గురించి చక్కగా వివరించిన శైలజ  గారికి ధన్య వాదములు . వారి గళ మాధుర్యం ఒకసారి విన్న వారికి , మళ్ళీ , మళ్ళీ , మారు మ్రోగుతూనే ఉంటుంది.

sailaja mithra: వారి గురించి రాయడమే ఒక అదృష్టం. ఇక మీరు బావుంది అనడం ధన్యం!
 
Response to: mar12 funcounter
Name: yssubramanyam, nellore,AP, India
Message: incredible efforts to motherland. gratitude to all

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: aug10 mantraniki-shakti unda
Name: bharat , hyderabad
Message: Dear Sir
I felt very happy and i have sensed my self with peace in this rush life when i was going through the history of Maa tulasi.

I have one doubt so requesting you to guide me with right advise. My 1st question is can males(purushulu) can perform this pooja regularly or not and if yes, how to perform it with full details.

Regards

సుజనరంజని: Your message has been forwarded to the author. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 kavita-6 prapancha matrubhashadinam
Name: Krishna Kumar Pillalamarri, Fremont, California

Message: ఈ పద్యంలో ఒక పెద్ద తప్పు ఉన్నది! నన్నయనీ, పోతననీ సమకాలీకులుగా చిత్రించారు రచయిత. ఈలంటి తప్పు దొర్లకుండా ఉంటే సంతోషిస్తాము. భావం చక్కనిదే అయినా, పదాలు సరిగా పడితే తప్ప అర్ధం కోల్పోతామన్నది సుస్పష్టం. రచయితని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం నా అభిప్రాయం కాదు

bhavadIyuDu,

సుజనరంజని: Your message has been forwarded to the author. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 indexpage
Name: challa haribabu, kodad
Message: pleasant day on ugadhi

సుజనరంజని: Thank you and we wish you the same. మీ అభిమానానికి కృతజ్ఞులము!
Response to: mar12 indexpage
Name: P.Srinivasulu, Nellore
Message: I, Pulipati srinivasulu, I am working in BSNL, In this regard I request you please send the Telugu Font
 
సుజనరంజని: Your request has been forwarded to our technical team. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: mar12 annamayya
Name: rama chaganti, sanjose, CA
Message: Chaala Chakkagaa pratipadaardham telipaaru.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: jan12 vanmayacharitralo
Name: Nemani Ramajogi Sanyasi Rao, Visakhapatnam

Message: అయ్యా! మీ శీర్షికలో "అంతర్జాల సాహితీ పొదరిల్లు" అని యున్నది.  మంచి సమాసము చేయాలంటే "అంతర్జాల సాహితీ నికుంజము" అనాలి కదా.  లేనిచో దుష్టసమాసము అగుతుంది కదా.  పరిశీలించండి.

సుజనరంజని: మీరు చెప్పినది సబబుగానేవుంది. తప్పక పరిశీలిస్తాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
Response to: mar12 sangeetha
Name: R.Surya Lakshmi, NEPAL

Message: Respected Sri BalaSubrahmanyam garu,Namaskarams.
Just now I have gone through
the matter about Music, as a Karnatic Vocal Musician really I felt happy to read all. Many details were given by you,it is really useful to one and all.
I would like to request you to know the full meaning word by word for SARANAM BHAVA KARUNAMAYI KURU DEENA DAYALO NARAYANATHIRTHA THARANGAM, Through this Sujanajeevana, with regards R.Surya Lakshmi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: mar12 indexpage
 Name: Jandhyala shankar, Irvine CA

Message: బెజవాడ  లో పుట్టి పెరిగి అక్కడే ఉంటున్న నాకు బెజవాడ  మీద వ్యాసం చాలా బాగుంది.. రచయిత కు నా ధన్యవాదాలు. (భండారు శ్రీనివాస రావు గారు ఎక్కడ  ఉంటారో, ఈమెయిలు, ఫోన్ నెంబర్  తెలుసుకోగోరుతున్నాను).
అందరికి ఒక విన్నపము :  'బెజవాడ'    పేరుని 'విజయవాడ' గా (1949 ) లో మార్చారు. విజయుడు (అర్జునుడు) తపస్సు చేసిన స్తలం కాబట్టి 'విజయవాడ' అని పేరు మారిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఇంకా కొన్ని కారణాలు చెప్పారు.   అందులో ఆక్షేపణ లేదు. మంచి ఉద్దేసముతోనే మార్చారు. కాని అది మంచిది కాదని కొందరు పెద్దలు చెప్పారు.. కారణాలు చెప్పారు. (ఆప్పుడు ఎవరు పట్టించుకో లేదు)  

 అ). 'బెజవాడ'  పేరు దాదాపు ౨౦౦౦ (2000 )  సంవత్సరాల క్రితం నుండి వాడుకలో ఉంది . కనకదుర్గమ్మ కొండ దగ్గర దొరకిన 'రాజమల్లు  శాసనం' లో 'బెజవాడ'  అనే చెక్కబడి ఉంది.

ఆ). మరి ఏ పుస్తకము లో కాని, శాసనములో కానీ, వాడుకలో కాని, 'విజయవాడ' పేరు లేదు.  ఒక చోట 'విజయ వాటిక' అని మాత్రం ఉంది.

ఇ). 'విజయ' సంస్కృత పదం. 'వాడ' తెలుగు పదం.  పేర్లకు సంస్కృత తెలుగు పదాల కలయిక ఉండకూడదు. కుక్క నక్కల సంయోగం వంటిది. ఆ కలయిక వల్ల ఆ ప్రదేశానికి మంచి జరగదు. లేదా,  అబివ్రుధి ఆలస్యంగా జరుగుతుంది. ('విజయవాడ' విషయం లో అది కన్పిస్తుంది)  'విజయ నగరం', 'విజయ పురి', 'విజయ వాటిక', అని ఉండవచ్చు, మొదటి రెండు పేర్లు ఉన్నాయ్.

ఈ). అందుచేత, విజయవాడ పేరుని 'విజయ వాటిక' అని మార్చాలి.  అది అంత బాగా లేదు కాబట్టి   పాత పేరు 'బెజవాడ' గా  మారిస్తే బాగుంటుంది  అని చెప్పేరు. ఈ వాదన నాకు చాలా  బాగుంది. . చాలా నగరాల పేర్లను మార్చారు. ఉదాహరణ: 'ముంబై, చెన్నై, కొలకత, తిరువనంతపురం - మొదలైనవి.

ఈ విషయాన్నీ అందరూ అలోచించి మళ్ళి మా ఊరు పేరు 'బెజవాడ' గా మార్చటానికి చేయూత ఇవ్వండి. ధన్యవాదాలు. ఇట్లు  జంధ్యాల శంకర్ , 'బెజవాడ' (విజయవాడ) మాజీ  Mayor, క్యాంపు : Irvine , Ca , US

భండారు శ్రీనివాసరావు: శంకర్ గారు ,
రావు గారి ద్వారా మీ ఉత్తరం అందుకున్నాను.  నా చిన్న నాటే మీ గురించి విన్నాను. ఆ రోజుల్లో మీరు విదేశాల్లో చదువుకుని బెజవాడ వచ్చారు. ఎగ్జిబిషన్ మైదానంలో ఓసారి మీరు భూమ్యాకర్షణ శక్తిని అధిగమించే ఒక ప్రదర్శన ఏర్పాటు చేసిన గుర్తు. మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు (ఇప్పుడు కీర్తిశేషులు) బెజవాడలో పౌర సంబంధ శాఖ అధికారిగా వుండేవారు. ఈ వ్యాసం రాయడంలో అనేక విషయాలు సోదాహరణంగా అందచేసిన ఆర్  వీ వీ కృష్ణారావు గారు (వెనుక బెజవాడలో రేడియో వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు) మీకు బాగా తెలుసు. ప్రస్తుతం మేమిద్దరం 'రేడియో, దూరదర్శన్' నుంచి రిటైర్ అయి హైదరాబాదులో వుంటున్నాము. ఇన్నేళ్ళ తరువాత ఈవిధంగా పాత పరిచయాలను పునరుద్ధరించిన సుజన రంజని కి కృతజ్ఞతలు. కృష్ణారావు గారి మెయిల్ అడ్రసు కూడా పైన అడ్రసు కాలం లో జత చేస్తున్నాను.
మీరు బెజవాడ వచ్చినప్పుడు కలవాలనే కోరిక నెరవేరాలని మనసారా కోరుకుంటూ -
 

భండారు శ్రీనివాసరావు: విద్య గారికి,భగవాన్ గారికి,జంధ్యాల శ్రీరాం గారికి,లక్ష్మి గారికి,చెరుకూరి రమ గారికి,సోమయాజులు గారికి,రవి జంధ్యాల గారికి -

నా వయసు అరవై  అయిదు అయినప్పటికీ, వివేకంచేత,విద్య చేత అధికులయిన మీ అందరికీ నా నమోవాకాలు.

బెజవాడ మీద సినిమా వచ్చీ, బెజవాడ మీద నేను ఈ వ్యాసం  రాసీ ఇన్ని నెలలు గడిచిన తరువాత కూడా ఇంత చక్కని స్పందన చూసి 'ఔరా!' అనుకోక తప్పడం లేదు. బెజవాడ బిడ్డలందరికీ మరో సారి వందనాలు.

సినిమా చూసి బాధపడ్డ వారు చెప్పిన విషయాలు విన్న తరువాత 'బెజవాడ అంటే ఇదా!' అనే ఆర్టికిల్ రాయాలనే సంకల్పం కలిగింది. ఆ వేడిలో వండి వార్చిన కధనం ఇది. ఎన్నో పేర్లు, ఎన్నో ప్రదేశాలు మరచిపోయాను. గుర్తున్నంత వరకు, గుర్తు తెచ్చుకున్నంత వరకు గుర్తు తెచ్చుకుని మరీ రాశాను. ఎవరినన్నా మరచిపోతే, అది నా మతిమరపే కాని వారి గొప్పతనానికి వచ్చిన లోటేమీ వుండదు.

నా చిన్నప్పుడు  దక్షిణా మూర్తి గారంటే ఒక 'ఐ కాన్'.  నేను పెరిగి పెద్దయిన తరువాత జంధ్యాల శంకర్ గారంటే - మేయర్ అంటే ఇలా వుండాలని చెప్పుకునేవారు. అందుకే బెజవాడతో వారి కుటుంబానికి అంత అభిమానం. ఆ అభిమానమే బెజవాడ మీద ఆర్టికిల్ రాసిన నాపై ఇంత అభిమానం కురిపించింది.
చివరలో మరో మాట.

మా బావ గారు తుర్లపాటి హనుమంత రావు పంతులు గారు దక్షిణామూర్తి గారికి అత్యంత సన్నిహితులు. గవర్నర్ పేటలో వుండేవారు. నిరుడు చివర్లో కన్ను మూశారు. వారు జీవించి వుండగా దక్షిణా మూర్తిగారి  వంశాకురాలయిన మీ గురించి ఆయన చెవిన వేసి వుంటే యెంత సంతోషించేవారో.
 

 Response to: july2009 Mantraniki Shakti
Name: m.ravi kumar, draksharama
Message: bhakti tatvam, gurunchi chala vipulamga teliya chesinanduku krutajnatalu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
 Response to: mar12 indexpage
Name: vinukondamurali, bhaaratadesam

Message: మీ సంచికలొని వ్యాసాలు శీర్షికలు ఆసక్తిదాయకంగా వున్నాయి
మీకు ఒక అశ్చర్యకరమైన చారిత్రక విశేషాని తెలియ జేస్తున్నను.

తెలుగు భాషలొ వేదాలని కీర్తించి ప్రజల ఖేదాన్ని పోగొట్టిన తొలి తెలుగు పద కర్త, తొలి సంకీర్తాచార్యుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు కృష్ణమయ్య గురించి తెలియజేసే బ్లాగ్ urls పంపుతున్నాను.

మీరు ప్రచురిస్తానంటే ఒక వ్యాసం రాసి పంపుతాను.దయ చేసి మీ అభిప్రాయాన్ని మైల్ చెయ్యంది.

సుజనరంజని: అయ్యా మీరు బ్లాగులలో ఇప్పటికే ప్రచురించిన విషయాలను మళ్ళీ మా పత్రిక లో ప్రచురించడం సముచితం కాదు. మీరు కొత్తగా వ్రాసేటట్లయితే తప్పకుండా పంపించండి.
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech