కవితా స్రవంతి  
      విన్నపాలు వినవలె!!

(విద్యావంతురాలైన యువతికి, కన్నతల్లి ఆశీరభినందనలు)

రచన:  కోసూరి ఉమాభారతి 

 
 

 

 

అక్షరాభ్యాసంతో శ్రీకారం 
చుట్టుకొన్న నీ విద్యోపాసన
అలుపెరుగని పయనం సాగించి   
ఆశయాలు సాకారాలు గావించి
వర్ధిల్లుతున్నందుకు చిట్టితల్లికి జేజేలు!
 
ఒదిగి ఎదగమనేను
చెప్పేది శ్రద్దగా ఆలకించమనేను  
 

ఓర్పుతో నేర్పుతో
జీవితాన్ని మలుచుకో
నీ బతుకు బాటలలో
వెలుగు జిలుగులు నింపుకో
 
సంపాదనలు  కాదు ముఖ్యం
వెనకేయడం కాలేదు సౌఖ్యం
కొలువుల కన్నాఆవశ్యం
కళకళ లాడే నీ జీవనం

ఉన్నత విద్యలు కావాలి 
నీ మనుగడకి సోపానాలు
సంపాదనలు కాకూడదు
సంతోషాలకి అవాంతరాలు

అహంకారాలు పెంచి
మంచి చెడులు మరిచి
మనుగడ సాగించరాదు

నవ నాగరీక పడతివీవు
మారే దృక్పధాల ననుసరించేవు  
స్త్రీకి అన్నిటనుండాలి స్వాతంత్ర్యమనేవు
హర్షించేము, గర్వించేము
మనసైన వాడిని కోరుకో
మనసున్న వాడినెన్నుకో

అమృతాలు చిలికించి
అనురాగాలు పంచుకో
నీ స్ఫూర్తి నీ సంతతికి
తేవాలి కీర్తి పురోగతి

ఇవన్నీ ఉపదేశాలనుకోకు సుమా!
అమ్మ మనసు ఆకాంక్షలు
ప్రేమతో  దీవెనలతో  
ప్రియ పుత్రికకు విన్నపాలే!
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech