తొలిపలుకు  
    

రచన : రావు తల్లాప్రగడ

 
   సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.
 

 

 అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు.

ఇటీవల ఉగాదినాడు సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో నిర్వహించిన అష్టావధాన కార్యక్రమం ఎంతో రసవత్తరంగా జరిగింది. ఈ అవధానం పైన సమీక్షను డా.గీతగారు ఒక ఈ సంచికలోనే ప్రత్యేకవ్యాసంలో మీకు అందిస్తున్నారు. అలాగే సిలికానాంధ్ర అధ్యక్షుడు కొండుభట్ల దీనబాబు వ్రాసిన "సిలికానాంధ్ర కబుర్లు"లో ఆ రోజు జరిగిన మిగితా కార్యక్రమాల సమీక్షను కూడా చూడగలరు.

ఈ నెల సుజననీయంలో తాజమహల్ పైన జరుగుతున్న విశ్లేషణలో మినారుల చరిత్రని చర్చించుకున్నాము. ఈ మినారులు అసలు ఎక్కడ పుట్టి దేశవిదేశలలోకి ఎలా వ్యాపించాయి, వీటి ప్రాశత్యం ఏమిటి. హిందువులు మినారులు కట్టుకునేవారా? ఇటువంటి విషయాలపై లోతైన విశ్లేషణను మీకు అందజేస్తున్నామని తెలపటానికి ఆనందిస్తున్నాము. ఈ తాజమహల్ పైన వస్తున్న ఈ శీర్షిక ఇక త్వరలో ముగియనున్నది. దీనికి మీరిచ్చే ప్రొత్సాహానికి కృతజ్ఞతలు.

జ్వాలా నరసింహారావుగారి "అతిరాత్రం-భద్రాచలంలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం", అందరూ తప్పక చదవాల్సిన వ్యాసం. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో జరగనున్న ఈ సంప్రదాయిక యజ్ఞం గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం. అలాగే దాన్ని జయప్రదం చేయడం మన బాధ్యత. తప్పక చదవండి.

ఈ నెలనుంచీ, "ఓ సారి ఏమయ్యిందంటే" అనే పాఠకులు సమర్పించే కొత్త శీర్షికను మీముందుకు తేనున్నాము. దీనిని డా. జొన్నలగెడ్డ మూర్తి గారు నిర్వహించనున్నారు. మూర్తి గారు కోనసీమలోని అమలాపురంలో పుట్టి, పుదుచ్చెర్రీలో పనిచేసి, ఆ తువాత ఇంగ్లాండులో స్థిరపడ్డారు. వీరి వృత్తిని వీరి మాటలలో చెప్పాలంటే, సమ్మోహనశాస్త్రమే (Anaesthesiology) కాబట్టి, వీరి చమత్కారశైలితో మనల్ని సమ్మోహితులు చేస్తారనే ఆశిస్తున్నాను. తెలుగులో కవితలు వ్రాయడంతో పాటు, వీరు చక్కని నటులు, దర్శకులు, రేడియో యాంకర్, ఫొటోగ్రాఫర్, బహుముఖప్రజ్ఞాశాలి. మెడికల్ సైన్సెస్ లో అనేక పేటెంటులను సాధించి అనేక మన్ననలను పొందిన, ఈ మూర్తిగారి సారధ్యంలో, ఈ శీర్షిక కూడా విజయవంతము అవుతుందని ఆశిద్దాము.
మళ్ళీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ
మీ
రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech