నువ్వో సూర్యుడివి!

                                                             -ఆర్.దమయంతి
 

  కన్రెప్పల కిటికీలు తెరిచి వుంచు
నీlaaకాశం నీకు ఆశయమౌతుంది..
హృదయాన్ని మూsi vunchaku..
సముద్రం చిన్నదైపోతుంది '

పేద వాడికింత అన్నం పెట్టి చూడు
ఆ ఆ కళ్ళల్లో తృప్తిని చూడొచ్చు
రోజుకో నిముషం అమ్మతో గడిపి చూడు
నీ పసితనాన్ని చూసుకోవచ్చు
కొంచెం సేపు కట్టుకున్నదాన్నీ మాట్లాడనివ్వు
జలపాతాల సొగసు కనవచ్చు.

ఇంట్లో పనిపిల్లని చదివించి చూడు
ఆ ఇల్లెంత వెలుగవుతుందో..
నీ ఇంటి ముందు ఓ మొక్క నాటి చూడు
పెరిగి పెరిగి ఎంత నీడవుతుందో
నీ వారికి రోజుకో తెలుగుపదం నేర్పి చూడు
మాతృ భాష ఎంతగా మురుస్తుందో
వాయిట్లో ఓ గుప్పెడు నూకలు జల్లి చూడు
రెక్కలు వాల్చుకున్న పక్షులకు నువ్వెలా దేవుడువవుతావో...

కన్రెప్పల కిటికీలు తెరిచి వుంచు
నీlaaకాశం నీకు ఆశయమౌతుంది..
హృదయాన్ని మూయకు..
సముద్రం చిన్నదైపోతుంది

చిటికెడు ఆశ చాలదుటోయ్..
చీకట్లో చిన్ని దీపాన్ని వెలిగించుకోడానికి!?
ఆ చిన్న కాంతే చాలోయ్...
నీ చుట్టూ వున్నవారికి నువ్వో సూర్యుడవ్వడానికి!
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech