ఖర ఉగాది

                                                                                     - వేదుల బాలకృష్ణమూర్తి

  ఆ.వె.|| ‘ఖర’ నవాబ్ది! మీకు ఘనస్వాగతంబిదె
వికృతి నీకు ఇదియె వీడుకోలు
వెడలు ‘వికృతి’ మరియు విచ్చేయు ‘ఖర’ ఇచ్చు
సకల సంపదలను జనులకెల్ల

ఆ.వె|| తెలుగువారి కెల్ల తొలిపండగ ఉగాది
‘ఖర’ ఉగాది స్వర్ణగిరి శిఖరము
తెలుగు ముంగిళులకు వెలుగగు కూర్పగా
వచ్చె స్వాగతంబు పలుకరండు

నలువరాణికి నీరాజనం

సీ|| శృంగార సంగీత గంగా తరంగాల
డోళికలందు ఉయ్యాలలూగి
నాదాత్మకములైన వేదమంత్రాలతో
నలువ నాల్కలపైన నాట్యమాడి
నవరసాలొలికించు నాట్యలాశ్యాలలో
సరసార్ధభావవాగ్జరులు నింపి
కవుల సద్గోష్టిలోగా నమాధురులలో
శృతిలయలకు రాగసుధలు చేర్చి

తే.గీ|| అలసిపోయితివేమొ ఓనలువరాణీ
ఒక్కనిముషమువచ్చి కూర్చుండవమ్మ
నా హృదయపీఠికోటిరత్నాల పేటి
ఆసనముగాగ అర్పింతు అమిత ప్రీతి||


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech