పండగ చేసుకోండి....

 

    ఎంచక్కా..పండగ చేసుకోండి.. బయటకొస్తే గొడవలు..పండగలకి..దేవుళ్ళకి,భాషకి,చివరకి ఎప్పుడో పోయిన మహానుభావుల విగ్రహాలకీ తప్పట్లేదు..

చేదు : పెరుగుతున్న ధరలు..జరుగుతున్న ఘోరాలు..భయపెడుతున్న నేరాలు.....జరుగుతున్న విషయాలు.. విశేషాలు,వేపలా చేదుగా...ఉన్నాయి..వేప చేదు మంచి చేస్తుంది..కానీ ఈ చేదు విష(యా)లు చెడు చేయకుండా ఉంటే అదే చాలు...

కారం : ఏ రోజు కా రోజు మారుతున్న రాజకీయ సమీకరణాలు.. చూస్తుంటే వొళ్ళంతా కారం రాసుకుంటున్నట్టుగా ఉంటోంది.. ఎవరు ఏపూట ఏ పార్టీలో ఉన్నారో.. ఎవరు రాజీ నామా చేశారో... ఎవరు రాజీ పడ్డారో.. ఎవరు విలీనం చేశారో.. ఎవరు కొత్త పార్టీ పెట్టారో..ఎవరు ఉన్న పార్టీని తిట్టారో...తలుచుకుంటేనే మంట గా ఉంది..

ఉప్పు : పగలంతా కష్టపడి.. సెజ్ లు.. ఇండస్ట్రీ ఏరియాలు.. ప్రాజెక్టులు.. వోక్స్ వాగనులు లాంటి డమ్మీ ఫ్యాక్టరీలు.. పేరుతో కబ్జా ఐపోఅయిన తన భూమిలోనే వెలసిన ఏదో ఒక పని..లో ..గనిలో..కార్ఖానాలో.. కూలీ నాలి చేసిన. పేదవాడి చెమట.. ఇప్పటికీ ఉప్పగానే ఉంది.. రాత్రయ్యేసరికి.. కల్లో...సారానో కలవకపోతే...

తీపి - ఏదో మన వాళ్ళు పాకిస్తాన్ మీద గెలిచి..వరల్డ్ కప్పు ఫైనల్ కి రావడం తీపి కబురే కానీ..నేనిది రాసేటప్పటికి.ఇంకా ఫైనల్ జరగలేదు కాబట్టి పూర్తి స్థాయిలో తీపి అందుబాటులో లేదు.. ఐన అతి మధురం కూడా అనర్ధదాయకం కాబట్టి..వరల్డ్ కప్పు ఇండియా గెలవాలని ఆశిస్తూ...తీపిని కలుపుకుందాం


వగరు : ఒకప్పుడు భరత భూమి ధార్మిక భూమి..ఇప్పుడు అణు ధార్మిక భూమి ...ప్రకృతి భీబత్సం వల్ల సునామీలో నష్టపోయిన జపాను దేశాన్ని...అక్కడి అణు ధార్మిక కార్ఖానా ల వల్ల రాబోయే విపత్తులు తలుచుకుంటే నోరంతా వగరు గానే ఉంటోంది..ఇదీ అణుధార్మిక ప్రభావమో..మరోటో..

పులుపు :

ప్రతీ పండక్కి....పరాయి దేశం పండుగలు..దినాలు..ప్రేమికుల దినాలు..తల్లి దినాలు..తండ్రి దినాలు..స్నేహం దినాలు జరుపుకునే ఉత్సాహం గా జరుపుకునే మనం.. డిసెంబరు 31 న రాత్రి 12 వరకు ..చిందులేసి..గంతులేసి..కేకులు కుక్కుకునే మనం...మన సంవత్సరాదిని జరుపుకోవడానికి ఉత్సాహం చూపకపోవడం మాత్రం..పుల్లగా పంటి మధ్య తగులుతోంది..

ఐనా మనం ఆశా జీవులం కనుక..విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళైనా తెలుగు గురించి ఆలోచిస్తున్నారు గనుక..మన కి కొండంత ధైర్యం..

అందరికీ ఉగాది శుభాకాంక్షల తో

నా నిరాశా వాదం తో బాధ పెడితే క్షమించగలరు..మీకది అలవాటేలేండి..ఎంతమంది రాజకీయ నాయకులని ఎన్నాళ్ళనుంచి..క్షమించేస్తున్నారుగా...

 

 

 

 

 
 

 

 

ఫణి మాధవ్ కస్తూరి :
స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech