లైట్ కంబాట్ విమాన రూపకర్త - భారత విమాన శాస్త్రవేత్త

- పద్మశ్రీ డాక్టర్ కోటా హరినారాయణ

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు.

 

వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


  

లైట్ కంబాట్ ఏర్ క్రాఫ్ట్ (ఎల్ సి ఏ) నిర్మాణ సంచాలకుడిగా, ముఖ్య రూపకుడిగా  అత్యాధునిక, అత్యుత్తమ సంకేతిక పరిజ్ఞాన ప్రమాణాలు కలిగి ఉన్న అత్యంత సమర్ధవంతమైన యుద్ధ విమానాన్ని రూపొందించారు విమాన శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ కోటా హరినారాయణ గారు. ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైన (స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్) యుద్ధ విమానాన్ని రూపకల్పం చేయడమేకా, ధీటైన (ఆయుధం)  భారత దేశ వాయు సేన అమ్ములపోదలోకి చేర్చారు. ప్రతిష్ఠాత్మక నేష్నల్ ఏరోనాటికల్ లాబరేటరీ (ఎన్ ఏ ఎల్) సంస్థలో రాజ రామన్న ఫెల్లో గా ఉన్నారు. 2002 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ గౌరవం అందుకున్నారు. డి ఆర్ డి ఓ సంస్థ ప్రజ్ఞాశాలి శాస్త్రవేత్త గా ఉన్నారు. 2000 లో అప్పటి భారత ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారి వాజిపేయి నుండి " సిలికాన్ ట్రోఫీ " అందుకున్నారు. హైద్రాబాద్ విశ్వవిద్యాలయం ఉప-కులపతిగా వ్యవహరించారు. ఇండియన్ నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్ లో ఫెల్లో గా ఉన్నారు. 

 

భారతీయ విమాన శాస్త్ర (అరోనాటిక్స్) క్షేత్ర విభాగంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్తగా స్థానం సంపాయించుకున్నారు. డాక్టర్ కోటా హరినారయణ గారు నేటి ఒరిస్సా రాష్ట్ర బరంపురం లో జన్మించారు. డాక్టర్ కోటా హరినారాయణ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంగినీరింగ్ లో ఉత్తీర్నులైయ్యారు. తరువాత బెంగళూరు లోని ఐ ఐ ఎస్ సి నుంచి ఏరో ఇంగినీరింగ్ లో మాస్టర్స్ పట్టా సాధించారు. ఐ ఐ టీ (ముంబై) నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. 

 

1967 లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ లో చేరారు. తరువాత డి ఆర్ డి ఓ, ఏ డి ఈ సంస్థలలో కూడా పనిచేశారు. డాక్టర్ కోటా మంచి మేధావి; చాతుర్యంతో పాటు మాంచి వక్త కూడాను. వీరికి ఇష్టమైన పరిశోధనా అంశాలు - ఏరో మాడలింగ్, గతిశాస్త్రం (ఫ్లూయిడ్ డైనమిక్స్).  

 

భారత విమాన చరిత్ర లో మైలు రాయి:

 

జనవరి 4, 2001 - జనవరి 4, 2001 - భారత విమాన చరిత్ర లో మైలు రాయి. ఎల్ సి ఏ యుద్ధ విమానం భారత దేశ వినీల గగనతలానికి ఎగిసింది. భారత దేశం లో రూపకల్పన, నిర్మాణం జరిగి ఇలా అవతరించిన అత్యాధినిక విమానల ఉదంతాలు లేవు. 

 

తేజస్ (ఎల్ సి ఏ) విమాన నిర్మాణం, విషయాలు: 

 

తేజస్ నిర్మాణా క్రమం లో అనేక ఒడు దిడుకులు ఏదుర్కోవాల్సి వచ్చింది. అయినా వెనుతిరగక అవరోధాలను, వైఫల్యాలను అధిగమించి విజయ బావుటా ఏగరేశారు. భారత దేశ తొలి అత్యాధునిక యుద్ధ విమానాన్ని రూపొందించారు.

 

యుద్ధ విమానాన్ని నిర్మించడానికి పదహారేళ్ళు పట్టింది. ఎందుకంటే - " ఒక్క విమానాన్నే కాదు - దానికి కావలసిన అనుభంద సాధనా సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల శిక్షణ, పలు ఉపకరణ యంత్రాల తయ్యారి, అందరిని సమన్వయం చేసి, దిశామార్గం చూపుతూకొత్త పరికరాలు, ఉపకరణాలు తయారు చేస్తూ అన్నిటినీ సకూర్చుకుని అంచలంచలుగా లక్షాలని సాధిస్తూ వచ్చారు. విమాన చాలకుడి (పైలట్) కి కూడా తగు శిక్షణ ఇవ్వ వలసిన అవసరం ఉండింది. నిర్మాణ ప్రయాసలను ఓర్చుకోవాల్సి వచ్చింది " అని డాక్టర్ హరినారాయణ గారు వివరించారు.

 

విమానయాన శాస్త్రవేత్తల ఆశలు ఫలించాయి. 

- 1970 నుండి 1982 వరకు డి ఆర్ డి ఓ సంస్థలో విభిన్న హోదాలలో పనిచేశారు.

- 1982 లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ, నాశిక్ విభాగం లో ముఖ్య రూపకర్త గా చేరారు. కొంత కాలం ఏరోనాటిక్స్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ సంచాలకుడిగా పనిచేశారు. 1995 లో ప్రజ్ఞాశాలి శాస్త్రవేత్త గా గుర్తింపు పొందారు.

 

- హెచ్ ఎఫ్ (హిందుస్తాన్ ఫైటర్) 24 మారుత్ 1961 లో రూపొందించారు. తరువాతి నలబై యేళ్ళు మరే ప్రయత్నాలు జరగలేదని చెప్పవచ్చు.  

 

ఎల్ సి ఏ విశిష్టత:

 

ఎల్ సి ఏ విశిష్టత ఏమిటంటే - " తేజస్ " (ఎల్ సి ఏ విమానం పేరు) ధ్వని కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న, అత్యంత సమర్ధవంతమైన సూపర్సానిక్ (ధ్వని కన్నా ఎక్కువ వేగం గా ప్రయాణం చేయగల) యుద్ధ విమానం. ఈ పరియోజన లో దాదాపు డెబ్బై శాతం దేశీయం గానే రూపొందించడం విశేషం. అత్యంత జటిలమైన, ఉపయుక్త పరిజ్ఞాన సంపదలు - కార్బన్ కాంపోసిట్స్, ఫ్లై-బై-వైర్, డిజిటల్ కాక్పిట్, డిజిటల్ ఏవియానిక్స్ తదితర ఉపకరణాలు దేశీయంగా రూపొందించ గలిగారు. ఇవి గొప్ప విజయాలే.  

 

భారత దేశం ఇన్నేళ్ళు తీసుకుంది? అన్న కొందరి ప్రశ్నకి ఇది సమాదానం.

 

ఆధునిక దేశాలుగా చలామణి అవుతున్న - ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ సంయుక్తంగా ఎఫ్ 22 యుద్ధ విమాన నిర్మాణం 1980 మొదలెట్టినా, 1994 వరకు గాలిలో ఎగరగలిగే విమానాన్ని నిర్మించలేక పోయారు. అమెరికా ఆంక్షలు ఈ దేశాలకు లేవు. అయినా ఇంత సమయం పట్టింది. భారత దేశం ఇంత సమయం తీసుకుంది అని విమర్శించే వారికి ఈ విషయాలు తెలిడం అవసరం. అప్పుడు వరికీ వేలెత్తి చూపే ఆస్కారం ఉండదు.

 

మరొక్క విషయం - " పశ్చిమ దేశాల ప్రలోభాలకు బానిసలై, భారత దేశ ఆవస్యకతలను విస్మరించి, గుడ్డిగా వ్యతిరేకించడం సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే అత్యంత కీలకమైన పరిజ్ఞాన్ని దేశీయంగా రూపొందించుకోవాల్సి వచ్చింది. యూరోప్ (టైఫూన్) యుద్ధ విమానాలకన్నా మన పరిజ్ఞానం మిన్నమైనది " అని డాక్టర్ కోటా హరినారాయణ ఓ సందర్భంలో ఉద్ఘాటించారు. " వంద కోట్లకు పైగా జనాభా మనది. ప్రతీది మనం దిగుమతి చేసుకోలేము. అందులోనూ అత్యంత వ్యూహాత్మక విమానాలను నిర్మించడం పెద్ద సవాలు, అభిమతం " అని అభివర్ణించారు హరినారాయణ గారు.  

 

ఈ బృహత్ ప్రణాళిర్చు సుమారు రెండు వేల కోట్లు. అంతా! అని అడిగే వాళ్ళు లేక పోలేరు. అది వారి అవగాహనా రాహిత్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అమేరికా, యూరోప్ లకు దీని కన్నా ఎన్నో రెట్లు అధికముగా వెచ్చించాల్సి వచ్చింది. ఈ పరియోజనలు దేశానికి బహుళార్ధ సాధక పరియోజనలు దూర ప్రయోజనాలు సాధించేవిగా ఉండాలి. దాదాపు 300 చిన్నా పెద్ద పరిశ్రమలు నిర్మాణాకి దోహద పడ్డాయి.

 

ఎల్ సి ఏ పరిజ్ఞాన ఫలస్వరూపముగా, దాదపు వంద ఉపకరణాలు సంసిద్ధం చేశారు. వీటిని ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ (ఐ జే టి) విమాన నిర్మాణానికి ఉపయోగించారు. ఈ విమానం రూపుదిద్దుకుని వెలుగు చూసేందుకు డాక్టర్ ఎస్ ఆర్ వల్లూరి, డాక్టర్ వీ ఎస్ అరుణాచలం, డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం, డాక్టర్ వీ కే ఆత్రే చాలా సహకారం అందించారు.   

 

భారత దేశ ఎల్ సి ఏ విమాన మరిన్ని వివరాలు: 

ఎల్ సి ఏ విమానాల పోషణా ర్చులు చాలా తక్కువా అని హరినారయానణ గారు వివరించారు. అమెరికా భారత దేశం పై ఆంక్షలు విధించింది. తత్ ఫలితముగా కీలక మైన పరికరాలు విదేశాలలో కొనుకోవటం దుస్సాధ్యమయ్యింది. భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో ఎల్ సి ఏ " ఆక్చు - ఏటర్స్ " సృష్టించారు. అవి అమెరికా (నిరాకరించినా) వాటి కన్నా మెరుగైన యుక్తి విన్యాశం, త్వరిత గతి ఉండ గలిగినట్టు గా రూపొందించడం విశేషం. తక్కువ ర్చులో ఎక్కువ మేలు రకం ఉపకరణ యంత్రాలు రూపొందించ గలిగారు.

 

ఎల్ సి ఏ ప్రణాళిక ఫలస్వరూపాన "ఆటోలే " సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఇప్పుడు దీన్ని ఏర్ బస్ సంస్థ కూడా కొనుగోలు చేస్తోంది. భారతీయ సాంకేతిక నిపుణుల నైపుణ్యానికి ఇదో మచ్చు తునక. 

 

 గౌరవ పురస్కారాలు, అవార్డులు: 

డాక్టర్ కోటా హరినారాయణ గారు అందించిన ప్రయోజనాలకి అనేక గౌరవ పురస్కారాలు, అవార్డుల లభించాయి. వాటిలో ముఖ్యమైనవి:

 

- భారత ప్రభుత్వం నుండి పద్మ శ్రీ గౌరవం అందుకున్నారు (2002)

- నేష్నల్ ఏరోనాటికల్ లాబరేటరీ (ఎన్ ఏ ఎల్) సంస్థలో రాజ రామన్న ఫెల్లో గా ఉన్నారు

- ఫెల్లో, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా

- అధ్యక్షుడు (మాజి), ఏరోనాటికల్ సొసైత్టీ ఆఫ్ ఇండియా

- నేష్నల్ ఏరోనాటిక్స్ పురస్కారం అందుకున్నారు

- ఫెల్లో, ఇండియన్ నేష్నల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్

- ఐ ఐ టీ ముంబై (1995) ప్రజ్ఞాశాలి విద్యార్ధి అవార్డు

- ఎఫ్ ఐ ఈ ఫౌండేషన్ అవార్డు (1996) గైకొన్నారు

- నేష్నల్ ఏరోనాటిక్స్ బహుమతి అందుకున్నారు

- ఎస్ బి ఐ ప్రజ్ఞా పురస్కారం

- డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు

- డి ఆర్ డి ఓ టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు

- ఐ ఎన్ ఏ ఈ, జీవిత పురస్కారం

- గుజర్ మల్ మోడి అవార్డు (2006) (శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశిష్టత సాధించినందుకు)

- డి ఆర్ డి ఓ సంస్థ ప్రజ్ఞాశాలి శాస్త్రవేత్తగా గుర్తింపు

- సి ఎస్ ఐ ఓ పరిశోధనా మండలి అధ్యక్షకుడిగా ఉన్నారు

- అధ్యక్షుడు, ఏ ఆర్ సి ఐ, హైదరాబాద్

- ఇండో జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలనా మండలి అధ్యక్షుడిగా ఉన్నారు

- ఐ ఐ టీ (ముంబై) ఏరో - స్పేస్ ఇంజినీరింగ్ విభాగ ప్రజ్ఞాశాలి ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు

 

ఏది ఏమైనా భారత దేశం కల, కృషి ఫలించాయి. తేజస్ విమానాలు భారత గగన తలంలో విహరిస్తూ దేశాన్ని పరిరక్షిస్తున్నాయి. అనేక సాధక బాధకాలు, ప్రతికూల వాతావరణం, పరిస్తుతలతో పాటు, అమెరికా అంక్షలని అదిగమించింది, చివరకు అనుకున్న ఫలితాలు సాధించారు. " కృషితో నాస్తి దుర్భిక్షం " అన్న నానుడిని నిజం చేశారు. " తేజస్ " తో భారత దేశ విమాన నిర్మాణ దుర్భిక్షం తీరింది. శబ్ద తరంగాలకన్నా వేగం గా ప్రయాణించే అత్యాధునిక యుద్ధ విమానం నిర్మించారు. ఈ విమానంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభించాయి. దీనికి సుత్రధారుడిగా, రూపకర్తగా కీలక పాత్ర పోషించిన డాక్టర్ కోటా హరినారాయణ ఆదర్శనీయుడు, అభినందనీయుడు. 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech