తల్లాప్రగడ

ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
సంపాదక బృందం:
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
ముఖచిత్రం :
జొన్నవిత్తుల
 

 

 

 

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

తే.గీ.|| జొన్నవిత్తుల పాటలు విన్న వేళ,

తెలుగు వేదము వాదము తెలుపు వేళ,

రామలింగేశ శతకంబు రక్తి కట్ట,

రజతగిరినాధుడగుపించె  రామచంద్ర!

 

ఇటీవల సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, కవిస్వరూపానికే సరికొత్తరూపు. ఒక ప్రముఖ సినీ గేయ రచయితగా వీరు అందరికీ సుపరిచితులే, కానీ ఇక్కడ జరగిన కవిసమ్మేళనంలో ఒక్క సినీగీతం కూడా వినపడలేదు. ఒక్క సినిమా ప్రస్తావన కూడా జరగలేదు. కేవలం తన పద్యాలతో, వారు చూపిన దండకాలతో శుద్ధసాంప్రదాయరచనా శైలితో, విన్నూత్న పఠానాదాటితో, సంగీతమిళితకవితావిలక్షణంతో, అతిసున్నితచమత్కారచాతుర్యంతో... అద్వితీయం అమోఘం. ఆసాంతం దాదాపు 2000 మందిని ఒకేక్షణంలో ఆకట్టుకున్న ఆనందవీక్షణం…. ఆయనతో కలిపి వేరే ఐదుగురు స్థానికుకవులు కూడా కవిసమ్మేలనంలో కవిత్వాలు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకొని దాదాపు 4 గంటలపాటూ ఈ అసాధారణ కవిసమ్మేళనాన్ని అందించారు.

 

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మనముఖ్యఅతిధికి జేజేలు. ఈ కార్యక్రమంలోని జొన్నవిత్తులగారే ఈ సంచికపై ముఖచిత్రమై భాసిస్తున్నారు. అలాగే వారి పరిచయాన్ని ఈ సంచికలో మృత్యుంజయుడుగారు మీకందిస్తున్నారు. చదవండి మీ స్పందనలను తెలియజేయండి.

--------------------------------------------------------------------------------------------

పంచాంగం

కం:\\ గడియారంబులు తిప్పిరి

వెడదగు దినముల  తలచుతు వెష్ట్రన్ లోకుల్!

వెడగున డేలైట్ సేవింగ్

గడబిడ చేసెను తెలిసిన కాలెండరులన్!

 

ముందుగా అందరికీ వికృతినామసంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా సుజనరంజని అమెరికా పాఠకులకు స్థానికకాలమానప్రకారం రూపొందించిన పంచాంగాన్ని, కేలండర్‌ను అందిస్తున్నాము.   ఈ కేలండర్ వేరే ఎందుకూ ఇండియానుంచీ ప్రతి సంవత్సరమూ కేలండర్ ను తెచ్చుకుంటాముగా? అంటూ ఎందరో అనేక ప్రశ్నలను సంధించారు. ఇంకోడు " మేము పండుగలు భారత ప్రబుత్వం నిర్ణయించిన రోజుల్లోనే జరుపుకుంటాము నువ్వెవడవు ఇంకొంచెం ముందే జరుపుకోవాలి అని నిర్ణయించాడనికి " అని గదమాయించేడు. ఇంకోడు "ఎవరి నమ్మకాలు వారివి మేము మా కాలండర్ నమ్ముతాం. మీరు మీవి నమ్ముకోండి " అని అన్నాడు. ఇలాంటి మేధావులకు మనం ఏమీ చెప్పలేము కానీ, తెలుసుకుందాం అన్న ఉత్సుకత వున్నవాళ్ళకు చెప్పడానికి మాత్రం తెలిసింది సంతోషంగా చెప్పొచ్చును. అందులో అనేకులు పండితులు, పురోహితులు, స్థానిక పెద్దలు, కూడా వున్నారు. ఏం చేస్తాం, అది మానవ సాధారణ నైసర్గిక లక్షణం.  అందరూ అనుకునే విధంగా,  " ఏ తారీకు ఐనా ఇండియాలో ముందు వస్తుంది ఆ తరువాత 12 గంటలు దాటాకే ఆ రోజు అమెరికాలో వస్తుంది . కాని వాస్తవానికి తిధులు అలా రావు

సాధారణంగా ఎవ్వరినైనా జాతకాలు చెబుతారా అంటే పుట్టిన తేధీ, సమయంతో పాటుగా, జన్మస్థలం కూడా అడుగుతారు. అది అడ్రస్సు తెలుసుకోవడానికి కాదు. జన్మస్థలం తిధి నిర్ధారణకి ఎంతో అవసరం. ఇప్పుడు ఈ క్షణంలో లగ్నం కృత్తికా నక్షత్రం అని రాజమండ్రీలోని సిద్ధంతిగారు చెబితే అంటే దాని అర్థం-- రాజమండ్రీలో నుంచుని దిజ్మండలాన్ని (horizon) చూస్తే ఆ నక్షత్ర మండలంలో కృత్తికా నక్షత్రం కనిపిస్తోంది అని (అలాగే చంద్ర లగ్నం అంటే చంద్రుడు ఆ క్షణంలో ఫలానా నక్షత్రంలో వున్నాడు అని అర్థం). అదే సమయంలో హైదరాబాద్ నుంచీ (వేరే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వుంటాయి కాబట్టి అక్కడి స్థానిక కాలం వేరే వుంటే)  దిజ్మండలాన్ని చూస్తే కృత్తికే వుండవచ్చుగానీ డిగ్రీలలో తేడా తప్పక వస్తుంది. రాజమండ్రీకి హైదరాబాదుకీ ఒకే స్థానిక కాలం పాటిస్తున్నాం కాబట్టీ, ఆ రెండు ప్రాంతాలు దగ్గిరవే కాబట్టీ, ఆ రాజమండ్రీ పంచాంగకర్త పెట్టిన నక్షత్రం తో సరిపెట్టుకుంటాము. కానీ ఇటువంటి సర్దుబాటు అమెరికావంటి సుదూరప్రాంతాలకు వర్తించదు.

 

ఎందుకంటే అమెరికా కాలమానం మారిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇండియాలో సోమవారం సమయం ఉదయం 9 గంటలనుకుందాము. అంటే అమెరికాలో ఆదివారం రాత్రి 9 గంటలవుతుంది అనుకుందాము. మీరు అమెరికాలో వున్నారు కానీ మీ ఆవిడ ఇండియాలో ప్రసవిస్తోంది అనుకోండి. సరిగ్గా ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చి మీరు తండ్రి అయ్యారు, మీ బిడ్డ సోమవారం ఉదయం 9 గంటలకి పుట్టాడు  అనే వార్త వినిపించారు అనుకోండి. అప్పుడు, అంటే మీ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రే ఎగిరి గంతేస్తారా? లేదా ఇంకా సోమవారం ఇక్కడ రాలేదు అని మరో 12 గంటలు ఆగే గంతువేస్తారా? నాకుతెలిసి ఎవరూ 12 గంటలు ఆగి సంతోషించరు. వెంటనే సంతోషిస్తారు. అక్కడ బిడ్డ ఏప్రిల్ 1వ తారీకు ఉదయాన పుడితే ఇక్కడ మార్చి 31రాత్రినే సంబరాలు జరుగుతాయి.

మనకాలమానం ప్రకారం ఇక్కడ తారీఖులు ఆలస్యంగానే రావచ్చు, కానీ తిధులు అలా వైట్ చేసుకుని రావు. ఇక్కడ అమెరికావాడు డే లైట్ సేవింగ్స్ అని గడియారాలు ముందుకూ వెనుకకూ తిప్పుకోమంటే మనకు గతిలేక తిప్పుకుంటాము. కానీ ఆ తిధులు అలా తిప్పుకోవు. ఇక్కడ స్టేట్ స్టేట్కి వేరే టైం జోనులుంటాయి. మా రాజ్యాంగ పరంగా వాటిని నువ్వు ఫాలో అవ్వాలి అని ఆంక్షలు విదిస్తే అది మనుషులకేకానీ, కాలాన్ని నిజంగా ఎవరూ శాసించలేరు. తిధులూ నక్షత్రాలూ వాటిని పట్టించుకోవు.  అవి రావలసినప్పుడు వస్తాయి, పోవలసి వచ్చినప్పుడు పోతాయి.

క్లుప్తంగా గ్రహిస్తే అమెరికాలో తిథులు 12గంటలు ఆలశ్యంగా రావు; స్థానిక కాలమానం ప్రకారం 12 గంటల ముందే వస్తాయి. ఆలా అని " ఓకే నాకు విషయమంతా  అర్థమయ్యింది ఇండియానుంచీ కేలండర్ తెచ్చుకొని దానిలో 12 గంటలు తీసేయడమే " అని అనుకోకండి. ఇది అంత ఖచ్చితంగా 12 గంటల తేడానే కాదు. అది ఒక ఎప్రోక్సిమేషన్ మాత్రమే. సరైన స్థానిక  తిథి నిర్ణయానికి మరెన్నో సూత్రాలను పరిగణలోకి తీసుకోవలసి వుంటుంది. అవి పిడపర్తి పూర్ణసుందరరావుగారి వంటివారిని సంప్రదించినా, లేక వారి గగనతలం శీర్షికను చదివినా అర్థమవుతుందనే ఉద్దేశ్యంతోనే గగనతలం శీర్షికను అనేక మాసాలుగా మీకు అందిస్తున్నాం.  అలాగే మారేపల్లి వేంకటశాస్త్రిగారి చేత గణింపబడ్డ పంచాంగాని కూడా మీముందుకు తెస్తున్నాము. ఈ పంచాంగం అమెరికాలోని పసిఫిక్ టైం జోన్ వాసులకు సరిగ్గా సరిపోతుంది. ఈష్ట్ కోష్ట్ వాసులు ఎప్రోక్షిమేట్ గా మూడు గంటలు కలుపుంటే సరిపోవచ్చును.

ఈ పంచాంగం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మీ అందరికీ ఉపయోగపడే అంశలనూ ఇంకా ఎన్నో అందించాలని కోరుకుంటూ, మీ ఆశిస్సులను కోరుకుంటూ,

మీ

రావు తల్లాప్రగడ

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech