సగం ధర్మప్రభువు


 ఒకనాడు నిక్షేపరాయుడి రాజసభలోకి ఒక పేదవాడు వచ్చాడు. తన దీనస్థితి చెప్పుకున్నాడు. తనకు బతుకు తెరువు చూపమని వేడుకున్నాడు. రాజు అతనికి కొంత బంజరు భూమి ఇప్పించాడు.
కొంత కాలం తరువాత ఒకనాటి రాత్రి నిక్షేపరాయుడు మంత్రి వివేకుడితో కలిసి మారువేషాలతో నగరంలో తిరుగుతూ ఆ పేదవాడి ఇంటి ప్రాంతానికి వచ్చారు.
ఆరుబయట మంచం మీద కూర్చుని ఉన్న అతణ్ణి పలకరించారు. అతను మర్యాదగా వారిని తన మంచం మీద కూర్చోమన్నాడు. వారితో మంచీ, చెడూ మాట్లాడాడు.
’ఈ దేశపు రాజుగారి నుంచి సహాయం పొందాలనుకుంటున్నాం. ఆయన ఎటువంటివాడు?. అని మంత్రి అతన్ని అడిగాడు.
ఆ పేదవాడు రాజుగారు తనకు చేసిన సహాయం గురించి వివరించి ’ఆయన సగం ధర్మ ప్రభువు’ అన్నాడు.
’నీకు బతుకుతెరువు చూపించిన రాజును సగం ధర్మప్రభువు అన్నావేం?’ అని మంత్రి వివేకుడు అతన్ని అడిగాడు.
’అయ్యా నేను సాహసించి రాజుగారి దర్బారుకు పోయి నా గోడు చెప్పుకున్నాను. ఆయనకు నాకష్టం అర్ధం అయ్యేట్లు చేసుకోగలిగాను. అందువల్లనే కదా ఆయన నాకు పొలం ఇచ్చారు. నాలాటి కటిక దరిద్రులు దేశంలో ఎందరులేరు? వారందరికీ రాజుగారి ఎదుట పడే ధైర్యం ఉంటుందా? తమ కష్టాలు చెప్పుకునే శక్తి ఉంటుందా? రాజుగారు పూర్తి ధర్మప్రభువులు అయితే, వారి కష్టాలు తానే తెలుసుకునే వారు. సాగులేకుండా పడి ఉన్న భూములన్నీ దానం చేస్తే నాలా సాగుచేసుకుంటారు!’ అన్నాడు.
వెంటనే నిక్షేపరాయుడు తనరాజ్యంలో ఉన్న కటిక దరిద్రులందరికీ భూదానం చేశాడు.
 

 
  చొక్కాపు వెంకటరమణ :

స్టేజి మీద మేజిక్ చాప్లిన్ గా మేజిక్ కార్యక్రమాలుచేస్తూ, పిల్లల కోసం అనేక కధలు వ్రాసిన బాలల రచయిత, ప్రతిభకల చిన్నారులతో ఎన్నో రికార్డు ప్రోగ్రాములు చేయించిన మేజిక్ ఫన్ స్కూల్ నిర్వాహకుడు, బాలభవన్ లో ఉద్యోగిగా ఎన్నో రచనలు అందించిన సంపాదకులు, పిల్లల మనోవికాసం కోసం ఊయల పత్రిక నిర్వహించిన పత్రికాధిపతి......ఊయల కమ్యునికేషన్స్ అధినేత..ఆల్ రౌండర్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం చొక్కాపు వెంకట రమణ ఆంధ్ర్ర ప్రదేశ్ బాలల అకాడెమీవారికి అనేక పిల్లల పుస్తకాలు వ్రాసారు. వాటిని జవహర్ బలభవన్ ఇటీవల పున:ప్రచురుంచింది. చొక్కాపు వెంకట రమణ ఆధునిక పరవస్తు చిన్నయ సూరి గా అందిస్తున్న నీతికధల సమాహారం 'నిక్షేపరాయుడి కధలు ' ధారావాహికంగా బాలరంజని లో నెల నెలా వెన్నెల..

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech