ఏప్రిల్ , 2010

me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

ప్రస్తుతసమయము అనుకూలముగా నున్ననూ ఈ మాసపు పూర్వార్థమునందు అసహనము ప్రకటించడము మరియు ఒత్తిడులకు లోనగుట జరుగు అవకాశములెక్కువ. లావాదేవీలయందు ఎవరినీ ఈ సమయములో నమ్మరాదు. మాటలు నమ్ముట ద్వారా ఆర్థికముగా నష్టపోగలరు. అందువలన ధనమునకు సంబంధించిన కార్యములను వాయిదా వేసుకోగలరు.

ఇది విద్యార్థులకు అనువైన సమయము. కావున వారు ఈ సమయమును తమకు అనుకూలముగా వినియోగించుటకు ప్రయత్నించగలరు. ఆరోగ్యపరముగా ఇది ఇబ్బందికరమైన సమయము కావున శ్రద్ధ అవసరము.

ఉత్తరార్థములో ఒత్తిడులు మరింత పెరుగు అవకాశములున్నవి. పలుకుబడి తగ్గగలదు. తెలిసినవారు కూడ తప్పించుకు తిరుగుటకు ప్రయత్నిస్తారు. ఈ మాసములో ఎక్కవ ఇబ్బందికరములైన గ్రహములు బుధ, రవి, కుజులు. దేవాలయసందర్శనము మరియు విష్ణసహస్రనామ పారాయణము ఈ రాశివారికి ఊరటను కలుగజేయగలదు.

 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

పెక్కు గ్రహములు ప్రతికూలములుగా ఉన్ననూ ఈ రాశివారికి ఈ మాసపు పూర్వార్థము అనుకూలముగా నుండు అవకాశమున్నది. ప్రభుత్వపరములు మరియు అధికారుల ప్రమేయము ఉన్న కార్యములను  ఈ సమయమునందు పూర్తి చేసుకొనుటకు ప్రయత్నించవలెను.  ఈ సమయమునందు సూర్యుడు ఈ రాశివారికి అనుకూలముగా నున్నాడు. కుజుడు ఈ మాసమంతనూ అనుకూలముగా నుండుటచే ధైర్యముగా ముందడుగు వేసిన కార్యములు సఫలప్రదములు కాగలవు.

ఉత్తరార్థమునందు సూర్యుడు కూడ అశుభుడగుచున్నాడు, కావున అశుభస్థానములలో నున్న మిగిలిన గ్రహములు వాని ప్రభావమును ఈ సమయములో చూపు అవకాశమున్నది. ఆకస్మికముగా ధనలాభము మరియు వస్త్రాదుల వ్యాపారము మరియు లావాదేవీల కారణముగా ధనము సంపాదించు అవకాశము కూడా ఉన్నది. వ్యతిరేకులపై ఒక కన్ను వేసి ఉంచాలి. వ్యతిరేకుల కారణమగా నష్టములు సంభవించగలవు.

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ప్రభుత్వపరముగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నది. కావున అధికారులు మరియు ప్రభుత్వోద్యోగులతో కలహములకు దిగుట మంచిది కాదు. పిత్తవికారము మరియు చోరులవలన నష్టములు కలుగవచ్చును. మితృలు, భార్యాపిల్లలనుండి తోడ్పాటు మరియు సహకారము గతకొంతకాలముగా తక్కువగా శని ప్రభావకారణముగానున్నది. కానీ ఈ నెలయందు బుధబలప్రభావమున వారినుండి విశేషసహకారము లభించు అవకాశమున్నది. కావున ఈ మాసమునందు వారినుండి సహాయమును ఆశించవచ్చును.

          ఈ మాసమంతయూ సూర్యుడు శుభుడైయున్నాడు. పూర్వార్థమునందు పనులు జరిపించుటకు అనువైన సమయము. కావున గత కొంతకాలముగా ఆగి ఉన్న పనులను ఈ సమయములో పూర్తిచేసుకోవడానికి ప్రయత్నించగలరు. ఉత్తరార్థమున కార్యసిద్ధితో బాటు పలుకుబడి పెరుగును. అన్ని రంగముల వారికి ఇది గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు లభించే కాలము.

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కరాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

మానసిక ఒత్తిడి, తలపోటుసమస్యలు, ఆవేదన, ఉద్రేకములు ఈ రాశివారికి గత కొద్దినెలలుగా కుజుడు ప్రసాదిస్తున్న ఫలములు. అవి ఈ మాసమునందు కూడ సాగే అవకాశములు పూర్తిగా ఉన్నాయి. గురుని వ్యతిరేక పరిస్థితి అగ్నికి ఆజ్యము పోసినట్లున్నది. శుకృని కారణముగా అవమానములు మరియు కలహములు ఎదురవ్వగలవు.

దశమమున ఉన్న బుధుడు వ్యతిరేకులను ఎదుర్కొనుట యందు, ఉత్సాహమును నింపుటయందు పూర్తి సహకారమును ఇచ్చుటకు ప్రయత్నించును. వ్యాపారాదులయందు ఉత్సాహము పెరుగు అవకాశమున్నది. ప్రస్తుతము ఎన్ని వ్యతిరేకతలు ఉన్ననూ ఈ రాశివారికి పూర్తిగా సహకరిస్తున్న గ్రహము శని. ఆ గ్రహ ప్రభావకారణముగా అన్ని రంగములయందూ వీరికి విశేష అనుకూలత లభించు అవకాశములు చాలా ఎక్కువ. ఉద్యోగులు, వ్యాపారస్థులు మరియు విద్యార్థులు మరియు మిగిలిన వారందరికీ శ్రమకు తగ్గ ఫలితము లభించు సమయము ఇది. కానీ ఫలితముతో బాటు ప్రతికూలగ్రహముల ప్రభావకారణమున త్రిప్పట, ఒకటికి రెండు సార్లు ప్రయత్నము చేయుట మొదలుగునవి అనివార్యములుగా కనబడుచున్నది.

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

పూర్వార్థమునందు రోగభయము, వ్యయము, స్త్రీల వలన కష్ట నష్టములు, కార్యములయందు విఘ్నములు, ధర్మకార్యములు నిర్వర్తించుట మొదలగు ఫలితములు కనబడుచున్నవి.  కష్టముల మధ్యన కూడా సుఖములు గోచరించగలవు. గురు ప్రభావకారణముగా సుఖము కష్టముల వెన్నంటి వచ్చుచున్నది. అందువలన కష్టములను ఉత్సాహముతో ఎదుర్కొనడానికి ఈ రాశివారు ప్రయత్నించాలి. ఏలినాటి శని ప్రభావకారణముగా జనుల వ్యతిరేకత మధ్య మధ్యలో కనబడగలదు.

ఉత్తరార్థములో  ఆలోచనాశక్తి తగ్గడము మరియు ఇతరులపై ఆధారపడడము చేయు అవకాశములున్నవి. జనులను ఒకటికి రెండు సార్లు ప్రాధేయపడవలసిన అవసరము రాగలదు. సూర్యుని వ్యతిరేకత ఈ మాసమునందు ఎక్కువగా కనబడుతున్నది. కావున ఈ రాశివారు ఆదిత్యహృదయ స్తోత్రమును చదువగలరు. 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

జన్మంలో ఉన్న శని మరియు షష్ఠములో ఉన్న గురుని దుష్ప్రభావము ఈ రాశివారిని ఇంకా వదలలేదు. ఆ ప్రభావకారణమున ప్రస్తుతము వీరి మనస్సుకు ఏ పనీ సుఖమును ఇవ్వలేదు. అనగ ఏ పని చేసిననూ అందు ఎంత అనుకూలఫలితములు వచ్చిననూ వీరికి ఆనందము కలుగు అవకాశములు తక్కువ. ఈ ప్రభావము మరికొంత సమయము నడుచును.

ఇక ఈ మాసపు పూర్వార్థమును పరిశీలిస్తే ఈ సమయములో ఈ రాశివారికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరము. ఉదరసంబంధమైన అనారోగ్యములు మరియు ఇబ్బందులు వీరిని బాధపెట్టు అవకాశమున్నది. అందువలన వీరు బయటి పదార్థములను గ్రహించకుండుట మేలు. ఇంటివద్ద కూడ భోజనవిషయములో జాగ్రత్త వహించ గలరు.

ఈ మాసమంతయూ వీరికి అనుకూలముగా కుజ బుధ శుకృలున్నారు. మిగిలిన విషయములందు వీరు సహకరించలేక పోయిననూ వ్యాపార లావాదేవీలయందు, ధనసంగ్రహమునందు, పనులను నెరవేర్చుకొనుటయందు, కుటుంబసభ్యులు మరియు స్త్రీలవలన సుఖము పొందుటయందు ఈ గ్రహములు వీరికి పూర్తిగా సహకరించగలవు. కావున ఈ శుభత్వమును ఈ రాశివారు సద్వినియోగపరచుకొనుటకు ప్రయత్నించగలరు.

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

ఈ మాసము ఈ రాశివారికి మిశ్రమము. అనుకూలముగా ప్రవర్తించు గ్రహములు మరియు ప్రతికూలగ్రహముల బలము సమానముగా ఉన్నది.  అందువలన ఈ రాశివారు అన్ని రంగములయందూ తటస్థభావముతో వ్యవహరించుచూ  తమ కర్తవ్యములను నిర్వహించుచున్న వీరికి అనుకూలముగా ఫలములు రాగలవు. సమయము మిశ్రమము అగుటచే ఏ పనినీ పూర్తిచేయుటకు లేక త్వరిత గతిన ఫలము పొందుటకు ప్రయత్నించరాదు. కేవలము మీ పని మీరు చేసుకుపోయిన సందర్భములోనే అపేక్షిత ఫలము లభించగలదు.

అశుభగ్రహముల కారణముగా మానసిక ఉద్వేగము, తొందరబాటు పెరగడము, అనాలోచితముగా పనులు జేయుట చేయగలరు. ఇవన్నియూ పనియందు మీకు నష్టమును కలిగించగలవు.

పూర్వార్ధము ఆరోగ్యము మరియు కార్యస్థానవిషయములు, కోర్టువివాదములు మొదలగువానికి అనుకూలముగా ఉన్నది కావున ఈ కార్యములను పూర్వార్థములో చేసుకొనగలరు. ఉత్తరార్థములో ఆరోగ్యము సున్నితముగా మారును. అతి సాధారణ విషయములందు కూడ ఆరోగ్యముపై పెద్ద ప్రభావములు కలిగించు అవకాశ మున్నది కావున సంయమనముతో వ్యవహరించగలరు.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

ఈ కష్టాలన్నీ మాకే రావాలా అనే భావన అడుగడుగునా నాలుగవ ఇంట ఉన్న గురుడు ఈ రాశివారికి ప్రస్తుతము కలుగజేయుచున్నాడు. దానికి తోడు ఎప్పుడూ కష్టము వచ్చినపుడు తోడుగా ఉండే బంధువులు ఈ సమయములో కష్టములకు కారకులగుచున్నారు. అనగ చాలా వరకు ఈ సమయములో కష్టములు బంధువులు మరియు కుటుంబ సభ్యులకారణముగానే సంభవిస్తున్నాయి.  దానికి తోడుగా పూర్వార్థములో నానాప్రకారములైన శారీరిక ఇబ్బందులు కూడ నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు శుకృని కారణముగా స్త్రీలవలన కలుగు కష్టములు కూడ ఇబ్బందికలుగజేయడానికి సిద్ధముగా ఉన్నాయి.

ఉత్తరార్థము వచ్చేటప్పటికి గ్రహాలన్నింటికీ ఆధారభూతుడైన సూర్యుడు కరుణించే స్థితికి వస్తున్నాడు. ఈ కారణముగా శారీరిక ఇబ్బందులు సమసిపోగలవు. ఇబ్బందులకు కారకులుగా మారిన బంధువులు, పనులయందు విఘ్నములను కలుగజేయుచున్న వ్యతిరేకులు తోక ముడవక తప్పదు. దీనికి తోడు మాసమంతా అనుకూలముగానున్న శని బుధులు ఈ రాశివారికి విజయము, ఉన్నతి , సౌభాగ్యము మరియు పరస్త్రీలకారణముగా లాభమును సూచిస్తున్నాయి కావున ఈ రాశివారికి ఈ మాసపు ఉత్తరార్థము అన్ని రంగములయందునా అనుకూల ఫలితములను ఇవ్వగలదు.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

  ప్రస్తుతము ఈ రాశివారికి తమ పనులను నిర్వర్తించుకుపోవడము తప్ప వేరు మార్గములేదు. ఈ సమయము వీరికి అత్యంత సంఘర్షమయము.  ఏ రంగమునందునా ఈ సమయమునందు ఫలితములను ఆశించి పనిచేయు అవకాశములేదు. కావున కర్తవ్య నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రతీ పని, పడ్డ ప్రతీ శ్రమ ఖచ్చితముగా దాని ఫలితములను ఇస్తాయి. కావున ఈ సమయములో చేసిన పనులకు ఫలితములు ఎదర అనుకూల సమయము వచ్చినపుడు లభిస్తాయి. అందువలన సమయము నిరర్థకమైనదని భావించి పనిచేయకుండిన ప్రతికూలతలకు మీరు బానిసలయ్యేఅవకాశములు పూర్తిగా ఉన్నాయి. కావున నిష్క్రియత్వమును ప్రదర్శించరాదు. ఆశించిన ఫలితములు రానప్పుడు నిరుత్సాహపడే అవకాశములెక్కువగా ఉంటాయి కావున ఈ సమయములో మీరు చేయు పనులనుండి మీరేమియునూ ఆశించవద్దు. మీ పని చేయుట మీ కర్తవ్యము కావున దానిని నిర్వహించగలరు.

ఈ సమయములో శుకృడు మాత్రమే అనుకూలముగా ఉన్నాడు. మిగిలిన వారి వ్యతిరేకతలో ఈ ఒక్క గ్రహముయొక్క ప్రభావము అంత ప్రస్ఫుటముగా కనిపించు అవకాశములేదు. అయిననూ బంధుజనాది సుఖము మరియు గురుజనుల సుఖమును ఈ గ్రహము మీకు ప్రసాదించడానికి ప్రయత్నము చేయగలదు.

శివునికి నీలము పువ్వులతో పూజచేయుటద్వారా శని, పసుపు పూలతో పూజ చేయుట ద్వారా గురుడు శాంతించగలరు. విశేష ఫలప్రాప్తికై వేంకటేశ్వరుని నిత్యము స్మరింపగలరపు

 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

చిన్న వ్యతిరేకఫలములు అప్పుడప్పుడు కనిపించిననూ ఈ మాసము ఈ రాశివారికి అత్యంత అనుకూలమైనది. అన్ని రంగముల వారికి ఇది శుభ ఫలితములను ఇచ్చు అవకాశమున్నది. ముఖ్యముగా ఈ మాసపు పూర్వార్థములో కోరుకున్న స్థానములు దక్కడము, ధనమును సంగ్రహించడము, కోర్టువ్యవహారములు మరియు వివాదములయందు అనుకూలపలితములు రావడము మొదలుగునవి కొత్త ఉత్సాహమును ఇవ్వగలవు.

గురు బుధ శుకృలు ముగ్గురునూ మాసమంతయూ శుభులుగానున్నారు. శతృవులు మరియు వ్యతిరేకుల కారణముగా కూడ ధనము సంపాదించు అవకాశమున్నది. అనగ చాలా కాలముగా రానీ బాకీలు ప్రాప్తించడము, వివాదములలో వ్యతిరేకుల నిష్ప్రభావకారణముగా ధనలాభము కలుగడము మొదలుగునవి జరుగు అవకాశమున్నది

ఈ మాసమంతయూ ఈ రాశివారు ముఖ్యముగా గుర్తుంచుకోవలసినది ఒకటే. శనికుజులిద్దరునూ వ్యతిరేక ప్రభావమును కలిగి యున్నారు. కావున ఉద్రేకములకు లోనగు అవకాశమున్నది. మరియు కిందస్థాయి ఉద్యోగులు మరియు కర్మచారులు మీకు సహకరించే అవకాశములేదు. కావున ఈ విషయములయందు ఆచి తూచి వ్యవహరించగలరు,

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

పూర్వార్థమునందు పెద్దగా ఆశించవలసినది లేదు. వంచింపబడు అవకాశములెక్కువ. ఎంత ప్రయత్నించిననూ ధనలక్ష్మికి నిలకడ లభించు అవకాశములేదు. ఈ సమయములో ఎదురయ్యే వ్యయములు కొత్త ఇతిహాసములు రచింపగలవు. నేత్రములయందు ఇబ్బందులు సంభవించగలవు. ప్రభుత్వ పరముగ మరియు శతృవుల కారణముగా నష్టములు సంభవించవచ్చుననే అనుమానము మరియు భయము రోజు రోజుకీ పెరుగుచున్నది.

ఉత్తరార్థమున చాలా వరకూ ఊరట లభించగలదు. ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయి. ఇక ఖర్చులవిషయములో ఇంతవరకూ కలిగిన భయములు తొలగిపోతాయి. ధనసంగ్రహముకూడ చేయగలరు. మాసమంతయూ మితృల సహాయసహకారములు పుష్కలముగా లభిస్తాయి.

శని దుష్ప్రభావము చాల అధికముగా ఉన్నది కావున ఈ రాశివారు రుద్రాభిషేకము మరియు శివ, వేంకటేశ దర్శనములద్వారా ఊరటను పొందుటకు ప్రయత్నించగలరు.

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

కొత్త ఆలోచనలు, కొత్త పనులు, కొత్త వ్యవహారములు, కొత్త లావాదేవీలు, కొత్త పెట్టుబడులు ఇలా కొత్తగా ఏ పనీ ఈ సమయములో చేయకుండుట మంచిది. ప్రస్తుతము శుకృడు తప్ప మరే గ్రహము ఈ రాశివారికి అనుకూలముగా లేదు.  కావున ప్రస్తుతము, ఈ మాసమునందు, ఏ రంగమునందు కూడ వీరు అనుకూలఫలమును ఆశించనక్కరలేదు.

పూర్వార్థము ఉత్తరార్థముకూడ వీరికి ఒకే విధముగా ఉన్నాయి. పూర్వార్థములో ఆందోళనలు ఎక్కువగా ఉంటే ఉత్తరార్థములో ధనవ్యయము, సుఖములేక పోవడము వీరిని నిరుత్సాహపరిచే అవకాశములెక్కువ. తాత్కాలిక ఉపశమనమునకు ముఖ్య ఉపాయములను ఆశ్రయించగలరు. అరుణవర్ణపు తిలకము ధరించడము, సూర్యునికి రాగిపాత్రతో అర్ఘ్యప్రదానము చేయడము, ఆదిత్యహృదయస్తోత్రమును పఠించడము వలన వీరికి వ్యతిరేక పరిస్థితులలో కూడ అనుకూలములైన ఫలితములు లభించగలవు.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం